01/02/2023.
మహతీ సాహితీ కవి సంగమం.
అంశం : నేటి మనిషి
శీర్షిక : మారె మనుషి.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.
ప్రక్రియ : ఆటవెలది.
మాన వత్వముంచి మనిషి మసలె నాడు
మారె దానవునిగ మనిషి నేడు.
మంచి- చెడులు నాడు మదినియొా చనజేయ
మరచె వావి- వరుస మనిషి నేడు ॥
తల్లిదండ్రు లిలను దలచు దైవము నాడు
ఆశ్ర మాల పాలు యైరి నేడు.
నిండు దేశ భక్తి కిచ్చె ప్రాణము నాడు
దేశ ద్రోహులున్న దేశ మిపుడు ॥
:
శీర్షిక : నేటి మనిషి.
మాన వత్వముంచి మనిషి మసలె నాడు
మారె దానవునిగ మనిషి నేడు.
మంచి- చెడులు నాడు మదినియొా చనజేయ
మరచె వావి- వరుస మనిషి నేడు ॥
ఓటు నమ్మి నోటు కోడిపోయిరి నేడు.
ఆత్మ వంచ నలిడె నడ్డ త్రోవ.
స్వార్ధ చింత నేలె స్వాభిమానము జచ్ఛె
కులుకు నేటి బ్రతుకు , కుక్కబ్రతుకు॥
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.
ప్రక్రియ : ఆటవెలది.
No comments:
Post a Comment