Tuesday, September 15, 2009

కొమ్మమీది కోయిలమ్మ .....( పాట )

పల్లవి .
__________
కొమ్మమీది కోయిలమ్మ కుహూ అన్నది
నా మనసే పరవసించి ''ఆహా'' అన్నది !!

అనుపల్లవి .
____________
రాగాలా .. సరాగాలా.. ఆ.......
సప్తస్వర సుధలతో ..
పూబాలలు తలలనూచె
వేయి కళలతొ ...!! కొమ్మమీది !!
చరణం.
_________
కన్నెవాగు గలగలమని పారుచున్నది
కలువభామ సిగ్గుతెరల ఒదిగియున్నది !
తారలనడుమ..వలపు గుసగుస వినుమ
వెన్నెలరాజుని కొంటెతనపు వేడుకగనుమ !! కొమ్మమీది !!

చిరుగాలిలొ పయనించే సౌరభాల మధురిమ
వెన్నెలలో విహరించెను పుష్పబాణుడదెసుమ !
ఆడుచు జతుల, గతుల నాట్యపు రతుల
మదిని మరుమల్లెల మత్తు శరము నొదిలె చూడుమ...!! కొమ్మమీది !!

రచన.....శ్రీమతి
పుల్లాభట్ల జగదిశ్వరి 
కల్యాణ్


No comments:

Post a Comment