Sunday, December 29, 2024

శీర్షిక : గెలిచామా..? ఓడామా..?

29/12/2024.


శీర్షిక : గెలిచామా..? ఓడామా..?

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .

---------------------

కూలిపోతున్న అశా సౌధాల హోరు,

బుల్డోజర్ పాలై నలిగిపోతున్న తీరు.

జీవితంలో సాధించిన గెలుపు ,ఓటమిని తీరు,

రగులుతున్న జీవితాలు చేసే  కన్నీటి సవాలు.!!


 జీవితంతో రాజీపడి నడిచే ప్రయాత్నాలు  ,

విడలేని న్యాయానికి వేస్తున్న పగ్గాలు.

 బాధ్యతలు నిండిన  బంధానుబంధాలకై ,

 మనసు చంపుకు చేస్తున్న పాపాలకు సాక్ష్యాలు..!!


కన్నీటి బాధలను ప్రక్షాళన చేస్తున్న వైద్యం-

 జీవిత ఆనందాలను కబళించి వేస్తున్న మద్యం .

పెరుగుతున్న  అమానవీయతల సారం. 

 ఓటును ,నోటుకు అమ్ముకుంటున్న దైన్యం!!


కడుపుకు ఆకలిని తీర్చే అన్న ప్రసాదం -

మెతుకు మెతుకుగా పంచుకుని తినే నిజం.

ఆరని జఠరాగ్నిని అర్పలేని అసహనం-

 ఆత్మహత్యలకు ధార తీస్తున్న వైనం..!!


అబద్ధపు వాగ్దానాలతో , జనుల ఆశా-

సౌధాలను. కూల్చి వేస్తున్న కేంద్రం -

ధూళి నిండిన కళ్ళను, కన్నీటి దారాలతో -

కడిగి ,ఉపశమనం పొందుతున్న జనం.!!


పోరాడే ధైర్యం లేని జనుల పరిస్థితి దైన్యం .

 పోరాడి, ఓడిపోయిన జనులో నిస్సహాయత్వం.

పోరాటాల బాటలో కటకటాల జీవితాన్ని-

 ఊహించుకోలేని , సర్దుబాటుతనం.!!


వారి కన్నీటిని తుడిచే ప్రయత్నంలో ,

 అక్షర సమూహాల ఓదార్పు పదాలతో,

 అమాయకంగా చేసే కవితా ప్రయాణం .

కవిగా గెలిచామో,.ఓడేమో, తెలియని అహం.!!.


కవి అసమర్థతకు జనం స్పందించే విధానం-

కంచికి చేరిన కథలకు వేసే తాపడం.!!

అయినా ఆగని జీవిత యానం ..

నీ ,నా ,శాంతి నినాదాల  నిష్పల ప్రయాణం!!


---------------------------------



No comments:

Post a Comment