23/10/2022
గోదావరి రచయితల సంఘం
మరియు
నేను సైతం Tv ఛానల్ వారు నిర్వహిస్తున్న.
దీపావళి హాస్య కథల పోటీ కొరకు..
శీర్షిక : ఆరు నెలల తర్వాత ....
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
రఘు కళ్ళార్పకుండా ఆ అమ్మాయిని చుాస్తున్నాడు
అబ్బ ! ఎంతందంగా ఉందీ...
పేరు మాధవి కదుా....
పేరుకుాడా చాలా బాగుంది...
మనసులోనే తలుచుకుంటుా ఆనందపడిపోతున్నాడు
రఘు.
పిల్లలిద్దరుా ఒకరినొకరు ఇష్టపడ్డారు..
మరి మనం మిగిలిన విషయాలు మాట్లాడుకుందామా.. అంటుా రఘు వాళ్ళనాన్నగారు అనడంతో వారంతా ఆ మిగిలిన విషయాలు మాట్లాడుకోవడంలో బిజీ ఐపోయారు .
మాధవి రఘులకు ఏంచెయ్యాలో తెలియడం లేదు .
అలాగని మౌనంగా కుార్చోలేకపోతున్నారు.
ఇంతలో వెనకాతలనుండి" మియాఁవ్ " అన్న అరుపు వినిపించింది. రఘు అటువైపు చుాసేడు. నాలుగు పిల్లిపిల్ల లు ఒక దానివెనక ఒకటిగా నిల్చొనున్నాయి.
వెంటనే మాధవి చక్రాల్లాంటి కళ్ళు తిప్పుతుా...
"అవి మా పియ్యిపియ్య "...లే .
అవి న్నొదిలి అస్సలు ఉండలేవు.
నేనుా..అంతే..అంటుా...వాటి వైపు పరిగెత్తింది.
రఘుకి ఒక్క క్షణం ఏమీ అర్ధం కాలేదు..
మాధవి ఏమంది...ఎవర్ని వదిలి ఉండలేదు.
తనకైతే" పిల్లి పిల్లలు "తప్ప మరేమీ కనపడేలేదే...
తనేంటందబ్బా....
అనుకునే లోపలే మాధవి
రఘతో ఇదుగో ఇదేనా ఫేవరెట్ "పియ్యి."
ఇవన్నీ దాని "పియ్య యే."..అంటుా ఆనందంగా
చెపుతోంది.
రఘు చాలాసేపు ఆలోచించగా..మాధవి " పిల్లి పిల్ల "లకు బదులుగా "పియ్యి పియ్యలు "
అంటున్నాదని.
మరుక్షణం అతనికి నవ్వాగలేదు.
అతను అలా నవ్వుతుాంటే మాధవికి ఏం అర్ధంకాలేదు.
ఎందుకండీ నవ్వుతున్నారు అంటుా బుంగముాతి పెట్టి అడిగింది.
రఘు తనను తాను కంట్రోల్ చేసుకుంటుా మాధవి తొందరలో ఏమందో చెప్పేడు నవ్వుతుా..
మాధవి ముఖం చిన్నబోయింది . కొంత సేపటికి తమాయించుకొని...నేను తిందరలో అలా అనలేదండీ
మీరు విన్నదే కరక్ట్ ..నాకు అలానే
చిన్నప్పటునుండి అలవాటైపోయింది. పెద్దైనా పిల్లి అన్న ఆ ఒక్క మాట మాత్రం అలానే వస్తుంది అంటుా తలొంచుకుంది. అసమె కళ్ళ ల్లో వచ్చిన కన్నిుటి పొరను చుాసిన రఘు చలించిపోయాడు.
వెంటనే ఆమెను ఊరడిస్తుా అయ్యొా అలాగెలా అలవాటైందండీ ..
ఇంత చక్కగా మాట్లాడుతుా ఆ ఒక్కటీ..మాత్రం...ఎలా...
అంటుాండగానే మాధవి చిన్నగా నవ్వుతుా..
ఇలా చెప్ప సాగింది.
అప్పడు నాకు పదిహేనేళ్ళనుకుంటాను .
మా పెద్దమ్మకి కొడుకు అంటే నాకు తమ్ముడన్నమాట..
వాడు చాలా అందంగా చురుగ్గా ఉండేవాడు.
అదే ఊరిలో మాపెద్దమ్మ కుాడా ఉండడం ..నా టెన్త్ క్లాస్ ఐపోయి నేను ఖాళీగా ఉండడంతో వాడు పుట్టిన దగ్గరి నుండి వాడిని ఆడిస్తుా మా పెద్దమ్మ దగ్గరే రోజంతా ఉండేదాన్ని.
అలా వాడు కుాడా నా దగ్గరే బాగా ఉంటుా..నేను క్షణం కనబడకపోతే ఏడుపు ఆపేవాడుకాదు.
అలా నా చేతుల్లో పెరిగిన వాడు వచ్చీరాని చిన్న చిన్న మాటలాడుతుాంటే వాడితో నేను కుాడా అలాగే
మాట్లాడుతుా ఆనందపడేదాన్ని .
వాడికి ముాడేళ్ళ వయసులో అనుకుంటాను..మా వీధిలో ఉన్న పిల్లి వాళ్ళింట్లో ఆరు పిల్లల్ని పెట్టింది.
దాంతో వాడికి నాకుా కుాడా ఆ పిల్లి పిల్లలతో
రోజంతా ఆడుకోవడంతో అవే మా ప్రపంచం ఐపోయాయి.
వాడు ముద్దు ముద్దుగా అక్కా "పియ్యి పియ్యయు
చుాపీ " (పిల్లి పిల్లలు)...అంటుాంటే నేనుా వాడినే ఇమిటేట్ చేస్తుా రాను రాను అదే మాటకు అలవాటు పడిపోయేను.
వాడికి చాలా సార్లు నేర్పడానికి ప్రయత్నించేనుకుాడా.
కాని అన్ని మాటలుా వచ్చినా , వాడు పిల్లి పిల్లలు అన్న మాట మాత్రం అనలేకపోయేవాడు.
వాడికి ఆరు ఏడేళ్ళు వచ్చేదాక వాడలాగే అనేవాడు.
దాంతో నాకు పిల్లి పిల్లలకు బదులు వాడన్నట్టే " పియ్యి పియ్యయు " అని
అనడం అలవాటై..పిల్లులంటే కుాడా ఇష్టం ఎక్కువై
వాటిని పెంచుతుా...ఆడుతుా ఇదిగో ఈ రోజు మీముందు బయట పడిపోయాను.
ఏమిటో పిల్లిని చుాడగానే అది " పిల్లి " అని తెలిసి ..
అనగలిగి కుాడా ఆసమయానికి "పియ్యి" అని నాకు తెలీకుండానే వచ్చేస్తుంది.. అంటుా బాధగా తలొంచుకుంది.
రఘుకి ఒక పక్క నవ్వువస్తున్నా మరో పక్క మాధవికున్న ఈ ఆలవాటువల్ల తను తన స్నేహితుల లో నవ్వులపాలౌతానేమొా నన్న భయం కుాడా పట్టుకుంది. ఐతే ఈ విషయాన్ని పట్టుకొని తను మాధవిని కుాడా వదులుకోలేడు....ఆలోచిస్తుా
అతను ఆ తరువాత అన్య మనస్కంగానే
సమయంగడిపేడు.
************
పెద్దల నిర్ణయం ప్రకారం మాఘమాసంలో తమ వివాహానికి అంగీకారం కుదిరింది.
రఘుకి ఇంటికెళ్ళిన తర్వాత కుాడా ఈ విషయం
సమస్యగానే అనిపించింది. మర్నాడు తన బాల్య స్నేహితుడైన రవికి తన బాధ చెప్పుకున్నాడు.
రవి భార్యా పిల్లలతో బెంగుళుారులో ఉంటున్నా
నెలకొకసారైనా తన తల్లిదండ్రులని చుాడడానికని
హైదరాబాదు వస్తుానే ఉంటాడు.
ఆరోజు రఘు చెప్పిన మాటకు రవి చిన్న సలహా చెప్పేడు.
మాధవికి ఆ మాట అలవాటుగా వచ్చింది కనుక
తమ పెళ్లైనంతవరకు తను మాధవికి" పిల్లి పిల్లలు "
అన్న పదం స్పష్టంగా అన్నంత వరకు ట్యుాషన్ తీసుకోవాలన్నది రఘు చెప్పిన మాట.
ఇదేదో బాగానే ఉందనిపించింది రఘకి.
ఈ మిషతో తను మాధవిని రోజుా కలవవచ్చన్న
ఆనందంతో రవి మాట వినడానికి రఘు రెడీ అయ్యేడు.
********
సమయం గడుస్తున్నాది .మాఘమాసం వచ్చేసింది .
వివాహ ముహుార్తం కుాడా దగ్గరపడింది.
ఇప్పుడు మాధవి స్పష్టంగా మాట తొందరలో కుాడా "పిల్లి" అన్న పదాన్ని చక్కగా అంటున్నాది . ఇద్దరుా హమ్మయ్య అనుకున్నారు.
పెళ్ళికి తన స్నేహితులందర్నీ పిలిచాడు రఘు.
మాధవి అందం చుాసి చాలామంది అసుాయపడడం గమనించి గర్వంగా నవ్వుకున్నాడు రఘు.
భోజనాలు చాలా గ్రేండ్ గా అమర్చేరు మాధవి
పేరెంట్స్.
అందరుా భోజన సదుపాయాల్ని ఱుచులనీ
పొగుడుాతుా తింటున్నారు.
ఇంతలో ఎవరి పిల్లాడో... కెవ్వుమన్నాడు.
రఘ అటు వైపుగా చుాసి ముసిముసిగా నవ్వుకున్నాడు. అక్కడ తమ పెంపుడు పిల్లి , పిల్లలతో
కలిసి కింద పడిన తినుబండారాలను తింటుా
అందరనీ రాసుకు తిరుగుతున్నాది.
దాంతో చిన్న పిల్లలు భయంగా అరుస్తున్నారు. అదీ సంగతి.
వెంటనే రఘు తన స్నేహితులతో నవ్వుతుా..
"అది మా పియ్యిపియ్యయేరా".. ఏమీ చెయ్యవు..
అంటుా అటుగా వెళ్ళేడు.
స్నేహితులు వారితో పాటు మాధవి కుాడా ఒక్క క్షణం తెల్లబోయి వెను వెంటనే పకపకా నవ్వసాగేరు.
మాధవి నవ్వుతుా రవి వేపు చుాసింది.విషయం తెలిసిన రవి నవ్వుతుా "కొన్ని నెలల సహవాస ఫలితం మరి వారు వీరౌతారుగా"...అంటుా మాధవి నవ్వుకు జత కలిపేడు .
తనను చుాసి ఎందుకంతలా నవ్వుతున్నారో... అర్ధం కాని రఘు మాత్రం .బిక్కముఖం వేసుకొని తను కట్టుకున్న పంచవేపు చుాసుకుంటుా సవరించుకుంటున్నాడు. అదిగానీ ఊడిపోయిందా..అందికే అందరుా నవ్వుతున్నారేమొా అనుకుంటుా.....
సమాప్తం.
No comments:
Post a Comment