04/08/2023.
పద్య కథా సౌరభం సంకలనం కొరకు ,
అంశం : "సుమతీ శతకం"లో ఒక పద్యం.
శీర్షిక : మనుజ తెలుసుకొనుము మంచి మాట.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల. జగదీశ్వరీమూర్తి .
కళ్యాణ్ : మహారాష్ట్ర .
8097622021
పద్యం :
-------
నడువకుమీ తెరువొక్కట
కుడువకుమీ శత్రునింట కూరిమి తోడన్
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ!
"బద్దెన" మహాకవి రచించిన "సుమతీ శతకంలోని "ఒక పద్యం ఇది
పద్య భావం :
----------
మానవులంతా జీవితంలో అందరితో, ఏ విధంగా మసలుకోవాలి, పరుల మనసు నొప్పించిన విధంగా
ఎలా మాట్లాడాలి , పర ధనముల కొరకు ఆశ పడకూడదు అనే విషయాలను , బద్దెన ,తన సుమతీ శతకంలోని ఈ పద్యంలో చక్కగా వివరించాడు.
నీతి కథ.
---------
ఒక ఊర్లో రంగయ్య అనే మోతుపరి రైతు ఉండేవాడు .
అతనికి కిష్టయ్య అనే ఒక కొడుకు ఉన్నాడు .
లేక లేక కలిగిన సంతానం కావడంతో, అతన్ని చాలా గారం చేసేది తల్లి.
తండ్రి రంగయ్య మాత్రం ,ప్రపంచంలో బతకాలంటే , మంచి మాట, మంచి బాట ,ఉండాలని, వాటిని అలవర్చుకోమని కొడుక్కి పదే పదే చెబుతూ ఉండేవాడు..
ధనానికి లోటు లేని కృష్ణయ్య
చీటికి మాటికి అందరినీ గేలి చేస్తూ, అవమాన పరుస్తూ, ఉండడంతో కిష్టయ్య మీద కోపంతో, అందరూ అతనికి దూరంగా ఉండసాగారు.
చెడు స్నేహాలు ఎక్కువై, చెడు అలవాట్లకు లోనైన కిష్టయ్యతో , ఎవరూ ఎక్కువగా మాట్లాడే వారు కాదు .
కృష్ణయ్య తో స్నేహం చేసిన వాళ్లలో, రాజు, రంగా అన్న వారిద్దరు మాత్రం కృష్ణయ్య వల్ల చాలా అవమాన పడి, కృష్ణయ్య పై ప్రతీకరం తీర్చుకునేందుకు అవకాశం కోసం
ఎదురు చూడ సాగారు
---------------------
స్కూలు రోజుల పూర్తయ్యాయి.
కిష్టయ్య, తండ్రి సంపాదించిన డబ్బుతో జల్సాలు చేయడం వల్ల , ఆస్తంతా హరించుకు పోయింది .
దాంతో కృష్ణయ్య, తన చెడు అలవాట్లు మానలేక ,
ఎవరినో ఒకరిని మోసగించో, లేదా, అవకాశం దొరికినప్పుడు దొంగిలించో, తన అవసరాలను తీర్చుకునేవాడు.
కృష్ణయ్య కున్న చెడు అలవాట్ల సంగతి,
సంపాదనాపరుడు, కాడన్న సంగతి తెలిసి,
వయసు మీరుతున్నా. ఎవరూ కృష్ణయ్యకు, పిల్లను ఇవ్వడానికి ముందుకు రాలేదు.
ఇటు డబ్బూ లేక ,అటు పెళ్లీ కాక, అసహనంగా ఉన్న కృష్ణయ్య ఎలాగైనా తను ఒక పిల్లని పెళ్లి చేసుకుని, తనను తాను నిరూపించుకోవాలనే ఉద్దేశంతో , దొంగతనంగా ఒకరింటట్లో ఉన్న డబ్బుంతా ఎవరికీ తెలియకుండా తీసుకొచ్చి , ఉద్యోగం ఇప్పిస్తామన్న రాజు, రంగాల చేతిలో పోసాడు.
ఆ డబ్బంతా తీసుకున్న రాజు రంగాలు , తమ ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చిందని గ్రహించి, కిష్టయ్యకు రాత్రి భోజనంలో, ఏదో ముందు కలిపి తినిపించి, డబ్బులు పట్టుకొని పారిపోయారు...
కల్తీ భోజనం తిన్న క్రిష్టయ్య జబ్బు పడి, నెల రోజుల దాకా కోలుకోలేకపోయాడు.
దొంగతనం విషయం ఆరా తీసిన పోలీసులు కృష్ణయ్యను జైలులో పెట్టారు.
ఊరు వాళ్లంతా కృష్ణయ్య ఈ విధంగా చెడిపోవడానికి ,
జైలు పాలు కావడానికి, పెళ్లి కాకకుండా ఉండి పోవడానికి కారణం, అతని నోటి దురుసు తనమే గాక , తల్లిదండ్రులు చేసిన గారమే కారణమని ,అనుకోవడం మొదలెట్టారు.
అన్ని విధాలా దివాలా తీసి, అవమానం పాలైన కృష్ణయ్య
తల్లిదండ్రులు , మనోవ్యాధితో, మంచం పట్టి మనస్తాపంతో , కాలం చేశారు.
కృష్ణయ్య , తల్లిదండ్రులు లేక ,స్నేహితులు లేక , తోడు ఎవరూ లేక, ఒంటరితనంతో మానసికంగా
కృంగి పోయాడు.
కధలో నీతి :
1.తోడు లేకుండా ఒంటరిగా ఎక్కడికీ వెళ్లవద్దు.
2. శత్రువైనవాడు తినడానికి ఏవైనా పదార్థాలను స్నేహంగా పెట్టినప్పటికీ, ఏమీ తినవద్దు.
3. ఇతరులకు సంబంధించిన ఏ వస్తువునూ తీసుకోవద్దు.
4. ఇతరుల మనసుబాధపడేలాగ మాట్లాడవద్దు !!
ఇలా, మంచి సందేశాలు ఇస్తున్న పద్యాలు ఎన్నో, ఈ సుమతీ శతకంలో ఉన్నాయి. ఈ పద్యాలు అందరూ చదవండి., అందరి చేత చదివించండి.
మరోసారి, మరో పద్యంతో కలుసుకుందాం .
"శుభం".
******************************************
No comments:
Post a Comment