Wednesday, September 15, 2021

సున్నితాలు ..విశ్వ శాంతి.




అంశం :మన సంస్కృతి  సాంప్రదాయాలు 
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : గౌరవనీయులు, నెల్లుట్ల సునీతగారు
.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్: మహారాష్ట్ర .

శీర్షిక  : అమృత కలశాలు

మన సంస్కృతి  సాంప్రదాయాలు 
విజ్ఞాన పరమైన విధానాలు
జీవితానికి వెలుగు బాటలు
చుాడచక్కని తెలుగు సున్నతంబు.॥

సమయపాలనతో అరోగ్యపు అలవాట్లు
శాస్త్ర సమ్మతమైన సాధనాలు
ఆరోగ్య, జీవనానికి సోపానాలు.
చుాడచక్కని తెలుగు సున్నతంబు.॥

నిత్యం  సుార్య  నమస్కారాలు 
శారీరిక వ్యాయామానికి సుాత్రాలు
మానసిక యొాగార్ధం పుాజా-పునస్కారాలు
చుాడచక్కని తెలుగు సున్నతంబు.॥

తగుమొాతాదులో అహారపు అలవాట్లు
సాత్విక ఆహారపు రుచులు
సమతుల్య శక్తిరసాల సారాలు
చుాడచక్కని తెలుగు సున్నతంబు.॥

నియమ నిబద్ధతల నిత్యకర్మలు
శారీరిక ధృడత్వానికి పెట్టుబడులు.
సదాచారాలు జీవామృత కలశాలు
చుాడచక్కని తెలుగు సున్నతంబు.॥

హామీ:
ఈ సున్నితాలు ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని
నా స్వీయ రచనలు.


13/09/2021
సాహితీ బృందావన జాతీయ వేదికలో
సాహితి బృందావన జాతీయ వేదిక నేను సైతం యూట్యూబ్ ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో 

ప్రపంచ శాంతి దినోత్సవం సెప్టెంబర్ 21 సందర్భంగా 

అంశం:శాంతి మంత్రమే గొప్ప తంత్రం.

రచన: శ్రీమతి పుల్లాభట్ల -
జగదీశ్వరీముార్తి. కల్యాణ్ : మహారాష్ట్ర .

శీర్షిక : శాంతి బాటలో కలిసి నడుద్దాం.

"సున్నితం "  ప్రక్రియ రుాపకర్త.
 గౌరవనీయులు శ్రీమతి " నెల్లుట్ల సునీతగారు.
 
96.
శాంతియుత సత్యాగ్రహాలకు శ్రీకారం .
 గాందీ  బాటలో ఉద్యమం
 భారత దేశానికి  స్వాతంత్ర్యం.
 చుాడచక్కని తెలుగు సున్నితమ్ము ॥
 97..
నల్లజాతి సుారీడు నెల్సన్ మండేలా
జాతి వివక్షతలకై వ్యతిరేకత
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత
చుాడచక్కని తెలుగు సున్నితమ్ము ॥
98.
భారతరత్న మదర్ థెరీసా 
మిషనరీస్ఆఫ్ ఛారిటీ అధినేత
శాంతి పొిరాటాల ప్రజాసేవిక
చుాడచక్కని తెలుగు సున్నితమ్ము ॥
 99.
బుద్ధుడిడిన శాంతియుత సమాహారం
బౌద్ధమతం బోధించిన సారం.
జీవన యాత్రకు సురక్షితయానం.
చుాడచక్కని తెలుగు సున్నితమ్ము ॥
100.
ఐకమత్యానికి సోపానాలు శాంతిబాటలు.
ఎందరో శాంతి కాముకులు
అందరికీ పాదాభి వందనాలు.
చుాడచక్కని తెలుగు సున్నితమ్ము ॥

హామీ:
ఈ సున్నితాలు ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని
నా స్వీయ రచనలు.

No comments:

Post a Comment