Wednesday, November 30, 2022

బాల సాహిత్యము

*మహతీ సాహితీ కవిసంగమం, కరీంనగరం*
తేదీ: *26-11-2022-శనివారం*
అంశము: *బాలసాహిత్యం(ల గుణింతం)*
*********************
పేరు: *పొర్ల వేణుగోపాల రావు*
ఊరు: *ఎల్లారెడ్డిపేట, రాజన్నసిరిసిల్ల*
శీర్షిక: *లెక్క విప్పవమ్మ చక్కనమ్మ!*
ప్రక్రియ: *పద్యము*
*********************

*(1)*
*లయను కలిగి యుండు! లాలిత్యమే నిండు!*
*లిప్తలోన నిదుర! లీనమగును!*
*లాలి లాలి యనగ రాత్రిని మరిపించు!*
*లెక్క విప్పవమ్మ! చక్కనమ్మ!*

*(2)*
*లవకుశులకు తండ్రి! లంకేశునకువైరి!*
*లక్ష్మణునికి యన్న! లక్షణముగ!*
*లక్ష్మియయ్యె సీత! రాజిల్లె నతనితో!*
*లెక్కవిప్పవమ్మ! చక్కనమ్మ!*

*(3)*

*లిప్తపాటులోన రెక్కలే లేకుండ*
*లేచి జారుకొనును! లెస్సగాను!*
*లుప్తమైనవేళ రోదించ రాదయా!*
*లెక్క విప్పవమ్మ! చక్కనమ్మ!*

*(4)*

*లలితపదములుండు! లావణ్యమొలికించు!*
*లిపిని నేర్చినంత లిఖితమౌను!*
*లెస్స భాషలందు! లేతసొగసులతో!*
*లెక్క విప్పవమ్మ! చక్కనమ్మ!*

*(5)*
*లోకమంత మెచ్చు! రూపాయి వృథకాదు!*
*లోనయున్న తెలివి రూపమిదియె!*
*లక్షలెన్నియున్న రసనచే కలుగురా!*
*లెక్క విప్పవమ్మ! చక్కనమ్మ!*
*********************
హామీపత్రము: *స్వీయరచన*

*జవాబులు*
*1. లాలిపాట/జోలపాట*
*2. శ్రీరాముడు*
*3. కాలము/సమయం*
*4. మాతృభాష*
*5. లౌక్యం*


*పొడుపుకథలు/పజిల్స్ కు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు*

*మీ*
*వేణుగోపాలుడు*
🙏🌹🙏🌹🙏

No comments:

Post a Comment