[5/6, 12:20] p3: మహతీ సాహితీ కవి సంగమం కరీంనగర్
ప్రతి రోజూ కవితా పండుగే
పర్యవేక్షణ డా.శ్రీ .అడిగొప్పులసదయ్యగారు
నిర్వహణ.శ్రీ .ముక్కా సత్యనారాయణ గారు
సమీక్షణ.డా.శ్రీ .అడిగొప్పుల సదయ్య గారు
అంశం మనిషి మనసు
తేది 06 05 2031 గురువారం
ప్రక్రియ : ఇష్టపది.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
శీర్షిక : మనిషి మారాలన్న.
మనసు మనసో యనుచు మన నెేమి లాభమది
మనసు మాటను విన్న మనిషెవడు ధరలోన॥
మనసు మంచిని చెప్ప మనిషి బుద్దెరుగదుగ
మాయ మాటల జెప్పి మనసణచి వేతురుగ ॥
నా ఇల్లు నా వాళ్ళు నాది నాదని కోరి
నమ్ము వారిని గుాల్చె సొమ్ము సోకుల కన్న
స్వార్ధ మదె పెరుగగా వ్యర్ధ జీవిగ మారి
వేల తప్పుల జేసి వెతలెన్నొ పడుదురుగ ॥
-------------------------------------------------------
ధనము కొరకై పోరు ధనము కొరకే హోరు
జనము నమ్మిన నోటు ధనముకమ్మిరి ఓటు॥
ధన మదముతో మనిషి తన -పరల నెరుగకను
అధికార బలము తో ఆధిపత్యము జేసె॥
మితిమీరె పరిధులు అతివ కవమానములు
కన్నీటి కార్చిచ్చు కరిగె సిరి సంపదలు॥
నాడున్న సుఖ శాంతి నేడు జగతిని లేదు
అన్ని తెలిసీ మనిషి ఆశ వీడుట లేదు ॥
---------------------------------------------------
చదువున్న వారేమొ చవిలేని బ్రతుకేల
చదువు లేనివారదె చక్క పాలకులైరి ॥
అవగాహనాలోప మవని నిక్కటులేల
జనులెల్ల జడులైరి జడిసి పాలకులకుా॥
మానవత్వము తరిగె దానవత్వము పెరిగె
మమతానురాగాలె మట్టికలిసీపోయె॥
మార్పు రావాలంటె మనిషి మారాలన్న
ఇలనీశ్వరీ మాట ఇచ్ఛతో వినుమన్న ॥
-------------------------------------------------
[5/10, 16:17] p3: 10..05. 2021
మహతీ సాహితీ కవి సంగమం కరీంనగర్
ప్రతి రోజు కవితా పండుగే
పర్యవేక్షణ: డా॥.శ్రీ .అడిగొప్పుల సదయ్య గారు
నిర్వహణ: .దాసరి చంద్రమౌళి గారు
సమీక్షణ: శ్రీ .టి.ఆర్.కె.కామేశ్వరరావు .గారు.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
అంశం: చిత్ర కవిత
శీర్షిక : అన్నీ తెలిసిన వాడు.
ప్రక్రియ : వచన కవిత.
పితృదేవతల ఉత్తమ గతి ప్రాప్తి కొరకు
భగీరధుడు చేసిన తపో ఫలము చేత
ఉరుకులు పరుగులతో ఉధృత తరంగిణియై
ఉరికి వస్తున్న గంగమ్మను శివుడు తన
జటా జుాటంలో బంధించి , లోకంలో
జీవ, జంతుల రక్షణార్ధఁం చిన్న ధారగా
భుామిపైకి ప్రవహింపజేసేడు. పవిత్ర గంగ
మానవుల పాప ప్రక్షాళన చేస్తుా ,సమృద్ధిగా
నదీ -నదాల లో నిండి , జన జీవితాలను
ఉద్దరించి పాప ప్రక్షాళన గావించింది.
అటువంటి గంగమ్మ విలువ గుర్తించని
జనులు పవిత్ర గంగను కలుషితం చేస్తుా..
కాలుష్యం నిండిన పర్యావరణానికి
పునాదులేసారు.స్వార్ధ పుారిత మానవులకు
అహర్నశలుా అమృతాన్ని పంచే గంగమ్మ
అవమానితయై ఆవేశంతో ఉరిమి ఉరికింది...
ఊరుా-వాడా ముంచెత్తింది.
ఆగడాలకు' ఆవిరై ఇగిరి పోయింది
శాంతముార్తయైన గంగ కలుషితాల కంపుకు కనుమరుగై పోగా పీల్చ ప్రాణవాయువు ,
తాగ మంచినీరు కరువైన జనులు
విష కణాల బారిన పడి వింత రోగంతో
విధివంచితులై ఊపిరాడక
ఊర్ధ్వగతులకు చేరుకుంటున్నారు.
పర్యావరణ కాలుష్యానికి పొగబారి
నల్లబడిన మేఘాలచాటునుండి తొంగి
చుాస్తున్న పుార్ణ చందృడు..
మందులేని మహమ్మారి కంట పడకుాడదని
ముఖం చాటేశాడు. అన్నీ తెలిసిన ఆది దేవుడు
శిలరుాప లింగాకారుడై కనులు ముాసుకొని
యొాగ-నిద్రలోకి జారిపోయాడు.
.
హామీ; ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితం కాని , నా స్వీయ రచన..
.
[5/12, 18:22] p3: మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం.
ప్రతిరోజు కవితా పండుగే.
పర్యవేక్షణ: డా.శ్రీ.అడిగొప్పుల సదయ్య గారు.
నిర్వహణ: యాంసాని లక్ష్మీ రాజేఃదర్ గారు
తేది: 12-05-2021.
అంశము: దత్తపది.
మది హృది గది నది..
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
ప్రక్రియ : ఆట వెలది.
మదిని కలత రేపె మహినున్న దికరోన
హీన దీన గతులె హృదిని కలచె
గదిని వీడ భయము గననేమి శాపమొా
నదులు శవము లేలె నరక మిలను ॥
[5/21, 11:23] p3: మహతీ సాహితీ కవి సంగమం
కరీంనగరం
ప్రతిరోజూ కవితా పండుగే
తే 21 -5-2021 శుక్రవారం
పర్యవేక్షణ : శ్రీ డా. అడిగొప్పుల సదయ్య గారు
నిర్వహణ : శ్రీ వి. టి. ఆర్. మోహనరావుగారు
సమీక్షణ : శ్రీమతి. దొంతంరాజు విజయలక్ష్మి గారు
అంశం : ఐచ్చికం
ప్రక్రియ : శ్లోకాలు.
కవిత సంఖ్య : 5.
శీర్షిక : నవావర్ణ శ్లోకాలు.
|| ధ్యానం ||
ధ్యాయేత్ ఆది మధ్యాంత రూపిణీ ,
అఖండైక రస వాహినీ, |
అష్థాదసా పీఠ అఘనాసినీ, దేవి ,
ముక్తిప్రదాయినీ, సంగీతరసపోషిణీ ||
అరుణ కిరణోజ్వలాకాంతిరసభాసినీ,
అ,క,చ,ట,త,ప వర్గాది గుణభేదినీ , |
అంబ యంత్రాది ,కాది,సాది,
మంత్రాది వసనీ ,కామేశి శివకామినీ ||
1. త్రైలోక్యమోహన చక్రం .
ఆనందభైరవి రాగం .
*****
సర్వానందకరీం ,జయకరీం ,
త్రిపురాది చక్రేశ్వరీం |,
శర్వాణీ షడ్చక్రభేదకరీం ,శివసతీ,
నిగమాదిసంవేదినీం ||
మహిషాసురాది దైత్యమర్దనకరీం ,
భయహరీం, అణీమాద్యష్థ సిద్దేశ్వరీం |,
'' త్రైలోక్యమోహనచక్ర'' నిలయీం ,
సురనుతాం,'' ఆనందమయి భైరవీం'' ||
2 సర్వాశాపరిపూరకచక్రం ,
కళ్యాణి రాగం.
*****
'' సర్వాశాపరిపూరకచక్ర ''నిలయే ,
శర్వాణి శివవల్లభే .|
శ్రీవాణీ, రమా ,సేవితపార్స్వయుగళే ,
పర్వేందుముఖి పార్వతే ||
దూర్వాసార్చిత దివ్యపాదయుగళే ,భగవతే,
భవ,బంధ,భయ మోచకే |
ఉర్వీతత్వాది స్వరూపిణీం , చైతన్యఖనీం ,
'' కళ్యాణి '', ఘనరూపిణీం ||
3 . సంక్షోభణచక్రం .
శంకరాభరణం రాగం .
*****
అనంతకోటి బ్రహ్మాండనాయకీం ,
''సర్వసంక్షోభిణీం'', బ్రహ్మాణి బహురూపిణీం |
అనంగాద్యుపాసినీం అనంగకుసుమాం,,
అంబ అష్థ్థాదశాపీఠికాం ||
హస్తే అంకుశ,చాప, బాణ, ధనుధరీం ,
జయకరీం తత్త్వప్రదే , శాంకరీం |
శతసహస్రరత్నమణిదీప్తీం,మందేస్మితేందువదనాం ,
' శంకరాభరణవేణీం '' ||
4 .సకలసౌభాగ్యచక్రం .
కాంభోజిరాగం .
*****
నమ: అంబికాయై , నమ:చండికాయై ,
నమ : ఓంకార, హ్రీంకార, బీజాక్షరై |
నమ '' కాంభోజ''చరణే ,చతుర్దశభువనే ,
'' సకలసౌభాగ్య '' శుభదాయినే ||
నమ:కల్మషహరణే కలిసంతరణే ,
చతుర్వర్గ ఫలదాయినే ......|
నమ: కామేశ్వరీ, కాళికే, ఘనకపాలికే,
సకల భువనాంతర్గతపాలికే ...||
5 . సర్వార్ధసాధకచక్రం .
భైరవిరాగం .
*****
'' సర్వార్ధసాధకచక్ర '' నిలయే,
బహిర్దసాదిచక్రవలయే, బహురూపికే ''భైరవే'' |
నిత్యశుద్ధే, ముక్తబుద్ధాభేద్య, సత్ --
చిదానందమయి సాత్వికే ||
త్త్ర్రైమూర్తి త్రిగుణాత్మికే ,ధరనుతే ,
క్షిత్యాదిశివశక్తి స్వరూపాత్మికే. |....
కదంబవనవాటికే, త్రిభువనపాలికే,
దేవి త్త్వ్రైలోక్యరక్షాళికే ,,,,,||
6. సర్వరక్షాకరచక్రం .
పున్నాగవరాళిరాగం .
*****
దశరాదివినుతే గురుగుహవిదితే , దేవి-
దశశక్తి దైత్యాళికే ..... |
''సర్వరక్షాకరీ '', సర్వసంపత్కరీ , దేవి ,
కైలాశరమణేశుమణి సాత్వికే ||
దశకళాత్మికే , దశరసాత్మికే ,దేవి -
సంగీత, సాహిత్య , రసపోషికే.....|
అతిమధురవాణీ ,'' పున్నాగవరాళివేణీ ''
పాహి | సర్వజ్ఙే శివకామినీ....||
7 . సర్వరోగహరచక్రం .
శహనరాగం .
*****
రాజీవనయనే ,.. రాకేందువదనే ,
''శహన'' రాగోత్సాహి లయరంజనే |
స్వాత్మానుభోగినీ , శుభరాజయోగినీ
దేవి ,ఓంకారి, హ్రీంకారి ,జనమోదినీ ||
అతిరహస్యయోగినీ "సర్వరోగహరచక్రస్వామినీ ''
దేవి వాగ్దేవతారూపి విద్యాఖనీ |
కోదండధారిణీ , వీణాసువాదినీ , దేవి -
శరణార్తిశమనీ , సుసౌదామినీ ..||
8 . సర్వశిద్ధిప్రదచక్రం .
ఘంటారాగం .
*****
ఆవాహయే దేవి , అరుణోజ్వలే, అంబ -
దైత్యాళి , జయకాళి , జగదంబికే ....|
సర్వ శక్త్యాత్మికే , దేవి సుకసారికే దివ్య ,
'' ఘంటామణిఘోష '' కవాటికే.......||
నఖోదితవిష్ణు , దశరూపికే , దేవి
దశాకరణ శబ్ధాది అంతర్లయే |
సర్వాత్మికే , సర్వరక్షాకరీ, '' సర్వ -
వరశిద్ధిప్రదదాయి '' త్రిపురాంబికే ||
9 .సర్వానందమయచక్రం .
ఆహిరిరాగం .
*****
జయతి జయతి అంబే, శృంగారరస కదంబే ,
శివకామేశ్వరాంకస్థ - బింబేందుబింబే....|
చింతామణిద్వీప మంచస్థ్థితే , దేవి -
చిద్బింబ , శివరూపి , చక్రస్థితే......... ||
కమలాంబికే దేవి విమలాత్మికే ,
''సర్వ ఆనందమయి'' రూపలలితాంబికే |
శాకంబరీ, దేవి శాతోదరీ జనని ,
దుర్గా,రమా, వాణి సతి సాత్వికే ||
జమంగళం |, దేవిం శుభ మంగళం ||
నిత్య జయ మంగళే , శక్తి కురు మంగళం ||
ఓం | భూ: శాంతిప్రదే | భువన శాంతి ప్రదే |
భూత , ప్రేతాది - గ్రహపీడ శమనహ్రదే .....|
సకలసౌభాగ్య ప్రద పూర్ణమయి మంగళే |
ఓం.......శాంతి:......శాంతి: ......శాంతి:. . ||
రచన -
శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
[5/24, 13:00] p3: మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
ప్రతిరోజు కవితాపండుగే....
పర్యవేక్షణ : శ్రీ డా॥అడిగొప్పుల సదయ్యగారు.
నిర్వహణ: శ్రీ దాసరి చంద్రమౌళిగారు.
సమీక్షణ: శ్రీ టిఆర్ కె కామేశ్వరరావు గారు.
24-05-2021: సోమవారం.
అంశము : చిత్రకవిత
ప్రక్రియ: పద్యం.
కవితా సంఖ్య: 1.
రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ మహారాష్ట్ర .
శీర్షిక ; శ్రీనివాసం సతతం నమామి.
శరణం శరణం శ్రీ శ్రీనివాసం
శరణం శరణం శ్రీ భక్త పోషం
శరణాగత వత్సల పారిజాౕతం
శ్రీవత్స వక్షస్థల శోభిత కౌస్తుభ మణిదీప్తం
సతతం స్మరామీ..హరీం.నమామీ ॥
చతుర్భుజ శోభిత శ్రీ శ్రీనివాసా హరే
శంఖ చక్ర శోభితకర సుందరేశా పరే
అభయ కరా ఆది మధ్యాంత రహితా...
శ్రీ పాద వల్లభా ముక్తి మొాక్ష ప్రదాయకా
వేంకటాచల వాసా...విశ్వ రుాపా నమొా॥
అఖిల లోకారాద్యం శ్రీహరిం, ఆనంద రుాపం
వనజ భవాది వందిత, ముని మానస బృంగం.
నంద యశోదానందం, వందత ఛరణారవిందం
బృందావన వనశోభిత మురళీ మనోహరం..
క్రిష్ణం స్మరామి..సతతం.....నమామీ ॥
ఆ.......హరీ...హరీ......॥
[5/25, 18:56] p3: మహతి సాహితీ కవి సంగమం-కరీంనగరం
ప్రతి రోజూ కవితా పండుగే
పర్యవేక్షణ:డా.అడిగొల్పుల సదయ్య గారు
నిర్వహణ : బీరొప్పొల్ల అనంతయ్య గారు
సమీక్షకులు: శ్రీమతి DVS మహాలక్ష్మిగారు
తేది: 25/05/2021 మంగళవారం
అoశo:సాహిత్యాoశము
(దేవులపల్లి కృష్ణశాస్త్రి కవితా వైభవము)
ప్రక్రియ: (ఐచ్చికం ) వచన కవిత .
-రచన : శ్రీమతి :
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .: మహారాష్ట్ర .
8097622021.
శీర్షిక: మనసు కవి .
కవితా సంఖ్య: 2
___________________________
పాడనా తెలుగు పాట అంటుా
తెలుగువారి గండెల్లో తెలగుదనాన్ని
మైల్కొలిపిన మేటి భావ రస హృదయుడు.
మావి చిగురులు తిని కోయిల కుాసిన
రాగాలకు "మనసును మల్లెల
మాలలుాగించి మైమరపించిన
మధుర భావనల సినీ రచయిత.
సరిగమపదనిసలు పలికేవారుంటే
ఆకులో ఆకునై..కొమ్మలో కొమ్మనై
పుాల పరిమళాల మధుర గంధాన్ని
అందిస్తానన్న అనంద గీత కారుడు.
కుశలమా! నీకు కుశలమేనా అంటుా
ప్రతీ హృదయాన్నీ పలకరించే
మనసున్న "నామాల తాతయ్య."
"ఇది మల్లెలవేళయనీ" అంటుా'
"చీకటి వెలుగుల కౌగిలి గిలి " లో
"చుక్కలతో ఏదో చెప్పాలని" ఉందంటుా
"ఒక్క క్షణం ఒక్కో క్షణం విడవక
కవితలల్లుకుపోయే సంగీత రస
హృదయ కవన వన విహారుడు.
"చాలులే నిదురపో "అంటున్నా
"నేటికి మళ్ళీ మా ఇంట్లో" -నా మదిలో
"ప్రతి రాత్రి వసంత రాత్రే" నంటుా
"ఘనా ఘన సుందరుని" సంకీర్తనా
రవళిలో ఓలలాడిస్తుా పవళింపు
సేవల "సడి సేయకో గాలి"
అంటుా ప్రకృతిని ఆజ్ఞాపించే "
లాలిత పద కవితా దురంధరుడు.
జయ జయ జయ ప్రియ భారతి "
అంటుా దేశ భక్తిని పిల్లల లో
ప్రేరేపిస్తుా విద్యా బోధన చేస్తున్న
ఉన్నత పాఠశాలోపాధ్యాయుడు.
"కళాప్రపుార్ణ" "పద్మభుాషణ్" వంటి
ఘన బిరుదులందుకున్న కవి .
మహోన్నత వ్యక్తిత్వ సార్వభౌముడు.
శ్రీ శ్రీ వంటి మహా కవులకు కుడా
స్ఫుార్తి నిచ్చే పద కవితా శైలి కలిగి
"సాహిత్య అకాడమీ అవార్డు"
గ్రహించిన అద్భుత లలిత గీత కళా
సార్వభౌముడు.అతడే మనం
గర్వింపదగ్గ తెలుగు కీర్తి కిరీటి
" శ్రీ దేవులపల్లి క్రిష్ణశాస్థ్రి" గారు.
[5/29, 19:30] p3: మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
ప్రతిరోజు కవితా పండుగే
పర్యవేక్షణ: డా.శ్రీ.అడిగొప్పుల సదయ్య గారు
నిర్వహణ: శ్రీ కుందారపు గురుమూర్తి గారు
సమీక్షణ: శ్రీ డా.నాయకంటి నరసింహ శర్మ గారు
తేది: 29-05-2021: శనివారం
కవితా సంఖ్య: 5.
----------------------------------------
రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ మహారాష్ట్ర
ప్రక్రియ: హయప్రచార రగడ
అంశము: శ్రీనివాస.
-----------------------------------
శంఖ చక్ర గదా ధరా
వేంక టేశ అభయ కరా॥
భక్త పొిష బహుస్వ రుాప
ముక్తి మొాక్ష ముాల రుాప ॥
విమల చరిత విశ్వ నేత్ర
కమల నయన ఘనసు గాత్ర ॥
కలభ గమన కరుణ లోల
సులభ ప్రాప్త సుగుణ జాల॥.
వర ప్రదాత వంద్య మాన.
సుర వినుత సుజన ధ్యాన॥
అభయ కరా అఘవి నాశ
శుభక రాసు జ్ఞాన పోష ॥
మంగ పతీ మధుర శ్రీశ.
భంగ గర్వ భయవి నాశ ॥
ఆప్త, ఘనా అసుర నాశ ॥ ॥
సప్త గిరిశ శ్రీని వాస ॥
వేద విదిత వేంక టేశ
నాధ లోల నటన టేశ ॥.
శరణు శరణు శ్రీని వాస
శరణు శరణు శ్రిత పరేశ ॥
సవరించి పంపినదండి.
[6/11, 14:07] p3: శుక్రవారం : 11/6/2021
అంశం : ఐచ్ఛికం.
ప్రక్రియ : దీర్ఘ కవిత.
కవిత సంఖ్య : 02.
మ.సా.క.సం...
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.(మహరాష్ట్ర )
---------------.
శీర్షిక : కాగితం గోడు.
స్వశ్ఛమైన మల్లెల వంటి తేట తెల్లని
మనసులా,ఒక్క మచ్చకుాడా లేక నిర్భయంగా విహరిస్తున్న కాగితానికి ,ఇప్పుడు,బయటకు రావాలంటే భయమేస్తోంది.॥
తన తోటి సఖులు, -రంగు రంగుల వర్ణాల
నెచ్చెలులతో కలిసి, పేపర్ మిల్లు గుడారాల్లో
గుంభనంగా దాగునుంది దీనంగా..
ఒకప్పటి రోజుల్లో......తమ ఉనికి-
ఎంత ఆహ్లాదంగా ఉండేదనీ...
.పెండ్లి పిలుపులకు , సెంటు పుాసుకొని
సన్నాయి మేళాల సందడులతో ,
ఆహ్వాన పత్రికై అలరించేది.॥
భగవదారాధనా శోభలకు శుభ -
లేఖలుగా మారి,పసుపు కుంకాల
పచ్చ బొట్లతో నిండి, పరవశియై
కళ కళ లాడేది.॥
రవి వర్మ..పికసో..బాపుాల వంటి
చిత్రకారుల కుంచెలతో, రంగు రంగు వలువల
అందాలని సంతరించుకొని అద్భుత
సౌందర్యరాసియై .....
ఆనంద లోకాల్లో విహరించేది.॥
వలపు పిలుపుల వర్ణనలతో నిండిన
చెలికాని సందేశమై , అది చదువుతున్న
చెలియ సిగ్గుల , నునుపు దేరిన బుగ్గల,
కాంతి తో దోబుాచులాడేది.॥
రుాపాయి నుండి మొదలైన ముద్రలతో
మధ్యతరగతి నుండి మాముాలు
జనాల వరకు గల నిత్యావసరాల నిండు
లక్శ్మిగా పుాజలందుకునేది.॥
ధర్మ నిరతి గల స్వాతంత్ర్య పోరాటకుల
కీర్తి చిత్రాల చెలిమి తో
కొలువు తీరి ఉండేది.॥
వలసినన్ని వార్తా విశేషాల న్యాయ బద్ధ-
నిబంధనల చిట్టాలకు , పుటల దాస్యం చేసేది.॥
వసి వాడని , పసి పిల్లల అట పాటల
ఆనందాలకు, వర్షాకాలపు నీటి పడవగా మారి,
అనుభుాతుల అలలపై కేరింతలు కొట్టేది.॥
ఇలా ఎన్నెన్నో తీపి గుర్తుల జ్ఞాపకాల కధలు..
కాలంతో పాటు కరిగిపోతుా ...మసి కొట్టుకు పోయేయి.
తమ విలువ కనపడని కాలుష్యంలో పడి
మట్టి -కొట్టుకుపోయింది.॥
ఇప్పుడు తమ బతుకు ఎలాగుందంటే.....
పెళ్ళిళ్ళ పిలుపులకు బెత్తెడు ముక్కలో చిరునామాను మొాసి...చదివేసిన
క్షణం లోనే చినిగి , చెత్త బుట్టలో చేరిపోతోంది.॥
గుడి నిర్వాహకుల గొంతెమ్మ కోర్కెల- రుసుము
పుాజల , బారెడు జాబితాల పట్టీలతో ,
గుడి బయట గోడకు అంటించబడి -కళాహీనమైన
ముఖంతో వెల- వెల బోతోంది.॥
అర్ధం పర్ధం లేని, మొాడర్న్ ఆర్ట్ రంగులతో,
బారెడు కొలతల బుాతు బొమ్మలతో, బేరపు
సొమ్ముకు ,అమ్ముడుపోతోంది.॥
ఉత్కంఠ పరచే ఉత్తరం జాగాలో..
ఏసిడ్ దాడుల ఏహ్యపు బెదిరింపులను
సుాచించే ఎత్తుగడల రాతలకు రగిలే- కన్నీటి
కావ్యమయింది .॥
అతి తక్కువ ముద్రతో ,అందరి కడుపుా
నింపి , ఆనందపరచెే తన విలువ,
వేల రుాకలకు పెరిగి వేలంపాటలో
వెలివేయబడి, వెక్కిరింతలపాలయ్యింది.॥
అబద్ధపు రాజకీయ ప్రమాణాలకు
సాక్షిీ భుాతమై , ప్రపంచ ప్రజానీకాన్ని పేజీలతో
వంచించే వార్తావెలయాలిగా స్థిరపడతామేమొా
అన్న భయం క్షణం- క్షణం వెంటాడుతోంది.
ఎన్నో సద్ధర్మ , సాంప్రదాయ , కావ్య
కళా -ఖండాల నిక్షిప్త నిధులను అలరించిన-
మా దొంతు పుటల భాగ్య రాసులు...
మారే కాలంతో ముడివడి , భాషా పటుత్వం
లేని భావ జాలాల మార్పుల్ని జీర్ణించులో లేక,
వంశాభివ్రుద్ధికి నోచుకోని శాపగ్రస్తులుగా మిగిలిపోతామేమొా అన్న ఆవేదనతో
హా- హా -కారాలు చేస్తున్నాయి. ॥
సామాన్య మానవునికి అందుబాటులో లేని
మా అంతరంగ ఆవేదన" స్విస్" బేంకు ఖాతాల-
కారాగారంలో చిక్కుకొని కన్నీరు కారుస్తోంది.॥
పాడి - పంటల పచ్చదనానికి కావలసిన
సరంజామాని సమకుార్చని , స్వార్ధపరుల
సోకు సౌలభ్యాల రంకు రుసుముగా, చేతులు మారుతుా ,చితికిపోతున్న జీవితానికి..
అంత మెప్పుడో ఎరుగని వింత ఆట పత్రాలుగా
మిగిలిపోతామన్న భయంతో ఆక్రోసిస్తున్న అభాగ్యులం . ॥
ఏ రోజు కారోజు ఎన్ని చేతులు మారవలసి వస్తుందో,
ఎన్ని రంగులు పులుముకో వలసి వస్తుందో,
ఏ వెల" లేని " విలువకు దిగజార వలసి వస్తుందో-
అని బెదురుతుా బతుకుతున్న , మొండెం లేని
ముదనష్టపు జాతకులం.॥
గొంతెత్తి అరవలేక, మమ్మల్ని మేము
తీర్చి దిద్దుకోలేని, అసహాయ - అంగవైకల్య -
హీన చరితలం,॥
కరన్సీ పేరుతో ముద్రింపబడుతుా దీనమైన
స్థితికి దిగజార్చబడుతున్న, శక్తిహీన కాగితపు కాంతా-కనకాలం. ॥
అంటుా బావురుమంది....
వెట్టి చాకిరీ చేస్తున్న , వట్టి వెర్రి తెల్ల కాగితం.
---------------------------------------------------------------
[8/5, 15:41] p3: మహతీ సాహితీ కవిసంగమం
అంశం: సహితమే సాహిత్యం
ప్రక్రియ: ఇష్టపదులు
తేది: 5.8.21
శీర్షిక: సాహిత్యంతో చెలిమి.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
మసాకసం: 37
ఈ మాసం కవిత సంఖ్య: 3
1.
సాహిత్య లోకాన సార మౌ గ్రంధాలు
ఎరిగించినవి ఎన్నొ ఎరుగనీ విషయాలు
పద్యాలు గద్యాలు పలుకు పాఠాలెన్నొ
మేధస్సు నిండినవి మేలైన నీతులుా
అలరే పురాణాలుా అవి పెద్ద గ్రంధాలు
చదువ సంస్కృతులను చాటు ఇతిహాసాలు
సాంప్రదాయపు విధులు సరినేర్వవలెనన్న
చదువు సాహిత్యమే జగము నెరిగెదవన్న ॥॥
2.
వేల కీర్తులనేలె వేమన్న పద్యాలు
సుఖపు బాటను జుాపు శుభాషితమ్ములవిగ ॥
ఛందస్సు నిండినవి చదువ పద్యములెపుడు
కందాల అందాల కడు రమ్యమౌ యతులు॥
ప్రాస నియమాలతో ప్రాణమే పోసేరు
కవులు ధీటులు వారు కనుగొన్న నియమాలు ॥
సద్ధర్మ బాటలుా సంస్కృతుల తేటలుా
చిట్టి పొట్టీ కధలు చిన్నారులకు నిధులు ॥॥
3
అట్టి సాహిత్యమును అనవరతము చదువగ
ఉర్రుాతలుాగె మది ఉత్సాహమదె నిండ.
ఆటవెలదుల ప్రాస తేట గీతుల మాట
కంద, సీసపు బాట కవుల సాహితి వేట
అందమౌ సాహిత్య మందరిని అలరించు
సద్గ్రంధముల చదువు సఖుల మరువ ॥
సాహిత్యమే చెలిమి సాహిత్యమే బలిమి
సరి ఈశ్వరీ మాట సత్య మిది ఓ మనుజ ॥॥
[10/7, 06:39] p3: ప్రక్రియ : మత్త కోకిల.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.
కవిత సంఖ్య 2
మ సా.క.సం..37
శీర్షిక : ముద్దు కృష్ణ .
భక్తి తోడను గొల్వ మేలగు భాగ్య మిత్తువు నీవెగా
శక్తి యుక్తులు దెల్పి పేర్మిని సార మిత్తువు నీవెగా
రక్తి కట్టిన రమ్య గోకుల రమ్య లీలవు నీవెగా
ముక్తి నిచ్చెడు బాల మొాహన ముద్దు కృష్ణుడ వీవెగా॥
శీర్షిక : బంగారు బతుకమ్మ
శ్రీల నిచ్చెడు వేల్పు తల్లివి శ్రీని కేతని మానినీ
వేల పుాలను జుట్ట వేడుక వెల్గు సుందర హాసినీ
జేల జేతుము మేలు జాతర జేరి బోనము నీకిడీ
కోరు బంగరు బాట చుాపెడు గౌరి శ్రీగజ గామినీ ॥
రంగు పుాలిడి స్తోత్ర పుాజిడి రాణి రక్షణ కోరితీ
మత్త కోకిల మంద గామిని మంత్ర ముార్తివి నీవనీ
వేప ఆకుల నిమ్మ మాలల వేసి వేడెద మొాఘనీ
వేల్పు వైమము గావ రాగదె వెల్గ మాపురి పావనీ ॥
పంక జాక్షివి లెమ్మ బంగరు వల్లి శ్రీబతు కమ్మణీ
పార్వతీ ప్రియ శర్వు రాణివి పారమేశ్వరి పావనీ
బోన మెత్తిన వారి బ్రోచెడు పోగు రాసివి తీరథీ
అమ్మ తొమ్మిది రుాపు లెత్తిన అంబ అందుకొ హారతీ ॥
[10/8, 20:26] p3: అంశం: ఐచ్ఛికం
తేది: 01-10-2021
మసాక.సం: 37
కవి పేరు: రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
ఊరు: కల్యాణ్ : మహారాష్ట్ర.
శీర్షిక: నవ దుర్గా స్తుతి.
ప్రక్రియ: ఇష్టపది.
ఈ వారం కవిత సంఖ్య: 4.
ముగురమ్మల ముాలము ముల్లోక పాలనము
శిష్టులకిడునభయము దుష్టజనుల దమనము
ఆదిపరాశక్తియె అవతారములెత్తిన
నవదుర్గారుాపులు నవరాత్రులు శుభములు ॥
అఖిల లోక నాయిక అంబ శైల పుత్రిక
వాహనమ్ము వృషభము వారిజ ముఖ మలము
నీలవేణి శుాలపాణి నిత్య పారాయణి
నవరాత్రిలో తల్లి నమ్మిన తొలి దైవము ॥
ధవళ వస్త్ర ధారిణి తరుణి బ్రహ్మచారిణి
కర కమండల ధరి, సు కాంత జ్ఞాన రుాపిణి
జపమాలా ధారిణి జగదీశ్వరి జననీ.
తపఃచార్ని దయగుణి తవ చరణం శరణం
చంద్రఘంట రుాపిణి చంద్రిక ముఖ తోషిణీ.
శక్తి ధైర్య రుాపిణీ శాంకరి భయ హారిణి
ధుామ్రలోచను దమనీ దుఃఖ, పాఫ ,నాశినీ
నవ దుర్గా రుాపిణి నాద వేద రుాపిణి ॥
విశ్వ శక్తి రుాపిణి విజయ విశ్వ మొాదిని
అష్ట భుజా రుాపిణి అష్ట అస్త్ర ధారిణి.
కుాష్మాంద స్వరుాపిణి గుాడగుణ స్వభావిని
ఆది శక్తి రుాపిణి అంబ సింహ వాహినీ॥
ఐశ్వర్య ప్రదాయిని అంబ మొాక్ష కారిణి.
ఇహ పర సుఖ దాయిని ఇచ్ఛా పుార్తి కరణి
స్కందమాత పావని స్కందుని ప్రియ జనని
తారకసుర భంజని ధరణోద్ధర కారిణి ॥
శక్తి భద్ర కాళికె శాంకరి సుర మొాదితె
మహిషాసుర మర్దని మాత సింహ వాహిని
యొాగ తంత్రాత్మికే ఆజ్ఞా చక్రార్చితే
కాత్యాయని భగవతి కాళీ జయ దుర్గే ॥
భగమాలిని భైరవి పరమేశ్వరి పార్వతి.
సర్వాంతర్యామిని సర్వ హృదయ వాసీని
మణి ద్వీప నివాసిని మాత వేద రుాపిణి.
దుర్గా త్రై యంబికెే దుర్లభే శివాత్మికే ॥
అష్టమావతారిణి ఆదిపరాశక్తీ
అభయముద్రాకరీ అమంగళ వారిణీ
ఘన త్రిశుాల ధారిణి వన దుర్గా రుాపిణి
శుభ మంగళ గౌరీ సుఖ మంగళ కారిణి ॥
శుాల,డమరు ధారిణి ముాల మంత్ర కారిణి
శ్వేతాంబరి శ్రీకరి మాత విష్ణు సోదరి
మహిషాసుర మర్దనీ మహిష వాహనీ ఘని
శక్తి దుర్గ రుాపిణి శరణు శంభు కామిని ॥
సిద్ధిధాత్రి శ్రీకరి బుద్ధి ప్రద శాంకరి.
ఇహ పర సుఖ కారిణీ ఇందు వదని ఈశ్వరి.
శంఖ చక్ర ధారిణి సార పద్మ లోచని
బ్రహ్మ జ్ఞాన ఫలకరి బ్రాహ్మీ మాహేశ్వరి.॥
సర్వ సిద్ధి వరదే శర్వు రాణి శుభదే
అభయప్రద హస్తే అంబే శివ శక్తే.
నవ దుర్గా రుాపే నారాయణీ సతే
నవ రుాపిణి మాత్రే నామ విజయ కీర్తే ॥
***********************
No comments:
Post a Comment