[31/03, 5:50 pm] JAGADISWARI SREERAMAMURTH: మహతీ సాహితీ కవిసంగమం.
*ప్రతిరోజూ కవితా పండుగే*
అంశం:చిత్రకవిత
కవితాసంఖ్య: 1
31/ 03/ 2025 . ( సోమవారం)
శీర్షిక: కళ్యాణ రాముడు.
శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి .
కళ్యాణ్ : మహారాష్ట్ర . 43.
ప్రక్రియ: వచన కవిత.
------------------
నింగి నిండా భానుడి ప్రతాపం,
నేలంతా సీతారాముల కళ్యాణ మేళం..
వేద మంత్రాల ధ్వనులతో నిండిన ఆకాశం,
దేవతలు చల్లే పుష్పాలతో భువి నిండిన సుగంధం !!
సీతా , రాముల నుదుట మెరిసే బాసికం .
అగ్ని సాక్షిగా ఏకమైన వారికి తోడైన తారాబలం.
భక్తుల హృదయాలలో వెలిగించిన ఆనంద దీపం.
సూర్యుని వేడిమి కూడా కరిగి ,
చల్లని అనుభూతిగా మారిన క్షణం.!!,
కళ్యాణ ఘట్టంలో నిండిన మన దివ్య సంస్కృతి.
చరిత కెక్కిన సీతారాముల ఘనమైన దివ్య కీర్తి .
మంగళ వాయిద్యాల మధ్య నాదలోలుల ఆనంద గీతి.
మన సభ్యత , సంస్కరాలకు పట్టిన నిండైన ఆరతి.!!.
సీతారాముల కళ్యాణ గాధ, సుగంధ పరిమళ పూదోట.
కుటుంబ విలువలు పెంచే బంధాలకు బాట.
తల్లి,తండ్రుల మాటలకు విలువిచ్చిన పుత్రుని కధ.
రామరాజ్యాన్ని భువిలో నిలిపిన వేద-వేద్యుడతడట.!!
అన్నదమ్ముల ఆదర్శానికి ప్రతీక అన్నది నిజం.
ఆలు,మగల అన్యోన్యానికి ఆతడే నిదర్శనం.
గుణగణాలకు తగిన అందమైన రూపం.
ఆతని తలపే భక్తుల మదిలో ఆనంద దీపం. !!
-----------------------------------
ఈ కవిత నా స్వీయ రచన.
[31/03, 9:48 pm] +91 96406 22018: 2️⃣2️⃣✅ శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు కళ్యాణ రాముడు శీర్షికతో నేటి చిత్రానికి మీరు రాసిన కవిత చాలా బాగుంది. నింగి నిండా భానుడి ప్రతాపం నేరంతా సీతారాముల కళ్యాణ మేడం చక్కని ప్రారంభం. సీతారాముల కళ్యాణ ఘట్టం శ్రీరాముని గుణగణాలు ఎదురుగా ఉండి చెప్తున్నట్టుగా వివరించారు ధన్యవాదములు మరియు అభినందనలు.👏👏👏💐💐💐🙏🙏🙏
No comments:
Post a Comment