నమస్కారం..🙏
నా పేరు శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ , మహారాష్ట్ర లో ఉంటాను.
నాటినుండి నేటి వరకు గల చరిత్రలో ,
ఎందరో మహిళామణులు విద్య , వైద్య, న్యాయ ,
సంగీత , సాహిత్యాది అనేక కళా రంగాలలోనే గాక ,
శాస్త్ర సాంకేతిక వైజ్ఞానిక, రాజకీయ, స్వాతంత్ర్యాది
ఉద్యమాల లో పాల్గొని , తమ విశిష్ట ప్రతిభను
చాటుకున్నారు.
వారందరుా మన భరతమాత కీర్తి కిరీటంలో
కలికితురాయిలై , నేటికీ చరిత్ర పుటల్లో
మహిళా శక్తికి స్ఫుార్తిదాయకులై నిలచేరు.
జాతీయ మరియు అంతర్జాతీయ మహిళా-
దినోత్సవాల సందర్భంగా , సాహితీ బృందావన జాతీయ వేదికవారు నిర్వహిస్తున్న
" మగువ మహారాణి " పోటీలకుగాను
నేను తీసుకున్న అంశం నాటి మహిళా రత్నమైన
శ్రీ " దుర్గాబాయి దేశ్ ముఖ్ " గారిది.
ఈమె మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబీకులైన
రామారావు క్రిష్ణవేణమ్మ దంపతులకు రాజమండ్రిలో
జన్మించారు.
8 సంవత్సరముల వయస్సు లో ఆమెను ఆమె తల్లిదండ్రులు , ఆమె మేనమామకు ఇచ్చి వివాహం చేయ నిశ్ఛయించగా, ఆ వయసులోనే ఆమె ఆ వివాహాన్ని తిరస్కరించేరు.
12 సంవత్సరాల వయసుకే ఆమె హిందీ పాండిత్యాన్ని
సంపాదించి , రాజమండ్రిలో హిందీ పాఠశాలను
నెలకొల్పి , అన్ని వయసులవారికీ విద్యా బోధనను
చేసేరు
మహాత్మాగాంధీగారు ఆంధ్రా పర్యటనకు వస్తున్నారని తెలిసిన ఆమె ఎనలేని విరాళాలను సేకరించి ,
వాటితోపాటు ఆమె చేతికున్న బంగారు గాజులను కుాడా స్వాతంత్ర్య పోరాట విరాళంగా సమర్పించేరు.
ఆంధ్రా పర్యటనలో గాంధీగారు చేసిన హిందీ ఉపన్యాసాలను , తెలుగులోనికి అనువదించి
ఆయన ప్రశంసలను పొందేరు.
ఉప్పు సత్యాగ్రహంలో అరెస్టు కాబడి కుాడా ,
స్వాతంత్ర్యోద్యమాలలో పాల్గొన్న ధీర వనిత
శ్రీ దుర్గాబాయి దేశ్‌ముఖ్ గారు.
ఇన్ని చేస్తుా కుాడా ఆమె తన చదువుకు ఆటంకం రానీయలేదు. విరామసమయాల్లో అమె చదువుకుంటుా తన విద్యను సకాలంలో పుార్తిచేసి,
న్యాయ కోవిదురాలిగా , ప్రఖ్యాత క్రిమినల్ లాయర్ గా
జగద్విఖ్యాతిగాంచేరు.
అనేక సాంఘీక సంక్షేమ సంస్థలను ప్రారంభించి
స్త్రీ ల అభ్యున్నతికి కృషి చేసేరు.
చెన్నై లో ఆంధ్ర మహిళా సభను
లిటిల్ లేడీస్ ఆఫ్ బృందావన్ అనే బాల సంఘాన్ని
స్థాపించేరు.
ఆంధ్ర విద్యాలయంలో మహిళా వసతి గృహాలను, హైదరాబాదులో ఆంధ్ర మహిళా పత్రికను స్థాపించి
దానికి సంపాదకత్వాన్ని వహించేరు.
రాష్ట్రమంతటా ఎన్నో కళాశాలలు, వసతి గృహాలుా,
నర్సింగ్ హోమ్ లు, వృత్తి కేంద్రాలు నెలకొల్పారు.
చెన్నై లో 70 మంది కార్యకర్తలతో ఉదయవనం అనే
సత్యాగ్రహ సిబిరాన్ని ఏర్పరచేరు.
స్వాతంత్ర్యానంతరం అమె భారత రాజ్యాంగ నిర్మాణ
సభలోసభ్యురాలిగా పనిచేసేరు.
అటుపై C D దేశ్‌ముఖ్ గారితో వివాహానంతరం
అమె సాక్షారతాభవన్ ను స్థాపించగా..
ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ఈమెకు గౌరవ
డాక్టరేట్ ను ప్రదానం చేసేరు.
పిదప భారత ప్రభుత్వంచే నెలకొల్పబడిన
కేంద్ర సాంఘీక సంక్షేమ బోర్డ్ కు , దిల్లీ లో ఉన్న
బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ లకు అద్యక్షురాలిగా
పని చేసారు.
కేంద్ర సాంఘీక సంక్షేమ బోర్డ్ వారు ఈమెకు 1998లో
ఈమె పేరున " డాక్టర్ దుర్గాబాయి దేశ్‌ముఖ్" వార్షిక అవార్డు ను నెలకొల్పి , దానిని మహిళా అభ్యున్నతికి
పాటుపడే స్వశ్ఛంద సంస్థలకై వినియొాగపరిచేరు.
దిల్లీ లో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ వారు
2006లో ఈమె పేరున "దుర్గాబాయి దేశ్‌ముఖ్ -
కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్" ను నెలకొల్పారు.
ఇలా ఒక స్త్రీ గా, పిన్న వయసు నుండి కుాడా దేశానికి
ఎనలేని సేవలందించిన గౌరవనీయులు
శ్రీ దుర్గాబాయి దేశ్‌ముఖ్ గారు 1981 మే వ తారీఖున
హైదరాబాదు లో దివంగతులై భరత మాత కీర్తి కిరీటంలో మణిరత్నమై చిరస్మరణీయులయ్యేరు.
"మగువ మహారాణి " పేరుతో మహిళలకు
అత్యున్నత వేదికను కల్పించి , మహోన్నతమైన మహిళా మణుల వీర చరితల సంస్మరణతో, మహిళా శక్తిని జాగృత పరచే విధంగా , వచన, కవితా గానాలను చేసే అవకాశాలను కల్పిస్తుా ప్రోత్సహిస్తున్న
సున్నితం ప్రక్రియ రుాపకర్త ,సాహిత్య పోషిణులుా ఐన గౌరవనీయులు శ్రీ నెల్లుట్ల సునీతగారికి , ఆమెకు సహకరిస్తుా కవులను ఉత్సాహపరుస్తున్న
యుాట్యుాబ్ ఛానల్ నిర్వాహకులు
గౌరవనీయులైన శ్రీ దేవవరపు ఈశ్వర రావుగారికి
సాదర నమస్కారములతో
నా మనఃపుార్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
No comments:
Post a Comment