శివ -శక్తి -స్తోత్రం.
రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి.
కామ దహన శివ దురిత హరణ
భవ కాల హరణ హర సదా శివ.
గంగ జటాధర గౌరీ మనోహర.
అంగభూతి ధర హర హరోం హారః !!
కామ దహన శివ నామ ప్రళయకర
నాట్య భయంకర ప్రభు అభయంకర.
నాద వినోద సు నాదానందిత
వందిత సురగణ రంజిత మునిగణ !!
చంద్ర చూడ ఘన మంద హాస ,గళ
ముండ మాల ధర , మంగళాననా
బంధ మోచకర వందనాది , సుర,
భంజనా ద్యసుర వంద్యముని జన !!
సర్వేశ్వర శర్వ సర్వాత్మకా
శర్వరీ తేజ ఓంకార నాదాత్మకా !!
సర్ప భూషాంగనా , కంఠ విష ధారణ
దండ దుష్టాది, కందర్ప దర్పాది భంగా !!
పర్వతేందు ప్రియా సర్వ భూత క్రియా
నిర్వికల్ప ప్రభావా నిత్యగంగా ప్రవాహా
భవా భూతనాధా భవానార్థ కాయా !!
త్రిలోకాది ఈశా త్రినేత్ర ప్రకాశా!!
లోకోద్బవా దురిత సంహారకారి.
పురారీ , దక్షాధ్వర ధ్వంశకారీ
భస్మానులిప్తంగ భవాన్మోదకారి
ప్రభూ చంద్రధారి ప్రపంచాధికారి!!
సర్వ మంగళ మధుర స్వరూపిణి
మాత మా దుర్గ మాంగళ్య కారిణి
సప్త వర్ణ మయ మాలా భూషణి
వర్ణ భేదినీ వర్ణ మోదినీ!!
చందన కుంకుమ గంధ మాలినీ.
ఆర్తత్రాణ పరాయణీ ఘనీ
అఖిల నాథు ప్రియ అర్థ శరీరిణి.
ఆపదోద్దారి ణాశ్రితపోషిణి!!
మంగళ కారిణి అమంగళ తోషిని
మాత మా దుర్గ మధుర సుభాషిణి.
ఆనంద రూపి, శివార్థ శరీరిణి.
పాహి పాహి జయ పర్వత వర్ధిని!!
---------------------------
No comments:
Post a Comment