08/05/2023
కలం స్నేహంలో
మాతృ దినోత్సవ కవితల పోటీ కొరకు ,
అంశం : మాతృదేవోభవ .
శీర్షిక : అమ్మకు, అమ్మే సాటి.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
కనిపించే దైవం దేముడైతే
కని పెంచే దేవత అమ్మ ॥
సృష్టించే వాడు దేముడైతే ..
ఆ సృష్టి కి ముాలం అమ్మ ॥
తొమ్మది నెలల భారం తనలో మొాస్తుా
ప్రసవ వేదనలో కుాడాప్రతి క్షణం ఎదురుచుాస్తుా
తన రక్తమాంసాల ఆకృతిని ఆత్రంగా ముద్దాడే
అది చైతన్య ముార్తి , ఆర్తి నిండిన అమ్మ ॥
ఆఁ వుాఁ ల వుాసులకు అర్ధం అమ్మ పలుకే
ఆడుగులేయడం నేర్చేది, అమ్మ ఆసరాతోనే
ప్రపంచ వార్తా విశేషాలెన్నో,అమ్మ ఒడి బడిలోనే
ప్రపంచాన్ని గెలిచే ధైర్యం అమ్మ చెప్పే కధల్లోనే..॥
ఆకలేస్తే అడిగేంతలోనే సాక్షాత్కరిస్తుంది అమ్మ
నిద్దరొస్తే , జోల పాడి లాలిస్తుంది....అమ్మే
తన కంట్లో నలుసు పడితే అమ్మ కంట కన్నీరు
తన కాలులో ముల్లు దిగితే అమ్మ గుండెలో గునపాలు.॥
తన అనంద రుాపం , అమ్మకు స్వర్గలోకం .
తన ఆరోగ్యం , అమ్మకు నిత్య వసంతం .
తన భోగ భాగ్యాల సుఖం, అమ్మకు ఆనందం.
తన చిరునవ్వే అమ్మ కంటికి వెలుగు కిరణం. ॥
అమ్మ జీవితాంత కష్టానికి ఎదిగిన నా అస్థిత్వం
అమ్మ ఋణాన్ని తీర్చుకోలేని స్వార్ధపుారిత వ్యక్తిత్వం ॥
ఐనా ఓడిపోని అమ్మ , ప్రతి సృష్టికి మరో బ్రహ్మ .
ఊపిరాడని ఊడిగానికి నిలువెత్తు "కీలుబొమ్మ".॥
" అమ్మ ".
************************************
హామీ :
ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచన.
****************::::*******
13/05/2023
మనుమసిద్ధి కవన వేదిక
అంశం : మదర్స్ డే..
శీర్షిక : అమ్మ మనసు.
(వచన కవిత).
.రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
అకాశంలో వెలిగే తారల మిణుకులు
అమ్మ, నాపై పెంచుకున్న ఆశల శకలాల్లా.
వెన్నెల కురిపిస్తున్న పుార్ణ చంద్రుడు .
అమ్మ చల్లటి చిరునవ్వులా ...॥
బావిలో చంద్రుని ప్రతిరుాపం ,
నా వెన్నంటి ఉండే- అమ్మ భావనలా...
మా తోటలో పుాచే గులాబీలు,
అమ్మ ఒడి నిండిన మమతలా....
గాలిలో పరుచుకున్న మత్తైన పరిమళం,
అమ్మ ,నిస్వార్ధంగా పంచే ప్రేమలా..॥
నాలో జరిగే అంతర్యుద్ధంలో
నాకు నేనుగా ఓడిపోతుాన్న ,భావన..
అమ్మనయ్యాకా గానీ తెలుసుకోలేని
"అమ్మ" మనసులా...॥
ధారగా కారుతున్న నా కన్నీళ్ళు
అమ్మని బాధపెట్టిన నా పాపానికి
ప్రాయశ్ఛిత్తంలా.....॥
నా ఒళ్ళో కేర్..కేర్..మంటుా ఏం కావాలో
చెప్పలేకా ,ఏడుస్తున్న నా బాబు రోదన..
అనాధాశ్రమంలో ఆకలైనా చెప్పలేని
అమ్మ నిస్సహాయతకు నిదర్శనంలా....॥
ఈ కవిత నా స్వీయ రచన.
************************
***********************::
*తపస్వి మనోహరం వారు,.
మాతృ దినోత్సవ సందర్భంగా విడుదల చేస్తున్న ప్రత్యేక e-book కొరకు రచన..*
11/05/2023.
ప్రక్రియ : వచన కవిత.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
శీర్షిక : ఇల వెలసిన దైవం .
"ఆమ్మ అనే రెండక్షరాల్లో ఒదిగి ,
రేయి పగలు తానై నిండినదమ్మ.
సృష్టికి ప్రతి సృష్టై , ప్రపంచాన్ని -
ఏలుతున్న మరో బ్రహ్మ అమ్మ.॥
పిండం నుండి, పిపీలకం వరకు
జన్మించేది అమ్మ కుక్షిలోనే.
అమ్మ ఒడి బడిలో , ఆఁ వుాఁ లకు
అర్ధాలు నేర్చుకొని ,అమ్మ ఆసరాతోనే
అడుగులు నేర్చి, ఎదిగిన వైనం
"అమ్మ " అనే పదానికి నిండైన నిదర్శనం ॥
ప్రతీ కష్టానికీ ఓర్చి, లాలించి -
పాలించే అద్భుత శక్తికి ప్రతీకయై
ఓంకార శబ్దానికి , ప్రతిద్వనిగా నిలచిన
నామాక్షర రుాపమే ,అమ్మ అనే పదం ॥
ఏమిచ్చినా తీర్చుకోలేమామె ఋణం.
" అమ్మ" ,ఇలలో తరగని ధనం.
అమ్మను అభిమానించి, స్త్రీలను
గౌరవిద్దాం మనం. ఎందుకంటే ...
"అమ్మ" ఇలవెలసిన" దైవం ॥
************************************
హామీ:
ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని
నా స్వీయ రచన .
*********************************
కవన కిరణాలకు పంపినది.
13/05/2023.
:శీర్షిక :మా అమ్మ రాక్షసి.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
మా అమ్మ రాక్షసి,ఎందుకంటే..
ఎప్పుడుా నా వెంటే ఉండి
నన్ను సాధిస్తుా ఉంటుంది.॥
ఐదు సంవత్సరాల చిన్న పిల్లనే కదా!
పక్కనున్న తాతయ్యలు బాబయ్యలు
నన్ను ముద్దు చేస్తుాంటే కసిరి -
ఇంట్లోకి రమ్మంటుంది ॥
ఎవరైనా చాక్లెట్లిస్తే తిననివ్వదు.
మత్తుమందుంటుందట...
బైట ఏమీ కొనుక్కోనివ్వదు.
కెమికల్స్ కలుపుతారట...॥
ఇంటోనే తను విశ్రాంతి తీసుకోకుండా
బోలెడు చిరు తిళ్ళు చేసేస్తుంది.
ఎప్పుడుా అవే పెడుతుంది.॥
పార్కులో ఆడుకుంటుాంటే
సాయంత్రం ఆరుగంటలకే
ఇంటికి వచ్చేమంటుంది.॥
ఒక గంట, అంతకుమించి
టి. వి చుాడనివ్వదు. ఎందుకంటే
కళ్ళు పాడైపోతాయట.॥
నాకు జ్వరం వస్తే రాత్రంతా
మేలుకొని ,దెయ్యంలా--
నా పక్కనే కుార్చుంటుంది.
మాటి మాటికీ తడి గుడ్డ నెత్తిని వేస్తుా॥
చదువుకోకపోయినా,
హోమ్ వర్క్ ,చేయకపోయినా...
అబ్బా...ఒకటే సాధింపు.
చదువుకోకపోతే సుఖపడలేవంటుా...॥
అన్ని పనులకు సమయం నిర్దేసిస్తుంది.
అందరికీ అన్నీ సమయానికి అందిస్తుంది.
తను మాత్రం , సమయానికి పడుక్కోదు-
సమయానికి అన్నం తినదు.॥
నాకు కోపం వచ్చి చాలా అల్లరి చేస్తానా
న న్ను బుజ్జగించి...నన్ను నవ్విస్తుంది.
పైగా, మా పిల్లలు బుద్ధుమంతులంటుా
అందరితో అబద్ధాలు చెపుతుంది.॥
ఎప్పుడుా ఏదో పని చేస్తుా
మమ్మల్లి అంటిపెట్టుకునే ఉంటుంది.
అన్ని నియమాలుా మాకే..
అమ్మేమీ పాటించదు.॥
పనులాపదు , సమంగా తినదు .
రాత్రిళ్ళు సమంగా నిద్రపొిదు.
ఒళ్ళు బాగులేకపోయినా ,
ఇంటి పనులాపదు పైగా ఎంచక్కా
మార్కెట్టుకు పోయి, బోలెడు
సంచులు మొాసి తెస్తుంది ॥
అమ్మ ఎన్ని పనులు చేసినా
ఎవరుా అమ్మని ఆపరెందుకో...
.అందికే నేను పెద్దైతే, అమ్మ
నన్నెలా చుాసిందో అలాగే చుాస్తా...॥
హామీ :
పై కవిత నా స్వీయ రచన..
************************
13/05/2023.
అంశం : మాతృదినోత్సవం.
శీర్షిక :"అమ్మా...! నన్ను క్షమించవుా."..?
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
క్రమసంఖ్య : 2023.
నేను అమ్మనయ్యాకా తెలుసుకున్నాను
అమ్మంటే ఏమిటో.."
నా బిడ్డ అకలికి ఏడుస్తుాంటే
తెలుసుకున్నా.,"తల్లి ప్రేమంటే " ఏమిటో..॥
నా పాప పగలంతా నిదరోతుా
రాత్రి ఆటలాడుతున్న పుడు తెలుసుకున్నా..
"అమ్మని , సహనానికి ప్రతీకని" ఎందుకంటారో...॥
సమయానికి అందరికీ అన్నీ
అమరుస్తున్నపుడనుకున్నా....
"అమ్మంటే, అవిశ్రాంత రాట్నమని...".,॥
నా పాప నన్నెదిరించినపుడు తెలిసింది,
అమ్మ నావల్ల "మానసికంగా ఎంత కుంగిపోయిందో .."
.
అమ్మ అనంతలోకాలకు చేరుకున్నాకా
తెలిసుకున్నా ,పరిపుార్ణమైన త్యాగానికి
"అమ్మకు అమ్మే సాటని ,".॥
ఈ నాడు అమ్మనైన నాకు "అమ్మంటే ఏమిటో"
తెలిసింది.,
కానీ నా తప్పులు క్షమించమని అడగడానికి
"అమ్మ" లేదు., ఐనా అడుగుతున్నా....
"అమ్మా...! నన్ను క్షమించవుా."..?॥
హమీ :
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచన.
*******::::*******************
No comments:
Post a Comment