మహతీ సాహితీ కవిసంగమం.
*ప్రతిరోజూ కవితా పండుగే*
అంశం: ఐచ్ఛికం
కవితాసంఖ్య: 1.
తేది: 22-3-25 శనివారం .
అంశం : అనువాద కవిత్వము.
అనువాదం కబీర్ దాసు దోహ..
అనువాదము : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహారాష్ట్ర .(43.).
కబీర్ దాసు గురించి..
15వ శతాబ్దానికి చెందిన భారతీయ ఆధ్యాత్మిక కవి, తాత్వికుడు, మరియు సంఘ సంస్కర్త. ఐన
కబీర్ దాస్ 1440 సంవత్సరంలో వారణాసి లో జన్మించారు.
ఆయన ముస్లిం ."నేత కార్మికుల" కుటుంబంలో పెరిగారు.
ఆధ్యాత్మిక గురువు , "రామానందుని" శిష్యునిగా ప్రసిద్ధి చెందిన కబీర్ దాసు , హిందూ, ముస్లిం మతాలలోని మంచి అంశాలను స్వీకరించి ఒక నూతన ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించారు.
కబీర్ దాస్ రచనలు "బీజక్" అనే గ్రంథంలో సంకలనం చేయబడ్డాయి.
రెండు పంక్తులలో రాయబడ్డ ఆయన," దోహాలు" మరియు "పదాలు " వంటివి చాలా ప్రాచుర్యం పొందాయి.
తాత్విక దృక్పథం గల "కబీర్ దాస్" మత సామరస్యాన్ని బోధిస్తూ
దేవుడు ఒక్కడేనని, మతాలన్నీ భిన్నమైన మార్గాలని విశ్వసిస్తూ, దేవుడు మనలోనే ఉన్నాడని, ఆయన్ని వెతకడానికి గుడులు, మసీదులు తిరగవలసిన అవసరం లేదని బోధించారు.ఆయన కుల వ్యవస్థను, మతపరమైన ఆచారాలను తీవ్రంగా విమర్శించారు.
ఆయన రచనలు భారతీయ సాహిత్యంలో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించబడతాయి.
కబీర్ దాస్.దోహా :
"బురా జో దేఖన్ మైం చలా, బురా నా మిలియా కోయ్,
జో దిల్ ఖోజా ఆపనా, ముఝసే బురా నా కోయ్."
అనువాదం:
"చెడు చూడటానికి నేను వెళ్లాను, చెడ్డవాడు ఎవరూ కనిపించలేదు .
నా మనస్సును నేను వెతుక్కుంటే, నాకంటే చెడ్డవాడు ఎవరూ నాకు కనిపించ లేదు.
భావం:
ఈ దోహాలో కబీర్ దాస్ స్వీయ పరిశీలనా ప్రాముఖ్యతను వివరించారు. "ఇతరులలోని చెడును వెతకడం కంటే, మనలోని లోపాలను సరిదిద్దుకోవడం ముఖ్యం "
అన్న భావాన్ని ఈ పద్యంలో ఆయన వ్యక్తపరిచారు .
-----------------------------------------
No comments:
Post a Comment