-----------
గున్నమావి చెట్టు మీది కోయిలమ్మ
చిందులేసి నువ్వు పాట పాడవమ్మ !!
అనుపల్లవి
----------
కొమ్మ,కొమ్మకో పలకరింత , నీ
పాటవినగ మది పులకరింత !!
గూటిలోన గువ్వజంట చూడు , పురి
విచ్చుకున్న నెమలి కన్నె చూడు ..
వింత వింత రాగాలు ,
గొంతులోన పలుకు నేడు
పంతమీడి పాట పాడవ !! గున్నమావి !!
చరణం .
---------
కుహూ కుహూ రాగాల గీతులే
సరాగ సంగమ మధురిమలై
ఊహలలో కవి పదములలో , కడు
ప్రేమసందేసాల సరిగమలై
ఉషోదయపు రవి కిరణాలే , తడి
మంచుబిందువుల తళుకులుగ
కురవనీ..అలా మెరవనీ...
పుడమి కళలు కాంతి నాదమై నిండిపోనీ !! గున్నమావి !!
నీలాకాశం మబ్బుల్లో ..
విహరించే శ్వేశ్చా విహంగమై
గలగల పారే సెలయేటా
తేలే చిన్నారి తరంగమై
వీచే గాలి తెమ్మెరవై ...నువు
పూచే పూల పుప్పొడివై
సాగిపోవా.....గానమందుకోవా...నీ
గొంతులోని తీపి ఇలను నింపరావ !!గున్నమావి !!
రచన, శ్రిీమతి..
పుల్లాభట్ల జగదిీశ్వరిీముార్తి.
కల్యాణ్.
------------------
---------------------------------------------
---------------------------------------------
No comments:
Post a Comment