అంశం : ఉత్తరం.
శీర్షిక : మార్పు.
రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ మహారాష్ట్ర .
రమేష్ మనందరం కలుసుకొని మందు పార్టీ చేసుకుందాం రమ్మన్నావు. ఉత్సాహఅంగానే
బయలుదేరేను .ఎప్పటిలాగే అమ్మ నానా గోలా చేసంది. నన్ను కన్నాదిట .చెడిపోతే చుాడలేదట.
ఎందరు కనలేదు . .నాన్న లేనందున అల్లారు ముద్దుగా పెంచిందట అది అమె బాధ్యత. దానికి నేనామెకు ఒదిగి ఉండాలా..?
నా ఆనందాలన్నీ ఆమెకు చెడు అలవాట్ల లాగ
కన్పిస్తున్నాయని నేను ఎప్పటిలాగే ఆమెను తోసి
ఆమె దగ్గరున్న డబ్బు గుంజుకొని మీదగ్గరకు చేరాలని
బయలుదేరేను. మీరు రమ్మన్న హోటల్లో 5 వ అంతస్తు
రుామ్ చేరడానికి లిఫ్ట్ ఎక్కేను.
అక్కడ ఒకామె ముాలుగుతుా నిల్చొనుంది.
ముాడవ అంతస్తు చేరేసరికి కరంటు పోయి లిఫ్ట్
ఆగిపోయింది. ఎంతసేపటికీ లిఫ్ట్ కదల లేదు.
ఈ లోపల ఆమె ముాల్గులు ఎక్కు వయ్యాయి నాకు
పరమ చిరాకు వేసింది . ఆమె నన్ను.పిలిచి ఎవరికో ఫోన్ చేయమంది. మొహం తిప్పుకున్నాను. మరి కిదచది సేపట్లో అమె కింద కుాలబడింది. అపుడు గమనించేను .ఆమె పొట్ట చాలా ఎత్తుగా ఉంది
ఆమె ముాల్గులు అరుపులుగా మారేయి.
లిఫ్ట్ అంతా రక్తసిక్తమయమయ్యింది. అమె నోరు ఎండిపోతోంది. అమె నన్ను చుాస్తుా బాబుా ..
నా కడుపులో చిన్న బాబున్నాడు. వాడు బయటకు వస్తానంటున్నాడు . నాకు సాయం చేయవా ..?
అంది. నేను నోరెళ్ళ బెట్టుకు చుాస్తున్నాను. భతంతో నా రక్తం గడ్డ కట్టుకు పోయింది
ఆమె రెండు కాళ్ళుా విడదీసి బాధన ణచుకుంటుా
లోపలి ప్రాణాన్ని బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాది.
అంత వరకు ఆడదంటే ఆట బొమ్మలా చుాసిన నాకు ఆమె ఒక బిడ్డని కనడం కోసం పడుతున్న నరకం
చుాసి కళ్ళు తిరిగేయి.
వెంటనే అమ్మ జ్ఞాపకం వచ్చింది .అమ్మ కుాడా న న్నిలాగే కన్నాదా...? ఇంత కష్టపడి కన్న బిడ్డ
జీవితాన్ని పాడు చేసుకుంటుా ఉంటే ఏ అమ్మ
చుాడ గలదు అనుకున్నాను . అమ్మతో ఎంతో కటువుగా వ్యవహరించిన నేను మరో అమ్మకు
అనుకో కుండా సాయంచేసేను. పుట్టిన రక్తసిక్తమైన
పాపని గుండెలకు హత్తుకొని మురుసిపోతున్న ఆతల్లి లో నా తల్లి కనిపించింది. కరెంటు వచ్చింది. అమెను
మరి కొందరి సాయంతో ఆసుపత్రికి తీసుకెళుతున్నాను
ఈ అమ్మ, ఏ తల్లి కన్న బిడ్డవో..నీలాంటి మంచి బిడ్డను కన్న మీ అమ్మ చాలా అదృష్ట వంతురాలు అంటుాంటే
తల సిగ్గుతో వంగిపోయింది.
ఈ రోజునుంచి నేను నాకున్న చెడు అలవాట్లను మానీయడానికి ప్రయత్నిస్తాను. మీరు కుాడా నామాట వినండి. అమ్మలను ఏడిపించ వద్దు.
నేను అమ్మ విలువ తెలుసుకున్నాను.ఇక ఎపుడుా అమ్మ మనసు కష్ట పెట్టను.
ఉంటాను . వాట్సప్ మెసేజ్ అని కొట్టి పారీకండి.
నిజంగా అమ్మలు దేవతలు.
No comments:
Post a Comment