Monday, July 19, 2021

కొత్త పద్య ప్రక్రియ.

----------------------------------------
*విశేష వృత్తము - వంశస్థము*
----------------------------------------
_లక్షణములు :_
గణములు - జ త జ ర 
యతి స్థానము - 8వ అక్షరము 
ప్రాస నియమము కలదు
----------------------------------------
సరస్వతీ! భారతి! సద్గతిప్రదా!
సరోజపాణీ! విలసత్ కళామయీ!
విరించి జిహ్వాలయ! వేద సంస్తుతా!
స్మరింతు నీ తత్త్వము జ్ఞానరూపిణీ!
----------------------------------------

Saturday, July 17, 2021

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నా పేరు నమొాదు

[7/17, 21:15] p3860749: విశిష్ట  సున్నితముల లేఖకులు

 1️⃣శ్రీ  రావినూతల భరద్వాజ గారు

2️⃣ శ్రీ దాడి శ్రీరాములు గారు

3️⃣ శ్రీమతిపుల్లాభట్ల   జగదీశ్వరీ మూర్తి గారు
[7/17, 21:17] p3860749: నమస్కారం అమ్మ..🙏

తెలుగు బుక్ ఆఫ్ రికార్డులోమీకు చోటుదక్కింది హృదయపూర్వక అభినందనలు🙏🙏🌹🌹🌹🤝🤝🤝

9494047938

Sunday, July 11, 2021

వ్యాస పుార్ణిమ, గురుపుార్ణిమ.

అంశం : వ్యాస పుార్ణిమ.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

శీర్షిక : గురుపుార్ణిమ

ఆషాడద శుద్ధమున వచ్చు పౌర్ణమి నాడు 
గురుపుాజ పర్వమును జరుపు దినమనాదిగను ॥
వ్యాస గురు దేవుని,గురు సాయి నాధుని
విద్య నిచ్చెడు గురుల పుాజింతు రాదినము ॥
వేదరాసులనెల్ల విభజించి ఏర్పరచి
చతుర్వేదములుగా అందించె వ్యాసుడు.
పంచమవేదముగ పేరుగాంచిన దైన
శ్రీ మహాభారతము వ్యాసరచనేగదా ॥
అష్టాదశ పురాణాది ఇతిహాస లిఖితముల
అందించె వ్యాసుడు అందరికి పుాజ్యుడు.॥
అట్టి వేద విదుని గురు వేదవ్యాసునికి
గురుపుజ చేసిన కలుగునష్టైశ్వర్యములు.॥
సద్గురుల పుాజించు సర్వోత్తమంబైన 
ఉత్తమంబీదినము వ్యాసు జన్మపు దినము  ॥
గురు పౌర్ణమందున గురుల పుాజించేటి
సంప్రదాయము మనది సర్రోత్తమంబిది.॥
వేదాపారాయణల విధుల గురులను గొల్చి
ఆయురారోగ్యాది ఐశ్వర్యములు పొందు.॥
విష్ణ్వావతారుడుా , వ్యాసుడే విష్ణుడని
పేరొందినా గురువు తొలి వందనీయుడు ॥
అజ్ఞాన తిమిరాలు పారద్రోలెడువాడు
జ్ఞాన జ్యోతిని వెలుగు చుాపించు సద్గరువు .॥


మధురగతి రగడలు నియమాలు.

పర్యవేక్షణ: *డా.శ్రీ.అడిగొప్పుల సదయ్య గారు*
నిర్వహణ: *శ్రీ కుందారపు గురుమూర్తి గారు*
సమీక్షణ: *శ్రీ డా.అడిగొప్పుల సదయ్య గారు*
తేది: *10-07-2021: శనివారం*
అంశము: *ఐచ్ఛికము*
ప్రక్రియ: పద్యము *మధురగతి రగడ*

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
క్రమ సంఖ్య : 37.

1.
ధ్యానము చేయుము ధరపర మాత్ముని
మననము  జేయుము  మానస మందున ॥
2.
ధర్మము నెరపుము ధనమదె సత్యము
కర్మలె  శుభములు, కరగ పాపము  ॥
3.
మల్లెలు  ముదముగ మాలగ నల్లితి
కొల్లలు సుమములు కొలువంగ హరిని ॥
4.
కరుణను  బ్రోవగ కమలాక్ష వేడితి
వరదుడ రారా  వనజభ వాహరి ॥
5.
కంటిని నీరుాపు కనులార  రామా
వింటిని  గుణముల విమలసు చరితా॥
6.
విశ్వము నేలిన విభుడవు నీవని
విశ్వా సముతోడ  విభునిను వేడితి॥

G.K. ప్రశ్నలు

[7/10, 12:09] +91 99517 44841: సాహితీ బృందావన జాతీయ వేదిక
🦜 సాహిత్య విజ్ఞానం🦚
ఎపిసోడ్12
🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴
తేదీ 10/7/2021 శనివారం జికె ప్రశ్నలు

1 తెలంగాణ కథా సాహిత్యంలో పేద కులాల జీవితాలను అట్టడుగు వర్గాల భాషలో అక్షరబద్ధం చేసిన గొప్ప కవి ఎవరు?
జవాబు
2 ప్రశ్న; అంపశయ్య నవీన్ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది ఆ నవల పేరు ఏమిటి?
జవాబు
3 ప్రశ్న బోయ జంగయ్య శ్రీశ్రీ స్మారక స్వర్ణ పతకం లభించింది ఆ కథా సంపుటి పేరు ఏమిటి?
జవాబు
4 ప్రశ్న; కాలాన్ని నిద్రపోనివ్వను కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న గొప్ప రచయిత ఎవరు?
జవాబు 
5 ప్రశ్న; కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కుతే అమ్మరా! గేయరచయిత పేరేమిటి?
జవాబు 
*********************************
గ్రూపులోని కవిమిత్రులకు చిన్న మనవి ఎక్కువసార్లు ఎవరైతే విజేత అవుతారో వారికి మన జాతీయ వేదిక నుండి ప్రశంసా పత్రం ఇవ్వబడును🙏🏽🙏🏽🙏🏽🙏🏽🦚🦚🦚🦚🦚🦜🪂🕉️🕉️
[7/10, 15:06] +91 99517 44841: సాహితీ బృందావన జాతీయ వేదిక శనివారం రోజు ప్రశ్నలకు జవాబులు
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🪴🪴🪴🪴🪴🪴🌴🌴🪂🪂🪂🪂🪂🪂🏹
1 జవాబు గూడూరి సీతారాం
2 జవాబు కాలరేఖలు
3 జవాబు హెచ్చరిక
4 జవాబు ఆచార్య ఎన్.గోపి
5 జవాబు అందెశ్రీ
💥💥💥💥💥💥💥💥💥💥🌺🌺🙏🏽🙏🏽🙏🏽🌴🌴🌴🏹🦜