Tuesday, December 31, 2024

శీర్షిక :: గెలుపు, ఓటమి ల నాంది సూత్రం...

శీర్షిక :: గెలుపు, ఓటమి ల నాంది సూత్రం..

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .



కౌరవులు ఎవరో పాండవులు ఎవరో 

తెలీని వెర్రిమాలోకం .

కరకు కర్రల అదిలింపుకు ..

కాపు గొర్రెల్లా మారడం ,  ప్రజల అజ్ఞానం.

.సారం లేని సాధింపు నాయకత్వం-

 వికటాట్టహాసంతో చేసే పైశాచిక నృత్యం..!!

అడ్డదారుల్లో శకుని వేసే పాచికల మంత్రం.

 అదే బలంతో నాయకులు నడిపే కుతంత్రం.!!

జూదపు ఆటలో ఓడిన ధర్మం 

వనవాసం చేస్తూ ఏళ్ళు దాటేస్తున్న శాపం..

 ఐదుగురు భర్తల అవమానిత,

 విధి వంచితల మధ్య తలవంచే శోకం.

సారధి లేని రథాన్ని  కుతంత్రపు టెత్తులతో

దోచుకొన్న, వాడి , బలవంతపు అధికారం-.-

 చెప్పిందే శాసనంగా పాటించే ప్రజల అజ్ఞానం .

పరిపక్వత లేని రాజ్యంలో, రాణీతి నిండిన

 రాక్షసత్వపు ఎత్తుగడలే, 

గెలుపు, ఓటమి ల ప్రణాళికలకు నాంది సూత్రం.

ఇదే  మన ఓటమి రహస్యం.

---------------------------

Sunday, December 29, 2024

శీర్షిక : గెలిచామా..? ఓడామా..?

29/12/2024.


శీర్షిక : గెలిచామా..? ఓడామా..?

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .

---------------------

కూలిపోతున్న అశా సౌధాల హోరు,

బుల్డోజర్ పాలై నలిగిపోతున్న తీరు.

జీవితంలో సాధించిన గెలుపు ,ఓటమిని తీరు,

రగులుతున్న జీవితాలు చేసే  కన్నీటి సవాలు.!!


 జీవితంతో రాజీపడి నడిచే ప్రయాత్నాలు  ,

విడలేని న్యాయానికి వేస్తున్న పగ్గాలు.

 బాధ్యతలు నిండిన  బంధానుబంధాలకై ,

 మనసు చంపుకు చేస్తున్న పాపాలకు సాక్ష్యాలు..!!


కన్నీటి బాధలను ప్రక్షాళన చేస్తున్న వైద్యం-

 జీవిత ఆనందాలను కబళించి వేస్తున్న మద్యం .

పెరుగుతున్న  అమానవీయతల సారం. 

 ఓటును ,నోటుకు అమ్ముకుంటున్న దైన్యం!!


కడుపుకు ఆకలిని తీర్చే అన్న ప్రసాదం -

మెతుకు మెతుకుగా పంచుకుని తినే నిజం.

ఆరని జఠరాగ్నిని అర్పలేని అసహనం-

 ఆత్మహత్యలకు ధార తీస్తున్న వైనం..!!


అబద్ధపు వాగ్దానాలతో , జనుల ఆశా-

సౌధాలను. కూల్చి వేస్తున్న కేంద్రం -

ధూళి నిండిన కళ్ళను, కన్నీటి దారాలతో -

కడిగి ,ఉపశమనం పొందుతున్న జనం.!!


పోరాడే ధైర్యం లేని జనుల పరిస్థితి దైన్యం .

 పోరాడి, ఓడిపోయిన జనులో నిస్సహాయత్వం.

పోరాటాల బాటలో కటకటాల జీవితాన్ని-

 ఊహించుకోలేని , సర్దుబాటుతనం.!!


వారి కన్నీటిని తుడిచే ప్రయత్నంలో ,

 అక్షర సమూహాల ఓదార్పు పదాలతో,

 అమాయకంగా చేసే కవితా ప్రయాణం .

కవిగా గెలిచామో,.ఓడేమో, తెలియని అహం.!!.


కవి అసమర్థతకు జనం స్పందించే విధానం-

కంచికి చేరిన కథలకు వేసే తాపడం.!!

అయినా ఆగని జీవిత యానం ..

నీ ,నా ,శాంతి నినాదాల  నిష్పల ప్రయాణం!!


---------------------------------



Tuesday, December 10, 2024

నా మనవరాలు ,చిరంజీవి "ఇషా" జన్మ పట్టిక.

నా కూతురు శైలజ కి పుట్టిన కూతురు, 
"ఇష" జన్మ పత్రిక.


My lovely daughter "Chiranjeevi srimathie "sailaja 's , Daughter" Esha's " birth details.

Date of birth : 10/10/2014.
Time of birth:  morning 9 o'clock. 
Place of birth Hyderabad. 
"Sundari hospital "..Alwal. 
Day :  Friday.
Star : Bharane.
Tithi : Tadiya. ( Atla Tadiya.).
Rashi : 
Paadam : 

మా మనుమరాలు , చిరంజీవి , "ఐశ్వర్య గాయత్రి".".పుష్పవతి" యైన సంవత్సరము ..


మా మనుమరాలు , చిరంజీవి ,

 "ఐశ్వర్య గాయత్రి".జన్మ పట్టిక.

------------------------------------------

పుట్టిన తారీకు. : 6/4/2013.

పుట్టిన స్థలము :  విశాఖపట్నం, (సింహాద్రి హాస్పిటల్ ).

పుట్టిన సమయము. : 8.58.AM.(పగలు.)

వారం :శనివారం.

తిథి : ఏకాదశి.

నక్షత్రం: ధనిష్ట. 3..వ పాదం.

రాశి : కుంభరాశి.

నామకరణం : 

శ్రీ సత్య, సాయి, వెంకట ,సంతోష, మోద, హనుమత్, 

లక్ష్మీ కార్తీక, రామేశ్వరీ, రమ్య, గాయత్రీ, ఐశ్వర్య.

--------------------------------------------------------------.-.

మా మనుమరాలు , చిరంజీవి ,

 "ఐశ్వర్య గాయత్రి".

".పుష్పవతి"  యైన సంవత్సరము .

పగలు. 9 గంటలు దాటాకా..

 ఆదివారము, డిసెంబర్ 8, 2024.

"క్రోధి ",నామ సంవత్సరము.

-----------------------------------------

మాసం: మార్గశిర మాసం

అమృతకాలము: 09:05 నుండి 10:38 వరకు

సూర్యోదయము: 06:35

సూర్యాస్తమయము: 17:42

రాహు కాలం: 16:19 నుండి 17:42 వరకు

యమగండము: 12:08 నుండి 13:32 వరకు

దుర్ముహుర్తములు: 16:13 నుండి 16:57 వరకు

అభిజిత్: 11:46 నుండి 12:31 వరకు

కరణం: వణిజ 09:44 వరకు, విష్టి 20:55 వరకు

చాంద్ర రాశి: కుంభము

వర్జ్యం: 22:08 నుండి 23:40 వరకు

చంద్రోదయం: 12:14

చంద్రాస్తమయం: కుంభము

తిథులు: సప్తమి 09:45 వరకు

నక్షత్రము: శతభిషం 16:02 వరకు

గుళిక కాలం: 14:55 నుండి 16:19 వరకు

యోగా: వజ్ర 03:54, డిసెంబర్ 09 వరకు

 

 ఓం నమఃశివాయనమః   

 卐 ఓం శ్రీ గురుభ్యోనమః 卐 

  ఓం శ్రీ మాత్రేనమః   

-------------------