Tuesday, September 14, 2021

కరోనా

13/04/2021.
గోదావరి రచయితల సంఘం వారి "శ్రీ ప్లవ నామ" ఉగాది పర్వదిన  కవితా సంబరాలు*

గోరసం ఉగాది కవితా సంబరాల కోసం మాత్రమే...

అంశం : నవ యుగాది.
శీర్షిక  :  భయానికి స్వస్తి .
ప్రక్రియ : వచన కవిత.

గత సంవత్సరం "మహమ్మారి "లా విజృంభించి
యావత్ప్రపంచాన్ని గడగడలాడించింది కరోనా.
సంవత్సరంపాటు పడరాని పాట్లతో గృహ...
నిర్బంధులైన ప్రజలు, ఎన్నో జాగర్తలతో పాటు
సాంప్రదాయ పద్ధతుల ప్రాశస్త్యాన్ని గ్రహించి,
ఆచార వ్యవహారాల విలువలని తెలుసుకొని,
మసలడంతో, 2021-నాటికి మరోకోణంలో
మనుషుల మధ్యకు దుాసుకు  వచ్చింది
ముందస్తు జాగర్తల విశ్వాసంతో" భయం వీడిన"
ప్రజలు , తమ తమ దైనందిన కార్యక్రమాలను
నిర్భయంగా చేసుకుంటుా, గృహ నిర్బంధ
సంకెళ్ళకు ఉద్వాసన చెప్పేరు. పర్యావరణ రక్షణతోపాటు,సామాజిక దుారాలను పాటిస్తుా , "ఆనంద యుగాదికి" ఆహ్వానం పలికేరు.
మనుషుల్లో వచ్చిన మార్పుకు, ఆనందించిన
"ప్లవ "నామ ఉగాదికన్య , తన వంతుగా నీటి
వనరుల నిర్మల వసంతమై , ఆరు ఱుచుల ఆరోగ్యామృత కలశాన్నిచేత పట్టుకొని ,
పచ్చన్ని ప్రకృతి స్వాగత గీతాలకు
పరవసించిపోతుా  "అనందామృతాన్ని "
అందరికీ పంచడానికి అదిగో, వస్తోంది.
ఆమెను నిండు మనసుతో "స్వాగతిద్దాం" రండి.
-----------------------------------------------------
"భయానికి స్వస్తి"   అనే ఈ కవిత ,
ఏ మాధ్యమునందుా ప్రచురితం కాని-
నా స్వీయ రచన .

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.







No comments:

Post a Comment