[10/5, 16:53] p3: తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవా సంస్థ అనంతపురం వారి ఆధ్వర్యంలో
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
సమాచార హక్కు చట్టం-2005 ,(అక్టోబర్ 12వ తేదీ) సందర్బంగా
కవితల పోటీ కొరకు రాసిన కవిత.
శీర్షిక : తమ హక్కుల రక్షణ , ప్రజల బాధ్యత.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.
అక్టోబర్ 12, 2005 నుండి పూర్తి
స్థాయిలో అమలులోకి వచ్చిన
సమాచార హక్కు చట్టం .
అటుపై వెలుగులోకి వచ్చిన
ఎన్నో రాజకీయ కుంభకోణాలు.
వాటిపై ప్రజల సందేహాలను అలవోకగా
తుంగదొక్కుతున్నన కేంద్రం , అడ్డ దారుల్లో
అడిగిన వాడిని అణచివైస్తున్న వైనం ॥
ఎందరో పోరాడి తెచ్చిన
సమాచార హక్కు చట్టం.
ప్రభుత్వాలకు మాత్రమే
లొంగిఉన్న ప్రత్యేక ప్రజా చుట్టం. ॥
ప్రభత్వ పరిపాలనలో లోటుపాట్లను
ప్రశ్నించే హక్కును కలిగించిన చట్టం,
భావ ప్రకటనా స్వేశ్ఛంటుానే
అడిగిన వాడిని అణిచివేస్తొిన్న దైన్యం
న్యాయానికి సంకెళ్ళు వేస్తున్న వైనం ॥
అసహాయ ప్రజల లో అర్ధంలేని ఆవేశం.
రాజకీయ పార్టీల అధికార దుర్వినియొాగం
నేటికీ కోల్పోయిన ప్రజా స్వాతంత్ర్యం .
హక్కు పేరుతో ఆరని అణచివేతల బానిసత్వం ॥
సమాచార హక్కు చట్టాన్ని బలోపేతం చేస్తుా
స్త్రీలు , రైతులు జరుపుతున్న శాంతియుత
ఉద్యమాలు వత్సరాలు దాటినా జవాబు
దొరకని ప్రశ్నలై సమస్యలుగా నిల్చిపోయాయి ॥
చట్టాలు అమలులోకి వచ్చినా
నెరవేరని లక్ష్యాలు ఎన్నెన్నో..
ప్రశ్నార్ధకంగా మిగిలిపోయిన ఈ
సమాచార హక్కు చట్టం, దుర్వినియొాగాన్ని
ప్రజలు గుర్తించి తమ హక్కులను
సాధించగలిగే బాటలో శాంతి పోరాటం
చేయడం బాధ్యత నిండిన పౌరులుగా
మన కర్తవ్యం.॥
హామీ :
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన..
,
[10/10, 20:59] రెడ్డి T V రెడ్డి అనంతపుార్: అమ్మా నమస్తే,
మీకు అభినందన శుభాకాంక్షలు. సమాచారహక్కు చట్టం 2005 ఆవిర్భావం సందర్భంగా తెలుగు వెలుగు సాహిత్య,సామాజిక సేవా సంస్థ,నిర్వహించిన కవితల పోటీలో మీరు తృతీయ విజేతగా ఎంపికైనారు. రేపు అధికారిక ప్రకటన చేస్తాము.మీరు మీ పాస్ ఫోటో ఒకటి వాట్సప్ ద్వారా పంపగలరని కోరుచున్నాము
--- టి.వి.రెడ్డి. అధ్యక్షుడు
తెలుగు వెలుగు సాహిత్య, సామాజిక సేవా సంస్థ,అనంతపురం
సెల్ 73828 63523.
No comments:
Post a Comment