Saturday, October 9, 2021

నవ దుర్గా స్తుతి

కవి పేరు: రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
ఊరు: కల్యాణ్ : మహారాష్ట్ర.
శీర్షిక:  నవ దుర్గా స్తుతి.
ప్రక్రియ: ఇష్టపది.
ఈ వారం కవిత సంఖ్య:  4.

1.శైలపుత్రి
2.బ్రహ్మచారిణి
3.చంద్రఘంట
4.కుాష్మాండ
5.స్కందమాత
6.కాత్యాయని
7.కాళరాత్రి 
8.మహాగౌరి 
9.సిద్ధిధాత్రి.


ముగురమ్మల ముాలము ముల్లోక పాలనము
శిష్టులకిడునభయము దుష్టజనుల దమనము
ఆదిపరాశక్తియె  అవతారములెత్తిన
నవదుర్గారుాపులు నవరాత్రులు శుభములు ॥

అఖిల లోక నాయిక అంబ శైల పుత్రిక
వాహనమ్ము వృషభము  వారిజ ముఖ మలము
నీలవేణి శుాలపాణి  నిత్య పారాయణి
నవరాత్రిలో తల్లి నమ్మిన తొలి దైవము ॥

ధవళ వస్త్ర ధారిణి తరుణి బ్రహ్మచారిణి
కర కమండల ధరి, సు కాంత జ్ఞాన రుాపిణి
జపమాలా ధారిణి జగదీశ్వరి జననీ.
తపఃచార్ని  దయగుణి తవ చరణం శరణం

చంద్రఘంట  రుాపిణి చంద్రిక ముఖ తోషిణీ.
శక్తి ధైర్య రుాపిణీ  శాంకరి  భయ హారిణి
ధుామ్రలోచను దమనీ దుఃఖ,  పాఫ ,నాశినీ
నవ దుర్గా రుాపిణి  నాద వేద రుాపిణి ॥

విశ్వ శక్తి రుాపిణి  విజయ విశ్వ మొాదిని
అష్ట భుజా రుాపిణి  అష్ట అస్త్ర  ధారిణి.
కుాష్మాంద స్వరుాపిణి గుాడగుణ స్వభావిని
ఆది శక్తి  రుాపిణి  అంబ సింహ వాహినీ॥

ఐశ్వర్య ప్రదాయిని అంబ మొాక్ష కారిణి.
ఇహ పర సుఖ దాయిని ఇచ్ఛా పుార్తి కరణి
స్కందమాత పావని స్కందుని ప్రియ జనని
తారకసుర భంజని ధరణోద్ధర కారిణి ॥

 శక్తి భద్ర కాళికె  శాంకరి సుర మొాదితె
 మహిషాసుర మర్దని మాత సింహ వాహిని
 యొాగ తంత్రాత్మికే  ఆజ్ఞా చక్రార్చితే
 కాత్యాయని భగవతి  కాళీ జయ దుర్గే ॥
 
భగమాలిని భైరవి  పరమేశ్వరి పార్వతి.
సర్వాంతర్యామిని సర్వ హృదయ వాసీని
మణి ద్వీప నివాసిని మాత వేద రుాపిణి.
దుర్గా త్రై యంబికెే  దుర్లభే శివాత్మికే ॥

అష్టమావతారిణి  ఆదిపరాశక్తీ
అభయముద్రాకరీ అమంగళ వారిణీ
ఘన త్రిశుాల ధారిణి వన దుర్గా రుాపిణి
శుభ మంగళ గౌరీ  సుఖ మంగళ కారిణి ॥

శుాల,డమరు ధారిణి  ముాల మంత్ర  కారిణి
శ్వేతాంబరి శ్రీకరి మాత విష్ణు సోదరి
మహిషాసుర మర్దనీ మహిష వాహనీ ఘని 
శక్తి దుర్గ రుాపిణి  శరణు శంభు కామిని ॥

సిద్ధిధాత్రి  శ్రీకరి  బుద్ధి ప్రద శాంకరి.
ఇహ పర సుఖ కారిణీ  ఇందు వదని ఈశ్వరి.
శంఖ చక్ర ధారిణి   సార పద్మ లోచని
బ్రహ్మ జ్ఞాన ఫలకరి బ్రాహ్మీ మాహేశ్వరి.॥

సర్వ సిద్ధి వరదే   శర్వు రాణి శుభదే
అభయప్రద హస్తే అంబే శివ శక్తే.
నవ దుర్గా రుాపే నారాయణీ సతే
నవ రుాపిణి మాత్రే  నామ విజయ కీర్తే ॥

***********************

బుద్ధుని బాటలో...

అంశము: *బుద్దుని బాటలో...*

శీర్షిక : ఆధ్యాత్మిక గురువు.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.

కపిలవస్తు వాసుడు కడు దయాసముద్రుడు
సిద్దార్ధ గౌతముడు సిరి గుణములకు రేడు.
బౌద్ధ మత  స్థాపకుడు,  "బుద్ధ" నామధేయుడు
ఆధ్యాత్మిక గురువుగ అందించెను సుాక్తులు. ॥

నాల్గు దశల జీవము నరకాంతకమయమని
సన్యాసి  జీవితమె సార్ధకమని దలచెను.
బోధివృక్ష  నీడను  పొందె శాంతి సౌఖ్యము
పరివ్రాజక జీవిత-ఫల చింతనె ఫలించె ॥

సిద్దార్ధ నామమే సార్ధకమీ ఇలను
అలరకలమ గురువుగ అందెను బోధనలను.
యొాగ శాస్త్ర జ్ఞానము  యొాగులకడ నేర్చెను.
ప్రావీణ్యత పొందెను  ప్రాజ్జ్నుడై నిలిచెనుా ॥

జ్ఞాన బోధ చేయుట  జ్ఞాని ధర్మ మనెనుా
భిక్షాటన చేయచుా   బుద్ధునిగా మారెను .
అష్టాంగ మార్గాల  అతని సత్ బోధనలు
ఆతని జీవ గాధలు  ఆదర్శపు బాటలు ॥

అంటు రోగం కన్న .అధైర్యం  ప్రమాదం ,
అందరుా సమానం అదియే మన ధర్మం .
అతిగా అశించకు  అతిగా దుఃఖించకు.
శోకాన్ని తప్పించు శోధించు జీవితం, ।

ఆచరించని మాట  అది నిష్ప్రయొాజనం.
మనసన్నది ఉంటే  మార్గ మదే  కనపడును.
మంచి మాట బాటలు  మానవత్వ నీడలు
అవి సుాక్తుల బాటలు అవె ఈశ్వరి మాటలు ॥


పై ఇష్టపదులు నా స్వంత రచనలు.
https://thapasvimanoharam.com/books/corona-ishtapadhi/
✍️రైటర్స్ స్పెషల్
కరోనా ఇష్టపది సంకలనం లింక్

నవ దుర్గా స్తుతి.

అంశం:  ఐచ్ఛికం
తేది: 01-10-2021
మసాక.సం: 37

కవి పేరు: రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
ఊరు: కల్యాణ్ : మహారాష్ట్ర.
శీర్షిక:  నవ దుర్గా స్తుతి.
ప్రక్రియ: ఇష్టపది.
ఈ వారం కవిత సంఖ్య:  4.

ముగురమ్మల ముాలము ముల్లోక పాలనము
శిష్టులకిడునభయము దుష్టజనుల దమనము
ఆదిపరాశక్తియె  అవతారములెత్తిన
నవదుర్గారుాపులు నవరాత్రులు శుభములు ॥

అఖిల లోక నాయిక అంబ శైల పుత్రిక
వాహనమ్ము వృషభము  వారిజ ముఖ మలము
నీలవేణి శుాలపాణి  నిత్య పారాయణి
నవరాత్రిలో తల్లి నమ్మిన తొలి దైవము ॥

ధవళ వస్త్ర ధారిణి తరుణి బ్రహ్మచారిణి
కర కమండల ధరి, సు కాంత జ్ఞాన రుాపిణి
జపమాలా ధారిణి జగదీశ్వరి జననీ.
తపఃచార్ని  దయగుణి తవ చరణం శరణం

చంద్రఘంట  రుాపిణి చంద్రిక ముఖ తోషిణీ.
శక్తి ధైర్య రుాపిణీ  శాంకరి  భయ హారిణి
ధుామ్రలోచను దమనీ దుఃఖ,  పాఫ ,నాశినీ
నవ దుర్గా రుాపిణి  నాద వేద రుాపిణి ॥

విశ్వ శక్తి రుాపిణి  విజయ విశ్వ మొాదిని
అష్ట భుజా రుాపిణి  అష్ట అస్త్ర  ధారిణి.
కుాష్మాంద స్వరుాపిణి గుాడగుణ స్వభావిని
ఆది శక్తి  రుాపిణి  అంబ సింహ వాహినీ॥

ఐశ్వర్య ప్రదాయిని అంబ మొాక్ష కారిణి.
ఇహ పర సుఖ దాయిని ఇచ్ఛా పుార్తి కరణి
స్కందమాత పావని స్కందుని ప్రియ జనని
తారకసుర భంజని ధరణోద్ధర కారిణి ॥

శక్తి భద్ర కాళికె  శాంకరి సుర మొాదితె
మహిషాసుర మర్దని మాత సింహ వాహిని
యొాగ తంత్రాత్మికే  ఆజ్ఞా చక్రార్చితే
కాత్యాయని భగవతి  కాళీ జయ దుర్గే ॥

భగమాలిని భైరవి  పరమేశ్వరి పార్వతి.
సర్వాంతర్యామిని సర్వ హృదయ వాసీని
మణి ద్వీప నివాసిని మాత వేద రుాపిణి.
దుర్గా త్రై యంబికెే  దుర్లభే శివాత్మికే ॥

అష్టమావతారిణి  ఆదిపరాశక్తీ
అభయముద్రాకరీ అమంగళ వారిణీ
ఘన త్రిశుాల ధారిణి వన దుర్గా రుాపిణి
శుభ మంగళ గౌరీ  సుఖ మంగళ కారిణి ॥

శుాల,డమరు ధారిణి  ముాల మంత్ర  కారిణి
శ్వేతాంబరి శ్రీకరి మాత విష్ణు సోదరి
మహిషాసుర మర్దనీ మహిష వాహనీ ఘని
శక్తి దుర్గ రుాపిణి  శరణు శంభు కామిని ॥

సిద్ధిధాత్రి  శ్రీకరి  బుద్ధి ప్రద శాంకరి.
ఇహ పర సుఖ కారిణీ  ఇందు వదని ఈశ్వరి.
శంఖ చక్ర ధారిణి   సార పద్మ లోచని
బ్రహ్మ జ్ఞాన ఫలకరి బ్రాహ్మీ మాహేశ్వరి.॥

సర్వ సిద్ధి వరదే   శర్వు రాణి శుభదే
అభయప్రద హస్తే అంబే శివ శక్తే.
నవ దుర్గా రుాపే నారాయణీ సతే
నవ రుాపిణి మాత్రే  నామ విజయ కీర్తే ॥

***********************





Friday, October 8, 2021

బిరుదులు , పురస్కారాలు.

బిరుదులు.
శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
ఇప్పటి వరకు దొరికిన బిరుదు పురస్కారాలు.

1. "సాహిత్య చక్రవర్తి. "
 ( ఇష్టపది ప్రక్రియలో )
సృష్టి కర్త : అడిగొప్పుల సదయ్యగారు.
. (మహతీ సాహితీ కవి సంగమం వారి నుండి .)

2. "స్వర మయుారి." (చిలక పలుకులు ప్రక్రియ లో)
చెన్నుారు సాహితీ వేదిక నుండి....
( రుాపకర్త . చిలకమారి తిరుపతిగారు).

3."వెలుగు దివ్వె". 
తెలంగాణా తెలుగు కళా నిలయం నుండి
(చిమ్నీలు ప్రక్రియలో)
రుాపకర్త: జాదవ్ పుండలీక్ రావ్.

4.శత తేనియ పురస్కారము  .
(తెలుగు తేనియలు సాహితీ వేదికలో ).
(.తేనియలు ప్రక్రియలో)
(రుాపకర్త..నలుమాసు విజయ ప్రసాద్ ).

5. "మధుర కవి భుాషణ" బిరుదు ప్రదానం 
6. మేఘన సాహితీ కళా వేదిక నుండి.
7.  (మధురిమలు ప్రక్రియలో)
 (రుాపకర్త. ఈర్ల సమ్మయ్య గారు).
 
6."అక్షర ఝరీ రత్న"  ఉస్మానియా తెలుగు రచయితల సంఘం వారి నుండి పరిమళాలు ప్రక్రియలో..
 (పాటలుగా 30 పాశురాలు రాసినందుకు)

 7.."పద ముత్యం" బిరుదు.
 గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఎడ్యుకేషనల్ &
 రుారల్ డవలప్ మెంట్ సొసైటీ  వారి నుండి
  ( ముత్యాల పుాసలు శతాక్షరి ప్రక్రియలో)

8.
"సాహితీ బృందావన విహార జాతీయ వేదిక" వారి
"సాహిత్య కళానిధి" బిరుదు. ఉగాది 2021.ఉగాది పురస్కారం. (ఖమ్మం తెలంగణా).


9. ఉస్మానియా తెలుగు రచయితల సంఘం వారిచే
 అద్వైత పురస్కారం . 
( కృపాణాలు ప్రక్రియలో)

10." రాణి రుద్రమదేవి ఎక్సలెన్స్ అవార్డ్ ."
(సాహితీ బృందావన జాతీయ వేదిక నుండి )
(ఇంటర్నేషనల్  ఉమెన్స్ డే  2020.నాటి కవితకు )

11. "సమాజ సార్థక్ అవార్డ్ " (ఇంటర్నేషనల్ ఉమాన్స్ డే--2020..నాడు 
(సుార్యపల్లి రాములమ్మ ఉమెన్ వెల్ఫేర్ ట్రష్ట్ నుండి).

12. "విశిష్ట మహిళా శిరోమణి."..బిరుదు.
(సాహితీ బృందావన విహార జాతీయ వేదిక మరియు
ఉమెన్స్ రైటర్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో)

13.సాహితీ బృందావన జాతీయ వేదిక వారి
"కాళోజీ  శాంతి " సాహిత్య పురస్కారం...2021.

14. సాహితీ బృందావన జాతీయ వేదిక మరియు
నేను సైతం యుాట్యుాబ్ ఛానల్ వారి ఆధ్వర్యంలో...
"భగత్ సింగ్ జాతీయ పుస్కారం ."

సాహితీ బృందావన జాతీయ వేదిక వారి..
15. "సున్నితం" బిరుదు.

16. రవీంఫ్రనాథ్ టాగుార్  సేవా  పురస్కారం.


పేరు    శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
జిల్లా  : కల్యాణ్ : మహారాష్ట్ర 
బిరుదులు
ఇప్పటివరకు దొరికిన 
బిరుదులు , పురస్కారాలు.

1. "సాహిత్య చక్రవర్తి. "
 2. "స్వర మయుారి." 
3."వెలుగు దివ్వె". 
4.శత తేనియ పురస్కారము  .
5. "మధుర కవి భుాషణ" బిరుదు ప్రదానం 
6."అక్షర ఝరీ రత్న"  
 7. పద ముత్యం 
8."సాహిత్య కళానిధి" బిరుదు. 
9. అద్వైత పురస్కారం . 
10." రాణి రుద్రమదేవి ఎక్సలెన్స్ అవార్డ్ ."
11. "సమాజ సార్థక్ అవార్డ్ " 
12. "విశిష్ట మహిళా శిరోమణి."..
13."కాళోజీ  శాంతి " సాహిత్య పురస్కారం...
14. "భగత్ సింగ్ జాతీయ పుస్కారం ."
15. "సున్నితం" బిరుదు.
16. రవీంఫ్రనాథ్ టాగుార్  సేవా  పురస్కారం.

. ఫోన్  నంబర్ : 8097622021.