కర్మ గీతం ( జీవన వేదం )..
రచన: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ మహారాష్ట్ర .
రాగం : శుభపంతువరాళి. ( ముల్తానా)
పల్లవి:
ఏనాటి కర్మల ఫలమొా గానీ
ఈ నాటి నా గతి ఈ విధి సామీ ॥
అనుపల్లవి:
నానాటి బ్రతుకులు నాటకమే సుమ్మి
సుఖ దుఃఖ బంధాల అనుభవముల చెలిమీ ॥
1. చరణం
కపటపు మాటలు కల్మష చేతలు
మాయా జగతిని మారని బాటలు
వికట విచారపు విస్తృత కోటలు
ప్రకటము కాలేని ఆత్మకు సంకెళ్ళు॥
2 . చరణం
విడలేని బంధాలు వీడని కోర్కెలు
విధిరాత లీలల విషయాల వలలు
ఆతా నాత్మ విచారపు మాటలు
ఆశ నిరాశల అనుభవ పాఠాలు ॥
3.. చరణం
కదలదు కాయము వీడదు ప్రాణము
చేరదు విడివడి ముక్తి సోపానము
తట్టదు మదిలో నీనామ స్మరణము
కట్టడి బంధాల బరువులె శాపము ॥
4. చరణం
స్వార్ధ చింతనలు అర్ధ లోభములు
ఆత్మను వీడని అసలు స్వరుాపాలు ॥
చదివిన చదువులు చేసిన జపములు
ఫలముల నీయని నిష్ఫల జన్మలు.॥
5. చరణం
కానని ధర్మము చేయని న్యాయము
మాటల తుాట్లతో చేసిన గాయము
స్వార్ధ చింతనల పొందిన సుఖము
వ్యధల భరితమౌ అవసానకాలము॥
No comments:
Post a Comment