[02/07, 11:26 pm] JAGADISWARI SREERAMAMURTH:
తపస్వీ, మనోహరం ," e" బుక్ కొరకు రచన.
అంశం : నాణానికి మరోవైపు. (కధ )
ఒకటవ భాగం
శీర్షిక : అంతర్మధనం.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
కళ్యాణ్ :మహారాష్ట్ర.
అఖిలకు చాలా సహనంగా ఉంది ఏంటి జీవితం ఎన్నాళ్ళు ఇలా ! పొద్దున్నే లేవడం, గబగబా ఇంటి పని, వంట పని- చేసుకొని ,ఆఫీస్ కి వెళ్లడం అక్కడ సాయంత్రం దాకా ఊపిరి తిరగని పనితో సాయంత్రం 5:30 దాకా కష్టపడడం , తి పెళ్ళిరిగి ఇంటికి రావడం, మళ్ళీ రాత్రి వంట ,
పొద్దున లేచి ఆఫీస్కి వేసుకునే బట్టలు ఇస్త్రీ చేసుకోవడం, ఆఫీస్ డబ్బా కోసం కూరలు తరుక్కోవడం ,ఇలా...
రాత్రి పడుకునే సరికి 11 దాటిపోతుంది .
పని, పని ,పని , ఎంత చిరాకుగా ఉందో...
అమ్మా,నాన్నలకు ఆరోగ్యం అంతంత మాత్రం గానే ఉంది.
తన మీద అన్నొకడున్నాడు . వాడు ప్రేమ పెళ్ళంటూ
ఒక తమిళ అమ్మాయిని చేసుకొని, చక్కగా ఆమెతో పాటు
అమెరికా వెళ్ళి పోయాడు. వెళ్లిన వాడు వెళ్ళినట్టే వెళ్లి మరి తిరిగి రాలేదు, . కన్నెత్తి చూడలేదు , పన్నెత్తి పలకరించలేదు
దాంతో తల్లిదండ్రుల బాధ్యత తన మీద పడింది.
ఉద్యోగం వచ్చిన తర్వాత తన పెళ్లి విషయం తాత్కాలికంగా మూల పడింది.
రెండేళ్లు ఇట్టే గడిచిపోయాయి.
తనకు 30 ఏళ్ళు పైపడ్డాయి.
అమ్మ నాన్న తనకు పెళ్లి చేస్తామని అప్పటినుంచీ.. ప్రయత్నాలు చేస్తూనేన్నారు . కానీ "ఉద్యోగం చేసే పిల్లవద్దని" కొంతమంది , "అమె పెళ్లయిన తర్వాత మీరు ఎక్కడ ఉంటారు" అని కొంతమంది , "ఉద్యోగం చేసే పిల్ల అయితే మాకు కావాలి కానీ, తర్వాత మీ ఇరువురి బాధ్యత తను తీసుకోవాల్సి వస్తుందేమో కదా, "అని మరి కొంత మంది,
ఇలా ఏదోరకంగా వచ్చిన సంబంధాలన్నీ తప్పిపోతున్నాయి.
దాంతో అమ్మ నాన్నలకు ,తనకసలు పెళ్లి అవుతుందా అన్న బెంగ మొదలైంది.
వాళ్ల బెంగ చూసి తనకు నిరుత్సాహం మొదలైంది.
చూడడానికి అయితే తను బాగానే ఉంటుంది .అందంకేం కొరత లేదు. ఛాయ కూడా కాస్త తెలుపనే చెప్పొచ్చు .కన్ను ముక్కు తీరుగానే ఉంటాయి.
పోస్ట్ గ్రాడ్యుకేషన్ చేసింది . మంచి ఉద్యోగం చేస్తోంది .
మంచి జీతం వస్తుంది . కానీ తల్లిదండ్రుల బాధ్యత తన మీద ఉందన్న ఒక్క నెపంతో తనకి ఈనాటి దాకా సంబంధాలు కుదరలేదు.
ఇప్పటికే తన వయసు 32 దాటింది .రొటీన్ గా చేస్తున్న పనితో జీవితం చాలా విరక్తిగా ఉంటోంది.
ఆలోచిస్తూ అరగంట నుండి పక్క మీద దొర్లుతున్న , అఖిలకు నిద్ర అన్నది మాత్రం రావడం లేదు .
ఈరోజు తను డ్యూటీ నుంచి రాగానే అమ్మ చెప్పిన మాట
రేపు తనకు పెళ్లి చూపులట.అమ్మ చాలా సంబరంగా చెప్పింది
"అబ్బాయి చాలా సింపుల్ గా ఉంటాడట .కొంచెం పొట్టిగానీ మిగిలిన విషయాలకు ఏమి లోటు లేదట .
ఛాయ కొంచెం తక్కువైనా ,మంచితనానికి మారు పేరట.
ఎవరి మనసు కష్టపెట్టడట."
ఇవన్నీ చెప్పుకోవడానికే , గాని నిజంగా మగవాళ్లంతా అలా ఉంటారా ? చాలా అరుదు కదూ.
అబ్బాయికి తను నచ్చినా, తనకు మాత్రం అబ్బాయి నచ్చొద్దూ ? తనకన్నా పొట్టిగా ఉంటే ఎలా ఒప్పుకోవడం.
తనకన్నా కొంచెం ఛాయ కూడా తక్కువేనట .
ఏమో చూద్దాం, పొద్దున్నే చూస్తాను కదా !అప్పుడే నిర్ణయించుకోవచ్చు." అనుకుంటూ అఖిల నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ కళ్ళు మూసుకుంది.
*******************************
ఆరోజు ఆదివారం .
ఆఫీసుకి సెలవు రోజు. అయినా సరే పెళ్లిచూపులు కారణంగా తను తొందరగానే లేచింది..
పెళ్ళివారు రాగానే ఇవ్వడానికి ఒక స్వీటు, హాటు,తయారు చేసి ,కాఫీ గుండ ఫిల్టర్ లో వేసి, డికాషన్ తీసి ఉంచి,
పక్కనే గిన్నెలో పాలు వేడి చేసి ఉంచింది .
వీలైనంతవరకు అమ్మని శ్రమ పెట్టకుండా ఉండాలన్నదే అఖిల తాపత్రయం .
ఇల్లంతా నీట్ గా సర్ది ఉంచి, స్నానం చేసి , దేవుని ముందు దీపం పెట్టి ,తర్వాత తనకు తోచిన విధంగా తయారై హాల్లోకి వచ్చి కూర్చుంది.
అప్పటికే సమయం తొమ్మిదిన్నర అయింది.
పది, పదిన్నర ప్రాంతంల్లో పెళ్లి వారు వస్తున్నారు అన్న వార్త వచ్చింది.
ఆ వెంటనే అమ్మా ,నాన్న చేసిన హడావిడి ఇంతా-అంతా కాదు.
తుడిచిందే తుడిచేరు, సద్దిందే సర్దేరు.
తనకైతే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది ఈ సంబంధం అన్నా కుదురుతుందా..? తనకు పెళ్లి కొడుకు నచ్చుతాడా? ఏమో?
ఆలోచిస్తుండగానే పెళ్లి వారు వచ్చేసారు .
అమ్మ, నాన్నగారు ,వాళ్ళందరికీ సకల మర్యాదలు చేసి- కుర్చీల్లో కూర్చోబెట్టారు.
అంతా కూర్చున్నారు. తనను వాళ్ళ ఎదురుగుండా కూర్చోబెట్టారు. వాళ్లు అమ్మ నాన్నలను ఏవేవో అడుగుతున్నారు.
తన దృష్టి మాత్రం ఎదురుగుండా కూర్చున్న పెళ్ళికొడుకు మీదే ఉంది.
అతడు చాలా సింపుల్ గా ఉన్నాడు.
చాయ్ తక్కువని చెప్పారు కానీ నల్లగానే ఉన్నాడు. దానికి తోడు పొట్టి. వెనకాతల బట్టతల కూడా ఉన్నట్టుంది.
జుట్టు చాలా పల్చగా ఉంది.
అతని పెదాలు లావుగా, చూడడానికి అసహ్యంగా ఉన్నాయి. చూడగానే అతనిని పెళ్లి చేసుకోవాలనిపించలేదు అఖిలకు.
కూర్చున్నంతసేపు అతనేమీ మాట్లాడలేదు
.అన్ని వాళ్ళ అమ్మ నాన్న గారే మాట్లాడారు.
అతనిని గమనించడంలో వాళ్లు ఏం మాట్లాడుకున్నారో
తనేం వినేలేదు.
కొంతసేపు తర్వాత అమ్మ వచ్చి "అబ్బాయి తో ఏమైనా మాట్లాడతావా" అంటూ చెవిలో చెప్పింది.
ఇదేంటి పెళ్లి చూపుల్లో అబ్బాయి కదా తనతో మాట్లాడ వలసింది... అదే మాట అమ్మతో అంది.
" అలా కాదమ్మా. అతడు కాస్త మొహమాటస్తుడట .
అందుకే నువ్వే ఏదైనా అడగాలంటే అడిగేయ్" అంటూ చిన్నగా నవ్వింది.
నిరుత్సాహంగా ఉన్న తను
" మాట్లాడను" అన్నట్టుగా తల ఊపింది.
ఇంతలో అతన్ని తల్లి "మాకు అమ్మాయి నచ్చిందంటూ" చెప్పారు.
అంతేకాదు తమకు కట్న కానుక లేవీ అవసరం లేదని, పెళ్లయిన తర్వాత ఆమె బాధ్యతగా తల్లిదండ్రులను చూసుకోవచ్చని , అందుకు తమకేమీ అభ్యంతరం లేదని కూడా చెప్పారు.
ఆ చివరి మాట తనకు చాలా నచ్చింది." తనకు పెళ్లయితే అమ్మానాన్న సంగతి ఎలాగ. ? " అని ఆలోచిస్తున్న తనకు ఒక ప్రాబ్లం సాల్వ్ అయినట్టు అనిపించింది.
అమ్మ నాన్నల ముఖాల్లో సంతోషం వెల్లి విరుస్తున్నది.
అమ్మ, వారి ముందే తనను అడుగుతోంది "ఆనంద్ నచ్చాడా" అంటూ..
అప్పుడు తెలిసింది అతని పేరు ఆనంద్ అని. పేరైతే చాలా బాగుంది.
కానీ అతను తనకన్నా చాలా పొట్టి గా ఉండటమే గాక
చూడటానికి కూడా బాగులేడు అందుకనే తనేం చెప్పలేకపోయింది.
నిజంగానే తనకు అబ్బాయి నచ్చలేదు కానీ, ఈ సంబంధం వద్దంటే మరొకళ్ళు వస్తారు ,కట్నం అడుగుతారు, లేదా తల్లిదండ్రులని చూడొద్దు అంటారు.
తను ఈ వయసులో వాళ్ళని వదిలి వెళ్ళలేదు.
ఎటునుండి ఎటు ఆలోచించినా ,తను ,ఈ సంబంధానికి ఒప్పుకుంటేనే మంచిది అనిపించింది.
అందుకే మరోసారి ఆలోచించకుండా "ఊ... "అన్నట్టుగా తల ఊపింది,.
*****************
పెళ్లి నిశ్చయమైపోయింది. వెనువెంటనే ముహూర్తం కూడా .…
జేష్ట మాసంలో చాలా సింపుల్ గా, తామిద్దరికీ
పెళ్లైపోయింది.
వ్రతం అంటూ అత్తవారింటికి తీసుకెళ్లారు. ఇల్లు బాగానే ఉంది. అత్తగారు, మావగారు చాలా మంచి వాళ్ళలాగే ఉన్నారు.
తనను అమ్మ ,అమ్మ ,అంటూ ,ఒక క్షణం వదలకుండా తన మంచి చెడులన్నీ చూసుకుంటున్నారు.
వచ్చిన వాళ్ళందరికీ చాలా సంతోషంగా తనను పరిచయం చేస్తున్నారు
ఇంట్లో ఇంత హడావిడి జరుగుతున్నా....
ఆనంద్ మాత్రం దూరంగా కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు..
కనీసం ఇలాంటి సమయంలో అయినా తన పక్కన కూర్చోవచ్చు కదా! మరీ ఇంత మొహమాటమా!
కనీసం వచ్చినవాళ్ళలో ఒక్కరినైనా పలకరిస్తాడా అని చూస్తే అదీ లేదే ! అసలు అతను సమంగా మాటలైనా మాట్లాడుతాడా ,లేక మరేదైనా ప్రాబ్లమా ! అఖిల ఆలోచిస్తూనే అతని వైపు చూస్తోంది .
అతను తలెత్తి చిన్నగా తన వైపు చూసి నవ్వాడు అఖిల గాభరాగా చూపులు మరోవైపుకు తిప్పుకుంది
వ్రతంలో తన పక్కనే కూర్చున్న ఆనంద్ ,చాలా శ్రద్ధగా పూజ అంతా చేసాడు.
వ్రతం బాగానే జరిగింది. తర్వాత భోజన కార్యక్రమం.. అందరికీ తాంబూలాలు ఇచ్చుకోవడం వంటి పద్ధతులన్నీ
అయ్యేసరికి సాయంకాలం అయిపోయింది.
వచ్చిన వారందరూ సంతోషంగా వెళ్లిపోయారు
ఆ తర్వాత అత్తగారు, మామగారు ,నాన్నగారు, అమ్మ- కూర్చుని చాలా సేపు పిచ్చా- పాటీమాట్లాడుకున్నారు.
తర్వాత సడన్గా టాపిక్ మారిపోయింది.
వాళ్ళు తమ శోభనం కార్యక్రమం గురించి మాట్లాడుకుంటూ ఉంటే తన గుండె గుభిల్లుమంది.
అమ్మో !ఇతగాడి తోటా !శోభనమా!
తను చచ్చినా ఈ కార్యక్రమానికి ఒప్పుకోదు .
కానీ ఎలా ఎలా తప్పించుకోవడం..? కానీ ఎప్పుడో అప్పుడు ఇదంతా జరగవలసినదే కదా..?
ఇప్పుడు తప్పించుకున్నా మరొకప్పుడు వీళ్ళు ఇదంతా చేయడం మానరు .దాని బదులు ఇప్పుడే కాముగా ఊరుకుంటే సరి.
అసలు తనకు పెళ్లి కొడుకు నచ్చనప్పుడు తనీ పెళ్లెందుకు చేసుకుంది.
చేసుకున్న తర్వాత ఈ విధంగా ఎందుకు ఆలోచిస్తోంది..
అంటే తనకు పెళ్లి కాదని భయమా...
"లేదు, లేదు, తను అమ్మానాన్నల కోసమే ఈ పెళ్లి చేసుకుంది. వీళ్లు మాత్రమే తల్లిదండ్రులను తన దగ్గర ఉంచుకునేందుకు ఒప్పుకున్న వాళ్ళు..
అందుకే తనకు ఆనంద నచ్చకపోయినా ఈ పెళ్లి చేసుకుంది. అంతే....
అఖిల మనసులో ఉన్న ఏహ్య భావాన్ని, బయటకు కనబడనీయకుండా నానా అవస్థలు పడుతోంది.
దూరంగా కూర్చున్న ఆనంద్ , తనను చాలాసేపటినుండి గమనిస్తున్నాడని తెలుసుకున్న అఖిల మొదటిసారిగా సిగ్గుపడుతూ తల మరో వైపుకు తప్పుకుంది .
*****************************
రూమ్ లో పెద్ద మంచంపై తెల్లటి దుప్పటి .దానిపై మల్లెపూలు, జాజిపూలు, గులాబీ రేకులు, పరిచి ఉన్నాయి.
పక్కన టేబుల్ మీద పెట్టిన అగరబత్తుల వాసన , మంచి గుభాళింపుతో హాయిగ మత్తెక్కిస్తోంది.
ఆ పక్కనే కొన్ని రకాల సీట్స్, హాట్స్ , పాలు వంటివి పెట్టి ఉన్నాయి.
ఆ పక్కన కుర్చీలో ఆనంద్ పంచకట్టు, లాల్చీ వేసుకుని ఠీవిగా కూర్చుని ఉన్నాడు.
అతని బుగ్గ మీద నల్లగా పెద్ద పుట్టుమచ్చ లాంటిది పెట్టారు.
మెడలో కర్పూరపు దండ వేలాడుతోంది.
పొట్టిగా ఉన్న అతన్ని ఆ విధంగా చూసేసరికి అఖిలకు నవ్వు ఆగలేదు .
అది కష్టం మీద నవ్వు ఆపుకుంటూ చిన్నగా నవ్వింది.
అఖిల లోపలికి రాగానే ఆనంద్ మెల్లగా లేచి అఖిల దగ్గరికి వచ్చి , "రా అఖిలా " అంటూ నెమ్మదిగా ఆమె చేయి పట్టుకున్నాడు.
అఖిలకు ఏదోలా ఉంది .తనకు అతనే ఇష్టం లేనప్పుడు.. అతనితో ఈ రాత్రి ఎలా గడపడం ?
అనుకుంటూ ,ఎటూ తేల్చుకోలేక మెల్లిగా అతని వెనకాలే నడిచింది.
ఆనంద్ ఆమెను మంచం మీద కూర్చోబెట్టాడు . మెల్లిగా తను కూడా అమె పక్కన కూర్చుంటూ , "అలిసిపోయావా" అంటూ అడిగాడు.
అఖిలకు చిర్రెత్తుకొచ్చింది .
ఇదీ అడగవలసిన మాటేనా? నాలుగు రోజులు బట్టి నిద్ర లేకుండా ,రెస్ట్ లేకుండా ,తమ పెళ్ళి హడావిడి అంతలా జరుగుతూ ఉంటే.... అలసటగా ఉండదా..
అనుకుంటూ చిరాకుగా అతని వైపు చూసింది.
ఆనంద్ మెల్లగా నవ్వుతూ "పడుకో అఖిలా !
ఈ రాత్రంతా నువ్వు రెస్ట్ తీసుకో . నేను ఆ బయట వరండాలో పడుకుంటాను అని ,తన మాటకోసం ఎదురు చూడకుండా తలగడ పట్టుకుని చక్కా
బాల్కనీలోకి వెళ్ళిపోయాడు.
ఒక్క క్షణం అఖిల అవాక్కైపోయింది.
కానీ మరుక్షణం తనకి ఈరోజు గండం తప్పినందుకు సంతోష పడింది.
రోజులు గడుస్తున్నాయి. అతను రాత్రి రూమ్ లోకి రాగానే రోజు అడుగుతున్నాడు ".వరండాలో పడుకోనా" అని,
తను సరే అని తల ఊపుతుంది .అతను వరండాలోనే పడుకుంటున్నాడు అతనిలో కనీసం కోపం కూడా కనపడడం లేదు ,చిరాకు అంతకన్నా లేదు. పైగా తన ఆఫీసుకు వెళ్తున్నప్పుడు ప్రతి పనిలోనీ సాయం చేస్తున్నాడు.
ఇదంతా చూస్తున్నా అఖిలకు ఏం చేయాలో అర్థం కావడం
లేదు. అటు అత్తగారు మామగారు కూడా తనను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు.
ఇదంతా చూస్తున్న అఖిలకు, అసలు అతడు మగాడా , కాదా ,అన్నా అనుమానం రోజురోజుకు పెరిగిపోతోంది.
ఇక ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో, అఖిల తనంతట తానే ఒక రాత్రి అతన్ని వరండాలోకి వెళ్ళనివ్వలేదు.
అతను చిన్నగా నవ్వుతూ తన వైపు చూశాడు .
తను మళ్ళీ సిగ్గుతో తలొంచుకుంది.
కానీ ఆ రాత్రి అతని ప్రవర్తన తనకి చాలా విచిత్రంగా అనిపించింది.
తనతో ముద్దుగా, ముచ్చటగా ,ఏ మాటలు మాట్లాడలేదు.
తనను దగ్గరికి తీసుకుంటూ పరవాలేదా ,నీకు ఇష్టమే కదా అని మాత్రం అడిగాడు.
ఆ తర్వాత ఆయన మరింకేమీ మాట్లాడలేదు. తన మనసులో ఏముందో కూడా తెలుసుకోకుండానే
తన కోరికను తీర్చుకోవడంల్లో నిమగ్నమైపోయాడు.
అరగంట దాటగానే అతడు గుర్రు పెట్టి నిద్రపోయాడు.
అఖిలకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి .ఇదే నా జీవితం అంటే.. ఇకముందు కూడా, ఇతను ఇలాగే ప్రవర్తిస్తాడా...?
తన శరీరంతో తప్ప తన మనసుతో అతనికి పని లేదా...
అతను తనతో కొంచెం సేపైనా ప్రేమగా మాట్లాడితే కనీసం మనసైనా తెలుసుకోగలిగి జీవితంలో కాస్త రాజీ పడేది.
కానీ ఆనంద్ ప్రతిరోజు ఒకేలా ప్రవర్తిస్తున్నాడు తనతో ఎక్కువగా మాట్లాడడు. తన దగ్గర ఉంటే మాత్రం ఒంట్లో బాగుందా అని అడుగుతాడు. కానీ నిజంగా ఒంట్లో బాగు
లేకపోయినా ,చెప్తే గాని అర్థం చేసుకోలేడు .
తను చేయాలనుకుంటే ఇంటి పని ,వంట పని, ఆడ పని అంతా కూడా చేసేస్తాడు.
అతనికి మూడ్ లేకపోతే తను చచ్చిపోతున్నా లేవడు.
అసలు అతడేంటో అతని మనస్తత్వం ఏంటో పెళ్లై ఇన్ని నెలలైనా తనకి ఇంకా బోధపడలేదు.
ముందు ముందు తను ఇంకా ఎన్ని విషయాలలో ఎంత అడ్జస్ట్ అవ్వాలో.....
ఆలోచిస్తున్న అఖిలకు తెల్లారితూ ఉండగా కాస్త కునుకు
పట్టింది.
లేచేసరికి తెల్లారి 7: గంటలు దాటింది.
అత్తగారికి మామగారికి కావలసిన వంట చేయనేలేదు ఎలా? తను డబ్బా కట్టుకోకపోయినా పర్వాలేదు.
ఈ పూటకి అతను ఏదో బయట తినేస్తారు.
కానీ తను ఆఫీసుకి వెళ్ళిపోయాక అత్తయ్య గారు తామిద్దరికి వండుకోగలరా? లేదు లేదు.
ఆవిడ చేసుకోలేరు .తనే ఏదో కొంచెం చేసి పెట్టి వెళ్ళాలి.
ఆలోచిస్తునే గబగబా కిచెన్లోకి వెళ్ళింది.
అక్కడ వంటిల్లు అంతా నీట్ గా సర్ది ఉంది.
కిచెన్లో వంట వండిన సూచనలు కనిపిస్తున్నాయి.
ఒక మూల గిన్నెల్లో, వండిన వంటంతా శుభ్రంగా నీట్ గా సర్ది ఉంది.
తన కేరేజి కూడా సర్దేసి ఒక మూల పెట్టి ఉంది.
సింకు దగ్గర ఆనంద్ చిన్న బర్ముడా వేసుకొని,
చెమటలు కారుతూ, అంట్ల గిన్నెలు బర బరా తోముతూ కనిపించాడు.
అదేంటి ? ఇతనెప్పుడు లేచాడు ..? అతను కూడా ఆఫీస్ కి వెళ్ళాలి కదా! ఈ పనంతా ఎప్పుడు లేచి చేసాడు...?
ఐనా ఇతనేంటి ,ఎప్పుడూ అంటిడీ గానే ఉంటాడు .
గట్టిగా మొహం కడుక్కొని, శుభ్రంగా మంచి సూట్ వేసుకొని, టక్ చేసుకుని, నీటుగా తలదువ్వు కొని ,కాస్త సెంటు స్ప్రే చేసుకుని కనిపిస్తే ఎంత బాగుంటుంది. ఇప్పుడు పేడ తట్టలా మొహం వేసుకుని తనెదురుగా తిరుగుతూ ఉంటాడు. అతను ఎప్పుడు ఆఫీస్ కి వెళ్తాడో గాని ,తను వెళ్ళిపోయే వరకు కూడా ఇలాగే ఉంటాడు. శుభ్రంగా తయారై ఉండగా అతనిని తనెప్పుడూ చూడలేదు..
ఏ జన్మలో ఏ పాపం చేసుకుందో తన ముఖానికి ఇలాంటి భర్తను రాసి పెట్టాడు దేవుడు. అనుకుంటూ ఆఫీస్కి తయా రవ్వ సాగింది. అద్దం ముందు నిలబడీ ఉన్న అఖిలకు, సడన్గా తన ఆఫీసులో బాస్ గుర్తుకొచ్చాడు.
అతడు ఎంత బాగుంటాడని ఎప్పుడూ నీటుగా సూటు వేసుకుని ఉంటాడు కాళ్ళకు పోలీష్. చేసిన బూట్లు నిగనిగలాడుతూ ఉంటాయి .
మంచి ఒడ్డు పొడుగుతో అందంగా ఉంటాడు.
అతనిని చూస్తున్న కొద్ది చూడాలనే అనిపిస్తుంది.
అందరితోనూ చాలా రిజర్వుడ్ గా ఉంటాడు
చాలా తక్కువ మాట్లాడుతాడు. సాయంత్రం వరకు చొక్కా నలగకుండా, రూపు చెదరకుండా అలాగే ఉంటాడు.
అతని ఆఫీసులో లేడీస్ ష్టాఫ్ కొంచెం ఎక్కువ మందే ఉన్నారు. అందరూ అతనితో ఏదో పని కల్పించుకుని మాట్లాడుతూ ఉంటారు .
తనకి కూడా అనిపిస్తుంది తను కూడా మాట్లాడదామని కానీ ఒక రకమైన భయంతో అలాగే ఉండిపోయేది.
రోజులు గడుస్తున్నాయి
అతనికి కూడా తను నచ్చిందేమో చాలాసార్లు తన వైపు చూస్తూ ఉండడం తను గమనించింది .
అతని భార్య ఎంత అదృష్టవంతురాలో...
నిన్న మాత్రం అతను ఒక అడుగు ముందుకేసాడనే చెప్పాలి ఫైల్స్ చూపించమన్న మిషతో తనను లోపలికి పిలిచాడు. ఎంత మర్యాదగా మాట్లాడాడని.
తనకోసం కాఫీ కూడా తెప్పించాడు.
కావాలనే తనతో ఎక్కువగా మాట్లాడుతూ
తన కుటుంబ విషయాలు అడిగి మరీ తెలుసుకున్నాడు.
అతను తన భర్త గురించి తరచి తరచి అడిగేవాడు.
తను ఏమని చెప్తుంది అతనితో ...
తన భర్త విషయంలో ,తను ఎంత అసంతృప్తిగా ఉందో అతనితో ఎలా చెప్పగలదు..?
కానీ ఒకరోజు తను కావాలనే తన భర్త ఫోటో ఒకటి తన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకు వెళ్ళింది.
అది ఏదో ఒక విధంగా అతని కంట పడినట్టు చేసింది.
ఆ ఫోటో తన భర్తదని తెలిసి అతనెంత బాధ పడిపోయాడనీ...
అతను చాలా బాధపడుతూ" అందమైన వాళ్ళకి దేవుడు ఇలాంటి పరీక్షలు ఎందుకు పెడతారో" ..అంటూ వాపోయాడు.
తనతో చాలా ప్రేమగా మాట్లాడుతూ, తనపై జాలి చూపించడం వలనో ఏమో ,తను అసంకల్పితంగా అతనికి దగ్గరవుతూ వచ్చింది .
అతని గురించిన ఆలోచనలు ఎక్కువ అవ్వడంతో,
ఆనంద్ అంటే మరి కొంచెం రోత పుడుతోంది అఖిలకు.
ఆనందం మాత్రం అఖిల విషయంలో చాలా ప్రేమగా ఉంటున్నాడు ఆఫీసుకు వెళ్తున్న పిల్లలకు చాలా సాయం చేస్తున్నాడు ఏ విధంగానూ కష్టపెట్టకుండా చూసుకుంటున్నాడు.
*****************************
ఈనెల శనాదివారాలతో కలిపి ఆఫీసుకు మరో రెండు రోజులు అదనంగా సెలవులు. కలిసి వస్తున్నాయి. దాంతో ఆఫీసులో అందరూ ఎక్కడికైనా చిన్న టూర్ వేసుకుని, ఎంజాయ్ చేద్దాం అని ప్లాన్ వేస్తున్నారు.
ఎవరెవరు జాయిన్ అవుతారో వాళ్ళ అందరి పేర్లు రాసుకుంటున్నారు.
తను ఈ ఊరు తప్ప, మరెప్పుడూ, ఏ ఊరికీ వెళ్లలేదు పెళ్లైన తర్వాత కూడా హనీమూన్ కని ,ఆనంద్ తనని ఎక్కడికీ తీసుకెళ్లలేదు.
అత్త మామల్ని వదిలి, నాలుగు రోజులు పాటు బయటకు వెళ్లడమా, మానడమా, అని ఆలోచిస్తున్న తనకు
తన ఆఫీసు కోలీగ్స్,తమ బాస్ కూడా తమతో వస్తున్నట్లు తెలిపారు.
దాంతో అఖిలకు ఎక్కడలేని హుషారు పుట్టుకొచ్చింది.
వెంటనే తను కూడా తన పేరు ఇచ్చి వచ్చింది.
*****************
ఇంటికి వెళ్లిన తర్వాత ఆనంద్ తో ఈ విషయం చెప్పింది.
ఎవరెవరు వెళ్తున్నారు అని అడిగాడు.
తను కొందరి పేర్లు చెప్పి ,బాస్ కూడా వస్తున్నట్లు తెలిపింది.
అకామిడేషన్ ఎక్కడ అని అడిగాడు .
అఖిలకు చిరాకు వేసినా, భర్తగా ఆ మాత్రం అధికారం అతని కుందిలే ....అనుకుంటూ వివరాలు చెప్పింది.
ఆనంద్ నవ్వుతూ సరే అన్నాడు.
అఖిల ప్రయాణానికి అన్నీ సర్దుకుంటున్న సమయంలో ఆనంద్ కూడా హెల్ప్ చేశాడు.
చివరిలో దగ్గు జలుబు లాంటివి వచ్చినా ,ఒంటి నొప్పులు కలిగినా, నడిచి నడిచి అలసిపోయి, జ్వరం వచ్చినట్లు అనిపించినా ఈ మందులు వేసుకో అంటూ కొన్ని టాబ్లెట్స్ నా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టాడు.
అఖిల కు అతన్ని చూస్తే చాలా జాలి అనిపించింది.
ఎప్పుడు తను, అతనిపై విసుక్కుంటూనే ఉంటుంది .
కానీ అతను మాత్రం తన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడు.
అనుకుంది .
మరుక్షణమే ఎందుకొచ్చిన ప్రేమ, తన మనసు గురించి గానీ తన ఇష్టాయిష్టాల గురించి గానీ పట్టించుకోనప్పుడు,.
అనుకుంటూ మూతి ముడిచింది.
************************
అఖిల ఆనందంగా ఆఫీస్ స్టాఫ్ తో కలిసి ప్రయాణం అయింది.
అందరూ తమ తమ కార్లను తీసుకొచ్చి కొంతమందిని ఎక్కించుకుంటున్నారు.
తమ బాస్ తనను, తనతో పాటుగా మరొకరిని తన కార్లో ఎక్కించుకున్నాడు. అతనితో వచ్చిన ఆమె తమ ఆఫీసులో పనిచేయడం లేదు .ఆమె ఎవరో తనకు తెలియదు.
ఏమైతానేం అందరూ కార్లో కూర్చున్నారు అఖిలకు చాలా హ్యాపీగా గాల్లో తేలిపోతున్నట్టు ఉంది.
తను, బాస్ తో కలిసి ప్రయాణం చేయడం చాలా ఆనందంగా ఉంది. బాస్ తనను ఫ్రెంట్ సీట్లో, తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. బాస్ తో వచ్చిన అమ్మాయి పేరు శ్రావణి అని చెప్పింది. ఆమె కూడా చాలా కలగోలుపుగా, చాలా చక్కగా తనతో మాట్లాడుతూ ఉంటే, ప్రయాణం చాలా హాయిగా సాగింది.
జోకులు వేసుకుంటూ ,పాటలు పాడుకుంటూ, చాలా సరదాగా ప్రయాణం అయ్యారు .మధ్య మధ్యలో ఆగుతూ విశాలంగా ఉన్న చెట్ల కింద ఫలహారాలు తింటూ, ప్రకృతిని ఎంజాయ్ చేశారు.
ప్రతి చోట బాస్ తనతో ఉన్న తమ ఇద్దరి మీద ,చాలా శ్రద్ధ చూపించాడు.
మొత్తానికి సాయంత్రానికల్లా రిసార్ట్ చేరుకున్నారు .బాగా ప్రయాణం చేసి ఉన్నారేమో ,అలసిపోయి ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు.
తనది, శ్రావణీది, బాస్ వి , రూములు వేరే హోటల్ రూమ్ లో బుక్ చేసానంటూ బాస్ తమని మళ్ళీ కారు ఎక్కమన్నారు .
ఒక్క క్షణం తనకేమీ అర్థం కాలేదు చుట్టూ ఉన్నవారి వైపు చూసింది .వారు తన వేపు ,తన పక్కన ఉన్న మరొక ఆమె వైపు అదోలా చూసి, ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు.
ఆ క్షణం తనకెందుకో కొంచెం భయం వేసింది .
బాస్ తమకు వేరే హోటల్లో, రూమ్స్ ఎందుకు బుక్ చేసినట్టు.
ఈ విషయం తనకు చెప్పలేదే . ఇక్కడికి వచ్చాక తెలిసింది.
అందరూ కలిసి ఒక దగ్గరే ఉండి ఎంజాయ్ చేస్తాము కదాకదా.. ఎక్కడ కూర్చుంటే ఏంటి ..? అనుకున్నది తను . బాస్ ,తమ కోసం వేరే రూమ్స్ ఎందుకు బుక్ చేసినట్టు ఇంత పెద్ద రిసార్ట్లో మరో రెండు రూమ్స్ దొరకలేదా?.
అనుకుంటూనే కారెక్కింది అఖిల .
ఆమెతో పాటుగా శ్రావణి కూడా .
తాము ఉండబోయే హోటల్ ,రిసార్ట్ కి చాలా దూరంలోనే ఉన్నట్టుంది . అందరితో కలిసి ప్రయాణించడం చాలా బాగుంది అనుకున్న అఖిల కి , ఎందుకో , ఈ విషయం నచ్చలేదు. అందరికీ అంత దూరంగా ఉంటే ఇంకా సరదాగా ఉంటుంది . అదే విషయం బాస్ ని అడిగింది .
బాస్ నవ్వుతూ, నా స్టేటస్ కి ,స్టాఫ్ అందరితో కలిసి ఉంటే బాగుండదు కదా! అందుకే నేను వేరే స్పెషల్ గా ఈ హోటల్ లో రూమ్ తీసుకున్నాను. అక్కడ చాలా బాగుంటుంది. ఏముంది , తెల్లారి లేచి, ఫ్రెష్ అయ్యి ,మళ్ళీ మనం అక్కడికి వెళ్లిపోవడమే .అందరూ కలిసి చుట్టుపక్కలంతా తిరిగి ,ఎంజాయ్ చేశాక ,రాత్రి పడుకోవడానికి మట్టుకే మనం ఈ హోటల్ కి వస్తాం . అని చెప్పాక కొంచెం రిలాక్స్ గా ఫీల్ అయింది అఖిల.
**************************"""""
రూమ్ లోకి వెళ్ళగానే , అఖిల ఫ్రెష్ గా స్నానం చేసి ,మంచి చీర కట్టుకుంది .చాలాసేపు వెయిట్ చేసింది .ఎవరైనా వచ్చి పిలుస్తారేమో ..బయటకు వెళ్దామని ..
కానీ ఎవరూ రాలేదు.
రాత్రి డైనింగ్ హాల్లో భోజనాల దగ్గర అంతా మళ్ళీ రిసార్ట్ లో కలిశారు.
అక్కడ మరుసటి , అందరూ వెళ్లవలసిన ప్రదేశాల గురించి, సమయం గురించి మాట్లాడుకున్నారు.
తర్వాత ఎవరు రూముల్లోకి వెళ్లిపోయారు . అఖిల, శ్రావణి
బాస్ తో కలిసి హోటల్ కి వచ్చేసారు. అఖిలకు ఎంతసేపటికి నిద్ర రాలేదు.
తను సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చింది అందరితో పాటు కలిసి ఉండొచ్చు అనుకుంది. కానీ అందరూ దూరంగా రిసార్ట్లో ఎవరి రూముల్లో వాళ్ళు పడుకుంటున్నారు.
పోనీ కాసేపు శ్రావణి తో కబుర్లు చెబితేనో., అనుకుంటూ
బయటి వారండాలోకి వచ్చింది.
శ్రావణి రూము లాక్ చేసీ ఉంది . "ఇంత రాత్రిపూట, శ్రావణి ఎక్కడికి వెళ్ళిందబ్బా" అనుకుంటూ, ఏమి తోచక ,మెల్లగా- బాస్ రూమ్ దగ్గరికి వచ్చి ఆగింది . పోనీ కాసేపు ఇతనితో మాట్లాడితేనో... చర్చ నిన్న రాత్రిపూట బాగుంటుందా అయినా తను ఏంటి , బాస్ రూం దగ్గరికి వచ్చి నిలబడింది.
తనకి బాస్ అంటే మనసులో ఇష్టమే. అతనితో మాట్లాడాలని కాసేపొద్దునతో గడపాలని చాలాసార్లు అనుకుంది తను. ఇప్పుడు వచ్చిన ఈ అవకాశం తన కోసమే అన్నట్టుగా వచ్చింది .కానీ మరీ ఇంత బరితెగించినట్టు ఇలా రావడం బాగోలేదు కదా...
తనిలా తర్జనభర్జనలు పడుతూ ఉండగానే, బాస్ రూమ్ తలుపు తెరుచుకుంది . లోపల బాస్ చిన్న లాగుతో ఉన్నాడు. మరో ఆఛ్చాదన లేని శరీరం నిండా నల్లటి బొచ్చు అసహ్యంగా కనిపిస్తోంది . నోట్లో సిగార్ లోంచి గుప్ గుప్ మని పొగ వస్తోంది.
రూమ్ లోంచి విస్కీ వాసన గుప్పు మంటూ వస్తోంది.
ఇంత దరిద్రంగా బాస్ ని తనెప్పుడూ చూడలేదు.
వస్తున్న వాసనలకి కడుపు తిప్పినట్టు అయింది .
సగం రేగిన జుట్టు, సగం నలిగిన బట్టలతో శ్రావణి గాబరాగా తన రూమ్ కి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది .
తను ఏంటి చూస్తున్నది. ? తన బాస్ నేనా..?
అతనికి వివాహం అయినట్టుగా విన్నాది .మరి ఇదేంటి..? ఇతను ఇలా....
శ్రావణి అతని భార్యలా తనకు పరిచయం చేయలేదే ..
మరి శ్రావణి ఎవరు ...?
ఆయనకు ,శ్రావణి కు, మధ్య ఏమైనా ఉండవచ్చు.
కానీ. అతను ఆమెతో పాటు ఈ హోటల్ కి, తనను కూడా ఎందుకు తీసుకొచ్చినట్టు..?...
అఖిలకు చమటలు పడుతున్నాయి.
తలుపు తీయగానే ఎదురుగుండా నిలబడ్డ అఖిలను చూసిన బాస్ కూడా కాస్త తడబడ్డాడు.
కానీ కొద్దిసేపట్లోనే తేరుకొని " రా అఖిలా " అంటూ లోపలికి పిలుస్తూ, వెకిలిగా నవ్వాడు.
అఖిలకు కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది.
వెంటనే వెను తిరిగి పరుగెడుతున్నట్లు తన రూమ్ కి వెళ్లి ధడాలున తలుపేసుకుంది.
అఖిల గుండెలు, ఆగిపోతాయేమో... అన్నంత స్పీడుగా కొట్టుకుంటున్నాయి.
ఏంటి తను చూస్తున్నది.? ఎవరి శ్రావణి.? ఆమెకి బాస్ కి ఉన్న సంబంధం ఏమిటి..?
ఎంతో హుందాగా , డిగ్నిటీగా ఉంటూ ,అతి తక్కువగా మాట్లాడుతూ, అందర్నీ ఎంతో గౌరవిస్తూన్న బాస్, ఇలాంటి వాడా..
ఛీఛీ.. ఇందాకల అతను ఒంటి నిండా రోమాలతో, ఎంత అసహ్యంగా కనిపించాడు.
సిగరెట్టు ,తాగుడూ కూడా, అలవాటు ఉందా..?
పైగా రాత్రి కోసం , వేరే అమ్మాయిని కూడా తెచ్చుకున్నాడు .
అంతేకాదు...
ఆమెతో పాటు, తనని కూడా తీసుకురావడంలో, అతని ఉద్దేశ్యం ఏమిటి..?
తను కూడా ఆమెలాగే ,అతని కోసం ,అతని రూముకి వెళుతుందనా.,?
నా గురించి అతను ఇంత చీప్ గా ఆలోచిస్తున్నాడా.?
అక్కకు తల పగిలిపోతున్నట్టుగా ఉంది.
అసలు ,అతను తన గురించి ఇలా ఆలోచించడానికి కారణం కూడా ,తనే కాదు కదా..?
ప్రతీ ఆడపిల్లా కోరుకున్నట్టే , తను కూడా, తనకి అందమైన భర్త రావాలని కలలు కన్నాది.
కానీ తనకు ఆనంద్ లాంటి అందవిహీనమైన భర్త దొరకాడు.
రంగూ లేదు .పొడగరీ కాదు. కనీసం సరదాగా మాటైనా మాట్లాడడు . ఇంతవరకు ఎక్కడకూ తీసుకెళ్లలేదు కూడా.
ఆడారిలా ఇంటి పని అంతా చేస్తాడు .
*****************
[02/07, 11:28 pm] JAGADISWARI SREERAMAMURTH: తపస్వీ, మనోహరం ," e" బుక్ కొరకు రచన.
అంశం : నాణానికి మరోవైపు. (కథ).
రెండవ భాగం.
శీర్షిక : అంతర్మధనం.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
కళ్యాణ్ :మహారాష్ట్ర.
దాంతో తనకు చాలా చిరాకు వేసి ,జీవితం మీద విరక్తి పుట్టినట్టయింది.
దాంతో ఎప్పుడూ లేనిది అందంగా ఉన్న, తన బాస్ ని గమనించడం మొదలెట్టింది.
ఎందుకంటే అతను ఆఫీసులో అందరితో చాలా క్లోజ్ గా అభిమానంగా ఉంటాడు .అందుకే ,అతని స్వభావం చాలా మంచిది అనుకుంది.
తనకు ఎలాంటి భర్త రావాలనుకుందో, అటువంటి లక్షణాలున్న బాస్ అంటే, కాస్త వ్యామోహం పెరిగిన మాట వాస్తవమే.
అతనితో కాస్త టైం స్పెండ్ చేసి, మనసు విప్పి మాట్లాడాలనుకుంది.
అంతకుమించి తన మనసులో మరి ఏ ఉద్దేశమూ,
కోరికకా లేదు.
కానీ తను తీసుకున్న చోరవను, అతను అపార్థం చేసుకున్నట్టుగా ఉంది..... తను సులభంగా అతనికి లొంగిపోతుంది అనుకున్నాడేమో ! అందుకే తన కారులో స్పెషల్ గా రూమ్ తీసుకున్నానని చెప్పి, ఇక్కడకు తెచ్చి పెట్టినట్టున్నాడు.
ఇందులో తప్పంతా తనదే కనిపిస్తున్నది. ఎందుకంటే ఇంతకుముందు కూడా తను ఆఫీసులో పనిచేసినప్పుడు బాస్ గురించి పట్టించుకునేది కాదు. తనేదో తన పనేంటో, అంతే .ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేది కూడా కాదు.
పెళ్లయిన తర్వాతే ఆనంద్ విషయంలోనున్న అసంతృప్తి తనను ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి బయట పడడం ఎలా? తను ఒక్కతే ఇంటికి వెళ్లిపోగలదా ? చూస్తే అర్ధరాత్రి దాటిపోయినట్టుంది.
ఆలోచనలతో మహతికి పది లంఖణాలు చేసినంత నీరసం వచ్చేసింధి.
ఏమీ చేయలేక మంచం మీద కూర్చునీ , ఏడవడం మొదలెట్టింది.
ఇంతలో హోటల్ బయట అలారమ్స్ మోగుతున్న చప్పుడు వినిపించింది.
అంతలోనే అఖిల రూమ్ ఎవరో దబదబా , బాదుతున్న చప్పుడు వినిపించింది.
అఖిల అదిరిపడింది .తలుపు తీయడమా .? మానడమా..?
అసలు బయట ఏం జరుగుతోంది...?.
ఆలోచనలో ఉన్న అఖిలకు , "అఖిలా! తలుపు తియ్యి" అన్నా ఆడ గొంతుక వినిపించింది.
అఖిల గబగబా వెళ్లి తలుపుతీసింది.
అక్కడ, తమ ఇంటి పక్కన ఉన్న రాధ నిల్చునుంది. ఆమె వెనక ,ఆమె అన్నయ్య పోలీస్ డ్రెస్లో నిల్చుని ఉన్నాడు.
ఇదేంటి రాధ ఇక్కడ ఉంది. అని ఏదో అడిగేంత లోపలే రాధ , అఖిల చేయి పట్టుకొని ,అఖిలా పద, ముందు బయటికి రా, తర్వాత నీకు జరిగిందంతా చెబుతాను
అంటూ కబ-గబా చేయ పట్టుకుని త్వరగా రా అంటూ,
లిఫ్ట్ దగ్గరికి లాక్కు వెళ్ళింది.
అసలే గాభరాగా ఉన్న అఖిలకి, కళ్ళు తిరిగినట్టు అయింది. ఏం జరిగిందో, ఏం చేస్తున్నాదో, ఏమీ తెలియని పరిస్థితిలోనే , రాధ తనను కారులో ఎక్కించడం, ఆ కారు డ్రైవర్ సీట్ లో ,ఆమె అన్న కూర్చుని డ్రైవ్ చేస్తూ నడపడం గమనించింది.
భయం భయంగా చూస్తూ ,మాటరాని స్థితిలో ఉన్న అఖిలను చూసి ,రాధకు చాలా జాలి వేసింది.
వెంటనే తన బ్యాగులో ఉన్న మంచినీళ్ల సీసా తీసి, మంచి నీళ్లు తాగమని అఖిలకు ఇచ్చింది.
గటగటా మంచినీళ్లు తాగిన తర్వాత, అఖిలకు ప్రాణం లేచి వచ్చినట్టు అయింది.
అటుపై రాధ చెప్పిన మాటలు విన్న అఖిల నిశ్చేష్టురాలయింది.
తను ఆఫీసు వాళ్లతో రిసార్ట్ కి వెళ్తాను , అనగానే ఆనంద్ కి అనుమానం వచ్చిందట .ఎందుకంటే అతను అంతకముందే బాస్ మంచివాడు కాదని విన్నాడట .
కానీ అఖిల మీద నమ్మకం ఉన్నందువల్ల అతను ఏనాడూ ఆమెను అనుమానించడం గాని, ప్రశ్నించడం గాని చెయ్యలేదట.
కానీ రిసార్ట్ కి వెళతానన్న దగ్గర నుండీ , ఆనందు ఆరాలు తీస్తూనే ఉన్నాడట ,.ఎక్కడికి వెళుతున్నారు ?, ఎక్కడ ఉంటున్నారు,? ఏమిటి ?,అన్న సంగతులు తెలుసుకున్నాడట .బాస్ కూడా బయలుదేరుతున్నాడని ,తనతో అఖిలను, ఇంకో అమ్మాయినీ కూడా తన కారులో కూర్చోబెట్టుకున్నాడనీ , వేరే చోటికి తీసుకెళ్తున్నాడని కూడా విన్నాడట.
అందుకే పక్కనున్న రాధ తో మాట్లాడి ,వాళ్ళ అన్నయ్య పోలీసైనందున అతని సహాయం కోరాడట.
ఆ హోటల్ కి అంత మంచి పేరు లేనందున, ఆనంద్ వేసిన ప్లాన్ ఫలించిందట.
పోలీసులు హోటల్ మీద రైడ్ చేస్తున్నారని అనిపించేంతగా, "ప్లాన్" రక్తి కట్టించారు.
అఖిల అతడి "కామానికి" బలికాకుండానే రాధ, వాళ్ళ అన్నయ్య ఆమెను రక్షించి , సేఫ్ గా ఇంటికి తీసుకు వెళుతునన్నారట....
.
నిజానికి బాస్, ఆ రాత్రి మరో నలుగురిని పిలిచి ,
వారితో పాటుగా, తనను మానభంగం చేయాలని ప్లాన్ చేశాడట.
తను , పరువుకు భయపడతానని ,అందుకే అరవడం గానీ , పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం గానీ , చేయలేనని , అందువల్ల తమ పని అయిన తర్వాత , తనంతట తానే ఏ నుయ్యో - గొయ్యో చూసుకుంటుందని , దాంతో తమ కోరిక తీరడమేకాక ,ఇకముందు ఆమె వల్ల ప్రమాదముమూ ఉండదన తలచి, ఎప్పటినుంచో ప్లాన్ వేస్తున్నాడట.
అతనికి ఈరోజు అవకాశం దొరకడంతో చాకచక్యంగా తన ప్లాన్ ని, అమలుపరిచేడట.
ఈ సంగతులన్నీ తెలుసుకున్న ఆనంద్, ముందుగానే నీకు చెప్పి, వెళ్ళొద్దంటే , నువ్వు వాళ్ళ అందరితో వెళ్లడం ఇష్టం లేక అలా చెప్తున్నాడని అనుకుంటావేమోనని,
నువ్వు వెళ్ళిన రోజు నుంచే అన్నీ కనిపెడుతూ ,
ఈరోజు ఏ ప్రమాదం జరగకుండా నిన్ను ఇంటికి చేర్చే విధంగా ప్లాన్ చేశాడని చెప్తూ ఉంటే ఆశ్చర్యపోయింది.
ప్లాన్ విజయవంతంగా పూర్తయినందుకు ,తనకు ఎంతో ఆనందంగా ఉందని, రాధ చెప్తుతూ ఉంటే ,వింటున్న అఖిల నిర్గాంత పోయింది.
"నాకు కొన్ని సంవత్సరాల నుంచి ఆనంద్ నాకు తెలుసు అఖిలా. ఇరుగు-పొరుగునే ఉంటున్నాము కదా!
ఒకరి కష్టం తెలుసుకునే మనసుంది .అందర్నీ గౌరవించే సంస్కారం ఉంది.
ఒక చెడు ఆలోచన గాని, చెడ్డ గుణాలు కానీ , చెడు అలవాట్లు కూడా లేని, ఆనంద్ లాంటి భర్త ,అందరికీ దొరకడఖిలా.నువ్వు చాలా అదృష్టవంతురాలివి "..
అని రాధ.
అంటూ ఉంటే , అఖిల కళ్ళలో నీళ్లు తిరిగాయి.
తన సంకుచిత మనస్తత్వానికి ,తనకే సిగ్గు వేస్తోంది ఇప్పుడు.
నిజమే !ఇప్పుడు జరిగిన సంఘటన చూస్తూ ఉంటే, ఆనంద్ లాంటి మంచి వ్యక్తి తనకు భర్తగా దొరకడం, తన అదృష్టమనే అనిపిస్తున్నాది.
లేకపోతే.. ఏంటి ? ఈ విషయాలన్నీ ఆనంద్ కు ముందే తెలుసా?
తెలిసి కూడా ,తన మీద నమ్మకం ఉండడం వల్ల , తనని అనుమానించకుండా ఊరుకున్నాడా..?
ఎప్పుడూ మౌనంగా ఉండే ఆనంద్ , తన మంచి చెడులు కూడా ఎప్పుడూ పట్టించుకోడే అనుకున్న ఆనంద్ ,
ఈరోజు ఒక రాక్షసుడి చేతిలో నుంచి, తనను రక్షించడానికి, ఇంత కష్టపడ్డాడా...?
అఖిల కంటి నుంచి కన్నీరు ధారగా కారుతోంది.
రాధ, అఖిలా! కారు దిగు. ఇల్లు వచ్చేసింది .
అనడంతో ఇంట్లోకి ఎలా వెళ్లాలా అనుకుంటూ, సిగ్గుతో తల దించు కుంది అఖిల.
రాధ, తన చేయి పట్టుకుని గుమ్మం దాకా తీసుకెళ్ళి కాలింగ్ బెల్ నొక్కింది.
ఎప్పటిలాగే ఆనంద్ తలుపు తీసి, అదే చిరునవ్వుతో ఎదురుగా నిలబడి ఉన్నాడు.
అఖిల ,ఆనంద్ ని చూడలేక ,పరుగు -పరుగున , తన రూమ్ లోకి వెళ్ళిపోయింది.
ఆ తరువాత ఏమైందో ,ఆ రాత్రి ఎలా గడిచిందో, తను ఎంత ఏడ్చిందో..,తనకు ఎప్పుడు నిద్ర పట్టిందో ,అఖిలకు ఏమీ తెలియలేదు.
అఖిలా ,అఖిలా, అంటూ, పిలుస్తున్న ఆనంద్ పిలుపుకు, కళ్ళు తెరిచింది అఖిల.
గోడ గడియారం పగలు 10 గంటల సమయం చూపిస్తున్నాది.
ఆనంద్ చేతిలో ఉన్న కాఫీ అఖిల చేతికి అందిస్తూ ముందు కాఫీ తాగు అఖిలా! తర్వాత లేచి ఫ్రెష్ అవుదు గాని అంటున్నాడు.
అఖిల మెల్లగా కాఫీ అందుకుంది.
చిన్నగా తలెత్తి చూసింది. మేరు పర్వతంలా ఎత్తుగా కనిపించాడు ఆనంద్.
ఎంత మామూలుగా మాట్లాడుతున్నాడు. నిన్న రాత్రి అంత జరిగినా ,ఒక ప్రశ్న కూడా తనను వెయ్యలేదు.
ఏమీ జరగనట్టు తనతో మామూలుగా ఉంటున్నాడు.
అదే ఇంకొక మగాడైతే , తన గతేంకాను ..? నిజంగానే హోటల్లో రైడ్ జరిగి ఉంటే ,తను ఈసరికి జైల్లో కదా ఉండేది. ఎంత అప్రతిష్ట. అప్పుడు ఎవరికీ మొహం చూపించలేక నిజంగానే తను, ఏ నుయ్యో- గొయ్యో చూసుకో వలసి వచ్చేది కదా.....
కానీ...ఆనంద్ ... తన మనసు కష్టపడకుండా ఉండేందుకు ,తనకు తెలియకుండా ఎంత ఉన్నతంగా ప్రవర్తించాడు.
పైగా కాఫీ కూడా చేసి పట్టుకొచ్చాడు . ఆనందు ఎంత మంచివాడు.
అఖిలకు మొదటిసారిగా ,ఆనంద్ చేసిన కాఫీ, చాలా రుచిగా అనిపించింది.
ఆనంద్, అక్కడే నిల్చుని, అఖిల పెట్టి లోంచి బట్టలన్నీ తీసి, ఆమె వాడ్రోబులో సద్ధుతున్నాడు.
అఖిలకు ఈరోజు ఆనంద్ చేస్తున్న ఆ పని ,ఆడారి పనిలా అనిపించలేదు.
మొట్టమొదటిసారిగా అఖిల ఆనంద్ వ్యక్తిత్వానికి తలవంచింది.
అందంగా లేకపోతేనేం... ఆనంద్ లో ఉన్నతమైన భావాలు న్నాయి.
పొట్టిగా ఉంటేనే ఆనందులో , సభ్యత ,సంస్కారాలున్నాయి.
ఎక్కువగా మాట్లాడకపోతేనేం... ఆనందులో తనను ప్రేమించే గుణం ఉంది.
పెదాలు మోటుగా ఉంటేనేం.. ఆ నవ్వులో, నిర్మలత్వం ఉంది.
పెళ్లయిన తర్వాత ,కొన్ని రోజుల వరకు ,తను ఆనంద్ ని దగ్గరికి రానివ్వకపోయినా, ఆనంద్ ఏ ఆడదానిని కించపరిచే విధంగా, వెకిలితనంగా, ప్రవర్తించలేదు.
ఎప్పుడూ తన మంచి చెడులు చూసుకుంటూ, తను పడబోయే కష్టాన్ని, ఇష్టంగా పాలు పంచుకుంటూనే ఉన్నాడు,
"పాపిష్టిది .తనే అతన్ని ఎప్పుడూ సహృదయంతో చూడలేదు. నాణేనికి ఒకవైపే చూసింది, కానీ రెండవ వైపు కూడా ఓసారి చూద్దామని అనుకోలేకపోయింది .
అతని రూపాన్నే చూసింది గాని ,అతని గుణాన్ని గమనించలేకపోయింది.
తన అదృష్టం బాగుండి ఆనంద్ లాంటి భర్త లభించాడు .
తను అతని బాహ్య సౌందర్యానికే విలువచ్చింది, గాని అంతః సౌందర్యాన్ని గమనించలేకపోయింది.
తనే పాపిష్టిది .తన ఆలోచనలే బాగోలేవు. అనుకుంటూ, నెమ్మదిగా తలెత్తి ,కన్నీళ్ళతో ఆనంద్ వైపు చూసింది.
చిన్న బర్ముడాలో, చేతులు లేని బనీన్ లో ,ఆనంద్ ఆరోజు ఎంత అందంగా కనిపిస్తున్నాడో.... అఖిల మెల్లగా లేచి, ఆనంద్ కు దగ్గరగా వెళ్లి నిలబడింది.
"ఏం కావాలి అఖిలా "అన్న ఆనంద్ మాటలకు జవాబుగా,
అఖిల ఒక్కసారిగా ఆనంద్ పాదాలపై వాలిపోయింది.
ఆనంద్ అఖిలను మెల్లగా లేపి హృదయానికి హత్తుకున్నాడు. మొదటిసారిగా, రెండు హృదయాలు ఒకటై మాట్లాడుకుంటున్నాయి. మౌనరాగాలతో మధుర గీతాలు పాడుకుంటున్నాయి.
సుఖాంతం.
********************""********""""""""""
ఈ కథ ఏ మాధ్యమునందును ప్రచురితము కాని,
నా స్వీయ రచన.
[13/07, 9:45 am] JAGADISWARI SREERAMAMURTH: 13/07/2023.
తపస్వి మనోహరం E-book కొరకు కథ.
అంశం:* రైలు " కథలు...
శీర్షిక : అందమైన అనుభవం.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి.
కళ్యాణ్ : మహారాష్ట్ర.
కధా ప్రారంభం.
-------------
బట్టలు సర్దుతూనే మా వారి మీద నేను విసుక్కుంటున్నాను
"ఆయనేప్పుడూ ఇంతే .ఏ రోజు ఏ పని వద్దంటామో, ఆ రోజే ఆ పని చేస్తారు. తిథి ,వార, నక్షత్రాల మీద నమ్మకమే లేదు. జాతకాల మీద నమ్మకం లేదు, శకునాల మీద నమ్మకం లేదు, వాస్తు మీద నమ్మకం లేదు.
పూర్తిగా నమ్మక్కర్లేదు గాని, కనీసం కొంతవరకైనా నమ్మాలి కదా,. పూర్వం పెద్దలు ఎందుకు చెప్పారో..?.. ఏమో.?
నాకైతే అన్నిటి మీద నమ్మకమే...
కానీ , ఆడదాని మాట ఎప్పుడు నెగ్గిందని ,ఎప్పుడూ మగాడిదే కదా పై చేయి." అంటూ....
ఇంతకీ జరిగిందేంటంటే..,
బొంబాయి లో మా అత్తగారు, ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళని చూడడానికి వెళ్దాం అంటూ , ఆయన "ట్రైన్ కి టికెట్ బుక్ చేస్తాను" అన్నారు .
చాలా రోజులలై హైదరాబాదులోనే ఉన్నాం కదా. ఇలా .నలుగురినీ కలిసి వస్తే మనసుకు కాస్తా ఆనందంగా ఉంటుంది కదా, అని నేను కూడా" సరే " అన్నాను .
దాంతో మా వారు సంబరపడిపోయారు
" సరే మంచి రోజు చూడు, టికెట్లు బుక్ చేస్తాను" అని నాతో చెప్పనే చెప్పారు.
అయితే మంచి రోజు చూసి నేను చెప్పాను కూడా .కానీ ఈయనేమో "అసలు ఎక్కడా రిజర్వేషన్ లేవు" అంటూ కరెక్ట్ గా "పౌర్ణమి" రోజున టికెట్లు బుక్ చేసేసారు .
దాంతో, నాకేం చేయాలో తోచలేదు లేదు. ఎందుకంటే , పున్నమి రోజు పులి కూడా బయలుదేరదంటారు కదా, మన పెద్దలు.
ఆరోజు బయలుదేరితే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఏమో ? అన్న భయంతో, మరో రోజు టికెట్లు దొరుకుతాయేమో చూడండి." అన్నాను .
దాంతో మావారికి చిర్రెత్తుకొచ్చింది.
" నీకు కావలసినప్పుడల్లా రిజర్వేషన్లుదొరుకుతాయా? ఎప్పుడు రిజర్వేషన్లు దొరికితే అప్పుడు బయలుదేరాలి గానీ" ,అంటూ రుస రుసలాడారు మావారు .
నేనైతే ప్రతి పౌర్ణమికి ఉపవాసం ఉండి, "సత్యనారాయణ స్వామి వ్రతకల్ప" పుస్తకం , చదువుకుని, స్వామివారికి ప్రసాదం నివేదన చేసి, ఒక ముత్తైదువకి భోజనం పెట్టి , పసుపు, కుంకం, పండు-తాంబూలాలతో పాటు, చీర పెట్టడం నాకు అలవాటు. అది గాక ,
ఆరోజు ప్రయాణం పడితే, నేను ఉపవాసంతో ప్రయాణం చేయాలి . నాకు పూజ కూడా చేయడం అవదు .పౌర్ణమి నాటి పూజ, రాత్రి పూటే , చంద్రోదయం తర్వాత చేస్తారు. ప్రయాణం రోజు పూజ చేయడం కుదరదు .దాంతో వ్రత భంగం అవుతుందనే బాధ మరొకవైపు, కలుగుతున్నాది.
దాంతో ప్రయాణం రోజు వరకు, ఇద్దరి మధ్యన వాదనలే..," "ఏం పర్వాలేదు వెళదాం " అంటూ అతను,
"వద్దంటూ" నేను వాదించుకున్నా , మొత్తానికి అతనే నెగ్గారు.
దాంతో " ఏమవుతుందో, ఏమో " అని ఒక ఒక పక్కన భయం వేస్తున్నా , ప్రయాణానికి కావాల్సిన సామాన్లు, బట్టలు, సర్దడం మొదలెట్టేను.
"ఇంకా వంటవండాలి.. భోజనాలు చేయాలి. రాత్రికి ఏదో చేసి పట్టుకోవాలి . అంట్లగిన్నెలు తోముకొని ఇల్లంతా సర్దుకోవాలి."
"ఈ పనులన్నీ ఒక్కత్తినే ఎలా చేస్తానో ఏమో.."
"ఎక్కడికైనా వెళ్లాలంటే చాలా సరదాగా ఉంటుంది. కానీ ఇంట్లో , టైము లోపల అన్ని పనులు చేసుకుని తెమిలే సరికి తల ప్రాణం తోకకి వస్తుంది.
"ఈయనకి ఒక్క పని కూడా చేతకాదాయే.
ఏ పని చెప్పినా, తిరిగి ఆ పని, నేను చేసుకోవలసి వస్తుంది".
అనుకుంటూ, విసుక్కుంటూ, ఎలాగో ఒకలాగా , సామానంత సర్ది , ప్రయాణానికి రెడీ అయ్యాను. .
కరెక్ట్ సమయానికి , ఈయన బుక్ చేసిన "క్యాబ్ " కుాడా వచ్చేసింది.
దాంతో ఈయన" తొందరగా, పద " అంటూ హడావుడి చేసేరు.
" హైదరాబాద్ టు ముంబై వెళ్ళే హుస్సేన్ సాగర్ ఎక్స్‌ప్రెస్ " మధ్యాహ్నం 2:30 కి హైదరాబాదు లో బయలుదేరుతుంది.
మేము "బొల్లారం" ష్టేషన్ వైపు ఉన్నాము
" బేగం పేట్" కు వెళ్తే గాని, మాకు బండి ఎక్కడానికి అవ్వదు.
అందుకనే ,ఎప్పుడు ప్రయాణం చేసినా ఒక గంటన్నర ముందు గానే బయలుదేరవలసి వస్తుంది.
మొత్తానికి ఇల్లు తాళం పెట్టి, బేగంపేట్ చేరేసరికి రైలు వచ్చి రెడీగా ఉంది.
ఇద్దరం ఆడుతూ, పడుతూ, కోచ్ వెతుక్కోనేసరికి మరో 10 నిమిషాలు పట్టింది.
గబగబా సామాన్లన్నీ మోసుకుంటూ, ఈడ్చుకుంటూ, ఎలాగో పెట్టలో పడ్డాం.
టికెట్లో సీటు నెంబర్లు చూసుకుని వెళ్లేసరికి ,అవన్నీ నిండుగా ఉన్నాయి .మా సీట్లో ఎవరో దంపతులు కూర్చుని ఉన్నారు.
మా వారు మర్యాదగా" ఏమండీ ,ఈ సీట్లు మావి. కాస్త లేస్తారా.? సీటు కింద సామాన్లు సర్దుకోవాలి" అని చెప్పారు.
ఆయన ఒకసారి మా వారి వైపు చూసి ,"ఇవి మీ సీట్లు కావండి . ఇవి. మాసిట్లే. మేము 15 రోజులు ముందు నుండే బుక్ చేసుకున్నాం. " అని అన్నారు.
దాంతో మా వారు జేబులో ఉన్న టికెట్లు తీసి ,ఆయనకి చూపిస్తూ , "కాదండి ఇవి మా సిట్లే . కావాలంటే చూడండి " అంటూ టిక్కెట్లు చూపించారు .
కానీ ఆయన "ససేమిరా" అంటూ అక్కడే కూర్చున్నాడు ఎంతకీ లేవరు." టికెట్లు చూపించాం కదా"
అని మా ఆయన
" మా దగ్గర కూడా టికెట్లు ఉన్నాయి కదా "అంటూ అతను వాదించుకున్నా రు..
ఈ గొడవ మధ్య నిలబడి, నిలబడి , నా కాళ్లు పీకుతున్నాయి.
"అప్పుడప్పుడు ఇలాంటి పొరపాట్లు కూడా జరుగుతూ ఉంటాయి. .టి.సి .రానివ్వండి అతను ఈ టికెట్ల గొడవ చూసుకుంటాడు " అంటూ కొందరు సలహా ఇచ్చారు.
దాంతో అతను కాస్త జరిగి మా ఇద్దరం కూర్చునేందుకునందుకు కాసింత చోటు ఇచ్చాడు.
" బతికేం రా భగవంతుడా " అనుకుంటూ అక్కడ కూర్చున్నాం.
మా వారు అతనితో "ఏవీ, మీ టికెట్లు చూపించండి" అని అడిగారు . అతను ససేమిరా అన్నాడు.
దాంతో వాళ్లు ,మేము, ఎడముఖం, పెడముఖంగా కూర్చున్నాము.
టి సి రావడానికి చాలా సమయం పట్టింది.
అతను రాగానే మా వారు ముందు అతనిని పట్టుకుని మా దగ్గరికి తీసుకువచ్చారు .
మా ప్రాబ్లం విన్న టి .సి. చాట్ ని చూశారు .అందులో మా ఇద్దరి పేర్లు నమోదై ఉన్నాయి.
మా సీట్లలో కూర్చున్న వారి టికెట్లను అడిగారతను.
అతను సణుకుతూ విసురుగా టిక్కెట్లు చూపించాడు.
టి.సి , "ఇవి మీ సీట్లు కావండి . రెండు డబ్బాల అవతల మీ కోచ్ ఉంది చూడండి. అక్కడ ఉన్నాయి మీ సీట్లు అంటూ కోచ్ నంబరు చూపించాడు.
దాంతో అతని మొహం ముడుచుకుని, కోపంగా లేచి, కనీసం "సారీ " అయినా చెప్పకుండా, సామాన్లు, బరబర మని లాక్కుంటూ వెళ్ళిపోయాడు.
దాంతో" హమ్మయ్య "అనుకుంటూ ,మేము మా సీట్లలో రిలాక్స్ గా కూర్చున్నాం.
అప్పటిదాకా ముందున్నతనికి వంతపాడినందరుా ,
ఒక్కసారిగా మా పక్షాన మాట్లాడడం మొదలెట్టేరు.
"అబ్బో ..అతను టిక్కెట్టు చుాసుకోకుండా , దాబాయింపుతో, ఎంత చక్కగా వీళ్ల సీట్లను ఆక్రమించాడో..." అని ఒకరంటే..
"ఈ కాలంలో అన్యాయం ఎక్కువైపోయిందండీ...
మాట్లాడే వాడు లేకపోతే పుార్తిగా దోచేస్తారు మనల్ని"
అని మరొకరుా... అంటూ ఒకరొకరిగా మాపై ,సానుభుాతి కురిపించేసారు.
మేము మా సామాన్లను సమంగా సీట్లకింద సర్దుబాటు
చేసుకుని నిశ్ఛింతగా కుార్చున్నాము.
ట్రైన్ లో అందరుా ఆసరికే ఆప్తులైపోయినట్లు .
ఒకరితోనొకరు మాట్లాడీసుకుంటున్నారు.
ఇద్దరిద్దరుగా మాట్లాడుకుంటున్న వాళ్ళు ,
ఒకొక్కరుా వేరు వేరు విషయాలను చర్చిఁచుకుంటుా
ఉండడం వల్ల , ట్రైన్ అంతా గొడవ గొడవగా ఉండీ..
ఎవరేం మాట్లాడుతున్నారో మరొకరికి అర్ధం కాని రీతిలో , మాకు సమయం బాగానే గడిచుపోతోంది
అందులో కొందరు మాతో కుాడా మాటలు కలుపుతుా
రాజకీయాల దగ్గరినుండి , రైతుల ఇక్కట్ల దాకా , పెరిగిపోతున్న ధరలదగ్గరినుండీ నలిగిపోతున్న మధ్యవర్తుల దాకా, గల అన్ని రకాల బాధలనుా చర్చించుకుంటుా, టైం పాస్ చేస్తున్నారు.
ఈ మధ్యలో అలసట తెలీకుండానే రాత్రి ఏడు గంటలు దాటిపోయింది.
చాలా మంది ఇంటినుండి తెచ్చుకున్న ఆహార పదార్ధాలను విప్పి ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటుా
రుచులు ఆస్వాదిస్తున్నారు.
వారితో పాటు మేము కుాడా తెచ్చుకున్న
దిబ్బరొట్టెను కొబ్బరి చట్నీతో లాగించేసాము.
రాత్రి ఎనిమిదిన్నర గంటలయ్యేసరికి , చాలామంది తమతమ సీట్ల లో నిద్రకుపక్రమించేదుకు సిద్ధమవుతుా
తమ తమ సీట్ల లో దుప్పట్లు పరుస్తున్నారు.
కొందరు పై బర్త్ లకు ఎక్కి అసక్కడినుంచీ , కింది బర్త్ వాళ్లతో బాతాకానీలు కొడుతున్నారు.
ఇంతలో ట్రైన్ షోలాపూర్ ష్టేషన్ లో ఆగింది.
కొందరు ఏదో పేద్ద పనిన్నట్లు , ట్రైన్ దిగి
ఆచివరి నుండి , ఈ చివరి వరకు గల అన్ని ష్టాల్స్ నుా
చుట్టబెడుతుా అక్కరలేకపోయినా ఏవేవో కొనేస్తున్నారు.
షోలాపూర్ లో ట్రైన్ ఎక్కిన వాళ్ళు, ,
, గాభరాగా , తమ తమ సీట్లను వెతుక్కుంటూ ,
అందరినీ తోసుకుంటుా, గుద్దుకుంటుా వెళిపోతున్నారు.
ట్రైన్ అంతా గొడవ గొడవగా తయారయింది.
ఈ గొడవలో , ఒక పాతికేళ్ల అబ్బాయి ,అటూ ఇటూ ఈ కోచ్ నుండి ఆ కోచ్ కి, ఆ కోచ్ నుండి ఈ కోచ్ కి, తన సీట్ కోసం వెతుక్కుంటూ తిరగడం నేను గమనించాను.
అతని చేతిలో బరువైన పెట్టె ఉంది .
దానిని ఈ చేతి నుండి ఆ చేతికి , ఆ చేతి నుండి ఈ చేతికి, మార్చుకుంటూ , పాపం ఆకొస నుండి ఈ కొసకి.. ఈ కొసనుండి ఆ కొసకి , తిరుగుతూన్నాడు.
అక్కడ ఎక్కిన వారంతా సద్దుకుని , నిద్రకుపక్రమించేరు. కానీ ఈ అబ్బాయికి మాత్రం
తన సీటు ఎక్కడో తెలియనట్టుంది .చేతిలో బరువుతో ఎప్పటినుంచో అలా తిరుగుతుానే ఉన్నాడు.
నాకు అతని మీద చాలా జాలేసింది.
నేను మా వారితో
" ఏవండీ , ఆ అబ్బాయి చాలాసేపటినుండి అలా తిరుగుతూనే ఉన్నాడు . పాపం .అతనిది ఈ కోచ్ కాదేమొా । అతను ఎక్కడికెళ్తున్నాడో కనుక్కొని
ఆతని సీట్ నంబరేదొ మీరే చుాసి చెప్పండి. అతను కుాడా ముందు , మనసీట్లో కుార్చున్నవారిలా, కన్ఫ్యుాజ్ అవుతున్నట్టున్నాడులా ఉంది. మన అబ్బాయి వయసే ఉంటుంది .
ముందు కాస్తా , ఆ అబ్బాయిని కాసేపు ఇక్కడ కూర్చోనిచ్ఛి, "ఆ తర్వాత వివరాలు అడుగుదాం * అన్నాను.
మా వారు ఏదో అనే లోపునే , ఆ పక్కన కూర్చున్న వాళ్ళు , *అతి కష్టం మీద మీ సీట్లు మీకు దొరికాయి.
" మళ్లీ ఇంకొకరితో. ఎందుకు చెప్పండి , ఇతనెలాంటివాడో..
ఏంటో...
ఈ కాలంలో ఎవరినీ నమ్మకుాడదండీ...జాలి అస్సలు పనికి రాదు. టి సి రానివ్వండి అప్పుడు ఇతని సంగతి, అతనే చూసుకుంటాడు." అన్నాడు .
ఇంతలో మరొకతను.
"వద్దండీ .ఇలాంటి వాళ్ళలో, దొంగలు కూడా ఉంటారు. ఇలా తిరుగుతూనే , మనల్ని ఏమార్చి , మన సామాన్లు పట్టుకెళ్ళిపోతారు . ముందుగా అతనిది, ఏ కోచో ,ఏ సీట్ నెంబరో, అడిగి తెలుసుకోండి . అంతేగాని కొత్త వారెవరికి చోటు ఇవ్వకండి." అంటూ ఒక ఉచిత సలహా పారేశాడు.
అక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్లు అతనికి వంతు పాడారు.
ఈలోగా ఆ అబ్బాయి కరెక్ట్ గా, మా సీట్ల దగ్గరికే వచ్చి
ఆ పెట్టెను చేతితో పట్టుకొనే ,ఒక పక్కకు ఒదిగి అలసటగా నిలుచున్నాడు.
అంతలో మరొక అతను" చూశారా ! అతను, ఆ పెట్టెను ఎంత జాగ్రత్తగా పట్టుకున్నాడో ! అందులో ఏముందో ఏమో ? ఆ పెట్టను కనీసం, కిందకు కూడా దించడం లేదు '" అన్నాడు గుసగుసగా.
వెంటనే ఆ పక్కనున్నతను, " అవునవును. ఇలాంటి వాళ్లే రైళ్లలో అందరూ పడుకునేటప్పుడు , మత్తుమందు జల్లి, సామాన్లన్నీ పట్టుకొని పోతారు. ఇలాగే నటించి ముందు కొంచెం జాగా అడుగుతారు. ఆ తర్వాత మనకు నమ్మకం కలిగించేట్టు మాట్లాడతారు . మనం వాళ్ళని, నమ్మేమని తెలిసిన తర్వాత ,మనల్ని పూర్తిగా దోచేస్తారు. ఈ మధ్య ఇది ఒక బిజినెస్ అయిపోయింది.
వీళ్ళ గ్యాంగ్ అంతా చుట్టుపక్కల ఎక్కడో , ఉండే ఉంటుంది.
మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.". అంటూ చెప్పుకుపోతున్నాడు
అయితే, మాకు మాత్రం అతను చాలా మంచివాడు లాగా కనిపిస్తున్నాడు అతని ముఖంలో అలసట కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాది.
నేను మా వారు వైపు చూశాను . ఆయన వెంటనే ఆ అబ్బాయిని పిలిచి , "ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఆ పెట్టె పట్టుకుని అలా తిరుగుతుతూనే ఉన్నావు .మీకు టిక్కెట్ లేదా.బాబుా.? "అని అడిగారు.
అతను మరాఠీలో "లేదండి! నా టిక్కెట్టు ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు . ఏ కోచో తెలియదు .ఏ సీటో తెలీదు.
మా గురువుగారు నన్ను పూనా వెళ్ళమని ,అక్జడ గురువులకు ఈ పెట్టెను అందించమవి , అన్నారు. ఈ కోచ్ లో ఎక్కి , టికెట్ కలక్టరు వచ్చనపుడు ,నన్ను అతనికి ఫోన్ చేయమన్నారు. నేను టికెట్ కలక్టరుగారి కొిసం వెతుక్కుంటుా ఆటెళ్ళగానే , ఒకతను అతను ఇటువైపు ఉన్నట్లు చెప్పారు. దాంతో నేను మళ్ళీ ఇటు వచ్చాను . అలా తిరుగుతుానే ఉన్నాను గానీ టికెట్ కలక్టరు గారిని కలవలేకపోయాను . అతను ఎక్కడున్నారో ?..ఏమొా...?
చేతిలో పెట్టె , చాలా బరువుగా ఉండడం వల్ల
నాకు, చాలా అలసట ఆనిపించి ఇక్కడ ఆగాను .
అంటుా చెప్పుకొచ్చాడు.
మావారు కుాడా ఆతని వాళకం చుాసి ,
"సరే బాబు. ఇలా రా , టి సి వచ్చేదాకా ఇక్కడ కూర్చో "అని అన్నారు.
అతను వెంటనే మరాఠీలో
" ధన్యవాదాలు దాదా" అంటూ, సీట్లో ఒక పక్కన ఒదిగి కూర్చున్నాడు .
కానీ అతను, ఆ పెట్టెను మాత్రం, కింద పెట్టలేదు.
అది చిన్న బ్రీఫ్ కేస్ సైజ్ లో ఉంది. అతను ఆ పెట్టెను తన ఒడిలో పెట్టుకునే కూర్చున్నాడు.
అక్కడ ఉన్న అందరూ మా వారి వైపు కోపంగానే గాక , , అనుమానం గా కూడా చూశారు.
"ఆపెట్టెలో ఏముందో..?.అది మొాయలేనంత బరువు ఎందుకుందో...? అన్న అనుమానం మాకుా వచ్చింది.
కానీ మా వారు అందరితో టి.సి వచ్చాక ఇతని సంగతి చూద్దాం. అంతదాకా ఓపిక పడదాం " అని నచ్చచెప్పారు.
కొంతసేపట్లో అంతా సర్దుకుని ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు ఈ లోపల మావారు, ఆ మారాఠీ అబ్బాయితో "ఎక్కడికి వెళ్తున్నావు బాబూ, టికెట్ లేకుండా ఎందుకు ట్రైన్ ఎక్కావు ' అని అడిగారు.
వెంటనే ఆ అబ్బాయి "పూనాలో నేను, ఈ దత్త గురు పాదుకలని అందించాలండీ .అక్కడ గురు పౌర్ణమి
సందర్భంగా ,తెల్లారి నాలుగు గంటల సమయంలో నగర సంకీర్తనోత్సవం జరుగుతుంది . ఆ సమయానికి నేను ఈ దత్తగురు పాదుకలని ,అక్కడి గురువు గారికి అందించాలి . . ప్రతీ ఏడాదీ, మా గురువుగారు ,
ఈ శ్రీపాదవల్లభుని పాద పద్మాలను , ఈ ఉత్సవాలకు
పంపిస్తుా ఉంటారు. ఈ వత్సరమే నాకు ఈ సదవకాసం వచ్చింది . నేను వారివద్ద వేదం నేర్చుకుంటున్నాను. వారి ఆజ్ఞ తోనే నేను షోలాపూర్
లో ఈ ట్రైన్ ఎక్కేను. సడన్గా , ప్రోగ్రాం ఫిక్స్ అవడంతో నాకు టికెట్ సమస్య వచ్చింది .
మా గురువుగారు చాలా మంచివారు. టీ.సీ రాగానే, తప్పకుండా నాకు టికెట్ అరేంజ్ చేస్తారు.,"
అని, అతడు చెబుతుండగానే , టి.సి., కొత్తగా సోలాపూర్ లో ఎక్కిన వాళ్ళ టికెట్లు, చెక్ చేసుకుంటూ , అటువైపుగా వచ్చారు.
మరాఠీ అబ్బాయి ఆనందంగా లేచి నిలబడ్డాడు.
********
అతను లేచి టికెట్ కలెక్టర్ తో తన గోడు వెళ్ళబోసుకొని ,
తనకు" పుానా " దాకా సీటు కావాలని అడిగాడు.
టి సి..ఈ ట్రైన్ లో, మరెక్కడా వెయిటింగ్ లిష్ట్ లో
ఖాళీలు లేవనీ , కావాలంటే టిక్కెట్టు తీసుకోమని
చెప్పాడు.
ఆ అబ్బాయి వాళ్ళ గురువుగారికి పదే పదే ఫోన్ చేస్తున్నాడు. కానీ ఫోన్ కనెక్ట్ అవడం లేదు.
డబ్బిస్తే గానీ టికెట్టు ఇవ్వనని టి.సి.అరుస్తున్నాడు .
ఆ అబ్బాయి తన దగ్గర అసలు డబ్బులు లేవని ,
తనకు రాత్రి భోజనానికి కుాడా డబ్బు లేదని ,
ఒక్కసారి గురువుగారికి ఫోన్ కనెక్ట్ అవుతే , ఆయన తప్పకుండా తనకోసం టిక్కెట్ తీసుకుంటారని," పదేపదే టి.సి.ని బతిమాలుతున్నాడు.
అతని పరిస్థితి చూస్తూ ఉంటే మాకు చాలా బాధ వేసింది.
వెంటనే నేను మా వారితో, ఈరోజు గురుపౌర్ణమి కదండీ. ఆ అబ్బాయి నిజమే చెప్తున్నాడేమొ . నిజంగానే ఆ పెట్టిలో " దత్త గురు పాదుకలు " ఉన్నాయేమో....
మీరు అప్పుడప్పుడు చాలా మందికి ధన దానం చేసిన రోజులున్నాయి కదా...
అలాగే అనుకుని మీరు ఈ అబ్బాయికి టికెట్ తీసి ఇవ్వండి, పాపం , ఇప్పటికే చాలాసేపటి నుంచి అవస్థలు పడుతున్నాడు" అన్నాను.
ఆయన కాసేపు ఆలోచించి , టి.సిని పిలిచి ఆ అబ్బాయి కోసం 2000. పే చేసి ,టికెట్ తీసుకున్నారు.
ఆ అబ్బాయి కృతజ్ఞతతో మా వైపు చూస్తూ . మా గురువుగారికి ఫోన్ కనెక్ట్ అవ్వగానే ,నేను తప్పకుండా మీరు చేసిన సహాయం గురించి చెబుతాను . ఆయన వెంటనే మీకు టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తారు " అంటూ ఆనందంగా టికెట్ తీసుకున్నాడు.
నేను అతను "భోజనం చేయలేదు " అన్నమాట జ్ఞప్తికి వచ్చి, మాతో తెచ్చుకున్న ఫ్రూట్స్ కొన్ని తీసి ఆయన చేతిలో పెట్టాను. ఆయన నా వైపు కృతజ్ఞతగా చూసాడు .
అక్కడున్నవారంతా మమ్మల్ని వెర్రి వాళ్ళమన్నట్టు
చుాస్తుా..మేం చేసిన పనిని విమర్శిస్తుా..
ముసి ముసిగా నవ్వుకుంటున్నారు. కొందరు , ఈ అబ్బాయి వల్ల తమకు ఏమైనా నష్టం జరిగితే ,
దానికి మేమే బాధ్యులమని, తెగేసి చెపుతున్నారు.
మావారు మాత్రం ఎవరికీ సమాధానమీయకుండా ,
సైలెంట్ గా కుార్చున్నారు.
ఇంతలో ఆ అబ్బాయి మాతో , " ఏమండీ . నేను కాసేపు
ఈ పెట్టెను మీ సీటుమీద పెట్టవచ్చా"... అని అడిగాడు.
మేము" సరే" అన్నాము.
ఆ అబ్బాయి ముందుగా ఆ సీటును , ఒకచేత్తోనే నీళ్ళతో శుభ్రంగా తుడిచి ,
జాగర్తగా ఆ పెట్టెను సీటు మీద పెట్టేడు
తర్వాత అందరివైపుా చుాస్తుా...
" ఈ రోజు అతి పవిత్రమైన రోజైన గురు పౌర్ణమి .
నేను , శ్రీపాదవల్లభుని పాద ప్రతిమలను, మాగురువుగారి ఆజ్ఞ మేరకు, పుానాలో గల గురువులకు, అందించబోతున్నాను .
సమయానికి టికెట్ దొరకని కారణంగా , నాకు సహాయం చేసిన అన్నగారితో పాటు , మీ అందరికీ కుాడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
మీరంతా నాకు చేసిన ఈ సహాయానికి నేను సదా కృతజ్ఞుణ్ణి. మీరు చేసిన సహాయానికి ప్రతి ఫలంగా ,
మీరంతా "శ్రీపాద వల్లభుని" కృపకు పాత్రులు కావాలని మనసారా కోరుకుంటుా , నేను మీకు "గురుపాదుకా దర్శనం" ఈయబోతున్నాను.
అని అందరికీ నమస్కరించి , ఆ పెట్టె ముాతను
తీయడానికి సిద్ధమయ్యాడు.
అక్కడున్నవారిలో కొంతమంది భక్తిగా చుాస్తుా ఉంటే , మరి కొంత మంది , భయంగా చుాస్తున్నారు. మరి కొంతమంది తాము ఆ అబ్బాయిని అవమానించి , అవహేళన చేసామని తెలిసికూడా, అతను, తమకు ఇంత గౌరవం ఇస్తున్నందుకు సిగ్గుతో తలవంచుకున్నారు.
మేము కుాడా, అతను ఆ పెట్టి తెరుస్తున్నందుకు ఆత్రంగా చుాస్తున్నాము .
అతను ఆ పెట్టెకు వేసి ఉన్న చిన్న తాళం కప్పను తొలగించి , ఆ పెట్టె ముాతను తెరచాడు.
అంతే ! అందరి కళ్ళుా ఒక్కసారిగా జిగేల్ మన్నాయి. అందరి నోర్లుా , ఆసాంతంగా తెరచుకున్నాయి.
మా కుాపే అంతా మంచి గంధపు సువాసనతో నిండిపోయింది.
ఆ పెట్టెలోపల వెలుగుతున్న చిన్న చిన్న లైట్ల వెలుగులో, చిరునవ్వులు చిందిస్తున్న
శ్రీపాద వల్లభుని చిత్రపటం , పెట్టె మూతగా గల పైభాగంలో ప్రసన్నంగా కనిపిస్తోంది .
పెట్టె క్రింది భాగంలో , బంగారం తొడుగుతో మహిమాన్వితమైన " గురు పాదుకలు " వింత వెలుగులతో ప్రకాశిస్తుా కనిపించాయి.
ఒక్కసారిగా మా ఒళ్ళు ఒక్కసారిగా జలదరించి , భక్తితో .
పులకరించింది.
కళ్ళ నుండీ , ఆనందభాష్పాలు కురియసాగాయి.
ఆవల కిటికీ లోంచీ పుార్ణ చంద్రుని దర్శనం , లోపల గరు పాదుకా దర్శనం తో, మా జన్మ ధన్యమైపోయింది.
అంతదాకా, ఆ అబ్బాయిమీద అనుమానపడిన వారంతా ఒక్క సారిగా లేచి , పాదుకలకు భక్తితో నమస్కరించి , ఆ అబ్బాయిని ఆప్యాయంగా
దగ్గరకు తీసుకుంటున్నారు.
అంతేకాదు , మా వల్లే తమకీ భాగ్యం కలిగిందని
మమ్మల్ని వేనోళ్ళ కొనియాడడం మొదలెట్టేరు.
ఈ అనందకర సమయంలో మేమంతా మునిగి ఉండగానే , ఆ అబ్బాయి ఫోను మొాగింది.
ఆ అబ్బాయి ఫోను చుాసుకొని , "మా గురువుగారు" చేసారంటుా.. ఆనందంగా చెప్తూ,.మాట్లాడడం మొదలెట్టాడు.
తను ట్రైన్ ఎక్కిన దగ్గర్నుంచి పడిన కష్టం అంతా చెప్పాడు టికెట్ కలెక్టర్ వచ్చిన సమయంలో తను గురువుగారికి
ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఫోను తగలక తను ఎంత ఇబ్బంది పడ్డాడో చెప్పాడు.
చివరకు తన మీద నమ్మకంతో ,తనకు టిక్జెట్టు తీసి,. సీటు ఇప్పించినన మా గురించి గొప్పగా చెప్పేడు.
కొంత సేపు మాట్లాడాకా అతను ఫోను మా వారి చేతికిచ్చాడు
"గురువుగారు మీతో మాట్లాడతారట " అంటుా..
మా వారు మొగమాటపడుతుా , ఫోన్ తీసుకున్నారు.
మా వారు ,అవతలి వైపు గురువు గారికి నమస్కారం చెప్పారు. అటు నుండి గురువుగారు కూడా, మా వారికి ప్రతి నమస్కారం చేసి,
అత్యవసర సమయంలో తమ శిష్యునికి సహాయం చేసి నందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మేము టిక్కెట్ కొరకు పే చేసిన సొమ్మును , గూగుల్ పే చేస్తానని చెప్పి. ,మా వారి ఫోన్ నెంబరు అడిగి తీసుకుని , మాకు మరొకసారి ధన్యవాదాలు చెప్పి, ఫోన్ కట్ చేశారు
మరుక్షణమే మా రెండు వేల రూపాయలు, ఫోన్ ద్వారా అకౌంట్ లోకి చేరిపోయాయి.
గురు శిష్యుల నిబద్ధత, చిత్తశుద్ధి, చూసిన మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ రోజుల్లో కూడా ఇటువంటి మనుషులు ఉన్నందుకు ఆనందం కలిగింది..
ఆ తర్వాత ఆఅబ్బాయి ,తాను ఉంటున్న ప్రదేశం గురించి చెప్పి ,శ్రీపాద వల్లభుల నిజపాదుకలు గల ,ఆ మందిరానికి తమను తప్పకుండా రమ్మని ఆహ్వానించి, తాము వచ్చినప్పుడు అతనికి తెలియజేస్తే , తమకు రూమ్ సదుపాయం, భోజన సదుపాయం ,తప్పకుండా చేస్తానని చెప్పి , తన ఫోన్ నెంబర్ ఇచ్చి, అందరికీ నమస్కరించీ , "గురుపాదుక" లను తీసుకొని , అందరికీ శుభ రాత్రి చెప్పి, ఆ అబ్బాయి ,తనకు నియమించిన సీట్ లోకి వెళ్ళిపోయాడు.
ఆ రాత్రి అందరూ అదే విషయం గురించి ఆనందంగా చర్చించుకుంటూ, మాకు ధన్యవాదాలు తెలుపుతూ , మాట్లాడుకోవడం లో సమయం, అర్థ రాత్రి దాటింది.
ఆ రాత్రి అందరూ, అలా మాట్లాడుకుంటూనే , హాయిగా నిద్రలోకి జారుకున్నారు.
మాకు కూడా, పడుకున్న కాసేపటికి , బాగా నిద్ర పట్టేసింది.
తర్వాత, ,పూనా ఎప్పుడు వచ్చిందో , ఆ అబ్బాయి ఎప్పుడు దిగిపోయాడో కూడా, మాకు తెలియలేదు.
కానీ ఆనాటి అనుభవం , మేము ఎప్పటికీ మర్చిపోలేము.
ఆనాడే కాదు , ఎప్పటికీ కూడా, పౌర్ణమి వచ్చిందంటే ఈ సంఘటన , మాకు బాగా జ్ఞాపకం వస్తుంది.
ఆ అబ్బాయి జ్ఞాపకం వస్తాడు. అతని గురువుగారు జ్ఞాపకం వస్తారు. జరిగిన ఆ సంఘటన తర్వాత మేము శ్రీపాద వల్లభునకు నిజ భక్తులమయ్యాము. అంతే కాదు .మా పూజ మందిరంలో , సద్గురు ,శ్రీపాద వల్లభుల , దివ్య పాదుకులను మేము కూడా ప్రతిష్ట చేసుకున్నాము.
మీరంతా ఎప్పుడైనా మా ఇంటికి తప్పకుండా రండి.
మా ఇంటి పూజా మందిరంలో గల , "శ్రీ పాద వల్లభుల పాదుకా దర్శనము" చేసుకొని , మా ఆతిథ్యం స్వీకరించి,
మమ్మల్ని ఆశీర్వదించి వెళ్లండి .
" ఓం శ్రీ గురు దత్తాయ నమః "
[18/07, 3:56 pm] JAGADISWARI SREERAMAMURTH: తపస్వి మనోహరం E-book కొరకు,
18-07-2023.
కథ అంశం: "మనిషి, ఒకే ఒక్క రోజు, "దేవుడు అయితే..".
శీర్షిక: సరిలేరు, నీకెవ్వరూ.....
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కళ్యాణ్ :మహారాష్ట్ర.
------------------------------------------
అఖిలకు, చాలా చిరాగ్గా ఉంది. తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందుల వలన ఎక్కడకు తిరగడానికి వెళ్లలేకపోయింది , తను, పదో క్లాసు పాసవ్వగానే ,
తనకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలెట్టారు. .
కానీ ,అప్పటికే కాబోయే అత్తగారు, పక్షవాతంతో మంచం మీద ఉన్నారు. మా మగారికి ,డయాబెటిస్ కారణంగా , చెవుల వినికిడి, తగ్గిపోయింది. ఆ కారణంగా వాళ్లు,
వాళ్ళ అబ్బాయికి, తొందరగా పెళ్లి చేసేయాలని నిర్ణయించుకుని, వాళ్ల అబ్బాయికి, పెళ్లి సంబంధాలు చూడడం మొదలెట్టారు. " కట్న కానుకలు అక్కర్లేదని, అమ్మాయి , తమతో కలిసి ఉంటే చాలని* వాళ్ళు కోరుతున్నారని , తెలియడంతో ,అమ్మ, నాన్నలు, నా పెళ్లి వాళ్ళ అబ్బాయితో జరిపించేస్తారు
పెళ్ళయ్యాక భర్తతో హాయిగా, ఎన్నో దేశాలు తిరుగుదామని అనుకుంది. కానీ ఉమ్మడి కుటుంబం ఐన ఆ ఇంట్లో, ఏనాడు తామిద్దరికీ , కనీసం మాట్లాడుకుందికి కూడా ,సమయం దొరికేది కాదు . పెళ్లయిన సంవత్సరంలోపలే, తనకు పెద్దవాడు పుట్టేసాడు .ఆపై వరుసగా మరో ఇద్దరు .
దాంతో తన బ్రతుకు, పనిమనిషి కన్నా హీనం అయిపోయింది పొద్దున్నే లేవగానే, అత్తగారి సేవలతో
మొదలైన పని, భర్తను ఆఫీసుక పంపించడం, పిల్లల్ని స్కూల్కి తయారు చేయడం , వాళ్ళని మళ్లీ స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావడం, ఈ మధ్యలో కడుపులో ఇంత వేయడం కోసం ఆరుగురు మనుషుల కోసం. వంట వండడం, గట్టిగా మాట్లాడితే గానీ వినపడని మామ గారితో సతమతమవడం , తిరిగి పిల్లలు వస్తే వాళ్ల కోసం స్నాక్స్ రెడీగా ఉంచడం ."
"అబ్బబ్బ. జీవితం అంటే విసుగు వచ్చేస్తోంది.
"పోనీ.. సాయంత్రం పూట అలా చల్లగా, మార్కెట్కి వెళ్లి నాలుగు కూరలు కొని వద్దామా అంటే ,
అసలు కూరలు కొనే పరిస్థితిలో ఉన్నామా ?
ఎంతెంత ఖరీదులో... ..! "
"నాలుగు రోజులు కూరలు కొనుక్కుంటే ,ఇల్లే అమ్మేవలసి వస్తుంది.
సణుక్కుంటూనే, మాధవి, స్నానం చేసి బట్టలు మార్చుకుని , జడల్లుకుంది .
అత్తగారికి, మామ గారికి , ఫ్లాస్క్ నిండా కాఫీ పోసి,
స్కూల్ కి వెళ్ళొస్తానని చెప్పి ,బయలుదేరింది.
"స్కూల్ కి వెళ్లి , పిల్లల్ని తీసుకురడానికి, ఇంకో అరగంట దాకా టైం ఉంది .ఈ మధ్యలో కాస్త , దగ్గరలో ఉన్న "వెంకటేశ్వర స్వామి " మందిరానికి వెళ్లి, దర్శనం చేసుకుని వస్తే సరి... కాస్త మనసు ప్రశాంతంగానే ఉంటుంది . అప్పటికి. పిల్లల స్కూలు కూడా విడిచి పెట్టేస్తారు ." "అనుకుంటూ , స్వామివారి మందిరంలోకి అడుగు పెట్టింది.
********************
చాలా రోజుల తర్వాత, మందిరం లోకి అడుగు పెట్టిన మాధవి కి, ఎదురుగుండా దివ్య మంగళస్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని చూసేసరికి, భక్తి పారవస్యంతో కళ్ళల్లో , నీళ్ళు నిండుకున్నాయి.
వెంటనే భక్తిగా రెండు చేతులు జోడించి నమస్కరించింది.
"స్వామీ ! పెళ్లి కాకముందు, అమ్మతో కలిసి, మీ కోవెలకి, ప్రతిరోజు వస్తూ ఉండేదాన్ని . నా బాల్యమంతా నీ సన్నిధిలోనే గడిచినంత తృప్తి నాకు ఉండేది . కానీ, పెళ్లయ్యాక ఏంటి స్వామీ...? ఒక్కరోజు కూడా నీ దర్శనానికి రాలేకపోతున్నాను .
నాకు ఈ బంధనాలన్నీ ఏమిటి స్వామి ..? క్షణం సేపు కూడా, నీ నామస్మరణ చేయడానికి సమయం దొరకడం లేదే. ?"
అయినా నిన్నని, ఏం లాభం..? నా కర్మ ఇలా కాలిపోయింది.
నీకేం? నువ్వు మహారాజులా, భక్తులు పెట్టిన. నైవేద్యాలన్నీ తింటూ, లక్ష్మీదేవి, నీ పాదాలు. పడుతూ ఉంటే , హాయిగా కళ్ళు మూసుకుని ఆనందం అనుభవిస్తున్నావు . ఇంక నీకు ,మా కష్టాలు ఎందుకు కనిపిస్తాయి ?,మా గురించి ఎందుకు పట్టించుకుంటావు?
అసలు నిన్ను ఆపద్బాంధవుడవని ఎవరన్నారయ్యా? !
అదే నిజమైతే , మధ్యతరగతి వాళ్ళమైన మాలాంటి వారి పై , బీద, బిక్కిలపై , దయచూపవేమి స్వామీ! ?
అతి చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకోలేని స్థితికి, మమ్మల్ని ఎందుకు దిగజారుస్తావు స్వామీ..?
వింటున్నావా స్వా మీ.! " అంటూ తన మనసులోని బాధనంత వెబోళ్లసుకుంటున్న అఖిలకు , ఒక్కసారిగా ఉక్రోషం ముంచుకొచ్చింది.. వెంటనే కోపంగా,
"అసలు ఇదంతా ఎందుకు ,?
ఈ సుఖాలన్నీ వదిలిపెట్టి ఒక్కరోజు నువ్వు నా జాగా లోకి వచ్చి చూడు . ఆ ఇంట్లో నేను ఎంత కష్టపడుతున్నానో, నీకు తెలుస్తుంది .అంతేకాదు , నన్ను ఒక్కరోజు ,నీ స్థానంలో . ఉండనీయ్యి .నాలాంటి ఎంతోమందికి ,నేను ఎంత సుఖాన్ని ఇస్తానో... ఎంతమంది బాధలు వింటానో.. ఎంతమంది కోర్కెలు తీరుస్తానో..!. ఈ దేశంలో సామాన్యులకు జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాల్ని , అన్నింటిననీ రూపు మాపేస్తాను .
ప్రపంచం అంతటా ఆనందాన్ని నింపేస్తాను .
ఈ దొంగలు, దెబ్బలాటలు, రాజకీయాలు , అరాచకాలు ,ఏమి లేకుండా శాంతియుతమైన జీవితాన్ని అందరికి ప్రసాదిస్తాను. వింటున్నావా.. స్వామీ .. ?
"ఒక్కరోజు దేవునిగా ఉండే అవకాశం నాకు ఇస్తావా "?
అంటూ సవాలు చేసింది.
అంతలోనే తుళ్లి పడి ,సమయం చూసింది ". అరే పిల్లలకు, స్కూలు వదిలేసినట్టున్నారు . ఎంతసేపయిపయిందో....
అనుకుంటూ, వస్తాను స్వామీ. !
ఏదో భరించలేని బాధలో ఏదోదో అనేసాను .నువ్వు అపార్థం చేసుకోకేం , అంటూ ,కళ్ళు తుడుచుకుని, పిల్లల్ని తేవడానికి. స్కూలుకు బయలుదేరింది.
********************
పగలంతా కష్టపడిందేమో, . రాత్రి అఖిలకు ఎంతొందరగానే నిద్ర వచ్ఛేస్తోంది . అన్ని పనులు గబగబా ముగించుకొని పక్క మీద వాలింది.
అఖిలకు అప్పుడే " మగతగా" నిద్ర పట్టింది.
************
తలుపు కొడుతున్న చప్పుడికి తెలివి వచ్చింది అఖిలకు.
సమయం చూస్తే, తెల్లవారి నాలుగు గంటలు అవుతోంది . " ఈ సమయంలో ఎవరబ్బా వచ్చింది " అనుకుంటూ వెళ్లి తలుపు తీసింది.
ఎదురుగుండా స్వామి వారిని చూసి , అఖిల నోరేళ్లబెట్టింది. అంతలోనే స్వామివారు ,"అఖిలా! నువ్వు కోరుకున్నట్టుగానే, నేను మీ ఇంటికి వచ్చాను .పొద్దున లేచిన దగ్గర నుండి, ఈ రోజంతా నువ్వు నా స్థానంలో ఉంటావు .నేను నీ స్థానంలో ఉండి ఇల్లు, వ్యవహారం, అంతా చూసుకుంటానులే .
నువ్వు , తొందరగా.గుడికి వెళ్ళు .తెల్లవారిపోతే ,మళ్ళీ భక్తులందరూ ,తమ గోడు వెళ్ళబోసుకోవడానికి, గుడికి వచ్చేస్తారు ."అనగానే అఖిల తెల్లబోయింది.
తర్వాత ఆశ్చర్యపోయింది .తర్వాత సంతోషంగా
స్వామి వారికి ,తను తెల్లారి లేచి, చేయబోయే పనులన్నీ అప్పచెప్పి .గుమ్మం దాటి గుడి దారి పట్టింది.
అఖిలకు, ఆకాశంలో తేలిపోతున్నట్టుంది . "ఈ ఒక్కరోజు, తను దేవుడి స్థానంలో ఉండబోతోంది . తను ఏమన్నా చేయగలిగే శక్తిని , ఈ ఒక్క రోజు మాత్రం, దేవుడు తనకు ప్రసాదించాడు ."
"ఈరోజు తను ఎన్నో అద్భుతాలు చేయాలి. సమయం తక్కువగా ఉంది .దేవుడుకి నా సత్తా ఏంటో చూపించగలగాలి ."అనుకుంటూ ఆనందంగా గబగబా గుడి వైపు గా, అడుగులు వేయసాగింది అఖిల.
**************
తను వెళ్లేసరికి ,అప్పటికే చాలా బాగా తెల్లారిపోయింది .గుడిలో నుంచి సుప్రభాతం వినిపించడం
ఆగిపోయింది . తను గుడి లోపలికి వెళ్ళబోయేంతలోనే , అక్కడ ఏదో దొమ్మి జరుగుతున్నట్లనిపించీ , అటువైపుగా నడిచింది
తను ఇప్పుడు అఖిల గా కాక ,స్వామివారి రూపంలో, అంటే మగ వేషంలో ఉంది .అందుకే వారి మధ్యకు వెళ్లి, తగువేమిటో కనుక్కొని ,"తగువు తీర్చడానికి ప్రయత్నిద్దాం" అనుకొని దగ్గరకు వెళ్ళింది .
అక్కడ రెండు పక్షాలుగా , మనుషులు విడివడి కొట్టుకుంటున్నారు అందులో మొదటి పక్షం "విగ్రహాన్ని మీరే దొంగిలించారు "అంటూ ఎదుటివారిపై నిందలు వేస్తున్నారు. మరొక పక్షం "మీరే దొంగలు" ఎప్పటినుంచి మీరు సత్తాలోకీ వచ్చారో , అప్పటినుంచి ,ఎక్కడపడితే అక్కడ, దొమ్మిలు, దొంగతనాలు అరాచకాలే..జరుగుతున్నాయి" అంటూ , మొదటి వారిపై విరుచుకుపడుతున్నారు
అఖిలకు, చాలా సేపు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు . పక్కనున్న పూజారి గారిని అడిగింది .అతను గుడిలో విగ్రహం మాయమైపోయింది నాయనా .. పొద్దున్న సుప్రభాతం సమయంలో ఈ భక్తులంతా వచ్చారు. ఇదిగో ఇప్పుడు ఈ విధంగా దెబ్బలాడుకుంటున్నారు"
ఎవరూ "స్వామివారి విగ్రహం ఏమైందో" అన్న మాట గురించి, ఆలోచించడమే లేదు "అంటూ బాధగా అన్నారు.
దాంతో అఖిలకు విషయం పూర్తిగా అర్థమైంది .కానీ, " తనే ఈరోజుకు దేవుడు " అని చెప్తే ,ఈ జనం నమ్ముతారా? "అనుకుంది. అయితే "తను ఇప్పుడు దేవుడు కదా! ఈ సమస్యకు పరిష్కారం చెప్పి చూద్దాం " అనుకుంటూ మధ్యలోకి వెళ్ళింది. ఇరుపక్షాల వారిని ఆగమంటూ" విగ్రహం పోయిందని కదా వాళ్ళడుగుతున్నది . దానికి పరిష్కారం ఆలోచించాలి గానీ, ఇలా కొట్టుకోవడం, నిందలు వేసుకోవడం ఎందుకు ? " అంటూ ఏదో అనబోయింది."
ఇంతలో, మొదటి పక్షం నుంచి ఒక మనిషి వచ్చి ," ఇతడు ఎవడో గానీ దేశద్రోహి లా ఉన్నాడు వీడు మన పార్టీ నే ప్రశ్నిస్తున్నాడు వెంటనే, వీడిని కారాగారంలో వెయ్యాలి . లేకపోతే ,మనకే నీతులు చెబుతాడా" అంటూ అరవ సాగేడు.
అంతే..! ఐదు నిమిషాలలో, అక్కడ పరిస్థితి మారిపోయింది .ఎవరో ఎవరికో ఫోన్ చేశారు .పోలీసులు వచ్చారు. తన చేతికి బేడీలు వేశారు .అంతే మరో పది నిమిషాల్లో తను కారా గృహంలో ఉంది.
మగ రూపంలో ఉన్న అఖిలకు ఏం చేయాలో తోచలేదు. తనకి రాజకీయాల గురించి ఏమీ తెలీదు .అనవసరంగా వీళ్ళ మధ్యలో దూరానేమో ! అనుకుంటూ మధన పడసాగింది. ఇప్పుడు తను బయటకు వెళ్లేది ఎలా..?
ఆలోచిస్తూ ఉండగానే ,ఎవరో వచ్చి తనను "బెయిల్" మీద, విడిపించి బయటకు పట్టుకెళ్లారు.
తనను విడిపించేరు గనక, వచ్చే ఎలక్షన్ లో , తన ఓటు వారిదేనని , వారి పార్టీలోనే తను చేరాలని, వారికై, ప్రచారం చేయాలని నొక్కి చెప్పసాగాడు
మగ రూపంలో ఉన్న అఖిల్ కు, చాలా భయం వేసింది " అయ్యా బాబోయ్ ! ఇక్కడి నుంచి, ఎలా తప్పించుకోవడం
రా దేవుడా !" అని ఆలోచిస్తూ ఉండగానే ,దేవుడిలాగా వాళ్ళిద్దరి మధ్య నుండి ఒక కారు దూసుకెళ్లింది .ఆ క్షణంలోనే, అఖిల తనకు తెలియకుండానే ఓ పక్కకు తప్పుకుంది . అఖిల్ కు ఏం అర్థం కాలేదు కానీ ,వెంటనే, తను దేవుడు కదా.. అన్నది జ్ఞాపకానికి వచ్చి, తన రూపాన్ని మరో పురుషుడిలా మార్చుకుని , .
"బ్రతికానురా దేవుడా "అనుకుంటూ బయటపడింది.
ఇలా కొంచెం దూరం వెళ్ళిందో లేదో, వెనకనుంచి తనను నలుగురు దుండగులు పట్టుకొని , చితక బాదడం మొదలెట్టారు.
అఖిలకు ,వాళ్లు తనను , ఎందుకు కొడుతున్నారో... చాలాసేపటి వరకు ,అర్థం కాలేదు ఒళ్లంతా చితకబారిన తర్వాత తెలిసింది ఏంటంటే, తనలాగే ఉన్న ఒకతను, వారి వద్ద , వేలకు వేలు-
అప్పులు చేసి పారిపోయాడట . అచ్చు అతనిలాగే రూపం మార్చుకున్న తను, కనబడే సరికి ,వాళ్ళు తమ దగ్గర అప్పు చేసి , పారిపోయిన వాడే వచ్చాడనుకొని , తనను చితక్కొట్టినట్టు ,తెలుసు కొంది..
ఇంకా వాళ్ళు తనని ఏమి చేసి ఉందురో.. కానీ ఇంతలో ఒక ముసలావిడ
"వాడిని ఏమి చేయకండి వాడు నా కొడుకే...నా దగ్గర డబ్బులు ఉన్నాయి మీకు చెల్లిస్తా" అంటూ వాళ్లకి ఇవ్వాల్సిన డబ్బులు అక్కడికక్కడే వాళ్ళకి చెల్లించేసింది.
ఇంతవరకే అఖిల చూడగలిగింది .తర్వాత , వాళ్లు కొట్టిన దెబ్బలకి ,మెల్లగా తెలివి తప్పింది.
*******
కళ్ళు తెరిచి చూసిన అఖిలకు ,చుట్టూ ,చుట్ట కాలుస్తున్న కొందరు నాటు సారా తాగుతూ ,తూగుతూ, మాట్లాడుకోవడం కనబడింది .
మగరూపం లోనున్న అఖిల ,అక్కడి నుంచి వస్తున్న ఆ చుట్ట వాసన భరించలేక లేచి నిలబడింది.
అఖిల, నిలబడడం చూస్తున్నా ఒక అతను" "అదిగోరా !. లేచాడు . అతడినే అడుగుదాం అతన్ని, చితక బాదిన వాడెవడో ? బాస్ చెప్పగానే, అ కొట్టిన వాడిని , పొడిచి చంపేద్దాం "రండిరా, రండి- అంటూ , కత్తి పట్టుకొని, అతని దగ్గరికి వచ్చాడు.
అఖిలకు కాళ్లు చేతులు వణక సాగాయి.
ఇంతలోకి వాళ్లు , "బాస్. ! మిమ్మల్ని ఎవరు కొట్టారో చెప్పండి బాస్! ఈరోజు వాళ్ళ అంతు చూస్తాం " అంటూ, రెచ్చిపోసాగారు.
ఓహో! తను ఇప్పుడు వీరికి "బాస్" అన్నమాట అనుకుంటూ పిచ్చిగా నవ్వుకుంది.
ఇంతలో ఒకతను వచ్చి , "బాస్ ! ఇదిగో ! ఈ రోజు నాకు ఈ అబ్బాయి ,అమ్మాయి, దొరికారు. చెప్పండి .వీళ్ళని ముష్టి వాళ్ళను చేద్దామా..? లేకపోతే పై దేశానికి ఎగుమతి చెయిద్దామా "అంటూ అడగసాగాడు.
అఖిల నోరెళ్ళబెట్టి ,ఆ ఇద్దరు పిల్లల వైపు చూసింది. వెంటనే అఖిల రోమాలు నిక్కబొడుచుకున్నాయి .
ఆ పిల్లలిద్దరూ ,మరెవరో కాదు .తన పిల్లలే.
తను ఇప్పుడు, ఈ దుండగుల నుండి తన పిల్లల్ని ,రక్షించుకోవాలి. ఎలా? ఎలా ?
అఖిల ఆలోచిస్తూనే పిల్లల్ని దగ్గరికి తీసుకుంది.
"ఏంటి బాస్ ..పిల్లల్ని అలా దగ్గరికి తీసుకున్నారు. మీరు ఊ... అనండి. వాళ్ళని వికలాంగులను చేసి , కట్లు కట్టి ,ఈరోజు నుంచే వాళ్ళని పనిలోకి పంపిస్తాం ."
అన్నాడొకడు కర్కోటకంగా.
అఖిల క్షణంలో తేరుకొని, "ఈరోజు ,నాకు మనసు బాగోలేదు. వీరిని ఇక్కడే ఉంచి, మీరు వెళ్ళండి. వీళ్ళని ఏం చేయాలో, తర్వాత నేను చెప్తాను "అంటూ వాళ్ళను పంపించేసింది.
భయంతో వణుకుతూ , ఏడుస్తూ ,దూరంగా నిలబడ్డ పిల్లలని చూసేసరికి ,అఖిలకు కడుపులో దేవినట్లయింది.
ఎలాగైనా, వార్ని రక్షించాలని అనుకుని ,వెనకదారి నుంచి వారిని బయటకు పంపేయడానికి ప్రయత్నించసాగింది.
ఇంతలో దుండగుల్లో ఒకడు వీరిని చూసి , గట్టి గట్టిగా అరవసాగాడు
" రేయ్ ! మన బాస్ చూడండిరా ,మనకు వాటా ఇవ్వకుండా ఉండాలని , తాను తప్పించుకుని , పిల్లల్ని పట్టుకెళ్ళి తనొక్కడే అమ్మేయడానికి ప్రయత్నిస్తున్నాడు ."
అంటూ అరవసాగాడు
దాంతో, మిగిలిన వాళ్లంతా, గోల గోలగా వచ్చి, కర్రలతో తనను బాద సాగారు." అసలు వాళ్లేం చేస్తున్నారో" ,అన్నది వాళ్లకే తెలియని మత్తులో ఉన్న వాళ్ళని, ఏం చేయాలో..?..
ఎలా ఆపాలో...?.. " అన్నది, అఖిలకు అర్థం కాలేదు.
వాళ్లు కొడుతున్న దెబ్బలు, పిల్లలకి ఎక్కడ తగులుతాయో? అని వాళ్ళను గుండెల్లో దాచుకుంటూ, ఎలాగో అలా అక్కడి నుంచి తప్పించుకుంది. తను అంత సులభంగా అక్కడినుంచి ఎలా తప్పించుకుందో ,అఖిలకు అసలు అర్థం కాలేదు.
కానీ తప్పించుకున్నందుకు సంతోషపడుతూ, ఇంటిదాకా పిల్లల్ని దిగబెట్టి , వాళ్లని ఇంట్లోకి వెళ్లిపోమంది.
అప్పటికి , అఖిల చాలా అలసిపోయింది సమయం కూడా రాత్రి. ఏడు గంటలు కావస్తోంది.
నీరసంగా ఉన్న అఖిల మరో ఆలోచన లేకుండా, " తెల్లారి నాలుగు దాకా తను దేవుడిగా ఉండాలి కదా" అనుకుంటూ గుడి వైపు అడుగు లేచింది,
కడుపులో ఆకలి నకనకలాడుతోంది . గుడిలో భక్తులు చాలా తినమండాలు, నైవేద్యంగా పెట్టి ఉంటారు. హాయిగా వంట బాధ లేకుండా అవి తినొచ్చులే " అనుకుంటూ నడుస్తూ ఆలోచిస్తున్నాది అఖిల.
"అనుకోకుండా అస్తవ్యస్తంగా, ఈ రోజంతా గడిచిపోయింది తను దేవుడికి ఇచ్చిన మాట ప్రకారం, ఒక్క పని కూడా చేయలేకపోయింది . అయినా ఏంటీ ప్రపంచం ? ఎంత అన్యాయం జరుగుతోంది ? ఎవరు ఎవరిని కొడుతున్నారు..?. ఎవరు ఎవరిని తిడుతున్నారు? తెలియనంతగా ఈ మనుషులు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నరు ."
అందుకేనేమో ! భగవంతుడు ,ఉలకకుండా ,పలకకుండా, ఏమి పట్టించుకోకుండా, అలా చిద్విలాసంగా నవ్వుతూనే ఉంటాడు ఎప్పుడూ.."..
ఆలోచనల్లో ఉండగానే
"వీడేరా,మనని, ఎదుటి పార్టీ వాళ్ల దగ్గర, అవమానించి- సవాలు చేసింది. ఈరోజు వీడి భరతం పడదాం రండి" అన్న మాటలు వినిపించాయి.
అఖిల ఒక్కసారి గిర్రు న వెనకకు తిరిగింది.
పొద్దున్న గుడి దగ్గర జరిగిన దుమ్ములో, తను చూసిన ఒక పార్టీ మనుషుల్లో ,కొందరు వాళ్ళు,.
వాళ్ళని చూసినా అఖిల ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసింది.
ఇదేంటి ? వీళ్ళనే కదా ! తన పొద్దున్న, తను సపోర్ట్ చేసినది .ఇంతలోనే వాళ్ళని అవమానించానంటున్నారేంటీ...?.
" అంటే ! కొందరప్పుడే , పార్టీ మార్చేసి, ఎదుటి
పార్టీకి మారిపోయారా..?. ఇంత తొందరగానా...? "
ఆలోచిస్తున్న అఖిల , ఒక్కసారిగా వాళ్లంతా ,మీదకు వస్తూ ఉండడం గమనించి, పరుగులంకించుకుంది.
ఆ పరుగుతో ,తను ఎప్పుడు గుడికి చేరుతుందో ?..ఎప్పుడు దేవుని స్థానంలో నిలిచిందో...? గమనించలేదు.
తన వెనకాతలే వాళ్లు కూడా, గోల గోలగా ,గుడి లోపలికి చేరారు.
అఖిల ,"వాళ్లు తనను గుర్తుపడితేనో..." అనుకుంటూ భయంగా.. తనను తాను చూసుకుంది.
ఆశ్చర్యం, తను అచ్ఛంగా , వెంకటరమణమూర్తి లాగే, పూర్తి శిలారూపంలో ఉంది. .
ఆ వచ్చిన దుండగులు , తనకోసం ,ఇటూ -అటూ ,పరిశీలించి , తాను అక్కడ కనబడకపోవడంతో నిష్క్రమించారు,
అఖిల *బ్రతుకు దేవుడా! " అనుకుంటూ, ఒక నిట్టూర్పు విడిచింది"
రాతి విగ్రహ రూపంలో అఖిల , తాను మాత్రం , లోలోపల ,అఖిల లాగే. "ఫీల్ "అవుతోంది.
అంటే, తాను ఇంతవరకు "తను దేవుడిని" అనే భావనలోనే ఉందన్నమాట నిజంగా దేవుడు కాలేదన్నమాట.
అందుకే, తాను ఎన్ని చోట్లో , తన ప్రేమేయం లేకుండా చిక్కుకున్నా , తన అంతట తానుగా బయటపడలేకపోయింది. ఎందుకంటే ఆ సమయంలో తను, "దేవుడిని " అన్నమాటే మర్చిపోయింది కదూ. తను అక్కడ ఏ విధమైన మహిమను, చూపించలేకపోయింది కదూ.
ఏదో ఒక అదృశ్య శక్తి వచ్చి తను బయటపడేలా చేసేది కదూ.
ఈ విషయం తను అప్పుడు గుర్తించే లేకపోయింది.
అమ్మో ! దేవుడు, తనను ఎంత మభ్య పెట్టాడు.
అందుకే అతనికి " లీలా నాటక సూత్రధారి " అని, " నటన సూత్రధారి "అని పేర్లు వచ్చేమో...?
కానీ ,తనకు కష్టం వచ్చినప్పుడు మాత్రం ,తన పక్కనే ఉంటూ, తనను ఆ చిక్కుల వలయం నుండి,చాలా సార్లు రక్షించాడు కూడా , కదా.
అసలు దేవుడు , ఈ భూమి మీద ,అవతరించినదే,
" దుష్ట శిక్షణ", "శిష్ట రక్షణ " కోసమే కదా !
అన్ని మహిమలు ఉండబట్టే ,అతను దేవుడయ్యాడు.
లేకపోతే కుళ్ళు ,కుతంత్రం, స్వార్థం ,క్రూరత్వం, చఫలత్వం, అహంకారం ,అధికార దాహం, అమాయకత్వం ఇలా ఎన్నో మనస్తత్వాలు కలిగి ఉన్న మనుషుల్ని, వాళ్ల చర్యల్ల్నీ, భరిస్తూ, అందరికీ న్యాయం చేయడం ఎంత కష్టం.
తను తెలివి తక్కువగా " తన దేవుడి నైతే , ఒక్కరోజులో అన్నీ మార్చేస్తాననుకుంది . అది తన వల్ల అయ్యే పనేనా...?.
అందుకే దేవుడు అమాయకంగా తనడిగిన వరాన్ని , అలాగే ఇస్తున్నట్టు మభ్యపెట్టి, "దేవుడనే " అన్న భావాన్ని కలిగించి, ఊరుకున్నాడు లేకపోతే తొందరపాటులో, తనెన్ని పొరపాట్లు చేసేదో....
అఖిల ఆలోచిస్తూ, "గోడగడియారం వైపు" చూసింది
ఇంకా తెల్లారడానికి గంట సమయమే ఉంది.
ఆకలి దంచేస్తున్నాది . నిద్ర ముంచుకొస్తున్నది.
రోజంతా పరుగులు పెట్టడంతో ,కాళ్లు చేతులు లాగేస్తున్నాయి .
ఎదురుగుండా అన్ని నైవేద్యాలు ఉన్నా ,శిలా రూపంలో ఉన్న అఖిలకు వాటిలో ఏ ఒక్కటీ కూడా ,తీసుకుని ,తినడానికి వీలు కాలేదు.
పూజారులు ,పవళింపు సేవకై వేసే ,బంగారు మంచం అక్కడే ఉంది . కానీ అఖిలకు ,ఒక్క క్షణం కూడా దాని మీద ,నడుము బాల్చడానికి కుదరలేదు.
శిలా రూపంలో ఉన్న తను ,ఒక గంటకే, నిల్చో లేక , కాళ్లు పట్టిసినట్టై నీరసపడిపోయింది.
అటువంటిది" కొన్ని యుగాలై ,అలాగే నిలిచిన స్వామి వారు, ఎంత నీరసపడిపోయి ఉంటారు...? " అన్నది తను ఆలోచించే లేదు
ఆలోచిస్తున్న అఖిల ,మానసికంగా క్రుంగిపోతూ, కళ్ళు మూసుకుని, వెంకటేశుని పాదాలను తాకుతున్నట్టుగా భావిస్తూ ,
"తండ్రి నన్ను క్షమించు స్వామీ ! నువ్వు హాయిగా ఉన్నావని , హాయిగా లక్ష్మీ దేవితో, కాళ్లు పట్టించుకుని, భక్తులు పెట్టినదంతా తింటూ, ఆనందం అనుభవిస్తున్నావని నిన్ను నిందించీ , అనరాని మాటలన్నాను.. మే మేదో బాధలు పడుతున్నామని , నువ్వు ఛిద్విలాసంగా చూస్తూ కూర్చున్నావని , తప్పుగా అనుకున్నాను. నన్ను మన్నించు .
నువ్వు చేస్తున్న పని , ఎంత కష్టతరమైనదో ,
మా గురించి నువ్వు తీసుకున్న నిర్ణయాలు ఎంత సరైనవో , తెలుసుకోలేకపోయాను,
ఒక చిన్న సంఘటనతోనే , ఇక్కడి రాజకీయాలు ,ఎంత భయంకరమైనవో తెలుసుకున్నాను.
ప్రజలు తమ స్వార్థం కోసం , ఎదుటివారి మాన, ధనాలను ఎలా దోచుకుంటున్నారో చూశాను.
నేను ఆపదలో ఉన్నప్పుడు ,సునాయసంగా, నన్ను తప్పించింది "నువ్వేనని" తెలుసుకున్నాను. దానిని బట్టి
"మంచి ఆలోచనలు చేస్తూ, అందరికీ మంచి చేద్దాం" అని తలచిన వారిని, నువ్వు పక్కనే ఉండి ,రక్షిస్తావని అర్థమైంది.
రాజకీయాలు ,దెబ్బలాటలలో దూరకుండా ,
మనుషులని వారి కర్మకు వారిని, ఎందుకు విడిచిపెడుతున్నావో కూడా ,అర్థం చేసుకున్నాను.
చేసిన తప్పులకైనా పొరపాట్ల కైనా, ఈ జన్మలోనే ,అప్పటికప్పుడే ,శిక్షలు వేస్తావని కూడా తెలుసుకున్నాను,
"ఏదో ప్రపంచాన్ని ఉద్దరిద్ధామని , నేను వరం కోరితే, నాకు "ప్రపంచం " అంటే ఏంటో తెలియజేసిన నీకు ,నేను చాలా రుణపడి ఉన్నాను.
ఒక తల్లిగా, ఒక కోడలి,గా ఒక భార్యగా ,ఒక చిన్న కుటుంబానికి సేవ చేయడానికి ,నేను కటకట లాడిపోతూ ఉంటే ,ఇంత పెద్ద ప్రపంచ భారాన్ని మోస్తున్న నువ్వు.,
ఎన్ని కష్టాలు పడుతున్నావో, అర్థం చేసుకున్నాను.
చాలు తండ్రీ , ఇక నేను మీ రూపంలో, ఒక్క క్షణం కూడా ఉండలేను . ఈ శిలారూపాన్ని అస్సలు భరించలేను .
మా ఇంటికి నన్ను పంపించి, నీ ఇంటికి నువ్వు వచ్చేయ్ సామీ...."
అంటూ పశ్చాత్తాపంతో మనస్ఫూర్తిగా, ఆ జగన్నాటక సూత్రధారిని , వేడుకుంది అఖిల.
********************************
అఖిల కళ్ళు తెరిచేసరికి ,తన మంచం మీద ఉంది.
పిల్లలు గోలగోలగా దీని కోసమో ,దెబ్బలాడుకుంటున్నారు,
భర్త ,అఖిలా ఏంటి ,ఇంతసేపు పడుకున్నావ్ .నాకు ఆఫీస్ కి టైం అవుతోంది . నీకు ఒంట్లో బాలేనట్టుంది
అందుకే , ఈరోజు నాకు "డబ్బా " ఈయక్కర్లేదులే..
కానీ , తొందరగా కాఫీ మాత్రం ఇవ్వు , ఇప్పటికే తల బద్దలై పోతున్నాది" .అంటున్నారు.
మావయ్య గారు దగ్గరకు వచ్చి , అమ్మా ! మీ అత్తయ్య లేచి చాలా సేపు అయింది. .ఏంటి కావాలో..? ఏంటో..?
ఒకసారి కనుక్కోమ్మా. "అంటున్నారు.
లేచి లేవగానే , వీళ్లందరి మాటలు విన్న అఖిలకు, ఈరోజు అస్సలు కోపం గాని, విసుగు గాని, రాలేదు . సరి కదా, చిన్న చిరునవ్వుతో లేచి, తన బాధ్యతలను గుర్తు చేసుకుంటూ, మెల్లగా మంచం దిగి , ప్రశాంతమైన మనసుతో, వంటింటి వైపు నడిచింది దేవుడు ,ఆహా ! కాదు- కాదు అఖిల.
" సమాప్తం +
*****************""*"""""******************
హామీ.. ఈ కథ ,నా స్వీయ రచన.
""""""""""""""""""""""
[27/07, 12:32 pm] JAGADISWARI SREERAMAMURTH: తపస్వి మనోహరం e book కొరకు కథ
అంశం : వానకారు నుండి పూలకారు వరకు
రచన శ్రీమతి ',
పుల్లాభట్ల జగదీశ్వరీ ముార్తి.
కల్యాణ్ (మహరాష్ట్ర ).
----------------------------------
అంశం : బామ్మ గోల ,సుబ్బిగాడి పెళ్లి .
శీర్షిక .
ప ప. పాలు,
పొ..పొ...పొంగిపోతున్నాయ్..
(హాస్య కథ).
ఈ కధ సరదాగా రాసినది . ఎవరినీ ఉద్దేసించి గానీ, ఎవరినీ బాధపెట్టాలని , గానీ రాసినదికాదని గమనించ మనవి.
ఇందులో పెళ్ళి కుాతురు "సుందరి". నలుపు రంగు తో ఉండి , నత్తి తో పాటు పిప్పిపట్టిన గారపళ్ళతో , ఉంటుంది.
తల్లి "కనకం."కుాతురి పెళ్ళి కోసం, నానా పాట్లుా పడుతుా ఉంటుంది.
ఇక...కధ లోకి వెళితే..
పెళ్ళి కొడుకు పేరు "సుబ్బారావ్" .అందరుా "సుబ్బిగా" అని, పిలుస్తుా ఉంటారు.చెల్లెలు చిట్టి.,
అమ్మా , నాన్నా , ఏక్సిడెంట్ లో పోతే , బామ్మ "కాంతమ్మే", ఈ ఇద్దరినీ సాకింది. పిల్లలు పెద్దయ్యిన తర్వాత , సుబ్బిగాడి పెళ్ళి సమస్య గా మారింది బామ్మకి. కారణం.
.సుబ్బిగాడు నల్లగా ఉంటాడు . ఎత్తు పళ్ళు , పెదాలు ముాస్తే కింది పెదవి పైకి రెండు పళ్ళు వస్తాయి.
వాడిది చిత్రమైన నత్తి.
ఏలాగంటే...మాట్లాడుతుా - మాట్లాడుతుా మాట మధ్యలో ఉమ్మ్ మ్ మ్....అంటుా, ఆగిపోయి, కళ్ళు చిట్లిస్తుా, కుడిచేత్తో తన తల వెనుక వైపు తన చేత్తో తానే "ఠప్" మంటుా ఒక దెబ్బ గట్టిగా వేసుకుంటాడు .అంతే ! వెంటనే , తిరిగి మాట కంటిన్యుా అవుతుంది.
అది తెలిసిన వారంతా వాడి మాట ఆగ గానే , వాడికన్నా ముందే , "టెంకి" మీద ఠప్ మంటుా "జల్ల" కొడుతుా ఉండడం , వాడు ఏడుపు ముఖం పెట్టడం , వాళ్ళ బామ్మ, కొట్టిన వాడి వెంట పడి, మరీ తిట్టడం.. పరిపాటైపోయింది
బామ్మ కేమో సుబ్బు గాడి తీరు చూస్తే చాలా బాధగా ఉంటుంది. తనున్నన్నాళ్లు ,వాడి సంగతి చూసుకుంటుంది కానీ తను పోతే , కనీసం వాడికి నీళ్లిచ్చే దిక్కు కూడా ఉండదు . కనీసం. పెళ్ళ్లైనా చేసేస్తే తన బాధ్యత తీరుతుంది అనుకుంటే పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు ఎన్నో సంబంధాలు చూస్తోంది.
మాఘమాసం ,శ్రావణమాసం ,లాంటి పెళ్లిళ్ల సీజన్ల లో , పెళ్లి బాజాలు వింటుంటే , బామ్మ కళ్ళ ముందు, సుబ్బి గాడి పెళ్లి మెదులుతూ ఉంటుంది చూస్తుండగానే తన వయసు డిగి పోతోంది . సుబ్బిగాడి వయసు కూడా మీరిపోతుంది .ఈ శ్రావణమాసంలో, ఎలాగైనా సరే ,సుబ్బిగాడి పెళ్లి చేసేయాలని, బామ్మ, గట్టిగా పట్టు పట్టిమరీ ,సంబంధాలు చూస్తోంది.
ఇదండీ సంగతి.
ఇక కధలోకి వెళదామా....!
-----------------------------------------------
[27/07, 12:34 pm] JAGADISWARI SREERAMAMURTH: సుందరి పెళ్ళి చుాపులు...
------------------------------------
."కనకం" కి చాలా టెన్షన్ గా ఉంది. కుాతురు "సుందరి" పెళ్ళి గురించిన ఆందోళన ఆమె ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాది. ఈరోజు పెళ్ళి వారు వస్తున్నారు. సుందరిని తయారు చేయడానికి బ్యుాటీ-
పార్లర్ నుంచీ అమ్మాయిలను ,ఇంటికే రప్పించింది కనకం. ఇప్పటికే చాలా సంబంధాలు చుాసింది.కానీ
ఒక్కటి కుాడా కుదరలేదు. కానీ కనకం నిరాశ పడలేదు.
గంతకు తగ్గ బొంత దొరకపోతుందా , అని అలా ప్రయత్నిస్తుానే ఉంది. ఇన్నాళ్ళకు ఆ అవకాశం వచ్చింది. సుందరికి తగ్గట్టుగానే ఉన్నవాడు దొరికేడు.
వాళ్ళు కుాడా అబ్బాయికి ఎన్నో సంబంధాలు చుాసేరుట. కానీ వాళ్ళకు కుాడా ఒక్కటీ నప్పలేదుట.
వాళ్ళు కుాడా మన సంబంధం మీదే ఆశ పెట్టుకు వస్తున్నారనీ మధ్య వర్తుల ద్వారా తెలిసింది కనకానికి.
ఈ సంబంధం గానీ కుదరకపోతే ఇక ఈ జన్నలో సుందరికి పెళ్ళయే ఛాన్సే ఉండదు. అందికే సుందరి విషయంలో , కనకం ఎన్నో జాగర్తలు తీసుకుంటున్నాది.
పెళ్ళివారొచ్చే సమయం దగ్గర పడుతున్న కొద్దీ కనకానికి గాభరా పెరిగిపోతున్నాది.
ఇంతలో సుందరిని ఆ బ్యుాటీ పార్లర్ పిల్లలు , తయారుచేసి , హాలులోకి తీసుకొచ్చేరు.
కనకం తేరపారి సుందరివైపు చుాసింది.
తల్లిని చుాడగానే సుందరి , వయ్యారాలుపోతుా పక పక నవ్వింది.
ఆమె నవ్వగానే గారపట్టిన పిప్పి పళ్ళు, పారల్లా కనిపించేయి.
కనకం కి ఒళ్లు ఝల్లు మంది.
గబ గబా సుందరి దగ్గరకు వచ్చి చెవి మెలిపెట్టింది.
"ఎన్ని సార్లు చెప్పేను. అంతలా నవ్వకే అని . ఇలా మాత్రం వచ్చిన వారి దగ్గర నవ్వకు " అంటుా గుడ్లురిమింది.
సుందరి కోపంగా తల్లి వేపు చుాస్తుా "నినిన్నీ తో...మ మ మ్మాట్లాడను , ఉమ్ ఉమ్ ఉమ్ ఫో...." అంటుా , వెనుతిరిగింది. వెనక బిగించి వేసిన జడ , దాని నిండా పుాలతో నిండి, చివరకు వచ్చేసరికి , తేలు కొండెలా పైకి లేచిన జడ కొస చుాడగానే ,కనకం కంట్లో నీళ్ళు తిరిగేయి.
సుందరి పుట్టినప్పటి నుండే అనాకారి. నల్లటి నలుపుకు తోడు, అంత చిన్న పిల్లప్పుడు కుాడా ,
చాలా పెద్ద జుట్టు , ముఖం మీద పడుతుా , ఆ జుట్టు మధ్యలోంచీ అది చుాస్తుా ఉంటే , తనకు చాలా చిరాగ్గా ఉండేది. అలా అలా , పెద్దవుతున్న కొద్దీ, మారుతున్న రుాపు తో పాటు, గార పట్టిన పిప్పి పళ్ళు, నత్తి తో పాటు,
అందంలేని ఆమెను చుాసి తను కళ్ళ నీళ్ళు పెట్టుకునేది. దేముడు ఇవ్వక -ఇవ్వక ఇలాంటి పిల్లనెందు కిచ్చేడో , తెలీక తెగ బాధ పడిపోతుా ఉండేది. దానికి తోడు , పిల్లని చుాసిన వారందరుా హేళనగా...."అబ్బ ..అతిలోక సుందరి" అంటుా వెక్కిరింతగా అంటుా ఉండడం తో , ఆ పేరే అలవాటై , బాలసారె నాడు పుాజారి గారు అడగ్గానే ఠక్కున "సుందరీ" అనే పేరే వచ్చింది నోటంట.
అసలు తమ ఇంట్లో ఎవరుా అంత వికారంగా లేరు .మరి ఎవరి పోలిక వచ్చిందో..? మా నాయనమ్మ చెపుతుా ఉండేది .వాళ్ళ తాత ఇలాగే ఉండేవారని..
తన ఖర్మ ..కాకపోతే ఒక్కగానొక్క. కుాతురికి ఆ పోలికే రావాలా..?
---------------------
"కాకి పిల్ల కాకికి ముద్దు " .అన్నట్టు సుందరిని అందరుా ముద్దుగానే పెంచేరు. కానీ పెద్దవుతుాన్న కొద్దీ , పాల పళ్ళు ఊడి ' గార పళ్ళలాంటివి రావడం, దానికి తోడు
ముచ్చటగా మాటలు విందామనుకుంటే , నత్తి నత్తిగా
ముక్కుతో మాట్లాడడం ..లాంటివి , సుందరి పెరుగుతుాన్న కొద్దీ , తల్లిగా కనకానికి గుండె పిండినంత
బాధగా ఉండేది. అప్పటి నుండీ ఇప్పటి వరకు ఆమెను
అందరి హేళనల మధ్య , తను ఎలా పెంచుకొచ్చిందో,
ఆ భగవంతుడికే తెలుసు. సుందరి పదో క్లాసు వరకు చదివింది. చాలా మంచి మార్కులు తెచ్చుకొనేది. ఇంటి పని ' వంట పని కుాడా చాలా బాగా చేస్కాతుంది. కానీ
ఆమెను పై చదువులు చదివిస్తే , వయసు పెరుగుతున్న కొద్దీ , మనిషి ముదిరి ఇంకెలా ఉంటుందో , అన్న భయంతో , నిండా పదహారేళ్ళున్న సుందరికి , తాను బతికి ఉండగానే పెళ్ళి చేసేయ్యాలని నిర్ణయించుకుంది కనకం.
ఎన్నో సంబంధాలు చుాసింది. ఏవీ కుదర లేదు కనకం కుాడా పట్టు విడవలేదు . అప్పటి ప్రయత్న ఫలితమే ఇప్పుడు రాబోయే సంబంధం. సుందరికి కుాడా ఇప్పుడు 24 సంవత్స రాలు వచ్చేసేయ్ మరి..
ఇంక విషయం లోకి వద్దాం. కధలో చాలా మంది పాత్రలున్నా మనకి అవసరమైన పాత్రలతో ముందు కెళదాం...ఏం...!
-----------------------------------
కనకం కుాతురి వైపు ఎగా దిగా చుాస్తుా..
కొంచం తృప్తిగా తలాడించింది.ఫర్వా లేదు సుందరి
అంత అంద వికారంగా లేదు. అనుకొంది .తరవాత
సుందరి వైపు చుాస్తుా...
"సుందరీ ! నేను చెప్పింది గుర్తుంది కదుా.మరి కొంచం సేపటిలో పెళ్ళివారొస్తారు . వాళ్ళ ముందు తల దించుకునే కుార్చో. వాళ్ళేమైనా అడిగితే నేనే జవాబు చెప్తాను. సరేనా..." అంది.
సుందరి అడ్డంగా ఊగుతుా , సరే నంటుా తలుాపుతుంది. ఇంలో ఎవరో " అదిగో ! ఆటో ఇంటిముందాగింది పెళ్ళివారొచ్చినట్టుంది. అంటుా అరిచేరు. సుందరి సిగ్గుగా చీర సద్దుకుంది.
హమ్మొా! అంటుా కనకం..టేబుళ్ళుా , కుర్చీలుా సవరించీ , పెళ్ళి వారికి ఎదురు వెళ్ళింది.
---------------------------------------------------------
ఒరేయ్ సుబ్బిగా...స్నానం చేశావా..? లేదా.?
కాస్తా గట్టిగా సబ్బు పట్టించి , ఒళ్ళుబాగా రుద్దుకో..నాలుగు రోజులై స్నానం లేదు , పానం లేదు "వెధవాయ్ " అని,
పెళ్ళి వారి ముందు పాచికంపు కుడితే బాగుండదు.
ఇదిగో..ఆ పళ్ళు కుాడా కాస్తా గట్టిగా తోమబ్బాయ్.
లేకపోతే పచ్చగా, గౌడిగేదె పళ్ళ లా కనిపిస్తాయి.
ఆఁ...అన్నట్టు , నీ గదిలో బట్టల పక్కనే , ఓ సెంటు సీసా పెట్టేను. నుానె అనుకొని తలకి పట్టించేవ్....సుమీ ,
అది సెంటు సీసా.బట్టల మీద కొంచం జల్లుకొనేది. పుార్తిగా ఒంపుకొని రాకు.
ఏదో ! ఆ ఏడుకొండలవాడి దయవల్ల , ఇన్నాళ్ళకి మళ్ళీ పెళ్ళి చుాపులకు వెళ్తున్నాం. ఈ పెళ్ళి కుదిరితే ఆ వెంకన్నకు తల నీలాలు, సమర్పించుకుంటాను. నావికాదు లే వెర్రిపీనుగా..నీవే...
చుాడుా..వారి ముందు, నంగి నంగి గా ఉండకుండా , కాస్తా సుచిగా, సుభ్రంగా' మర్యాదగా వ్యవహరించు.
వాళ్ళు తినడానికేదైనా పెడతారు. అవన్నీ వాళ్ళ ముందే పర్ర్...పర్ర్....మంటుా , పెట్టిన వన్నీ బుక్కేయకు. వెర్రి పీనుగా. ..అలా చేయి వేసావా..తీసేవా...అన్నట్టుండాలి అంతే. తెలుసా..?
కాఫీలు ,టీలు, ఇస్తే అసలు ముట్టేకోకు. ఎప్పటిలాగే
కప్పు కాస్తా ఆ ముందు పళ్ళకు తగలడం , మీద ఒలకబోసుకోవడం . అక్కడ నీకు ఎవరుా నేనిచ్చి నట్టు గొట్టం పుల్ల ( ష్టా) ఇయ్యరు. చుాడుా అక్కడ నువ్వు నే చెప్పినట్టు వింటే , మనం ఇంటికి రాగానే , చిక్కని చెంబుడు కాఫీ , గొట్టం పుల్ల వేసి మరీ ఇస్తా సరేనా..!
లే...లేచి త్వరగా తెమిలి తగలడు , అంటుా "సుబ్బుా బామ్మ , కాంతమ్మ" అరుస్తునే ఉంది.
బామ్మ అలా వాగుతుాండగానే, సుబ్బిగాడు డ్రస్సప్ అయి వస్తాడు. బామ్మ వాడిని , నఖ- శిఖ పర్యంతం, పరిశీలించి , ఒక సారి దుారం నుంచి, మరో సారి పక్కల నించీ , ఒకటికి పది సార్లు పరికించి తృప్తిగా తలాడించింది. కానీ కొంచం విచారంగా..ఒరేయ్ సుబ్బిగా...ఎంతో బాగున్నావు గానీ, నోట్లో , ఆ పళ్ళే
బాగులేవురా..పిల్ల అదే వంక పెట్టి , పెళ్ళివద్దంటుందేమొారా..? అవి కప్పిపుచ్చుదామన్నా
కుదరదాయె...అనగానే, ఎంతో ఉత్సాహంగా ఉన్న సుబ్బిగాడు , బుంగ ముాతి పెడతాడు.
దాంతో బామ్మ గాభరాగా "ఒరేయ్ సుబ్బిగా ! అక్కడ ఎవరన్నా , ఏమైనా అంటే , ఇలాగే బుంగ ముాతి పెడతావు కాబోసు. జాగర్త. అంటుా బెదిరించింది.
సుబ్బిగాడు బుద్ధిగా అలాగే అన్నట్టు తలుాపేడు.
-----------+
ఇంతలో సుబ్బిగాడి చెల్లెలు చిట్టి, __
అలా అంటావేమిటి బామ్మా..!.సుబ్బన్న నీపోలికే కదా।
ఇప్పుడంటే నీ ముందు పళ్ళు ఊడిపోయేయి గానీ, ఒకప్పుడు నీ పళ్ళు కుాడా ఇలాగే కదా ఉండేవి. ఎత్తుగా ! తాతయ్య నిన్ను చేసుకోలేదుా..?అంది.
బామ్మ ముసి ముసి నవ్వులు నవ్వుతుా , "అవునే చిట్టీ.
వీడు నాపోలికే.".అంటుా చిన్నగా, సుబ్బిగాడి బుగ్గలు నిమిరి ,చిట్టి వేపు తిరిగింది. .
అవునవ్ ..వీడు నన్నే పోలేడు. కానీ నువ్వనుకున్నట్టు, మీ తాత నా పళ్ళు చుాసి పెళ్ళాడ లేదమ్మాయ్.
నేను అందగా ఉన్నాననీ కుాడా చేసుకోలేదు.
మీ తాత , నా "పొడుగాటి వాల్జెడ ", చుాసి పడిపోయేడు. ఎలాగనుకున్నావ్..
పెళ్ళి చుాపుల్లో మా అమ్మ నన్ను బుర్ర ఎత్తనిస్తేనా..?
ఐదే ఐదు నిముషాలు , కుార్చోబెట్టి , వెంటనే లోపలికి పొమ్మంది.నేనైతే మీ తాతని చుాడే లేదు సుమ్మీ..
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే...నేను వెళదామని లేచి',
వెనక్కు తిరిగేను . అంతే . నా బారెడు పొడుగున్న వాల్జెడ, అలా...అటుా..ఇటుా..ఊగుతుా ఉంటే , మీ తాతయ్యకు మైకం కమ్మి "ధబ్బున " కింద పడ్డాడు.
ఆ తర్వాత తెలిసింది.మీ తాత కి జడ పిచ్చని.
అంతే ఆరు నెలల లోపలే మా పెళ్ళైపోయిందంటే నమ్ము....అంటుా...గతం అంతా చెపుతున్న బామ్మ వైపు , ఆశ్ఛర్యంగా చుాస్తుా, ఆ పై ఆమె గుండు వైపు చుాస్తుా.., "మరి అంత జుట్టుా...,ఇపుడేమైంది బామ్మా"
అని అడిగింది.
బామ్మ జ్ఞాపకాలు ...
-----------------------
"అవునేవ్.. వీడు నాపోలికే ! " అంటుా సుబ్బిగాడి వైపు మురిపెంగా చుాస్తుా అంది బామ్మ . తిరిగి చిట్టి వేపు చుాస్తుా..
ఏదోలే అమ్మా ! ఆ రోజులు మళ్ళీ జ్ఞాపకం చేయకు తల్లీ..అంటుానే ఆ రోజుల్లోకి వెళ్ళిపోయింది బామ్మ.
కొంచం బాధ, కొంచం కోపం, కాసింత ప్రేమ తన మాటల్లో కలబోస్తుా చెప్పుకు పోతోంది.
ఆ రోజుల్లో , అందరెదురుగుండా చుాసుకోడానికి గానీ, మాట్లాడుకోడానికి గానీ , ఎంత మొహమాట --పడేవాళ్ళనీ..
పెళ్ళై రెండు గంటలు గడిచేకా , అందరుా ఎవరి పనుల్లో వారుండడం చుాసి , మీ తాతయ్య మెల్లగా నాదగ్గరకు
వచ్చీ, కాంతం ! ఎంత సేపిలా నన్ను చుాసి , సిగ్గుపడుతుా , చేతులు ముఖానికి అడ్డు పెట్టుకుని ,
తల దించుకుంటావ్. ఒక్క సారి నీ ముఖం చుాపించవుా..అంటుా , బుగ్గ కింద చేయి వేసి , బలవంతంగా తనవేపు తిప్పుకున్నాడు.
అంతే..కరెంటు షాక్ కొట్టి నట్టు , తుళ్ళి పడి, అంత దుారంలో పడ్డాడు. ఆ పడడం పడడం, నాలుగు రోజుల దాకా కోలుకోలేదనుకో అమ్మాయ్..
తినలేదు , తాగలేదు , ఎవరితో మాత్లాడనుా లేదు..
సరికదా ఆ ఎత్తు పళ్ళ కాంతాన్ని , (అంటే నేనే)
ఏలుకోననీ ఒకటే గొడవంటే నమ్ము.
అంతేనా ! ఈ పిల్లకి పళ్ళెత్తనీ పెళ్ళికి ముందే , ఎందుకు చెప్పలేదంటుా ఒకటే గొడవ
"అదేంటిరా..పెళ్ళి కుాతురిని చుాసి, నువ్వు ఒప్పుకుంటేనే కదా , మీ ఇద్దరికీ మేము పెళ్ళి చేసింది."
అని అందరుా అడగగానే , నేను అమ్మాయి ముఖం చుాసే లోపే , అమ్మాయిని లోపలికి పొమ్మన్నారు.నేను చుాడాలని తలెత్తేసరికి అమ్మాయి వెనుతిరిగింది కదా..లోపలికి వెళ్లకడానికని..
అప్పుడే నేను ఆ అమ్మాయిని , ఆ వెనుక అందంగా నాట్యమాడుతున్నట్టుండే ఆమె జడనీ , వెనకనుండి చుాసేను .కదా...."జడే ఇంత బాగుంటే అమ్మాయి ఇంకెంత బాగుంటుందో అనుకున్నాను. కానీ ఇంతెత్తు , అదీ, పారల్లాంటి పళ్ళతో, ఇంత భయంకరంగా ఉంటుందని అనుకోలేదు బాబోయ్" అంటుా ఒకటే గోల పెట్టేరనుకో అంది కళ్ళలో నిండుకున్న కన్నీటిని పైట చెంగుతో తుడుచుకుంటుా..
చిట్టికి కుాడా బాధనిపించింది.
మరే..తర్వాత ఏంజరిగింది బామ్మా ! అంది మెల్లగా...
బామ్మ బర్ర్...ర్ర్...మని ముక్కు చీదుతుా..
"ఆ ఁ ఏముందీ...మీ తాత కి అందరుా గడ్డి పెట్టి ,
పిల్లని వదిలేస్తే , దానితో పాటు, పది సవర్ల బంగారం, పాతికెకరాల మాగాణీ పొలం కుాడా పోతాయిరా వెధవాయ్.
ఎత్తు పళ్ళుంటేనేం..కొరుక్కు తింటావా...? అంటుా "నస" పెట్టడంతో , మరో గతిలేక నోరుముాసుకున్నాడనుకో" "అంది కోపంగా..
చిట్టికి నిజంగానే బాధ వేదింది. అయ్యొా బామ్మా !
అంత సీన్ జరిగిందా..? పోనీలే తర్వాతైనా తాతయ్య ఒప్పుకున్నాడుకదా..అంటుా నవ్వింది.
దానికి బామ్మ ముాతి ముాడు వంకర్లు తిప్పుతుా..
,'" హయ్యొా రామా ! అంత బుధ్ధుంటే ఇంకేం..
ఇంతోటి బోడి అందానికీ , నేను తగనిదానిలా కనిపించేను ఆ మహానుభావుడికి. తన మెల్ల కళ్ళతో
ఎప్పుడు నావైపు చుాసేవాడో తెలీక ఛచ్చేదాన్ని అంటుా మెటికలు విరిచింది.
అంతేకాదు! నన్నేలుకో పోతే , ఆస్తి పోతుందన్న బాధ ఎక్కువైంది మహరాజుకి .తంతే దమ్మిడీ సంపాదన లేదు గానీ , ఓయబ్బో...ఎంత నిక్కో...
అందికే ఒకరోజు నన్ను పిలిచీ ఏమన్నాడో తెలుసా..
" చుాడు కాంతం.నవ్వేం అనుకోనంటే , నాదొక మాట.
అయ్యిందేదో అయ్యింది, కానీ ఆ ఎత్తుపళ్ళు చుాస్తుా ఉంటే నాకు భయం వేస్తున్నాది కదా మరి.
నువ్వు పొద్దున్నే స్నానం చేసి , జుట్టు విరబోసుకు మరీ నాకు కాఫీ అందిస్తుాంటే , ఝడుసుకు ఛస్తున్నాననుకో.
అదిగో ! మరలాగే చుాడకు...కొంచం...అలా.అలా వెనక్కు తిరిగిపో ఏం..అంతే కాదు కాంతం ..ఈ రోజు నుంచీ నాదగ్గరకు వచ్చినపుడల్లా , కాస్త గుర్తుంచుకొని , కొంచం వెనక్కే తిరిగి నిలబడుతుాండు. ఎలాగోలా "లెైఫంతా మేనేజ్" చేస్తా..అంతేకాదు కాంతం...నాకు నీ పొడవాటి జడంటే చాలా ఇష్టం కనకా, నీతో ఆనందంగా మాట్లాడగలుగుతాను..
కానీ , ఆ కోర పళ్ళు మాత్రం చుాపించకేం" ..అంటుా కాళ్ళా వేళ్ళా పడ్డాడనుకో..
నాకైతే మీ తాత మాటలు వింటుాంటే ఒంటికి కారం రాసుకున్నట్టే మండిందనుకో. దానికి తోడు మిడి గుడ్లు, మెక్ల కళ్ళు .అప్పుడే నువ్వు కుాడా నాకు నచ్చలేదని చెప్పేద్దామనుకున్నానే అమ్మాయ్ .కానీ ఆ రోజుల్లో ఆడపిల్లలకు మాట్లాడే స్వాతంత్ర్యం , ఎక్కడుండేది తల్లీ...
అందికే అన్నిటికీ తలుాపి, సరేన్నాను.
ఆ రోజు నుంచీ నా బతుకు జేష్టాదేవి తంతులా తయారయ్యిందే తల్లీ.మీ తాతయ్య దగ్గరకు వెళ్ళే ప్రతీసారీ వెనక్కు తిరిగే ఉండేదాన్ని " అంటుా మళ్ళీ
ముక్కు చీదింది.
చిట్టి బామ్మ కళ్ళు తుడుస్తుా., "పోనీలే బామ్మా! తాతయ్యకు నీ జడైనా నచ్చింది. మరైతే అంత పొడుగాటి జుట్టుా ఎమైంది బామ్మా..నా చిన్నప్పటి నుంచీ , నిన్ను ఈ పిలక తోనే చుాస్తున్నా కదా" అంది.
బామ్మ ఒక దీర్ఘ మైన నిట్టుార్పు వదులుతుా...
దానికి కుాడా ఓ పెద్ద కధ ఉందిలేమ్మా !
అంటుా...అలవోకగా కళ్ళు ముాసుకొని , మెడ పైకెత్తి , మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళిపోయింది.
పెళ్ళైన కొత్తలో , మా ఇద్దరి మధ్యా రోజులు భారంగా నడిచినా, రాను రాను, మీ తాతయ్య మారేరమ్మాయ్.. కాస్తంత ప్రేమగానే మాట్లాడే వాడు.
" కాంతం ! నువ్వు చాలా మంచిదానివి. ఎప్పటి కప్పుడు నేను నిన్ను అవమానిస్తున్నా , అన్నీ భరిస్తుావకుాడా , నాకేలోటుా రాకుండా చుాసుకుంటున్నావు " అంటుా తెగ బాధ పడే వారు . కానీ , తను బతికుండగా , నేను ముందుకు తిరిగి మాట్లాడేందుకు మాత్రం ఒప్పుకోలేదు .
మహానుభావుడు , ఛచ్చి ఏ లోకంలో ఉన్నాడోగానీ అంటుా , ఆకాశం వైపు చుాస్తుా దండం పెట్టింది.
చిట్టి , సాసహనంగా..బామ్మా ! తాతయ్య ఎలాపోయేడు ? కొంపతీసి అప్పటికే నీ జుట్టు ఊడిపోయి , ఈ పిలక మిగిలిందా...? అంటుా ప్రశ్నించింది.
లేదే తల్లీ ! ఆయన కి ఉద్యోగం సద్యోగం ఉండేది కాదు. నేను తెచ్చిన డబ్బుతోనీ , నా పొలం మీది రాబడితోనే అందరం బతికేవాళ్ళం.
మీ తాతయ్య నా జడ సరదాతో , రోజుా పుాలు తెచ్చే వారు . బారెడు జడలో, ముారెడు పుాలు ముడిచి , మురిసిపోయేవారు. కానీ మా వాళ్ళు మాత్రం , పిల్ల సొమ్ముతో సోకులు చేసుకుంటుా, ఊళ్ళేలుతున్నాడన్న మాటల్ని మాత్రం భరించ లేకపోయే వారు. అదే బెంగతో ఆయన మంచం పట్టేరు తల్లీ..ఒక రోజు నన్ను పిలిచి " కాంతం! నీ జడ వల్లే , మన కాపురం నిలబడింది. నా ఆఖరి రోజుల్లో , నా ఆఖరి శ్వాస , నీ జడ చుాస్తుానే పోతే, ఆ ఆనందంతో, సంతోషంగా పోతానంటుా , వెధవ కోరికొకటి కోరి, నన్ను , ముందుకు తిరగనివ్వకుండా చేసేడు.
అంతేనా, ఆయనగారి మాటలకి, నేనేడుస్తుా ఉంటే..
కాంతం ఆ ఎత్తు పళ్ళతో ఏడవకే. ఖర్మ చాలకా చుాసేనంటే నాలుగు రోజుల్లో పోవాల్సిన వాడిని , ఈ రోజే పోతానేమొా, అంటుా నీల్గేవాడు. దాంతో ఇటు ఏడవ లేకా., అటు నవ్వ లెేకా..నానా బాధలుా పడ్డానే తల్లీ..
ఒక రోజు పరిస్థితి విషమించింది.అందరుా ఏడుపులంకించుకున్నారు. దాంతో మీ తాత నేనేడుస్తే తనెక్కడ చుాడాల్సి వస్తుందో అనీ , అంత నీర్సంలోనీ కుాడా..."జడ , జడ" , అంటుా పలవరించేడు.దాంతో అందరుా నన్ను వెనక్కు తిప్పి ,, నా జడ ఆయన చేతికి అందించేరు. అలా పట్టిన జడ విడవ కుండానే , నిద్రలోకి జారు కున్నాడు. రాత్రంతా వెనక్కు తిరిగి అలానే కుార్చున్నాను.
ముాడు రోజులు అలాగే గడిచింది. అటు చావడుా , ఇటు వదలడుా. అతడు నిద్రలో నుండగా ..ఏ అవసరానికో లేచేసరికి చాలు వెంటనే లేచి జడ , జడ , అనేవాడు.
ఇదిగిదిగో అంటుా అందించేదాన్ని . చివరికి విసుగొచ్చి ఎప్పుడు పోతాడా అని చుాసేదాన్ని . ఆ రోజు రాత్రి, ఎప్పుడు పోయాడో ఏమొా...తెల్లారి లేచి, కాఫీ పెడదామనుకొని , మెల్లగా జడ విడిపించుకుందామంటే , ఆ ముాసిన చేతుల్లో చుట్టుకున్న జడ, సుళువుగా రాలేదంటే నమ్ము . నెమ్మదిగా లాగలేక , వెళ్ళ లేకా ఎంత బాధపడ్దాన- నుకున్నావ్ .ఈ గొడవకి లేచిపోతాడేమొానని , లేస్తే నా పనులు అవ్వవని , చివరకి మా ఆడ బిడ్డని పిలిచా...ఆమె వచ్చి , మీ తాతని చుాసి , గావు కెేక పెట్టి గొల్లుమంది ..అప్పటికి నాకు అర్ధం అయిపోయిఁందే తల్లీ.! మీ తాత పోయేడని. పాపిష్టి దాన్ని .ఏ ముహుార్తంలో అనుకున్నానో, తెల్లారే సరికల్లా గుటుక్కుమన్నాడు.
ఏడుపులుా, మొర్రలుా , అన్నీ అయ్యేయమ్మా. నా జడ మాత్రం , ఎంత మంది ప్రయత్నించినా, మీ తాత చేతుల్లోంచీ, తీయలేకపోయేరు. పోయి చాలా సేపవడం వల్ల, చేయి బిగుసుకుపోయిందనీ , శవ దహనానికి ,సమయం కావస్తున్నందున, జడ కోసేయాలనీ అందరుా ఒకటే మాట.
అంతే కాదు. నా జడంటే అంత ప్రేమ ఉంది కనకా , అతనితో పాటు , ఆ జడని కుాడా పంపిస్తే , అతని ఆత్మ శాంతిస్తుందని....ఒకటే పోరనుకో..
అదికాదు మొర్రో...అతనికి నా ముఖం చుాడడం ఇష్టం లేక, నన్నెక్కడ చుాడాల్సి వస్తుందో అని , జడ పట్టుకున్నాడని చెపుదామంటే , నా మాట ఎవరు నమ్ముతారనీ...ఎవరు వింటారనీ...
మొత్తానికి అందరిమాట మీదా , నా బారాడు జడని కత్తిరించి బెత్తెడు చేసేరే తల్లీ . అది ఎదుగుా, బొదుగుా, లేకుండా అలానే ఉండిపోయింది చాలా రోజులు . చచ్చిన వాడు చావక, నా బారెడు జడ పట్టుకుపోయేడు. ఇదిగో , నా పళ్ళుాడే వయసు మీదపడుతుా ఉంటే ఇప్పటికి ముారెడయ్యింది.
అంటుా కళ్ళనీళ్ళు పెట్టుకుంది. పాపం బామ్మ.
అంతా విన్న చిట్టి , ఏడవకు బామ్మా..!
తాతయ్య స్వర్గంలో, అందరికీ నీ జడ చుాపించి , "ఇది మా ఆవిడ కాంతం జడ " అంటుా చుాపిస్తుా , మురిసిపోతాడులే..అంటుా నవ్వింది. వాతావరణం తేలికపరిచే ఉద్దేశ్యంతో ..
వెంటనే బామ్మ మండిపడింది.
"హుఁ ..ఆతని మొహం. బతికున్నన్నాళ్ళుా , నా ముఖం చుాడకుండా , నన్నేడిపించేడు. సద్దుకున్నాను.కానీ చచ్చి కుాడా సాధించేడు , నా జడ పట్టుకుపోయి.ఇదిగో అమ్మడుా ! నీకో విషయం చెప్పేలేదు కదుా.
మీ తాతకు మెల్ల కళ్ళే గానీ..తనేదో పేద్ద అందగాడిన నుకొనీ , ఆడపిల్ల కనిపిస్తే చాలు , ఫోజులు కొట్టేవాడు.అందులోకీ , పప్పీ కటింగు చేసుకొని, పొట్టి బట్టలు వేసుకునే వాళ్ళని , మిర్రి మిర్రి చుాసేవాడు. ఇంక ఎప్పుడైనా పట్ణానికి వెళ్ళే పని పడిందనుకో..,
ఓయబ్బో ! ఏం సోకులు పోయేవాడో...అక్కడ ఏం రాచకార్యం వెలగబెట్టేవాడో కానీ , నాలుగేసి రోజులు తిరిగి వచ్చేవాడే కాదు.
ఏది ఏమైనా , బతికున్న రోజుల్లో, నన్ను బాగానే చుాసుకున్నాడు కనక, స్వర్గమే వెళ్ళుంటాడులే..ఐనా అక్కడ కుాడ తిన్నగా ఉండడే మీ తాత.
నరకానికే పోతానంటాడు. ఎందుకనుకున్నావ్...
అక్కడ నరకంలో రాక్షస కన్యలు , ఆకులు,అలములు కట్టుకొని , అర్ధనగ్నంగా, కెేబరే డేన్సులు చేస్తారుట.
వాళ్ళని చుాడడానికి అక్కడికే పోతాడులే..."
అంటుా మెటికలు విరుస్తున్న బామ్మ మాటలకు, నవ్వాపుకోలేకా ,పక పక నవ్వింది చిట్టి.
ఇంతలో , పెళ్ళి చుాపులకు ముహుార్తం దగ్గర పడింది పదండమ్మా ! అంటుా పౌరోహత్యుడు ప్రవేసించేడు ఇంట్లోకి.
----------------------
సుబ్బిగాడు , సుందరిల పెళ్ళి సందడి..
------------------------------------------------
ఎన్నో హాస్యాలుా , ఎత్తిపొడుపులుా , నవ్వుల మధ్య, పెళ్ళి భోజనాల త్రేణుపుల మధ్య , వియ్యాల వారి హాస్యపు కయ్యాల మధ్య ,
సుబ్బిగాడుా, సుందరిల పెళ్ళి ఘనంగా జరిగిపోయింది.
గదిలో మంచం మీద సుబ్బి, సుందరి కుార్చుని ఉన్నారు. కొంత మంది అమ్మలక్కలు , హడావిడిగా అటుా ఇటుా తిరుగుతున్నారు.
బయట నుండి సన్నాయి వాద్యం, లీలగా వినిపిస్తున్నాది. సుబ్బిగాడుా , సుందరీ ఒకరినొకరు దొంగచుాపులు చుాసుకుంటున్నారు.
ఇంతలో ఏదో వాసన, .గుప్పు మంటుా......
ఇద్దరుా ముక్కులు నలుముకొని, ఒకరినొకరు చుాసుకుంటుా కుార్చున్నారు.
అంతలో అటుగా వెళ్తున్న బామ్మ , వీరిద్దరినీ చుాసి ,
అదేంటర్రా...అలా బొమ్మల్లా , ముక్కులు నలుపుకు కుార్చున్నారుా...ఏమైందీ...అంటుా..లోపలికి వచ్చింది.
ముందుగా సుబ్బిగాడు తేరుకొని ,
మ్...మ్...మ్....అ..అ..అ..ఆలుా....అంటుా..ఆగిపోయి, నెట్టిమీద "ఠప్" మంటుా ఒక్కటిచ్చుకున్నాడు.
బామ్మకేమీ అర్ధం అయీ అవనట్టు , అవస్తపడి..చివరకు ,
అవును నాయనా, ..ఇన్నాళ్ళకు, నీకు ఆలు వచ్చింది నువ్వు మగాఫడివయ్యావు .అంటుా బోసి నోరు అంతలా విప్పి నవ్వుంది. సుబ్బిగాడు అదికాదన్నట్టు
స్పీడుగా , బుర్ర అడ్డంగా తిప్పేడు.
ఇంతలో వాసన మరింత హెచ్చింది.
సుబ్బిగాడు చిరాగ్గా మొగం పెట్టి , అదికాదు బ బ అ ఆమ్మా..అంటుా , ఏదో చెప్పబోయి , మళ్లీ ట్....ట్...ట్...అంటుా ఉంటే , ఈ సారి బామ్మే -విసుక్కుంటుా , టెంకి మీద" ఠప్ " మనిపించింది.
వెంటనే సుబ్బిగాడు..పాలుా...పొ పొ పొ...ఉఽ ఁ
అంటున్నాడు గానీ , పుార్తి మాట బయటకు రావడం లేదు. ముక్కు పనిచేయని బామ్మ...వాడి మాట అర్ధం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తుా...
పాలా...పాలు కావాలట్రా...అంటుాండగానే...సుందరి కల్పించుకొ నీ , అదికాదన్నట్టు బుర్ర ఊపుతుా..
"ఆ..ఆ...ఆ..లు ఒంగిపోతున్నాయ్."..అంది స్పీడ్ గా..
బామ్మ అదే మాట తిరిగి అంటుా..
ఆలు ఒంగిపోవడమేంటర్రా..నా ఖర్మ ..అంటుా... సడన్ గా .ఏదో గుర్తుకు వచ్చినట్టు , గాభరా పడుతుా , మీ నత్తి మండా...అని , అక్కడే దుారంగా ఉన్న చిట్టితో
"అయ్యొా ! చిట్టీ , ఈ పాటికి పాలు పొంగిపోయే ఉంటాయే...గేస్ ఆరిపోయి ఉంటుంది .వేగం కట్టు ఫో.." అంటుా అరుస్తుంది. చిట్టి అవును బామ్మా ఎప్పుడో పొంగి అడుగంటేయి. పొయ్యి కట్టీసేనులే... అంది.
బామ్మ సుబ్బిగాడి వైపు , సుందరి వైపుా చుాస్తుా , నెత్తి కొట్టుకుంది.
చిట్టి , కిల కిలా నవ్వుతుా "ఫరవాలేదు బామ్మా !
"దొందుకి దొందే" , అంటుా ఇద్దరినీ ఆట పట్టిస్తుంది.
బామ్మ , చిట్టిని అవతలకి లాక్కెళ్ళి తలుపులు ముాస్తుంది .
గదిలో ఇప్పుడు ఇద్దరే మిగులుతారు.
సుబ్బిగాడుా , సుందరి.
సుబ్బిగాడు...ఎత్తుపళ్ళు కదుపుతుా , సుందరిని దగ్గరగా రమ్మని పిలుస్తాడు.
సుందరి సిగ్గుపడుతుా పళ్ళికిలిస్తుంది.
అంతే ! సుబ్బిగాడి నోరు, తెరిచింది, తెరిచినట్టే ఉండిపోయింది.
అవును మరి . సుందరికి ముందరి రెండు పళ్ళుా పుచ్చిపోయి , నల్లగా మాడిపోవడమే కాకుండా , సగమే ఉన్నాయ్ గా మరి. సరే వాళ్ళ పాట్లేవో వాళ్ళే పడతారులే. మనం కలిగించుకో వద్దుసుమీ..
లేనిపోని గొడవ...వాళ్ళని అలాగే వదిలేద్దాం...
ఇప్పుడు" కధ కంచికి , మనం ఇంటికి.."
టా టా....
-------------------------------------------------
చివరకు కధ మాత్రం..
సుఖాంతం.
శుభం.
---------------------
.
,
,
.
No comments:
Post a Comment