దత్తపది: *తప్పు-విప్పు-ముప్పు-కప్పు*
ప్రక్రియ: ఆటవెలది.
రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ , మహారాష్ట్ర .
తప్పు చేయు వాడు తనతప్పు నెరగడు
విప్ప ముడుల నతడు విశ్వసించు
ముప్పు చేయు నట్టి ముార్ఖత్వ మున్నచో
తగిన విధము లేదు తప్పు దెలుప ॥
అతిగ మాట లాడ నతివకు నదె(ముప్పు)
(తప్పు) దోవ బట్టు తరుణి జాణ
(కప్పు )కొనుము బట్ట కడుగౌర వముపొంద
విందు మాట లాడ( విప్పు) పెదవి॥
(తప్పు )జేసి నరుడు తనవోటు దెగనమ్మి
ముందు నుయ్యి( గప్పు) (ముప్పు) గనక
ఐదు ఏండ్ల పదవి యమలోక మునుదల్పు
కనులు (విప్పు) నరుడ కాన నిజము ॥
ఓటు నమ్మ (తప్పు) నొరిగేది యేదయొా..?
(ముప్పు) నీకు నదియె మురియ బోకు
కదలు కాల కధలు కను(విప్పు) గదనీకు.
(కప్పు) ముసుగు దీయ ఖలులె మెండు ॥
********************************
No comments:
Post a Comment