Friday, September 8, 2023

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పాట

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా
ప్రక్రియ : పాట:

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .


చిన్ని కృష్ణయ్య అల్లరింక చాలు చాలయా
వెన్న దొంగ వన్న పేరేలగ వేడ్క లేలయా !!
వన్నె చిన్నిలున్నవాడ వెన్నదొంగ వేగ రావయ్యా
అన్నె మెరుగనీ సఖియను నన్ను బ్రోవ రావయా !!

రేపల్లెలో వాడ వాడ తిరుగుతావయ్యా
దొంగ చాటుగాను ఇంటింటా దూరుతావయ్యా
వారు దాచుకున్న పాలు పెరుగు తాగు విందులేలయా
వారు కొట్టబోతే చిక్కకుండా పారిపోవుటేలయా!!

మాత నిన్ను రోట కట్ట మాయ చెట్లగూల్చావు
పాపాలను గొట్టి   యక్ష తాపాలను దీర్చావు
మన్ను తిన్న  నోటిలోని మాయలెన్నో చూపావు 
రేపల్లియ వాడలోన." రేడు"వై వెలిగావు !!

గోవర్ధన గిరి నెత్తి గో, బాలుర గాచావు
కాళీయుని పడగలెక్కి పింఛమణచి వచ్ఛేవు
వేల రక్కసుల మూకను వేడుక దునుమాడావు.
కొల్లలైన  లీలలతో. గొల్ల పల్లె నేలేవు  !!

పొన్న చెట్టు నెక్కి మురళి నూది, దాగుటేలయా !!
పొంచి,  గోపెమ్మలు తానమాడ  కిలకిల నవ్వేలయా
దాచి, వలువలన్ని  ,వారి మనసు దోచినావయా
ఆటలాడి- పాడి, అలసి -సొలసి, సోలి నావయా !!

నంద యశోద బాల నమ్మినాము నిన్నయా
బృందావన వనవిహారి భూరి కరుణ నీదయా
చిందులేయు సిరి పదముల విందు జేయరావయా
బంధుడవు మాకిల నువు, బంధమేల రావయా !!

************************************

No comments:

Post a Comment