రాగం..బేహాగ్
రచన:రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .
పల్లవి:
------
మనసుకు మించిన హితుడెనడే
మనిషికి ఇలలో మన్నిక నేర్పే...
అనుపల్లవి:
--------
కన కన గుణములు కొల్లలు కొల్లలు
ఘనమౌ నడనడి తీరుల ఎల్లలు
కపటపు మాటల. కల్లగు బాటల
వికటపు తీరుల విధులను దెలిపే!!
చరణం:
------
అద్ధపు చందము అగపరచునది
ఆడెడు మాటల కర్థమునిడునది
తప్పొప్పుల సరి వివరములిడునది
తానుగ మనిషిని మార్చే మందది!!
చరణం:
------
నియమపు.పూజలు నిత్యము చేయుచు
చయమున భక్తి, భావము చాటుచు
దుర్గుణ చింతన వీడని వానికి
సద్గుణ మార్గపు మహిమలు దెలిపే !!
No comments:
Post a Comment