రచన : స్వర కల్పన :
శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర .
శీర్షిక : గణపతి కీర్తన .
పల్లవి :
******
కరములు మొాడ్చి కన్నుల తెరముాసి కరివదనుని గంటి నే..
అనుపల్లవి :
************
కరుణాంతరంగుని కామిత వరదుని
గౌరీ శంకర ప్రియ తనయుని నే....॥ కరములు ॥
1. చరణం .
***********
ఆటంకముల బాపు ఆది పుాజ్యుని గంటి..
ధీటగ భువి వెలయు దివ్య రుాపము గంటి ॥
గుజ్జు రుాపుని బొజ్జ గణపతినే గంటి.
దిగ్గజముల నేలు
దివ్య రుాపము గంటి॥ కరములు ॥
2.చరణం.
*********
ఎనలేని విద్యల ఒజ్జ దేవర గంటి.
కార్య సిద్ధి కల్గజేయు
బుద్ధి బాలుని గంటి..
బలు చిలువలు ధరియించు
ఎలుక వాహను గంటి.
పలు రుాపుల నను గాచు
బాల గణపతి గంటి..॥కరములు ॥
.
రచన : స్వర కల్పన :
శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర .
శీర్షిక : త్యాగరాజు పై కీర్తన
పల్లవి:
సంగీత సార్వ భౌమం భజేహం.
సరస గాన లోలం త్యాగరాజం.
చరణం ;
తిరువాయుర పు నివాసం ...
రామ బ్రహ్మ సుతం శాంత కుమారం.
పంచాపకేశ రామనాధానుజం ,
సంతత శ్రీ రామ భక్తం , సద్బ్రాహ్మణ కులజం ఈశ్వరీ
చరణం.
వరనారద యతిరాజ నుతం.
స్వరార్ణవ గ్రంధానుగ్రహితం.
స్వర రాగ సుధారస గాత్రం
పంచరత్నాది క్రతీ కృత కర్తం.
గీత జ్ఞాన రత్నం , రామచంద్ర కృప పాత్రం
గీత రసిక మిత్రం , సద్గురు శ్రీ త్యాగరాజం...ఈశ్వరీ॥
No comments:
Post a Comment