Thursday, April 20, 2023

సీత



శీర్షిక : సార జీవిత చరిత .

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .
 
ప్రక్రియ : ఇష్టపది.



భుామి లోదొ రకినది భుామి పుత్రిక సీతఁ
జనకునికి పుత్రికగ జగమేలినది మాత
ఆట పాటిల మేటి అందాల విరికొమ్మ  
శివ ధనుసు నెత్తినది  సిత్రముగ  సీతమ్మ ॥

శ్రీ రాము వలచినది సిరి మల్లె సీతమ్మ.
సిరు లొలుకు మాయమ్మ  సిగ్గు సింగారమ్మ
స్వయంవరము లోన స్వప్న సుందరునిగని
తన వలపు తెలిపినది తరుణి చుాపుల తోడ॥

శివునాజ్ఞతో నతడు  శివ ధనుసు విరిచొచ్చె .
గుర‌ువులాశీస్సులతొ గుణవతిని చేబట్టె .
తల్లి కోరిక దీర్చ  తాను వనముల కేగ.
వెంటతా జంటగా వెడలె సీతాలక్ష్మి ॥

మాయా మారీచుని మాయ తెలియని దాయె
మగని కోరిన కోర్కె  మాతకిక్కట్లాయె
గీత దాటిన సీత  మాత కన్నీరొలికె
రామచంద్రుని బాసి రమణి శోకము మీరె ॥

మాయతో నమ్మించి మాత సీతను బట్టి 
లంక చెరలో బెట్టె లంకేశు రావణుడు.
హనుమ రాముని బంటు ఆర్తి తీర్చెదనంటు
ఆసంద్రమును దాటి అసురి లంకను గుాల్చె ॥ 

ఆ శోక వనమేగి అమ్మ సీతను జుాచి 
రామ గురుతును జుాపి రమణి శోకము బాపె.
 లంక తోకతొ గాల్చి లంకేశు దండించి
సీత జాడను దెలుప చిత్రకుాటము కెగసె ॥
రామ దండదె గుాడి రావణుని దెగ గుాల్చె 
రమణి సీతను గుాడి రాముడదె పురి జేరె
సీతమ్మ మాయమ్మ శ్రీ రాముడే తండ్రి.--
అనెడు విధముగ నతడు నాయొాధ్య పాలించె ॥

రామాయణ కధలు రంజింపు సుధ లవే
పసిపిల్లలకు జెప్పు పరమ పావన నిధులు
అందరిని బ్రోచేటి  అతడు నారాయణుడు
ఇల ఈశ్వరీ నుతుడు ఇనవంశ కులజుండు.॥


No comments:

Post a Comment