Thursday, July 8, 2021

నేటి రాజకీయం

5/07/2021   

మెట్రో ఉదయం జాతీయ తెలుగు దినపత్రిక
మరియు ఉదయ సాహితీ వేదిక కర్నూల్ ,& హైదరాబాద్ సంయుక్తంగా  నిర్వహిస్తున్న
కవితల పోటీ...
క్రమ సంఖ్య : 127.
అంశం : నేటి రాజకీయం.

రచన : శ్రీమతి:  పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .


శీర్షిక : రాజకీయ రణరంగం.

డెభ్భై సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో
అస్తవ్యస్తమైన రాజకీయ వ్యవస్థ..
ఎదుగూ బొదుగుా లేని ఆర్ధిక పరిస్థితి.॥

సమర్ధత లేని అసమర్ధతల వైపరీత్యాలకు
చితికిపోయిన మధ్య తరగతి జీవితం.
 నిరక్షరాస్యత నిండిన అమాయక
 జీవితాల  ఆశలుడిగిన అంతరంగం.॥

ప్రజల కలల సాకారానికి మాయా శ్రీకారం .
మాటల మంత్రాలతో చిత్తైన జనబాహుళ్యం.
వెరసి ...ఎన్నుకోబడిన బి.జె.పి.నాయకత్వం.॥

 నోటు బందీతో మొదలైన రాజకీయ వైఫల్యం .
 ప్రజల జీవితాలపై పడిన  జి.ఎస్.టిల భారం.
 గేస్,పెట్రోల్ డీజల్ ధరల పెంపుతో అట్టుడికిన-
  ప్రజా జీవితం, ప్రజలకు బి.జె.పి.పై దిగజారిన గౌరవం॥
  
  రోజుకో" స్కామ్ "తో ,ప్రజల సొమ్ము దోపిడీ.
  రాజకీయ కుంభకోణాలతో దిగజారిన దేశం గతి . 
 న్యాయమడిగితే శిక్ష. ఎదురు తిరిగితే హత్యలతో
 వేల కుటుంబాలు రోడ్డు కెక్కిన పరిస్థితి.॥

వాక్ స్వాతంత్ర్యం లేని వరుస దురాగతాలు .
 కామాంధుల రాక్షసత్వానికి  అబలల ఆగని 
కన్నీటి చావులు.
కరోనా కలకలం లో వలస కుాలీల కన్నీటి దారి 
ఉలికు పలుకు లేని కేంద్ర నిర్లక్ష్య  వైఖరి .

అవినీతి నిర్ముాలన పేరుతో  అరాచకాల ప్రభావం
 రచ్చకెక్కుతున్న రాజకీయాలతో విసిగి వేసారిన జనం.
 నల్లధన నిర్ముాలన  సాకుతో ఆర్ధిక స్థితి బలహీనం.
 సత్తా తొత్తులకు రుణమాఫీ చేసిన చీకటి రాజకీయం.॥
 
(నే)రాలుా ఘోరాలు నిండిన నేటి రాజకీయం .
 (టి.)వి ఛానల్స్ లో నిండిన అసత్య సమాచారం.
 డబ్బుకు అమ్ముడుపోయిన దరిద్రపు జాడ్యం.ో
  భావితర విసాశనానికి మార్గదర్శకం.॥
  
(రా)బందుల రాక్షసత్వం నిండిన రాజకీయం.
(జ)లగల్లా ప్రజల రక్తం పీల్చే పైశాచిక పాలనం.
(కీ)ళ్ళు విరిపి, ముంత చేతికిచ్చిన ముష్టి రాజకీయం.
(యాం)త్రిక జీవితానికి ఎదురీదుతున్న దీన జనం.
యజ్ఞ భుామియైన భారతావనికిది తీరని శాపం॥


హామీ:
నా ఈ కవిత  ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని స్వీయ రచన.




Monday, July 5, 2021

ఆకుపచ్చి బహుమతి

మనుమసిద్ధి కవన వేదిక
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
పర్యావరణ దినోత్సవం సందర్భంగా
అంశం:- ఆకుపచ్చని సిరి

రచన :   శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర .
8097622021.

కవితా శీర్షిక: పచ్చ చీర బహుమానం.

పెరుగుతున్న కాలుష్యానికి
దుర్భరమౌతున్న జీవితాలు॥
అడ్డదిడ్డపు   అనారోగ్యాలకు
తోడు కరోనా రేపిన కలకలాలు.॥

ఆక్సిజన్  కొరతతో అర్ధాంతర చావులు ,
తరుగుతున్న ఆరోగ్యంతో మందులేని
మహమ్మారికి లొంగుతున్న జనాలు.॥

కాలుష్యపు కంపుకు రోగ గ్రస్థయై
అతిదీనావస్తలో  ఆచ్ఛాదన లేని
శరీరాన్ని కప్పుకొనేందుకు చేతులు
అడ్డుపెట్టుకొని  ముడుచుకుపోతున్న
తక్లి భారతికి  ,ఆకుపచ్చని  అంబరాన్ని
బహుమతిగా  ఇచ్చేందుకు,పచ్చని
మొక్కలను నాటుతుా, పర్యావరణ
రక్షణకు పుానుకొన్న  భారత భావి తరాలు॥
   పిల్లల లో వచ్చిన మార్పు గమనించిన
  అమ్మ ముఖంలో  చిరునవ్వు జల్లులు
  అఖిల జనావళిలో ఆనంద పరవళ్ళు ॥

Friday, July 2, 2021

చిత్ర కవిత

వాగ్దేవీ కళా పీఠం లో 
చిత్ర కవిత.

శీర్షిక : బాల్యం...బంధం

రచన : శ్రీమతి:  పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

అమాయకత్వం నిండిన బాల్యం .
మాయామర్మాలెరుగని పసితనం
తెలియవు కులమతాల అంతరాలు
కనరు జాతి పాతుల జాడ్యాలు.
చిన్న నాటి ఆట పాటల అందాలు
అందరినీ కలిపే ఆనంధ బంధాలు.
చిన్న ,పెద్ద ,తేడా తెలియని నిర్మలత్వం.
ఆడ ,మగ ,అంతరాలెరుగని అప్యాయతలు.
ఆకాశపుటంచులు తాకే ఆనందపు సందళ్ళు.
ఆ సందడిలో ఎవరికి వారే రాజులు , 
ఎవరికి వారే రాణులు.

 

G.K..ప్రశ్నలు

ప్రశ్నలు

1 తెలుగులో మొదటి రామాయణం ఏది?
జవాబు:రంగనాథ రామాయణం

2 ప్రశ్న; మొల్ల రామాయణం ఎవరికి అంకితం చేయబడింది?
జవాబు; శ్రీరామచంద్రునికి

3 ప్రశ్న; సంస్కృతం లో ఉత్తర రామాయణం రాసింది ఎవరు?
జవాబు;బావ భూపతి.

4 ప్రశ్న; విశ్వనాథ సత్యనారాయణ రాసిన రామాయణానికి ఏమని పేరు?
జవాబు ;శ్రీమద్రామాయణ కల్పవృక్షం.

5 ప్రశ్న; విశ్వనాథ సత్యనారాయణ .రాసిన రామాయణానికి లభించిన గొప్ప పురస్కారం ఏది?
జవాబు; జ్ఞానపీఠ పురస్కారం.

6 ప్రశ్న; మూగ చెవిటి వారి ముచ్చట లా గా కవిత్వం ఉండకూడదని చెప్పినది ఎవరు?
జవాబు; మొల్ల
*********************************

ప్రక్రియ సున్నితం.

[5/7, 17:49] p3860749: సాహితీబృందావనవేదిక 
ప్రక్రియ-సున్నితం
రూపకర్త -నెల్లుట్ల సునీత 
అంశం- గీతాంజలి కావ్యం 
తేదీ07-05-21.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.

శీర్షిక :స్ఫుార్తి రచన గీతాంజలి

1.
రవీంద్రనాథ్ టాగుార్ నోబుల్
 బహుమతి అందుకున్న అద్భుతమైన
 పద్య కావ్యరచన గీతాంజలి.
 చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
 2.
దేశభక్తి నిండు అక్షరారాధన
ప్రకృతి ఆరాధనల సాధన .
గీతాంజలి కావ్య రచనాభావన.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
3.
నిర్భయమైన మానసిక స్థితి
సమత  నిండిన  దేశప్రగతి
స్వాతంత్ర్యతా స్ఫుార్తి గీతాంజలి.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
4.
పరిపుార్ణత నిండిన స్నేహనిరతి
స్వచ్ఛత నిండిన మనోగతి
మేల్కొలుపుల  గీతి  గీతాంజలి 
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
5.
ఆలోచనల్లో ప్రగతి తలపు 
 ఆవేశం, దేశవికాశ పిలుపు
 ఆచరణలో సమానత్వపు గెలుపు
 చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥

[5/20, 17:14] p3860749: 20/05/2021
సాహితీ బృందావన వేదిక.
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.
అంశం: హెల్మెట్.

రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .: మహారాష్ట్ర .
8097622021.

శీర్షిక . :కర్తవ్యపాలన నీ బాధ్యత.

6.
బాధ్యత ప్రథమ కర్తవ్యం.
భారత పౌరులకిది ముఖ్యం
భవిత చరితలకు సుబోధితం.
చుాడచక్కని తెలయగు సున్నితంబు.॥
7.
వాహన ప్రయాణం  జీవితావసరం.
అధిక గతి ప్రమాదకరం
నియమాల అనుకరణలు ముఖ్యం.
చుాడచక్కని తెలయగు సున్నితంబు.॥
8.
ఇద్దరు మించి ఎక్కవద్దు.
హెల్మెట్ ఉంటే తలకు ముద్దు.
 కుటుంబ పోషణ'  ప్రాణరక్షణ  
చుాడచక్కని తెలయగు సున్నితంబు.॥
9.
దొరకని వస్తువుకు విలువెక్కువ.
ప్రాణం విలువైన కొలువు.
కొందామంటే మళ్ళీ రాదు.
చుాడచక్కని తెలయగు సున్నితంబు.॥
10.
కన్నవారి ఋణం తోర్పుకు
తాళిబొట్టు నిలుపు చేర్పుకు
హెల్మెట్  పెట్టుటే  కర్తవ్యపాలన
చుాడచక్కని తెలయగు సున్నితంబు.॥

[
[5/21, 19:16] p3860749: ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీత.
అంశం : కరోనా కష్టాల్లో మనోధైర్యం.
శీర్షిక : మనోధేర్యాన్ని మించిన మందు లేదు.

రచన :   శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర 
11.
గతవత్సరం కరోనా భయానకం
మందులేని మహమ్మారిగా నిర్ణయం.
గృహ   నిర్బంధాల  బంధనం 
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
12.
సెకెండ్వేవ్  కలకలం  రేపినా
మనుషుల్లో గడచినానుభవాల సారంతో
భయంతగ్గి  పెరిగిన మనోధైర్యం
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
13.
సామాజిక దుారాలు  పాటించడం
మాస్క్ లు శానిటైజర్ల వాడడం
చిరుతిళ్ళు చెడుసావాసాలకు దుారం
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
14.
ఆత్మవిశ్వాశంతో అవలంభించిన సుగుణాలు॥
 వేక్సీన్ తో  పెరుగుతున్న  ఏంటీబాడీలు
 కరోనాను  తరిమే బాణాలు 
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
15.
ఆత్మవిశ్వాశంతో అవలంభించిన సుగుణాలు॥
ఆచార వ్యవహారాల సమయపాలనలు
సుచిశుభ్రతలకు  కట్టిన పట్టాలు   ॥
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥


[6/22, 11:22] p3860749: 20-06-2021
సాహితీ బృందావన వేదిక
ప్రక్రియ పేరు:సున్నితం
రూపకర్త:శ్రీమతి నెల్లుట్ల సునీత గారు.

అంశం:నిత్యజీవితంలో యోగా.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర .

శీర్షిక : నిత్య సంజీవని.

16.
మహత్తర వైజ్ఞానిక శాస్త్రం 
ఆధ్యాత్మిక క్రమశిక్షణా క్రమం.
మానసిక, శారీరిక అనుసంధానం
చుాడ చక్కని తెలుగు సిన్నితంబు ॥
17.
మనిషిలో చేతనావస్థ జాగృతి
నిత్య  జీవనగతికి సారధి
ఆరోగ్య ఆనందాలకు వారధి.
చుాడ చక్కని తెలుగు సిన్నితంబు ॥
18..
ఉఛ్ఛ్వాస నిశ్వాసపు వాయులీనాల
పరిసుద్ధపరచే  ప్రాణాపాన శక్తి.
నిష్ట - నియమాల జీవనోత్కృుష్ట  పుష్టి
చుాడ చక్కని తెలుగు సిన్నితంబు ॥
19.
పరిపుార్ణ ఆరోగ్యానంద బీజం
పతంజలీ  యొాగఋషి ప్రణీతం.
పరిపక్వ శుద్ధజ్ఞాన ప్రకాశం .
చుాడ చక్కని తెలుగు సిన్నితంబు ॥
20.
యొాగాసనక్రమం ప్రసాంత జీవితవరం.
నిత్య యౌవనామృత  ధనం
సత్యౌషధీ సంజీవన సారం.
చుాడ చక్కని తెలుగు సిన్నితంబు ॥


హామీ : ఈ సున్నితాలు నా స్వీయ రచనలు.
[6/25, 20:07] p3860749: సాహిత్య బృందావన వేదిక
25-06-21
ప్రక్రియ: సున్నితం .
రూపకర్త: నెల్లుట్ల సునీతగారు
అంశం: పీ. వీ గారి ఆర్ధిక సంస్కరణలు .

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర .

శీర్షిక : నర- సింహం.

21.
వేంకట నరసింహం పాములపర్తి
ప్రధానమంత్రిగా ఖ్యాతికెక్కిన కీర్తి.
అర్ధికవ్యవస్థలో  విప్లవాత్మక స్పుార్తి.
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥
22.
రాజకీయ శాసనసభ్యునిగా జీవితం.
కేంద్ర రాజకీయాలలో ప్రవేశం. 
భహుభాషావేత్తగా  పేరొందిన ఘనం.
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥
23.
నాలుగు విడతలుగా శాసనసభ్యత్వం.
న్యాయ ,వైద్య, ఆరోగ్యశాఖల-
మంత్రిగా పేరెన్నికైన ఘనం.
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥
24.
కులాంతర్గత  వర్గ ప్రాబల్యం.
పాములపర్తిదొక ప్రత్యేక స్థానం.
హంగుా ,ఆర్భాటాలులేని  లక్షణం.
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥
25.
బ్రాహ్మణునిగా  రాజకీయాలలో  శ్రేష్ట
సాహిత్య పురస్కార  గ్రహీత 
రాష్ట్రవ్యాప్త శతజయంతోత్సవ ప్రాప్త.
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥

[7/2, 16:01] p3860749: సాహితీ బృందావన వేదిక

ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త: నెల్లుట్ల సునీతగారు.

అంశం: పలకరింపు.

రచన : శ్రీమతి:  పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

శీర్షిక : చిరునవ్వుల పలకరింపు.

26.
కొత్త వ్యక్తుల పరిచయం
చిన్ని పలకరింపుతో ప్రారంభం.
మమతలు పండించే మాధుర్యం.
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥
27..
చిరునవ్వు నిండిన పలకరింపు
స్నేహ బీజానికి అంకురార్పణం .
నిండైన  స్నేహం నిర్మలానందం .
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥
28.
ప్రతీ రోజుా పలకరించు.
అహం నిండిన గుణం--
పలకరింపుతో ఔతుంది అంతం.
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥
29.
 ప్రతిదినం పలకరించే గుణంతో
 పొందెదవు అందరి అనురాగం.
 కుటుబంలో పెరుగును సఖ్యం .
 చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥
 30.
కన్నీటి బతుకులకు ఆలంబన .
పలకరింపుతో దొరికిన స్వాంతన .
కష్టలను మరపించేది పలకరింపు .
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥

----+-------------------------------------+--

హామీ:
నా ఈ సున్నితాలు ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని స్వీయ రచనలు.