*మహతీ సాహితీ కవిసంగమం*
*ప్రతిరోజూ కవితా పండుగే*
అంశం: *బ్రహ్మచారిణి*
కవితాసంఖ్య: *02*
తేది: *04-10-2024-శుక్రవారం*
శీర్షిక: *బ్రహ్మచారిణీ!జయహో*
కవి: *పొర్ల వేణుగోపాలరావు* కవి సంఖ్య *(02)*
ప్రక్రియ: *పద్యము(తరళము)*
*****************************
*(1)*
*రజత వర్ణపు శైలమందున రాణిగా విలసిల్లగా*
*నిజమనంబున నీదు భర్తగ నీలకంఠుడు వచ్చెనే*
*అజుని భర్తగ పొందగోరుచు నాచరించి తపంబులన్*
*విజయమందిన బ్రహ్మచారిణి వేల మ్రొక్కులు నీకివే!*
*(2)*
*గజగజా వణికెన్ జగంబులు గాఢమైన తపంబుకున్*
*గజములన్నియు ఘీంకరించుచు కట్టుతప్పుచు బోయెనే*
*రజని వేళను నీతపంబులు లక్ష్యపెట్టక సాగెనే*
*విజయమే వరియించె పార్వతి వీక్షణంబుల నీయవే!*
*(3)*
*దసర పండుగ వచ్చెముంగిట దండిగా నవరాత్రులే!*
*అసురులందరు హంతమందిరి హాయిగల్గె జగంబులన్!*
*మిసిమి వన్నెల దేవికిత్తుము మేలి భక్ష్యములన్నియున్!*
*కొసరి కోరిన కోర్కెదీర్చవె కోమలీ నిను గొల్చెదన్!*
**************************
హామీ పత్రం: *స్వీయ రచన*
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
*వేణుగోపాలుడు*
🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰
No comments:
Post a Comment