Wednesday, March 6, 2024

మాతృ భాషా పరిరక్షణ

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .

కల్యాణ్ : మహారాష్ట్ర .

శీర్షిక : మన మాతృ  భాషను మనం కాపాడుకుందాం.



దేశంలో అనేక ప్రాంతాలు ఉన్నాయి

ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష.

ఏ ప్రాంతంవారికి ఆ ప్రాంతంలో 

మాట్లాడే భాష వారికి మాతృ భాష .!!


ఎవరి భాష వారికి గొప్ప.

వ్యక్తి జీవన పరమార్ధిక విషయాలు 

 మాతృభాషలో అర్ధం అయినట్టుగా

 మరొక భాష ద్వారా అర్ధం కావు.!!


అటువంటి మాత్రం భాషకు 

ఆయువు పట్టు వంటిది సాహిత్యం.

అటువంటి సాహిత్యానికి  నిధి పుస్తకం.

పుస్తకాలకు నిలయం గ్రంధాలయం!!


పుస్తక పఠనం తెలియజేసేది మన సంస్కృతి ,

సంప్రదాయాలను తెలియజేసేది మన చరిత్ర.

"దేశభాషలందు తెలుగు లెస్స "అని నానుడి.

వ్యాకరణం ఛందస్సులతో నిండిన నుడి. !!


విషయ విజ్ఙానాన్ని పెంచే చదువు "నిధి"

జ్ఞాన ,వివేకాలను  పెంచే ఆదర్శాల "పెన్నిధి ".

పురాణేతిహాసాలలో నిండిన సాహిత్య "సడి"

జీవితాలకు మనుగడ నేర్పించే "నడవడి" !!


జీవితానికి సారమిచ్చే సాహిత్యాన్ని కాపాడుకుందాం.

 పుస్తక పఠనంతో   మన జ్ఞానాన్ని పెంచుకుందాం..

మన భాషను మనం గౌరవించుకుందాం.




 

No comments:

Post a Comment