19/02/2023.
మగువ మహారాణి త్రినేత్ర కధల పోటీ కొరకు ,
నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా...
కొంత కల్పించి రాసిన కధ..
అంశం : శివుడు .
శీర్షిక : ఇది కధ కాదు ...
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
శ్రావణికి చాలా అసహనంగా ఉంది.
ఒద్దు ఒద్దంటుాంటే బాబాయ్ ,పిన్ని, తనకు పెళ్ళి చేసీసేరు.
అబ్బాయైతే చాలా బాగున్నాడు. మంచి చదువుతో పాటు చాలా పెద్ద ఉద్యోగం కుాడాను. కానీ పేరుమాత్రం ...
ఛీ ఛీ ..ఆ పేరు వింటేనే రోతగా ఉంది .
మర్చిపోదామన్నా మరపురాని పేరు
." శంభు లింగం ". ట.
అంతే కాదు . దునుట విబుాది బొట్టు లేకుండా ఒక్క క్షణం కుాడా ఉండరట . పెద్దగా పుాజలు చేయరు గానీ
సోమవారం వస్తే మాత్రం ఉపవాసం చేసి శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేయిస్తారట వారంతా శివ భక్తులట .క్షణం సమయం దొరికితే .శివ నామ జపం
చేసుకునేంత " భక్తి "ట శివయ్యంటే.
ఈ మాట విన్న దగ్గరినుంచి తను గోల పెడుతుానే ఉంది తనకీ పెళ్ళి వద్దో " అని .
అబ్బే ! వింటేనా "..పిల్లాడు బాగా చదువుకున్నాడు.
లక్షల్లో జీతమున్న ఉద్యోగం చేస్తున్నాడు పైగా అందగాడు.
కుటుంబం అంతా చాలా మర్యాదస్తులు
ఇంతకన్నా మంచి సంబంధం మరెక్కడా దొరకదు" అంటుా ఒకటే నస పెట్టి పెళ్ళికి ఒప్పించేరు.
పెళ్ళి చుాపుల్లో అతనిని చుాసిన తర్వాత" తనకు అతను వద్దు" అనిపించలేదు..అంత అందంగా ఉన్నాడు మరి...
కానీ ఆ పేరే....ఇంట్లో అతనిని ఏమని పిలుస్తారో...
" శంభు"....అనా..."లింగా"........అనా...
ఛి ఛీ ..పెళ్ళవగానే ఎలాగైనా అతని పేరు మార్చేయాలి.
లేకపోతే..
తన స్నేహితులంతా పెళ్ళ కార్డ్ లో అతని పేరు పక్కన తన పేరు చుాసి ఎంతనవ్వేరనీ..
అసలు వాళ్ళంతా తన పెళ్ళికని రాలేదట ...
ఆపేరు చుాసి పెళ్ళికొడుకెలాగుంటాడో చుాద్దామని వచ్చేరట....ఎంతవమానం...ఆమాట విని ఎంత బాధ పడిందనీ..
కానీ ఆ బాధ ఎక్కువసేపు ఉండలేదు
" పెళ్ళి లో అతనిని చుాసి నోరెళ్ళబెట్టి " అబ్బా ! ఎంత అందగాడో " అంటుా గుస గుసలు పోతున్న తన స్నేహితులని చుాసి తనకెంత ఆనందం వేసిందో..
"పేరు కేముందిలే...మార్చేద్దాం."..అనుకుంటుా ముాడు ముళ్ళు వేయించుకుంది.---
-------------------------
అత్తారింటికి బయలుదేరిన స్వప్నకు లాన్ లోనే అతిపెద్ద శివలింగం దాని పై చుట్టుా అద్దాలతో ఆచ్ఛాదనా, కింద
రంగు- రంగుల పుామొక్కలతో ఆకర్షణీయమైన రాజ బాట చుాసి ఆశ్ఛర్యపోయింది. వాళ్ళు తనను ముందుగా అక్కడికే తీసుకెళ్ళి , అక్కడే ఉన్న బ్రాహ్మణుని చేత దంపతులిద్దరిపేరా గోత్ర నామాలతో పుాజ జరిపించేరు.
ఆరతి కార్యక్రమ మవగానే ఇంట్లోకి అడుగు పెట్టగానే
తనకు మొదటిగా కనిపించినది పెద్దగా ఉన్న శివుని విగ్రహం .దాని ముందు ధుాపం. భస్మం .
స్వప్న కు ఒక్కసారి తన కలలన్నీ కుాలిపోయినట్లయ్యింది .
తనింక రోజుా ఈ విగ్రహాలకి లింగాలకి పుాజలు చేస్తుా బతకాలన్న మాట అనుకుంది కానీ...
అత్తారింటికి వచ్చేక తనను వాళ్ళంతా ఎంతో ప్రేమగా చుాస్తునందుకు పొంగిపోయింది.
కానీ అతనిని ప్రతీ ఒక్కరుా " నాన్నా లింగా.." అంటుా పిలుస్తుాంటే తట్టుకో లేకపోతోంది. .
వాళ్ళ పిన్నమ్మ ఇల్లు చుాపిస్తుా ..".ఈ శివుడు మన కుల
దైవమమ్మా ! మేమంతా ఈతనినే కొలుస్తాము.
శివుని దయవల్లే వినోద్ బ్రతికి బట్టకట్టేడమ్మా
లేకపోతే వినోద్ కుాడా వాళ్ళ అమ్మా, నాన్నల్లా మాకు దక్కేవాడే కాదు" అంటుా కనులు తుడుచుకొంది.
---------------------
మొదటి రాత్రే అతను తనతో ఎన్నో విషయాలు
మాట్లాడుతుా చాలా స్నేహంగా ఉండడంతో , ఆ రెండవ
రోజే అతని పేరు విషయం అతనితో తను చెప్పేసింది
అతను కుాడా నవ్వుతుా ,
"ఓస్ ! ఇంతేనా...నీకెలా కావాలంటే అలా పిలిచేసుకో శ్రావణీ "అంటుా దగ్గరకు తీసుకున్నాడు.
తనకు వినోద్ అన్నపేరు చాలా ఇష్టం .అందుకే రేపటినుండి
అతనిని వినోద్ అని పిలుస్తానని చెప్పింది .
అతను కుాడా నవ్వుతుా సరేన న్నాడు.
కానీ "అతని పేరు మార్చుదాం" అని తను అనుకున్నది మాత్రం అనుకున్నంత ఈజీ కాదని అర్ధమయ్యింది.
స్కుాల్ నుంచి కాలేజ్ దాకా , సర్టిఫికేట్ లనుంచీ రేషన్ కార్డ్ దాకా , ఆఫీస్ నుంచి ఆధార్ కార్డ్ దాకా కుాడా అదే పేరు ఉండడం తో అదే పేరు అతని ఐడెంటిటీగా మారిపోయింది.
"కానీ తను మాత్రం "లింగా" అంటుా పిలవ లేదు కదా ?
ఎలా ఎలా."
అసలు తనకు చిన్నప్పటి నుంచీ దైవ భక్తి పెద్దగా లేదు.
దానికితోడు .. తనకు సైన్స్ మీద అభిలాష ఎక్కువగా ఉండ డంతో కాలేజీ లో సైన్స్ కి సంబంధించిన
సబ్జక్ఖ్ తీసుకోవడంతో ప్రతీ విషయాన్ని విజ్ఞాన పరంగా ఆలోచించడం ,ప్రతీ పనికి , కుాడా సైంటిఫిక్ రీజన్ ని జోడించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అలవాటైపోయింది.
సైన్స్ పరంగా మనిషి మహా మేధావి .సరైన విధంగా తన బుద్ధిని, చదువుని ,సదుపయొాగం చేసుకుంటే అతనిని మించిన శక్తి పరుడు మరెవ్వరుా ఉండరు . మనిషిలో అంతర్గతంగా దాగియున్న ఆ శక్తిని తెలుసుకోలేక మనిషి నానా బాధలుా పడుతుా "భగవంతుడు" అనే పేరుతో తన "శక్తి "ని తనే నిద్ర బుచ్చుతుా భగవంతుడనే బాహ్య రుాప శక్తిని నమ్ముతుా ' అసమర్ధుడిగా ఉండిపోతున్నాడేమొా అనిపిస్తున్నాది.
దేముడు అనేవాడు ఉన్నాడో లేదో తెలియదు గానీ దేవుని పేర్లను, రుాపాన్ని విమర్శిస్తుా చేసే భజనలు మాత్రం ఆస్సలు నచ్చవు తనకు .
ఆ దేవుని కీర్తనలు వింటే అవి భక్తితో పాడుతున్నారో లేక
ఆతనిని విమర్శిస్తున్నారో అర్ధంకాక నవ్వొస్తుంది తనకు .
వినాకుడి పాటలు వింటే వక్రతుండ, మహాకాయ, ముాషికవాహనా ,కుబ్జరుాప, సుార్ఫకర్ణ ,అంటుా అతని రుాపానికి విమర్శలే ఎక్కువగా ఉంటాయి .
ఇంక శివుణ్ణి ముాడు కన్నులవాడా , స్మశాన వాటిక లో తిరిగేవాడా , కపాల ధరుడా , నాగ భుాషణుడా , భస్మ ధారణుడా , పులి చర్మం కట్టే వాడా అంటుా భయపెట్టే రుాపంగా వర్ణిస్తారు. ఇలా దేవీ దేవతలని ముందు వికృతంగా భయంకరంగా వర్ణించిన తర్వాత కాపాడమంటుా పుాజలు చేసేస్తారు
కోరికలుా ....కోరేస్తారు.
అసలీ దేముడు అందరికీ అన్ని కోరికలుా తీరుస్తాడా...
అందులొకీ ఈ శివయ్య ఆడిగిందే తడవుగా అందరి
కోరికలుా తీరుస్తాడట. తలమీద గంగ ,ఒంటి మీద తోలు ,
మెడలో పుర్రెలు , ఒంటినిండా బుాది పుాసుకొని స్మశానంలో
తిరిగేవాడీ శివయ్య...అతని మీద తనకైతే ఏ నమ్మకముా లేదు.
తనకైతే వినోద్ తో కొన్ని రోజులు హాయిగా అలా...తిరిగి రావాలుంది. వినోద్ నమ్మే శివుడు అటువంటి అవకాశం
కల్పించగలడా ..లేదుకదా ...
.ఈ విషయమై వినోద్ మాత్రమే ఆలోచించాలి..
అతననుకుంటేనే కదా తాము బయటకు వెళ్ళగలరు .
ఈపని శివుడెలా చేస్తాడుా ?
తనెన్ని ఆశలు పెట్టుకుంది . తన పెళ్ళయ్యాకా తన లైఫ్ లో చుాడని ప్రదేశమంటుా ఉండకుాడదనుకుంది .
అలాంటి తనకు , ఇదొక పరీక్షలా ఇటువంటి దైవ భక్తి గలవారింటి కోడలుగా రావలసి వచ్చింది..
వచ్చిన దగ్గర నుండి తామిద్దరుా ఎక్కడికీ వెళ్ళ లేదు.
తనకు కనీసం తనకు తమ ఇంటి పక్కన ఏముందో కుాడా తెలీదు .
అనుకుంటుా అన్యమనస్కంగానే సాయంత్రం దాకా గడిపింది.
సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో వినోద్ వచ్చేడు .
అతని ముఖంలో అలసట కొట్టొచ్చనట్టు కనిపిస్తున్నా ,
కళ్ళలో ఆనందం కనిపిస్తున్నాది.
అతను తనను చుాసి పలకరింపుగా నవ్వి
గబ గబా బాత్రుామ్ లోకి వెళ్ళి సుభ్రంగా స్నానం చేసి వచ్చేడు.
పెళ్ళైన తరువాత మొట్ట మొదటిసారి తను ఆతని చేతికి వేడి వేడి కాఫీ అందించింది
అది అందుకుంటున్న అతని కళ్ళలో ఆశ్ఛర్యం, ఆనందం, నిండిన మెరుపులు గమనించింది తను.
అతను కాఫీ సిప్ చేసి రిలాక్స్ గా కళ్ళు ముాసుకుంటుా.
తనలో తను అనుకున్నట్టుగా " ఇంటికి అలసిపోయి రాగానే ఇంత ఆప్యాయంగా కాఫీ కలిపి ఇచ్చినవారుంటే ఎంత బాగుందో."
".ఆ ఆనందం అనుభవించినవారికే తెలుస్తుంది..కదుా స్వప్నా"
అంటుా తన చేయి పట్టుకొని దగ్గరగా ఉన్న మరో కుర్చీలో కుార్చోమన్నట్టు చుాపించేడు. ..
తను కుార్చున్నాకా ,
"కాఫీ చాలా బాగుంది స్వప్నా" అన్నాడు మెచ్చుకోలుగా...
తనేం మాట్లాడలేకపోయింది .కానీ మనసులో అనుకుంది .
"ఒక్క కాఫీ యేం ఖర్మ పుార్తి వంటే చేసిపెట్టగలను అదీ చాలా రుచిగా.. .కానీ చేయనిస్తేగా "...అనుకుంది.
వినోద్ కాఫీ తాగి ఆనందంగా "
స్వప్నా , మా కంపెనీ వాళ్ళంతా మనను హనీముాన్ కి వెళ్ళమని చెప్పి , ఉత్తరాఖండ్ కి
ఫ్లైట్ టికెట్ల్లే కాక , అక్కడ రుామ్ కుడా బుక్ చేసేసారు."
"చాలా చాలా బాగుంటుందిట . వారం రోజుల కోసం
రుామ్ బుక్ చేసేసారు .
మన కంపెనీ వాళ్ళందరికీ నా మీద ఇంత ప్రేముందని తెలియదుసుమీ."...
"రెండు రోజుల్లో మన ప్రయాణం .అన్నీ రెడీ చేసుకో " అంటుా ...ఎవరిదో ఫోన్ రావడంతో వాళ్ళతో మాటల్లో
పడిపోయాడు.
వినోద్ ఈ విషయం చెప్పే సరికి చాలా సంతోషమేసింది స్వప్నకు.
తనకు చిన్నప్పటినుండి ఉత్తరాఖండ్ ప్రాంతమంతా చుాడాలని చాలా కోరికగా ఉండేది.
దేవభూమిగా పిలవబడే ఈ రాష్ట్రం చాలావరకు కొండలతో కూడి ఉండి, ఉత్తరాన చైనా ఇంకా తూర్పున నేపాల్‌తో అంతర్జాతీయ సరిహద్దులను పంచుకొని ఉండడమేకాక అద్భుతమైమ ప్రకృతి సౌందర్యంతో నిండి ఉంటుందని చదివింది .ఎత్తైన పర్వతాలు, లోయలు, నదులు, సరస్సులు, హిమానీనదాలు మరియు అనేక పవిత్ర దేవాలయాల మనోజ్ఞతను కలిగి
మనోహ్లాదాన్ని కలిగించడమే కాక, భక్తి భావాన్ని కుాడా పెంపొందించే ప్రాంతమిదని చెప్తారు.
అక్కడ చుాడవలసిన పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి. గర్హ్వాల్ , కుమావోన్ ,. స్కీయింగ్, వన్యప్రాణుల అభయారణ్యాలు ఉత్సుకతను రేపేవిగా ఉంటే ,
చార్ ధామ్ యాత్ర మరొక ప్రత్యేకమైన ఆకర్షణగా ప్రసిద్ధి చెందడం వల్ల ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు ఉత్తరాఖండ్‌ను సందర్శించడానికి వెళ్తుా ఉంటారు.
ఇవేకాక నైనితాల్, జిమ్ కార్పెట్ ,డెహరాడుాన్, రాణిఖెత్ .
మూస్సుారీ ...ఓహ్ ....
ఇలా ఎన్ని పర్యాటక స్థలాలనో చుాడవచ్చు.
కానీ ఏవేవో కారణాలు, ఇంటి పరిస్థితులు , చదువుల కారణంగా అప్పట్లో తన కోర్కె నెరవేరలేదు.
అది ఇప్పుడు ఈ విధంగా అనికోకుండా కుదిరేసరికి
తన ఆనందానికి అవధులే లేవు.
అంతా శివమయమే ఐన ఈ యాత్ర భక్తుల పాలిటి
వరమనే చెప్పుకోవాలి.
ఆలోచిస్తున్న స్వప్నకి సడన్ గా శివుడు జ్ఞాపకం వచ్చేడు .
"తను ఎప్పటికైనా ఉత్తరాఖండ్ సందర్శించాలన్న మాట తనకు,ఆ దేముడికి తప్ప మరెవరికీ తెలియదే .
మరింతలోనే ఆఫీస్ స్టేఫ్ గిఫ్ట్ అంటుా అక్కడికే..ఫ్లైట్ ఎలా బుక్ చేసేరు. ఇదంతా కో ఇన్స్ డెంటల్ గా జరిగి ఉండొచ్చు కదా...
లేక దేముడు తన మాట విన్నాడా...
అంటే శివుడు ఉన్నాడా ..? ఉన్నా తనమాటెందుకు వింటాడు ? తనేం అతని భక్తురాలు కాదే..!
లేక తనున్నానని నిరుాపించుకునేందుకు ఈ విధంగా తన కోర్కె తీర్చాలనుకున్నాడా...?
హుఁ .. తనను నమ్మించే అవసరం శివయ్యకెందుకు ?
ప్రపంచంలో సగానికిసగం మంది అతని భక్తులేగా...?
ఐనా.. ఇదేంటీ ...తనిలా ఆలోచిస్తోంది....
వినోద్ పెళ్ళి కానుకగా కంపెనీ వాళ్ళు సంతోషంగా తమని
హనీముాన్ కి వెళ్ళమన్నారు.. దానికీ , శివుడికీ ,నాకోరికకీ
ఏమిటి సంబంధం...?
మనం తీసుకున్న నిర్ణయానికి కుాడా దేముడే కారకుడనుకోవడం ముార్ఖత్వం నిండిన అమాయక భక్తుల పని .
చదువుకున్న తనలాంటి వాళ్ళకు ఇలాంటి ఆలోచనలే రాకుాడదు ". అనుకుంటుా ప్రయాణానికి కావలసిన బట్టలు సద్దుకోవడానికి వెళ్ళింది .
--------------------
స్వప్నకి వినోద్ తో ప్రయాణం చాలా సంతోషం కలిగిస్తోంది.
వారం రోజుల పాటు తామిద్దరే.....ఎంచక్కా...
ముఖ్యంగా "లింగా" అన్న పిలుపుకు దుారంగా..
కళ్ళు ముాసుకుని కలల ప్రపంచంలో తేలిపోతున్న స్వప్నకు ఫ్లైట్ ఎప్పుడు దిల్లీ లో లేండ్ అయ్యిందో కుాడా తెలీలేదు.
తాము రెండు రోజులు దిల్లీ, ఆగ్రా , హరిద్వార్ అన్నీ చుాసుకుని , తర్వాత కారు బుక్ చేసుకొని "మసుారీ "
దెహరాడుాండ్ వంటి ఘాట్ ప్రదేశాలను బస్ లో గానీ
కారు బుక్ చేసుకొని గాని వెళదామనుకున్నారు.
అలాగైతే ప్రకృతి అందాలను మనసారా ఆస్వాదించవచ్చు.
అదే తన కోరిక కుాడా..
*********
ఎయిర్‌పోర్ట్ నుండి తక్కువ సమయంలోనే తమ ఫ్రెండ్స్ బుక్ చేసిన తాజ్ హోటల్ కు తీసుకొచ్చేడు వినోద్ . . ఆరోజంతా హాయిగా దిల్లీ అంతా తిరిగి రుామ్ లో రాత్రంతా రెష్ట్ తీసుకున్నారు.
ఆమర్నాడు హరిద్వార్ లో గంగా ఘాట్ కు వెళ్ళి గంగా నదిలో కలిసి స్నానాలు చేసి "గంగమ్మ గుడి "దర్శనం చేసుకున్నారు.అక్కడ తమ వంతుగా బీద సాదలకు దుప్పట్లు, తువ్వాళ్ళు , గ్లాసులు పంచి పెట్టడంతో
.మానసికమైన ప్రసాంతత నిండిన సంతృప్తి కలిగింది.
సాయంత్రం " గంగా హారతి " ప్రత్యక్షంగా చుాసిన తనకు మనసు ఆనందంతో పులకరించిపోయింది.
దీనినే భక్తి పారవశ్యం అంటారా..? ఏమొా మరి..?
ఆ మర్నాడు హరిద్వారంతా తిరిగి , మన్సాదేవి టెంపుల్ కి బయలుదేరాము..
హరిద్వార్ లో ఉన్న మన్సాదేవీ టెంపుల్ కి రోప్ వే ద్వారా వెళ్లడం గొప్ప అనుభవం .
కరెంటు తీగలద్వారా ఒక దాని వెంట మరొకటిగా పైకి వెళ్తుతున్న బాక్స్ టైప్ బోగీలో తను వినోద్ ఎక్కారు.
బోగీలు పైకెక్కుతుాంటే చుట్టు పక్కల ఉన్న ప్రకృతి సౌందర్యం , నిజంగా స్వర్గాన్ని తలపించేదిగా మధురానుభుాతిని కలిగిస్తున్నాది. ఇంతలో
సడన్ గా తమ ముందున్న భోగీ , చువ్వలు తెగి ఒక వైపుకు ఒరిగిపోయింది . దాంతో ఆ ప్రదేశమంతా అరుపులు కేకలతో నిండిపోయింది.
తమ ముందే అలా జరగడంతో స్వప్న భయంతో కెవ్వుమని కేకపెట్టింది.
అక్కడ కరెంటు ఆపడంతో బోగీలన్నీ గాలిలో వేలాడుతుా ఉండిపోయాయి. తామిద్దరుా బోగీ రాడ్ లను గట్టిగా పట్టుకొని కళ్ళు ముాసుకున్నారు.
ఎవరెవరో ఏదేదో ఎనౌన్స్ చేస్తున్నారు తనకైతే ఒక్క మాటకుాడాడా బోధపడలేదు.
వినోద్ కుాడా భయపడినా తనకు ధైర్యం చెబుతుా
చుట్టుా చుాస్తున్నాడు. అంతలో తామున్న భోగీ ఒక్కసారిగా
కిందకు వంగిపోయింది .ఇంకొంచం వంగితే తామిద్దరి
ప్రాణాలుా ఆలోయలో పడి పోయేవే.
కానీ ఎవరో రక్షించినట్టుగా తమ బోగీ ఒక పెద్ద బేనర్ తగిలించిన "రాడ్ "ల మధ్య ఇరుక్కుపోయింది.
తామింక బతకమనే అనుకున్న స్వప్న తమకు కనీసం చిన్న దెబ్బైనా తగలకుండా ఉండడంతో మెల్లగా కళ్ళు విప్పింది.
తన ఎదురుగా బేనర్ మీద చిద్విలాశంగా నవ్వుతుా ఉన్న శివయ్య చిత్రాన్ని చుాసి నిర్ఘాంతపోయింది.
అప్రయత్నంగానే చేతులు జోడించి , ధన్యవాదాలు శివయ్యా అంది. ఆమె కళ్ళలో ఆనందభాష్పాలు జల జలా రాలుతున్నాయి. వినోద్ వాళ్ళ కుటుంబీకులు నమ్ముతున్న ఈ శివయ్యే ఈ రోజు తమను కాపాడేడు.
లేకపోతే లోయలో పడవలసిన తాము ఇలా ఈ శివయ్య ఒడిలో ఉండడమేమిటి...?
అంటే తను కుాడా భగవంతుడనే ఈ శివయ్యను నమ్ముతున్నట్టేకదా......ఏమొా.....
అంతలోనే రెస్క్యుా టీమ్ వచ్చి అన్ని భోగీల లో ఉన్న అందరినీ రక్షించి బయటకు తీసుకువచ్చింది.. ఒకరిద్దరికి చిన్న చిన్న గాయాలు తగిలేయి తప్ప మిగిలిన అందరుా క్షేమంగా బయటపడ్డారు.
ఆటు తర్వాత తనైతే ఇంటికి వెళిపోదామంది. కానీ వినోద్ ఇటువంటి చిన్న చిన్న విషయాలకు నీలాంటి చదువుకున్న అమ్మాయిలు ఇలాగేనా భయపడేది...అంటుా వేళాకోళం చేయడంతో , తను మారు మాట్లాడలేకపోయింది.
ఆమర్నాడు వినోద్ "నైనితాల్ ట్రిప్ " ప్లాన్ వేశాడు
భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ హిల్ స్టేషన్లలో ఒకటైన "నైనితాల్ " , తను చుాడాలనుకున్న ప్రదేశాల్లో
ఒకటి. నైనీ సరస్సులో బోట్ రైడింగ్ చేసి
నైనా దేవి ఆలయాన్ని సందర్శించడం.
నైనా శిఖరం నైనిటాల్‌లోని ఎత్తైన శిఖరమని చెపుతారు.
ఇది ఒక ప్రసిద్ధ ట్రెక్కింగ్ ప్రదేశమని కుాడా అంటారు.
ఈ ప్రదేశం," నైని సరస్సు" సమీపంలో ఉన్న మొత్తం లోయ
ప్రాతం. ఈ ప్రాంతం నైనిటాల్ యొక్క అద్భుతమైన విశాల దృశ్యాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందినది.
ఈ లోయ వంటి ప్రదేశంలో
సూర్యోదయం లేదా సూర్యాస్తమయం చూడడం
ఒక అద్భుత దృశ్యమని చెపుతారు.
ఇంకా ఎన్నో చుాడవలసిన ప్రదేశాలున్నా
ఆర్యపట్ట కొండ వద్ద ఉన్న "టిఫిన్ టాప్ " హిమాలయాల సందర్శనం చేసి "హార్స్ రైడింగ్ "చేయడం మాత్రం మర్చిపోకుాడదనుకుంది స్వప్న
...మరే..తల్చుకుంటేనే ఎంత బాగుందో...
.ఇక అనుభవంలోకి వస్తే...
వినోద్ రేపే నైనిటాల్ వెళుతున్నామని చెప్పడంతో తనలో ఉత్సాహం ఉరకలు వేదింది..
-----------------------------
మర్నాడు తెల్లవారే సరికల్లా మేము బుక్ చేసుకున్న అందమైన కారు వచ్చేసింది
కారులో కుార్చొని కొండ పైకి వెళుతుా లోయలోని అందాలను చుాడడం ఒక అద్భుత అనుభవమనే చెప్పాలి.
తాము అప్పటికే రెడీగా ఉన్నందు వల్ల వెంటనే కారు ఎక్కేశారు.
పాముల మెలికల్లా ఉన్న రోడ్డు మీద కారు వెళుతున్నపుడల్లా స్వప్న కొంచం భయపడుతుానే ఉంది. చాలా సన్నపటి రోడ్డు వచ్చినపుడైతే మరీను.
లోయలో పడిపోతామేమొా అన్నంత భయం.
కానీ ఇక్కడి డ్రైవర్లు మంచి ట్రైనర్స్ లా ఉన్నారు.
చాలా చాకచక్యంగా బండి నడుపుతుా పోతున్నారు.
మధ్య మధ్యలో వస్తున్న కొండలు , బండలు, లింగా కారంలో కనిపిస్తుాండడం చుాసి నవ్వుకుంది స్వప్న.
తనకు ఈ రాళ్ళు లింగాకారాలుగా కనపడడమేమిటి..?
వెంటనే తనకు శివుడు జ్ఞాపకం రావడమేమిటి..?
శివుని పేరు తల్చుకోగానే తనలో ఈ గగుర్పాటెందుకు?
ఆలొచనల్లో ఉన్న స్వప్న సడన్ గా తమ కారుకెదురుగా ఒక కారు రావడం , ఆ కారుకు జాగా ఇచ్చేందుకు తమ డ్రైవరు పక్కకు తిరిగేంతలోనే
ఆకారు తమ కారును డీకొనడం , బేలన్స్ తప్పిన తమ
కారు డౌన్ లోకి జారిపోతుా ఉండడం చుాసిన స్వప్న
భయంతో గట్టిగా అరుస్తుా కళ్ళుతిరిగి పడిపోయింది.
చాలా సేపటికి తన ముఖం మీద ఎవరో నీళ్ళు
జల్లడం , వినోద్ స్వప్నా ...స్వప్నా..అంటుా గాభరాగా
పిలవడం వినిపించి మెల్లగా కనులు తెరిచింది.
వినోద్ వంగి తన వేపే చుాస్తున్నాడు. అతని చొక్కా చిరిగి ఉంది . అక్కడక్కడ గీరుకున్న శరీరం మీదనుండి రక్త- చారికలు చొక్కాపై భయంకరంగా కనిపిస్తున్నాయి.
డ్రైవరు
ఒక బండ మీద కుార్చొని తాపీగా బీడీ తాగుతున్నాడు.
అతని కాలుకి కుాడా దెబ్బ తగిలినట్టుంది.అతని ఫేంటంరా రక్తసిక్తమై ఉంది.
తనింకా కారులోనే ఉంది. తన నడుం పట్టేసి కదలడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తీంది. కారు చాలా
చిత్రమైన రీతిలో వంగి ఉంది. ఏ విధంగానుా
తను కిందకు దిగే ఆకాశమే లేదు.
ఇంతలో దుారంగా ఎంబులెన్స్ తమవైపే రావడం గమనించింది స్వప్న .
వారు ఒక ష్ట్రెక్చర్ తెచ్చి జాగర్తగా తనను దానిపైకి చేర్చేరు.
వారెంత జాగర్తగా తనను హేండిల్ చేసినా , నడుము నొప్పితో తనకు ఏడుపు ఆగలేదు.
అలా ఏడుస్తుానే తాము ఎక్కిన కారువేపు చుాసిన స్వప్న ఒక్కసారిగా నిశ్ఛేష్టురాలైంది.
కారు రోడ్డు క్రందకు పల్లంలోకి జారిపోయింది .
ముందు భాగమంతా నుజ్జు నుజ్జు అయిపోయి ఉంది.
కారు పక్క భాగం సొట్టలు పడిపోయింది.
కారు వెనుక వైపు పల్లంలోకి ఒరిగి పోవడంతో
ముందు భాగం మీదకు లేచి భయంకరంగా కనిపిస్తోంది.
కారు వెనుక భాగం అంతా రాళ్ళ గుట్టల మధ్య చిక్కుకొని నిలబడి ఉంది . ఆచుట్టు పక్కలంతా
అవే బండలు కారుని ఎటుా కదలకుండా ఆపినట్టుగా
ఉన్నాయి.
స్వప్న కళ్ళు ఆశ్ఛర్యంతో పెద్దవయ్యేయి.
తను వేటినైతే చుాసి హేళన చేసిందో అవే లింగాకార బండలు...
అందులో ఒక్క రాయి కదిలినా కారుతో పాటు తామందరముా ఆ భయంకరమైన లోయలో పడి భయంకర కృుారమృగాలకు ఆహారంగా మారేవారు.
ఆ బండలు ఎంత పెద్ద ఆపదనుండి తమను కాపాడేయొా
కాదు కాదు..ఆవి బండలు కాదు ..శివయ్యే...
లింగ రుాపంలో ఉన్న శివుడు...
ఆ శివుడే తమను లోయలో పడిపోకుండా కాపాడేడు..
అవును ..ఆతడే కాపాడేడు.
అతడే ...ఆతడే...భగవంతుడతడే....
తానెంతో ముార్ఖంగా ఆలోచిస్తుా...
విజ్ఞాన పరమైన విషయాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుా
భగవంతుడనే శక్తిని తక్కువ అంచనా వేసింది.
ఈ రోజు ఆ విజ్ఞానం తమను కాపాడడానికి ఎందుకుా పనికిరాలేదు.
తను బండలు ఆనుకున్న ఆ దైవ శక్తే తమకు ప్రాణం పోసింది.
శక్తి నిండిన" ప్రకృతిని" పరిశీలించి చదవడమే విజ్ఞాన విషయమని ,
ఆ విజ్ఞానంలో దాగి ఉన్న" శక్తిని విలువను " కనుగొని తెలుసుకోవడమే "విజ్ఞాన" మని ,
విజ్ఞానంలో దాగియున్న విజ్ఞతే "జ్ఞానమ"ని , ఆ జ్ఞానమే ఒక "యొాగమని ", ఆయొాగ శక్తి నుండి వచ్చిన వెలుగే "భగవంతుడని " తను తెలుసుకోలేకపోయింది.
చదువుకున్నానన్న అహంకారం , తన "లో" నున్న ,
తనను పొగవలె ఆక్రమించి ఆహంకారాన్ని పెంచింది.
ఈ నాటికి తన కళ్ళు తెరుచుకున్నాయి."
స్వప్నలో జరుగుతున్న అంతర్మధనం వల్ల పశ్ఛాత్తాపంతో
వచ్చిన కన్నీళ్ళు, ఆమె అహంకారాన్ని కడిగేశాయి.
ఏంబులెన్స్ హాస్పిటల్ చేరుకుంది
రక్త సిక్తమై ఉన్న వినోద్, తనను తాను పట్టించుకోకుండా
తన గురించి తాపత్రయ పాడడం చుాసిన స్వప్నకు
ఒక్క సారిగా దుఃఖం తన్నుకొచ్చింది .
తనను స్పెషల్ వార్డ్ లో చేర్పించి డాక్టర్ చెప్పిన మందులు కొనడానికి వెనుతిరుగుతున్న వినోద్ ని ప్రేమగా పిలిచింది
స్వప్న" శంభుాజీ..."..అంటుా....
అంత వరకు తన భర్తను వినోద్ అంటుా పిలిచిన స్వప్న..
తేలికైన మనసుతో...
-----------------
No comments:
Post a Comment