10.10.2025(శుక్రవారం)
మహతీ సాహితీ కవిసంగమం .
ప్రతిరోజూ కవితా పండగే .
అంశం: ఐచ్ఛికం
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి.(38).
శీర్షిక :చిరునవ్వు: ఒక నిశ్శబ్ద గీతిక .
కవితా సంఖ్య 02.
చిరునవ్వు, పెదాలపై విరిసే ఓ నిశ్శబ్ద గీతం
మనసులోని వేదనను మరపించే అద్భుత దీపం.
అధరాల విరుపులో దాగిన అలౌకిక ఆనందం.
మనిషిని మనీషిగా మార్చే మహిమాన్విత మంత్రం.!!
.మంచు తెరల మాటున మెరిసే తొలి సూర్య కిరణం.
చీకటిని చీల్చుకొని వెలుగు నింపే ఉషోదయం .
చల్లని గాలులకు కదిలే లేలేత వసంతం పరిమళం.
అందరికీ ఆనందాన్ని పంచే సుధా మాధుర్యం .!!
కోమలంగా విచ్చుకునే పూల సముదాయం .
మనసును ఆకర్షించే సుమ సుగంధం .
ఆనందాన్ని ఇనుమడింప జేసే అక్షయ పాత్రౌషధం.
జీవితానందాన్ని పంచే బంధానుబంధాల యానం.!!
ఎండిన నేలలో కురిసే తొలి చినుకు తడి .
నిర్మలమైన సెలయేటి గలగలల స్వచ్ఛత సడి .
వేల రాసుల విలువైన సిరి వన్నెల దడి.
మనిషి మోములో చెరగని కళల సందడి .!!
అహాన్ని చల్లార్చే చల్లని చంద్ర కిరణ సొన,
కలహాలు లేని లోకానికి కట్టిన ప్రేమ వంతెన .
మనిషి మనిషికి మధ్య బంధాన్ని బలపరిచే జాణ.
శత్రువుని కూడా మిత్రునిగా చేసే మంత్ర ఘన !!
నవ్వులో ఆనందం అనుభవించు.
స్నేహపూరితమైన నవ్వుతో గెలుపు బాటలో పయనించు.
ఈ కవిత నా స్వీయ రచన.
సొన' : వర్షం లేదా చినుకులు .
సోన : బంగారం', లేదా 'వేకువ',
No comments:
Post a Comment