Sunday, July 17, 2022

"క్ష " గుణింత కవిత

*క్ష* గుణింతంతో కవిత
శీర్షిక..క్షీణిస్తున్న మానవత్వం

*క్షణం క్షణం* ప్రకృతిని కాలుష్యంతో నింపేస్తూ మృత్యువునే కొని తెచ్చుకొంటున్న మనిషీ!..
*క్షు* ద్రమైన ఆలోచనలతో పుడమిని నిర్వీర్యం చేస్తున్నావ్..
*క్ష* ణికోన్మాదంతో విలాసాల బాట పట్టి, నీ శక్తులనే  కోల్పోయి దురభ్యాసాల పాలవుతున్నావ్..
*క్ష* ణికావేశానికీ లోనవుతున్నావ్..

*క్షితినీ, క్షితిజనీ* ఏకం  చేయాలనే విజ్ఞాన వీచికలు మానవుని
*క్షేమాన్ని* ఆశిస్తూ ఎన్నో ప్రయోగాలనే చేస్తున్నాయ్
*క్ష*ణమైనా విశ్రాంతి లేని యంత్రాలై అనవరతం శ్రమలనే చిందిస్తున్నాయ్..

*కానీ..*
*క్షీ*రసాగర మధనం లో గరళం పెల్లుబికినట్లు మనిషీ మనిషికి మధ్యన
*క్షీ*ణిస్తున్న 
ఆత్మీయానురాగాలు
*క్షా*మంలా ఎండిపోయిన మనసుల్లో ఆకలి తీరని ఆవేశాలు
*క్షు*ద్రంగా   మదమెక్కిన కామంతో
అమానుష కృత్యాలు
పెడదోవను పట్టిస్తున్నాయి..
*క్షే*మమే మీ *క్షే* మము కోరే పరిపాలనలంటూ
మనిషిని తాకట్టు పెట్టే
పాలనా యంత్రాంగాలు ..
*క్ష*మాగుణములనే మరిచి పగా ప్రతీకారాలతో రగులుతున్న ప్రతిహింసా ధోరణులు
*క్షు* రకత్తులతో మానవ మనుగడనే అంతం చేసే మారణహోమాలు
*క్షి* పణుల ప్రయోగాలతో, రక్తంతో తడిపే ఆగని నరమేధాలు..

*క్ష* ణమైనా ఇకనైనా ఇపుడైనా 
ఓ మనిషీ! స్థిరచిత్తంతో ఆలోచించుకో!
*క్ష*ళణభంగురమే నీ జీవితమంటూ తెలుసుకో
*క్షణం క్షణం* గడిచే ప్రతి క్షణం అమూల్యమైనది తెలుసుకో
*క్షే* మమునే, సంక్షేమమునే కాపాడుకొనుట నీ కర్తవ్యమని
మసలుకో
తక్షణమే నీ జీవితమును ఆనందంగా మలుచుకో..
*************

No comments:

Post a Comment