అంశం: సురవరం - తెలుగుజాతి వరం.
శీర్షిక : బహుముఖ ప్రజ్ఞాశాలి .
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .
నిజాం నిరంకుశ పాలనలో
మతం మాధ్యమంగా చేసుకొని
తెలుగు భాషా సంస్కృతులకు
జరిగిన అవమానం .॥
వ్యవహారిక భాషగా ఉర్దూ భాషకు పట్టం.
తెలుగు జాతి సంస్కృతిని సాంతం,
కాలరాయడానికి చేసిన ప్రయత్నం.॥
తెలుగు గ్రంథాలయాల ఏర్పాటును
నిషేధించిన నైజాం తెలుగు సభలు,
సమావేశాలకు తమ అనుమతి
కోరలన్న అహంకారపుారిత శాశనాలు॥
తెలుగువారి అణచివేతల కారణంగా
కలం ఎక్కుపెట్టిన సురవరం, నిజాం
నిరంకుశ పాలనను విమర్శిస్తూ
నిర్భయంగా రాసిన ఎన్నో వ్యాసాలు
ప్రజలలో తెచ్చిన చైతన్యం ॥
ప్రజా శ్రేయస్సే జీవిత పరమార్ధగా
ప్రతిష్టాత్మక సంస్థల ఉన్నతి, సురవరం-
ప్రతాపరెడ్డి సాధించిన ఘన విజయం.॥
తెలుగువారి ఘనతను చాటిచెప్పిన
ధీశాలి సురవరం ప్రతాపరెడ్డి గారి జయంతి
సందర్భంగా ఇదే వారికి నా ఘన నివాళి ॥
No comments:
Post a Comment