[30/05, 5:33 pm] JAGADISWARI SREERAMAMURTH: 30/05/2023.
మహతీ సాహితీ కవి సంగమం .
అంశం : రుబాయిలు.
శీర్షిక : అన్నియు నీవే : అంతయు నీవే
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహారాష్ట్ర .
1.
అణువణువున ఉన్ననిన్ను తెలియలేను గోపాలా!
ఈవిరహపు బాధ నేను తాళలేను గోపాలా !
నీనామమె నాజీవన స్మరణాయెను ఊపిరిగా._
నీరుాపము కానకనే నుండలేను గోపాలా..! ॥
2.
ఈ భువిలో, ఆదివిలో, అంతటనుా నీవేగా
బ్రహ్మాడపు చైతన్యపు సారధివీ నీవేగా
నా మదినే కోవెలగా మలచితినో గోపాలా
అలసిసొలసి యున్నాడవు విడిదిచేయు గోపాలా॥
(విడిది అంటే తత్కాలిక నివాసము , బస.)
3.
సాధుజనులు ,సారగుణులు ,మెచ్చుగురుడ వీవేగా
సజ్జననము, సుజ్ఞానము నిచ్చుఘనుడ వీవేగా
గీతామృత ,తత్త్వబోధ యొాగసార ములనుదెల్పి
నీభక్తుల బ్రోచేందుకు వచ్చుధవుడ వీవేగా॥
[30/05, 6:00 pm] +91 78423 68534: పుల్లాభట్ల జగదీశ్వరి మూర్తి గారు -23✅️
ఆణువణువూ ఉన్న నిన్ను తెలియలేను గోపాలా.. నీ భక్తుల బ్రోవగా వచ్చు ధవుడా అని కృష్ణ రుబాయీలు. 🙏💐👌
No comments:
Post a Comment