Friday, December 10, 2021

మధురిమల యుగాది

అంశం: ఉగాది విశిష్టత.

కవితా ప్రక్రియ: మధురిమలు

శీర్షిక: ఆనంద యుగాది.

1.
సృష్ట్యారంభపు గణితం.
చైత్ర శుద్ధ పాడ్యమి తిధి
భాస్కరాచార్య లిఖితం.
కాల -గణనారంభ విధి.॥
2.
నక్షత్ర గమన కాలం .
చాంద్ర మాన గణనీకం.
ద్వాదశ రాశీ చలనం.
ఆంధ్ర జన ప్రామాణికం.॥
3.
ధశ విధ కృత్యాచరణం..
బ్రహ్మ పుాజనం శ్రేష్టం.
నింబ పుష్పసు భక్షణం
పంచాంగ శ్రవణం శుభం ॥
4.
వసంత కాలం మధురం .
హరిత వనం సు శోభితం.
ప్రకృతి శోభాయమానం.
జీవనానంద,సుఖదం॥

*********************

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

షడృచుల యుగాది.

అంశము: *షడ్రుచులు-పంచభక్ష్యాలు
.
శీర్షిక : ఆరోగ్యమే మహా భాగ్యం.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

ప్లవ నామ ఉగాదికి స్వాగతం.
మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు .
ఉగాది రోజున నివేదించే  ఆరు రుచుల
ఉగాది పచ్చడి గురించి కొన్ని విషయాలు :

1.
మధురం (తీపి) .బెల్లం తేనె.
-----------------------------------

తేనెలుారు  తీయనైన  పలుకు.
స్నేహ బాంధవ్యాల పిలుపు
అతి మధురం రోగ కారకం.
మితం ఆనంద దాయకం. ॥

2.ఆమ్లం. ( పులుపు) .చింతపండు.
---------------------------------------
ఆమ్లం :  అసౌకర్యం లేని అరుగుదల.
కొవ్వు శాతం తగ్గింపు.
వాపులను తగ్గించి శరీర
వ్యవస్థను మెరుగుపరుస్తుంది.॥

3.లవణం  (.ఉప్పు).
------------------------------
ఉప్పు  : డి..హైడ్రేషన్ పోగొట్టేది.
అహారపు ఱుచిని పెంచేది.
తగినంత తింటే ఉత్సాహం
అతిగా తింటే రొిగం.॥.

4.కటువు.( కారం.)మిరపకాయలు, మిరియాలు.
-----------------------------------
కారం : ఆహారంలో ఱుచిని పెంచేది.
అధిక కోపాన్ని కలిగించేది.
రోగనిరోధక శక్తిని పెంచేది
కటు మితం, చర్మ రోగ నివారణం.

5. తిక్తం .( చేదు.) వేప పుావు.
----------------------------------
చేదు : కడుపును సుభ్ర పరచి,
నులిపురుగులను నాశనం చేసేది.
ఔషధీ  తత్త్వాన్ని కలిగినది.
ఎన్నో రోగాలను నయంచేస్తుంది.

6.కషాయం .( వగరు.) మామిడికాయ.
----------------------------------------------------
వగరు మేలైన రక్త ప్రసరణకు ,
ఆమ్ల వాయు నిరోధనకు,
ఉదరంలో క్రిముల నాశనముకు,
శరీరంలో నీటిని సమతుల్య పరచేందుకు.

కఫ, పిత్త వాతాలకు ఔషధంగా పని చేసే ఈ
ఉగాది పచ్చడిని సేవించి , ఆరోగ్య జీవితానికి
స్వాగతం పలకండి. 

నవయుగాది

అంశం : నవ యుగాది.
శీర్షిక  :  భయానికి స్వస్తి .
ప్రక్రియ : వచన కవిత.


గత సంవత్సరం "మహమ్మారి "లా విజృంభించి 
యావత్ప్రపంచాన్ని గడగడలాడించింది కరోనా.
సంవత్సరంపాటు పడరాని పాట్లతో గృహ...
నిర్బంధులైన ప్రజలు, ఎన్నో జాగర్తలతో పాటు
 సాంప్రదాయ పద్ధతుల ప్రాశస్త్యాన్ని గ్రహించి,
ఆచార వ్యవహారాల విలువలని తెలుసుకొని,
మసలడంతో, 2021-నాటికి మరోకోణంలో
మనుషుల మధ్యకు దుాసుకు  వచ్చింది 
ముందస్తు జాగర్తల విశ్వాసంతో" భయం వీడిన"
ప్రజలు , తమ తమ దైనందిన కార్యక్రమాలను
నిర్భయంగా చేసుకుంటుా, గృహ నిర్బంధ
సంకెళ్ళకు ఉద్వాసన చెప్పేరు. పర్యావరణ రక్షణతోపాటు,సామాజిక దుారాలను పాటిస్తుా , "ఆనంద యుగాదికి" ఆహ్వానం పలికేరు.
మనుషుల్లో వచ్చిన మార్పుకు, ఆనందించిన
"ప్లవ "నామ ఉగాదికన్య , తన వంతుగా నీటి
వనరుల నిర్మల వసంతమై , ఆరు ఱుచుల ఆరోగ్యామృత కలశాన్నిచేత పట్టుకొని , 
 పచ్చన్ని ప్రకృతి స్వాగత గీతాలకు 
 పరవసించిపోతుా  "అనందామృతాన్ని "
 అందరికీ పంచడానికి అదిగో, వస్తోంది.
ఆమెను నిండు మనసుతో "స్వాగతిద్దాం" రండి.
-----------------------------------------------------

ఓషధీ రస గుళిక

అంశం. ఉగాది పండుగ గొప్పతనం .

శీర్షిక ; ఓషధీ రస గుళిక.(వచన కవిత).

"ఉగ" అంటే నక్షత్ర గమనం లేదా జన్మ -
వీటికి ఆది ఉగాది. యుగం అంటే
రెండు కలిసినది-ఉత్తరాయణ, దక్షిణాయనాలు.
షడ్రుచులు అంటే తీపి, పులుపు, ఉప్పు,
కారం, చేదు, వగరు,. ఇవన్నీ కలిపి చేసిన
" ఉగాది పచ్చడి "ఎన్నో రోగాలను అరికట్టే
"దివ్యౌషధ తత్త్వాలను" కలిగి ఉంటుంది.
పంచభక్ష్యములు అంటే భక్ష్యం,
భోజ్యం, లేహ్యం, చోష్యం, పానీయాలు.
ఇవి మన ఆహారం లో ఉండే ఔషధ గుణాన్ని,
వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి
ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాక
ఆచారాలకు, సముచిత ఆహారానికి
గల సంబంధాన్ని చాటిచెప్పే రస గుళికలు.
మానవ  జీవితాలు,అన్ని భావాల మిశ్రమంగా
  ఉండాలని ఆకాంక్షిస్తుా జరుపుకొనే
  పండగ ఈ "యుగాది" .
నిరోగ మయ జీవితానందాలను పంచే
  "యుగాది పండగ" , మన సాంప్రదాయ
  సార జీవామృతమై, మనలను నడిపిస్తోంది
  అనడంలో సందేహం లేదు.
  ------------------------------------------------

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

Thursday, December 2, 2021

తొణుకులు నియమాలు

ఉస్మానియా తెలుగు రచయితల సంఘం*
ఆధ్వర్యంలో *తొణుకులు* నూతన ప్రక్రియ తేది:15-08-2021 నాడు. పునర్: ప్రారంభం కానుంది. (ఆగస్టు మాసంలో)

రూపకర్త:-
*శ్రీ ప్రశాంత్ కుమార్ ఎల్మల**
🫐🫐🫐🫐🫐
*నియమాలు*
*1. నాలుగు పాదాలు*
*2. ప్రతీపాదములో 9నుండి 11 అక్షరాలు మాత్రమే ఉండాలి.*
*3. 1,3 పాదాలలో మాత్రమే మొదటి అక్షరం ఒకేలా ఉండాలి.*
*4.  2,4 పాదాలలో మాత్రమే చివర అంత్య ప్రాస ఉండాలి.*

*వారానికి 4 మాత్రమే తొణుకులు రాయాలి .*

100 పూర్తి చేసిన వారికి *తెలుగు శ్రీ*

300 పూర్తిచేసినవారికి *తెలుగు భూషణ్*

500 పూర్తిచేసినవారికి *తెలుగు విభూషణ్*
బిరుదులు ప్రదానం చేస్తాము

ఇంతకు పూర్వం 100 తొణుకులు పూర్తి చేసిన వారు తిరిగి 101 నుంచి ప్రారంభించవచ్చు.

దిక్కరించిన కలము
1🌊
సిరా చుక్కలు వదలాలన్నా
చెప్పలేని భయం గొల్పుతుంది
సిగ్గుతో ఒక్కఅక్షరం ముక్కైన
రాయాలన్న బాధగా ఉంది.
2🌊
మనిషి చేతిలోకి చేరాలంటే
నాకు చెమట పడుతుంది
మగువాంతక మృగాల ఎదపై
జేబులో నిలువ సిగ్గేస్తుంది.

https://chat.whatsapp.com/BGxRalUKoFaFHj8FgxeTyK..

అధ్యక్షులు
ప్రశాంత్ కుమార్ ఎల్మల.
9494300188.