Tuesday, October 6, 2009

జనకజా మా జానకి , జగన్మోహిని రాగం.

జనకజా మా జానకి మాంపాలయే
కనక భూషణాంగే కమలాలయే '' జనక ''
ఘనకటాక్ష భూపుత్రే శాంతే
రమణిరత్న శ్రీ శుభకర గాత్రే
కమలనయని కరుణాంతరంగే
విమలయశే మునిమానస హంసే '' జనక ''
మిధిలానందకరే , ఏ.........

మధుర మధుర మృదు భాషిత ప్రియ వే
దాంగత సారే.. శ్రీకళే ...
సుందర రామానందకరే...

సాసా.స పా.నీ.
సనిపమ గమపస నిపమగ మపనిస '' సుందర ''
అంగన సీతే అఖిలవరే...

రావణాంతకరి రమణిలతాంగే
పావనానిలా దగ్ధశరీరే
సాకేతనగర సామ్రాజ్యరమే
సకలసురవంద్య సన్నుత చరణే '' జనక

ముల్తానరాగం

కరుణనుచూడుమయా రామయ్యా..
జాలము సేయకయా రామయ్యా || కరుణను ||

వేకువనేలేచీ , వేలపూలనుదెచ్చీ...
పూలమాలలుగూర్చీ పొందుగా జతచేసీ ,
మక్కువనేమీర మంచిగంధము తీసీ
ఎదురుచూచే నాపై మరుగేలరా ...|| కరుణను ||

ధూప , దీపాలనే ప్రేమతొ నలరించీ..
పాయసాన్నము , పాలు , పంచఫలములచేర్చీ..
పంచామృతమును , పానీయములుగూర్చీ
ఎదురుచూచే నాపై మరుగేలరా......|| కరుణను ||

కానడరాగం.

శ్రీరామనామం అతిమధురం ,
దశరధతనయం రఘునందనం |

కమలాలనేపోలు కన్నులు మధురం ,
కారుణ్యరసరామ హృదయమే మధురం ,
చిరునవ్వులొలికించు అధరమే మధురం ,
శివునివిల్లే విరుచు కరములే మధురం || శ్రీరామ ||

రావణాంతకరామ బాణమేమధురం ',
రాతి, నాతిగచేయు చరణమే మధురం ,
రాజసమ్ములొలికించు రూపం మధురం ,
రాముడేలినపుణ్యభూమియే మధురం ,
మధురాతిమధురం మధురాతిమధురం || శ్రీరామ ||

జగన్మోహిని రాగం .

Saamagaanalolaa

సామగానలోలా సారస-
దళనయనా శుభ శీలా...
రామ , రామ , రామా దశరధ-
తనయా శ్రిజనపాలా.....|| సామ ||

కనకభూష కోదండపాణే ..
కళ్యాణ గుణ మృదు, మధువాణే..
సూర్య ,చంద్ర సమ నయనే శుభ చరణే ,
ఘోర పాప , భయ , ఖలు సంతరణే..|| సామ ||

సీతామనోహర శ్రితపాలా...పర-
మేశా పరాత్పర ఆదిమూలా...|
ఇభరాజవరదా ఇనకులజా...
ఇంద్రాదిసన్నుత అభయప్రదాతా ..|| సామ ||

మలయమారుతం రాగం .ఆదితాళం .

*****
శ్రీరామా జయ , జయ రామా ,
సీతామనోహర సుగుణాభిరామా || శ్రీ ||

కరుణాకటాక్షా కమనీయరామా ,
కౌసల్య ప్రియరామ , కోదండరామా || శ్రీ ||

భరతాగ్రజా భక్తజనలోల శ్రీరామ ,
సుందర సౌమిత్రి సేవితరామా ,
వాతాత్మజావందిత చరణా శ్రీరామా ,
ఇల ఈశ్వరీవినుత వరదే శ్రీరామా || శ్రీ ||

నీలాంబరి రాగం ,ఆదితాళం .

నీలమేఘశ్యామా రామా ...
నీరజదళ నయనా శ్రీరామా .... ||నీల ||

యజ్న్యయాగ సంరక్షకరామా ,
ప్రజ్న్యమీర , విలుఖండిత రామా ..|| నీల ||

సుందరేశ సీతాప్రియ రామా..
తరుణిశాపహర శ్రీపద రామా || నీల ||
దశముఖాది దైత్యాంతక రామా..
దిశ, దిశాది సంస్థ్థూయక రామా .. || నీల ||

నారదాదిముని వందిత రామా...,
పురజనాది సుఖ వర్ధిత రామా....|| నీల ||

దివ్యసుందర విగ్రహం .

దివ్యసుందరవిగ్రహం ,
భవ్యమంగళదాయకం ,
నవ్యధనుధర ధరధాత్మజ-
దైత్య- దానవ భంజనం |

విమల రవికుల భాసితం |
కమలనయన సుభాషితం |
సుమనసుందర , మత్తమదగజ -
గమన గుణ, గణ భూషితం ||దివ్య ||

నిత్య నిర్మల శోభితం |
సత్య , ధర్మ సుపోషితం |
సస్యశ్యామలవర్ణ భవ,భయ ,
వారణం , సుఖకారణం || దివ్య ||

సకల మునిజన పాలకం |
నిరత మారుతి సేవితం |
భరత, లక్ష్మణ , సహిత పుర-
సాకేత సీతా నాయకం || దివ్య ||

శుభపంతువరాళి రాగం ,ఆదితాళం

BhaavamulOnaa
శ్లోకం =శ్రీ వేంకటేశా శేషాద్రివాసా
భావములోనా బాహ్యమునందున
భావింతునీనామమే ముకుందా
కాచేదోరవని కరుణాభరణా
వేచితినీకై వేంకటరమణా '' కరములు ''

ఏపుణ్యఫలమో, మానవజన్మము
చేసినకర్మము చేరువౌ నిజమూ
కపటములనువీడి కాం క్షలదునుమాడీ
కంటినీ పదములే కైవల్యమూ....''

భక్తజనావన భాగవతప్రియ
భజమన గోవిందా...........
లక్ష్మీవల్లభ నారాయణహరి
భజమన గోవిందా...........
రాధామాధవ మోహనరూపా
భజమన గోవిందా............
భక్తి ప్రధానా ముక్తిప్రదాతా
భజమన గోవిందా..........

గోవిందా హరి గోవిందా ..
గోవిందా హరి గోవిందా...........

మలయమారుతం , ఆదితాళం

పరమపదమునకు సోపానమూ శ్రీ
వేంకటపతి దివ్య గుణగానమూ ..
పదమున కైవల్య పథమును చూపెడు
కరుణాంతరంగుని శుభనామమూ || పరమ ||

పరమాత్ముడు శ్రీ వైకుంఠధాముడు
ధరవెలసిన కలియుగ దేముడూ ..
తిరుమలశిఖరాన వెలసిన భూధవుడు
యిడుముల బాపేటి పరంధాముడూ || పరమ ||

పదునారు కళలతో పరిపరి విధముల
అలరారు శృంగార రసలోలుడూ ..
శ్రీదేవి , భూదేవి యిరుగడల సేవింప
లోకాల పాలించు జగధీశుడూ ........|| పరమ ||

శంఖ, చక్రాదులను చక్కగధరియించు
పంకజనాభుడు పరమాత్ముడూ....
ముడుపులగైకొని మూలముతానని
కైవల్యమునుచూపు కమలాక్షుడూ .|| పరమ ||

అభేరి రాగం .

మరిమరికొలువరే శ్రీపతిచరణాలు
సేయరే గోవింద, గోవింద భజనలు ||మరి ||

వడివడి తెలవారే తీయరే గంధములు
తిరువరు సేయరే సింగారములు .....
మరుమల్లెలు , మందారపు మాలలు ,
చేర్చరే పదముల తులసీ సుగంధాలు || మరి ||

పాడరే పడతులు మంగళగీతాలు ,
వేడరే జనులూ విడ భవ-భంధాలు ,
కోరరే కైవల్యధామపు సిరులూ...
చేరరే సిరిపతి వెలయు శ్రీగిరులూ || మరి ||

హే శ్యాం .

tune)

గోపాలభజం గోవిందభజం జయ
గోకులబృందవిహార భజం హరి -
నామభజం ,ఘనశ్యామ భజం వర
నంద ,యశోదానంద భజం హే-
శ్యాం .....హే శ్యాం............||

కస్తూరీ శోభిత ఫాల భజం -
కమనీయ సరోజ సునయన భజం |
మధురం, హసితామృతమధర భజం ,
మృదు-మురళీధర కరకమల భజం ,
హే.| శ్యాం || .....హే | శ్యాం .....||

గోపీ ,ముని , మానస బృంగభజం ,
గోవర్ధనధర గోపాలభజం |
గళశోభిత తులసీమాల భజం ,
ధర , సుందర శుభ శ్రీచరణ భజం |
హే | శ్యాం || హే | శ్యాం ||

ఆనందభైరవి రాగం .

*****
చేతవెన్నాముద్ద దేవకీఒడిపంట
కన్నయ్య మాయింట కదలాడరారా ,
కనులార నినుచూచి అక్కుననుచేర్చే,
ఆనందభాగ్యాలు నాకొసగవేరా ......
ననుబ్రోవరారా..|| చేత ||

నంద,నందన నాదు మొరవినగలేవా ..( నా)
మనసుబృందావనము ఆటాడరావా...
రేపల్లెమాయిల్లు వలసొచ్చిపోరా....
వెన్నెల్లుకురిపించి ననుమురవనీరా
నాకన్నరారా .|| చేత ||

ఉట్టిలోనా వెన్నముంతుంది రారా
పొట్టనిండాపాలు నువుతాగిపొరా..
చిట్టిపాదాలా చిరుచిందులేదువులేరా,
పట్టినీదూచేయి పులకించనీరా..
..నాకన్నరారా....|| చేత ||.

శ్రీ అయ్యప్ప అష్థోత్తరం .

|.వేదసార , విశ్వరూప వీరవాజివాహనా ,
శరణమయ్యప్పా | స్వామి | శరణమయ్యప్పా |
నారదాది సేవ్యమాన నీలకంఠ దివ్యనామ ,
శరణమయ్యప్పా | స్వామి | శరణమయ్యప్పా ||

2 .నీలమేఘశ్వామ ఘనా ,నీలవస్త్రధారణ
శరణమయ్యప్పా,| స్వామి | శరణమయ్యప్పా |
నూపురాది ,దివ్యహార, మహిషాద్యాసుర సంహార ,
శరణమయ్యప్పా | స్వామి | శరణమయ్యప్పా ||

3 .పరమపురుష పద్మనాభ, పంపాతీరస్థిరనివాస ,
శరణమయ్యప్పా | స్వామి | శరణమయ్యప్పా |
పందళాపురోద్ధరా , గణపతి ప్రియ సోదరా ,
శరణమయ్యప్పా | స్వామి | శరణమయ్యప్పా ||
4 .పాపనాసనా , భక్తి ,ముక్తి , మోక్ష సోపానా ,
శరణమయ్యప్పా | స్వామి | శరణమయ్యప్పా |
భవ-బంధవిమోచనా , బాల కమలలోచనా ,
శరణమయ్యప్పా | స్వామి | శరణమయ్యప్పా ||

5 .దివ్యశబరిగిరినివాస ,అయ్య| శరణమభయదాత ,
శరణమయ్యప్పా | స్వామి | శరణమయ్యప్పా |
హరి- హర శ్రీ దివ్యతేజ , అయ్యప్పశుభ నామజేజ ,
శరణమయ్యప్పా |స్వామి | శరణమయ్యప్పా ||



6 . దివ్యాభరణ,దురితహరణ ,పుణ్యతీర్థ పాపహరణ,
శరణమయ్యప్పా | స్వామి | శరణమయ్యప్పా |
దీనోద్దరణ , శుభచరణా , ఆర్తత్రాణపరాయణా ,
శరణమయ్యప్పా | స్వామి | శరణమయ్యప్పా ||


7 .అష్థశిద్ధి నిధిప్రదాత, ఆదిరూప హరిస్వరూప ,
శరణమయ్యప్పా |స్వామి | శరణమయ్యప్పా |
అంధకారబంధనాశ , అగజానన అగ్రేశా ,
శరణమయ్యప్పా | స్వామి | శరణమయ్యప్పా ||

8 .యిరుముడి ప్రియ ఇష్థదేవ, భేదరహితభూతేశా ,
శరణమయ్యప్పా |స్వామి | శరణమయ్యప్పా |
ఇహపర మోక్షాబ్దిసార , అయ్యప్పజయ నిర్వికార ,
శరణమయ్యప్పా |స్వామి | శరణమయ్యప్పా ||
శరణమయ్యప్పా | స్వామి | శరణమయ్యప్పా

రచన ,  శ్రీమతి,
పుల్లాభట్ల జగదిీశ్వరిీముార్తి.
కల్యాణ్.
-----------------

శ్రీ సాయి సుప్రభాతం .

మేలుకో శ్రీసాయి మేలుకోవయ్యా ,
మేలుకొని మమ్ము దయనేలుకొవయ్యా |
మేలుకో | మేలుకో ||

ఉదయభానుని కాంతికిరణమ్ము పొడచూపె ,
నిదురమేల్కొనుమనుచు , అరుణకాంతులు విరిసే ,
హృదయద్వారము తెరచి , భక్తివాకిట నిలచి ,
భజన,కీర్తనలతో నిను సన్నుతించేను || మేలుకో ||

మందభాగ్యను నేను , మంత్ర, తంత్రములెరుగ ,
వందనములేసేతు , భక్తి , భావము పరగ ,
చంద్రవదనా మందహాసమ్ముతో నీవు -
అండనుండీగావు , అన్యమెరుగను బ్రోవ || మేలుకో ||

పన్నీటిస్నానాల, పాలనభిషేకించ ,
పట్టువస్థ్థ్రములిడగ , భరణాలుతొడగా ,
సద్దుసేయక నీదు వాకిటనునిలిచేను ,
బెట్టుసేయక రాజ-రాజాధి సద్గురూ ....|| మేలుకో ||

పూలమాలలుగూర్చి,తులసి, మరువము చేర్చి ,
శీలసుందరరాయ ,సార చందనమిడగ ,
ఫాలలోచన పొద్దు వేసారి గడపితీ ,
జాలమేలరయింక , ద్వారకామయిజేజ || మేలుకో ||

పాలు, ఫలములు ,తేనె , పరమాన్నములు -
మేలు భక్ష్య, భోజ్యములివిగొ ,తాంబూలమిదిగో ,
ఆరగించవెస్వామి ఆలసింపకయింక ,
నీరజాక్షా నీకు నీరాజనములిడెద .....|| మేలుకో ||

భక్తవరదా నీకు వింజామరమువీచి ,
చక్కనైనాపక్క, వేసి పాదములొత్తి ,
నృత్య, గీతపు సేవ ,సంతోషముగ సేతు ,
పవ్వళింతువు తిరిగి, పంతమిప్పుడు వీడి || మేలుకో ||

ఆదిశేషా అనంత శయన

Aadiseashaa Anantasayanaa
ఆదిశేషా అనంత శయన
వైకుఠవాసా ణారాయణా ఆ ....
పంజాసన , ఫాలలోచన ,
పక్షివాహనా నారాయణా... ..|| ఆది !!

సోమ , సూర్యాక్షా , సురేశ్వర -
హేమాంబరధర నారాయణా ఆ...
కామరహిత , గుణధామ మహిత ,
వర, భీమపరాక్రమ నారాయణా || ఆది ||

ఆగమాది సుపూజితా ,సుర -
వందితాఖిల నారాయణా ఆ....
భోగవైభవ , భాగ్యదాయక
యోగివంద్యా నారాయణా ....|| ఆది ||
రామనామా , రవికులసోమా -
సీతానాయక నారాయణా ఆ.....
శ్యామ , కైవల్యధామ మధుర
సుధామ సుందర నారాయణా ..|| ఆది ||

శ్రీనివాసా , శ్రీవేంకటేసా ,
శాంఖ, గదాధర నారాయణా ఆ....
శేషగిరినిలయా మంగాపతి
ముక్తిదాయకా ణారాయణా.......|| ఆది ||

శ్రీకృష్ణ శరణం మమ

krishnaamrutam

శిఖిపించశోభితా.......... . కేశాశ్రీకృష్ణా |
కస్తూరీ తిలకాంకిత ఫాలా. శ్రీకృష్ణా|
కౌస్థుభమణిభూషితా కంఠా శ్రీకృష్ణా|
కారుణ్యారసభరితా కమలాక్షా కృష్ణా|
కనకాంగద మణికంకణ హస్థా శ్రీకృష్ణా|
కరమురళీశోభితా సౌందర్య కృష్ణా|
జాజీ,చంపక,తులసీ భాసిత శ్రీకృష్ణా |
జగదీశా జయ రాధాలోలా శ్రీకృష్ణా |

గోపస్థ్థ్రీమనమోహన మాధవ శ్రీకృష్ణా |
గోవర్ధనగిరిధారీ గోకుల శ్రీకృష్ణా |
కాళీయమర్ధన శుభ చరణా శ్రీకృష్ణా |
కంసాదిదమనాజయ,జయ జయ శ్రీకృష్ణా |
నారాయణ, నారాయణ,నరహరి శ్రీకృష్ణా |
నీలా- మేఘశ్యామా , నిర్మల శ్రీకృష్ణా |
తారణ, భవసాగర, శుభకారణ శ్రీకృష్ణా |
తారకనామా దివ్య శ్రీ చరణా కృష్ణా|

శరణం, శరణం, శరణం ,శరణం శ్రీకృష్ణా |
శరణం , శ్రీకృష్ణా, శుభ ఛరణా శ్రీకృష్ణా ||

గణపతి ప్రార్ధన

రాగం =నాట = ఆదితాళం .

ఆదిదేవాయ హర :
పుత్ర గణనాయకం
అఖిల భువన పూజితాయ
నమ: వఘ్ననాయకం '' ఆది ''

మహాగనపతిం నమామ్యహం
వర: శివసుతం ప్రణమామ్యహం ' మహా ''
సా.సని పనిసరి సనిపని సరిరీ..,.
గమపని సనిపమ గమపని సా... l
ససగస మమగస నిసరిస సనిపమ
గమపని సగసా. సనిపమ రిసగమ

గణనాధప్రియ గౌరీ నందన
గజముఖాదివర ప్రధమ వందనా
గణాది సుర సంస్తూయక చరణా
మహావిఘ్నహర ఖలుసంతరణా '' మహా ''
పా.పా. మగసస సనిపని సరిసా. ,
సగమప పమగమ పసనిప సససా. l
సా.గస మమగస సనిపని సరిసా. ,
పససా. సనిపమ గమపమ గమరీ. ll

పాసాంకుశధర పన్నగభరణా
ఏకదంత శుభ సన్నుత చరణా
విఘ్ననివారణ మూషకవాహన
ఆపద్భాంధవ ఆశ్రితశరణా '' మహా ''

గణపతి ధ్యాన్నం

Slookam

శరణం శరణం శ్రీ శిద్ధివినాయకం
శరణం శరణం శ్రీ బుద్ధిదాయకం
శరణాగతవత్సల ఆదిపూజ్యం
సతతం స్మరామీ.................
శ్రీ పార్వతీ ,శివ సుతం ......||

అఖిలలోకారాద్యదైవం ,
ఆగమాదినుత, గణసేవితం ,
సర్వవిఘ్నవిదూరం .,సతతం,
స్మరామీ...కైలాసపతి సుతం .||

కరద్వయే ... పాశాంకుశధరం ...,
వరదే..మూషికవాహన వక్రతుండం ,
లంబోదరం, మహాకాయం .....,
సతతం.......... స్మరామీ.....,
షణ్ముకాగ్రజం ..వందే గణనాయకం -||

అభయం ప్రయశ్చత్ ప్రధమవందితగురం ...
పాలయమాం ....... పార్వతీ ప్రియసుతం
విజయీభవ ,విజయీభవ .కలిమలహర్తారం .....
నమస్తే...నమస్తే....నమస్తే .. నమ: .||

వర్ణం

రాగం = కల్యాణి .
ఆదితాళం
ఆరోహణ= సరిగమపధనిస |
అవరోహణ= సనిధపమగరిస ||.
*****
సా. .స నిధపమ పధపమ గరిగమ
శ్రీ . .గౌ . రీ . . . . పు . . . . .
పా..ధ నిధపమ గరిగమ పా.ధని |
త్రం..వి . . . . . . ఘ్న. నా . శక |
సరిగరి సనిధని సరిసా . నిధమధ
లం ... బో . దర సుగుణా. క ర వ ర
నిసనీ . . . ధని సనిధప మపధని |
దే . . . . . ధర శుభఫల దా.యక |

ధా . . ధ నిధా . . గమధని ధా . . .
శ్రీ . . క రుణా. . . . లో . లా. . .
నిరిసా . నిధపా . మరిగమ పా . . .
భూ. . త. దీ గణ పా. లా . . .
మపధని ధపమప ధనిసా . . . ధని
పా . . . లిం .పగ రా . రా. . . ధ ర
సరిసా . నిధనిస నీ . ధప ధా . . ని |
సుగుణా. కరశుభ దా .యక రా . . ర |

మధ్యమకాలం .
*****
సా . . ని రిసా . ని ధనీ . ధ పమగమ
పా. . ధ నిధపమ గరిగమ పా .ధని |
సరిగా. రినిరీ . నిధమధ నిసనీ .
ధనిసరి సా . నిధ నిసనీ . ధమధని || శ్రీ..||

చరణం.
*****
నీ . . . . . ధని సనిధమ గరిగమ
నీ . . . . . వే . . . . . తొలిదై .
పా . . . . . మప నిధమపా . ధనిస |
వం . . . . . మ . మ్మూ. .కా . వ . వే |

నీ . . . . . సా . . . నీ . ధా . పా .
మా . . . గా . మా. . . పా . ధ || నీవే ||

ధా . . ధ పమగమ పా . . ధ నిధపమ
గా . . మ పధనిధ మా . . రి గమపధ || నీవే ||

పధనిధా . పమపా . ధనిధ రిసనీ .
ధనిసనీ . ధపమ పా . .ధ మపధని
సరీ . గ రిసనిరీ . నిధమ ధనిసనీ
. రినిధ మగరిసా . రిగమ పధనిస || నీవే ||

సా . . . . . నిరి సా . నిధ పమగరి
సా . . . . . ధని సా . రిగ మగరిపా
. మగరి గధపా . మగరిస రిగమరీ
. గమప ధమపధ నిసరిసా . నిధని
సరిగా . మగరిస నిరినిధ మధనిస
గరిసా . నిధపా . గరిసా . రిగమధ || నీవే || .


Samgeeta Saarvabhoumam

నాటరాగం .
రూపకతాళం .
*****

సంగీత సార్వభౌమం భజే |
సరసగానలోలం త్యాగరాజం || సంగీత ||

తిరువాయురపురనివాసం ,ఊ .....
ఆ.......ఆ.........ఆ..........ఆ......." తిరు "
రామబ్రహ్మసుతం , శాంతకుమారం |

మధ్యమకాలం .
*****
పంచాపకేస రామనాధానుజం ఊ.... '' పంచాప ''
పంచాపకేస రామనాధానుజం , సం -
తత శ్రీరామ భక్తం, సత్ బ్రాహ్మణకులజం || సంగీత ||

వరనారద యతిరాజనుతం , స్వ-
రార్ణవ గ్రంధానుగ్రహితం |
స్వర, రాగ సుధారసగాత్రం , పంచ -
రత్నాది కృతీ , కృత కర్తం - సం -

గీత జ్ణాన రత్నం , శ్రీ -
రామచంద్ర కృప పాత్రం -
గీత రసిక మిత్రం , సత్
గురు శ్రీ త్యాగరాజం || సంగీత ||










Kalaabhyaam – Ganapati Prarthana
కలాభ్యాం చూడాలంకృత శశికలాభ్యాం
నిజతఫ;ఫలాభ్యాం , భక్తేషు ప్రకటితఫలాభ్యాం,
భవతుమే శివాభ్యాం , హస్థోక త్రిభువన శివాభ్యాం ,
హ్రదిపునర్భవాభ్యాం , ఆనంద స్ఫురదనుభవాభ్యాం ,
నతిదియం నతిదియం ...........

శివశక్త్యాత్మకరూపా చిద్విలాస గణపతీ
భవభయహర విఘ్నహర వీరశక్తి గుణపతీ
గణనాయక నాదరూప మోదకప్రియ బాలరూప
రిద్ధి , సిద్ధి , వరప్రదాత సకల విజయ సారధీ '' శివ ''

సకలశాస్త్ర గుణనిధాన , సర్వవేద సమసమాన ,
సారవంత ఏకదంత సుర,నర, పూజిత అనంత
కామరూప చామరకర్ణా - గజముఖ వక్రతుండ
లంబోదర ఆదిపూజ్య శంభుతనయ ధర అభేద్య ''శ్హివ ''

పాశ చాప, బాణధరా ఫాలతిలక శొభిత వర
శుక్లాంబర 'ధర షణ్ముఖ ప్రియ అనుజా దనుజ దూర
మూషికవాహన ముఖ్యా గణనాయక సాధుమిత్ర
ధరపాలిత దివ్యనేత్ర మునిజనసేవిత సుగాత్ర ''శ్హివ ''

Omkaaresa
ఓంకరేశ షిరిడీ మహేశ్వరా
మహాయోగ మహిమాన్విత తేజా
మంగళరూపా మహోజ్వల దీపా
నమో నమో శ్రీ సాయి జేజా ...

అభయమునీయవే శ్రీ షిరిడి సాయీ
నిరతము నిన్నే తలచెదనోయీ '' అభయా'

శంకర శ్రీకర సుందరనాయక
మునిజనపాలక బుధజనావనా
మంగళకర శ్రీ విఘ్నవినాశక
సద్గురు సాయీ మూక్తి ప్రదాయక '' అభయ ''



ద్వారకమాయీ నీ వాసమోయీ
నిత్యాగ్నిహొత్రమే నీ ఉనికొయీ
నీపదసన్నిధి నా పేన్నిధొయీ
శ్రీనిధి షిరిడీ ధామమోయీ '' అభయ ''
Lalitaasuprabhaatam

సుందరపూర్వోదయ భానుదీప్తీం |
మందార, చంపక, సుమసౌరభ వీచికాయాం |
అరుణోజ్వలాకాంతి సమాయుత శోభనీయం |
శ్రీదేవి | లలితే | తవ సుప్రభాతం ||

మంగళ సంగీత వాద్యసునాదలహరీం |
మృదుకూజిత కోకిలారవోన్మత్తగానం |
శ్రీనారదవీణా మధుర, మంజుల దివ్యనాదం ,
శ్రీదేవి | లలితే | తవ సుప్రభాతం ||

సులలిత సౌందర్య దివ్య ముఖారవిందం |
సరసీరుహేక్షిత లలితసుందర మృదుస్వరూపం |
మధుపూరితరస మధురమంజుల మందహాసం |
శ్రీదేవి | లలితే | తవ సుప్రభాతం ||

నవమోహనాంగి నవరూపిణి వేదమాతే |
శ్రీగంధ, కుంకుమవిలేపిత కోమలాంగీం |
పాశాంకుశధరీం , పరవేష్థ్థిత శ్రీచక్రరాజం |
శ్రీదేవి | లలితే | తవ సుప్రభాతం ||

కమనీయభుజాన్విత సౌకుమారీం |
కనకాంగద ,మణిభూషిత , శోభనాంగీం |
కాత్యాయనీ , కామితార్ధప్రద అభయహస్థాం |
శ్రీదేవి | లలితే | తవ సుప్రభాతం ||

కౌమారి, నిగమార్ధగోచరకరి నిర్మలాంగీం |
కరుణాంతరంగిత కమనీయ మనోజ్ణ్మయీశం |
స్వరపంచమరహిత , లలితరాగసు స్వప్రకాశం |
శ్రీదేవి | లలితే | తవ సుప్రభాతం ||



త్వత్ పాదాంబుజ నిజసేవిత కౌతుకేశ్చం |
పరివేష్థితమాతురమన : విప్రబృందం |
పూర్ణామృతమయి స్వీకురుమే మధురభక్ష్య ఫలనివేద్యం |
శ్రీదేవి | లలితే | తవ సుప్రభాతం ||

కళ్యాణీ | కలిభంజని | పాలయమమ, కృపాకటాక్షీం |
తవ చరణసేవనం మమజీవనవిధి నిత్య, సత్యం |
సేవాసుభాగ్యం దేహిమేరమే మమ భాగ్యరాశీం |
శ్రీదేవి | లలితే | తవ సుప్రభాతం ||
Leavamma Girivaasinee

లేవమ్మ గిరివాసినీ , తెలవారె ,
మేల్చొమ్మ అరినాసినీ ....|| లేవమ్మ ||

దంతావధానమ్ము తొందరగకానిమ్ము ,
కుందరదనా పిదప పన్నీటిస్నానమ్ము ,
అగరుసాంబ్రాణిధూపమలివేణి కురులకూ,
సొగసుమీరామల్లె, జాజులివె పూజడకు || లేవమ్మ ||

చెంగావిరంగుగల పట్టుపీతాంబరము ,
బంగారుభరణాలు , మట్టె,లందియలివిగొ |
బాగతీసినమంచి గంధాత్తరులు ఇవిగొ ,
వేగతెమిలీరామ్మ వగలేందుకోయమ్మ || లేవమ్మ ||

నీలలోచని కనుల కాటుకా దిద్దెదా ,
ఫాలతిలకముదిద్ద నగుమోముచూపమ్మ
నల్లనాగూవంటి కురులనల్లీ జడను ,
మల్లె,జాజులదండ ముదముగా పెట్టెదను ||లేవమ్మ ||

పాదపూజలుచేయ ప్రజలు వచ్చేరమ్మ ,
వేద, మంత్రమ్ములకు విప్రులొచ్చేరమ్మ ,
సారసాక్షీనీకు పాలు, ఫలముల నిచ్చి
షోడశోపాచార పూజచేయుదుమమ్మ || లేవమ్మ ||

ధూప ,దీపాలివిగొ - భక్ష్యభోజమ్ములివే ,
పాపహారిణివమ్మ తాంబూలమిదెగొమ్మ ,
పంచహారతులంది మమ్ము దీవించమ్మ ,
ఎంచనీవేమాకు వేరెవరుదిక్కమ్మ ..

శ్రీచక్రవాశీంభజే ..శ్రీగిరిస్థిరనిలయ ,
శ్రీశక్తిరూపీం భజే ........
Navaraagamaalika

|. షణ్ముఖప్రియ రాగం= ఆదితాళం .
ఆరోహణ: సరిగమపధనిస ..
అవరోహణ: సనిధపమగరిస ||.
*****
జయ జగజ్జననీ జగదంబే , జయ
గణనాధ '' షణ్ముఖ ప్రియ '' జననీ అంబే || జయ ||'
కామాక్షి కైవల్య కరి మణి వలయే ,
మీనాక్షి మాధుర్య మంగళ నిలయే....
సా..స నిధపమ పా. . మ గరిసా. |
రిగమప ధనిధప ధనిసా . నిధపమ ||

సా.రిగ రిసనిధ రిసా .ని ధపమపా |
.మగరి సా .రిగ మపధని ధపధని || జయ ||

2. కళ్యాణిరాగం .
ఆరోహణ :: సరిగమపధనిసా |
అవరోహణ సనిధపమగరిసా ||
*****

కమలామనోహరీ కామితఫలదే |,
'' కళ్యాణీ '' జయ కామాక్షి వరదే |
కాత్యాయని కరరాజిత కమలే ...
ఖలునాసినీ వర శుభగుణవిమలే ||

సా .రిని ధపమగ రిగధమ గరిసా . |
నిధనిసా .రీ. గా .మపధ మపధని |

సా.రిగ రిసనిధ రిసా.ని ధపమపా|
. మగరి సా. రిగ మపధని ధపధని || జయ ||





3. మోహనరాగం .
ఆరోహణ= సరిగపధసా |
అవరోహణ= సధపగరిసా ||
*****

'' మోహనాంగి '' నవమోహిని మాతే |
మదనమనోహరీ..........మంగళగాత్రే |
మరాళగామినీ మాధవసోదరీ.... |
మరకత మంగళ శ్యామల గౌరీ.......||

సా.ధప ధపగరి సా . రిగ పధసా . |
రిగరిస ధపధస ధపగరి సరిగగ ||

సా . రిగ రిసనిధ రిసా. ని ధపమపా |
. మగరి సా .రిగ మపధని ధపధని || జయ ||

4. రంజనిరాగం .
ఆరోహణ= సరిగమధసా . |
అవరోహణ= సనిధమగసా ||
*****

మారహరురాణీ మంగళదాయినీ |
మాతంగీ ... మధు, కైటభభంజనీ ||
మాతమనోహరీ .... హేశివరంజనీ |
మలయజ,కోమల మాత నిరంజనీ ||

సా .సని ధమగసా . రిగమ ధసా .రి |
సనిధమ ధనిధమ గసా .స రిగమధ ||

సా. రిగ రిసనిధ రిసా .ని ధపమపా|
. మగరి సా .రిగ మపధని ధపధని || జయ ||














5.పూర్వికళ్యాణిరాగం .
ఆరోహణ= సరిగమపధపసా .
అవరోహణ= సనిధపమగరిసా ||
*****

పర్వతవర్ధినీ పాహిమహేశరీ ,
పంచమస్వరజనీ '' పూర్వికళ్యాణీ ''
పన్నగధరుసతీ పద్మలోచనీ...
పాశాంకుశధరీ సింహవాహినీ ||

గా .మగ రిసధా . సరిగా . మపధప
మధపమ గరిగమ పమగరి నిధమగ |

సా .రిగ రిసనిధ రిసా.ని ధపమపా-
. మగరి సా .రిగ మపధని ధపధని || జయ ||

6.ఆనందభైరవిరాగం .
ఆరోహణ = సగరిగమపధపసా.
అవరోహణ= సనధపమగరిస ||
*****

మధురాపురీనిలయే మీనాక్షీ ,
మధురిపుసోదరీ '' ఆనందభైరవీ ''
మందగమని మహిషాసురమర్ధనీ ,
కుందరదని బాలా సుఖవర్ధని |

సా.నిధ పా. మగ రిపమగ రిసగరి |
గమపధ పసా .స నిధపమ గరిసని ||

సా.రిగ రిసనిధ రిసా.ని ధపమపా
. మగరి సా.రిగ మపధని ధపధని || జయ ||













7. కానడరాగం.
ఆరోహణ= సరిపగా..మధనీసా |
అవరోహణ= సనిపమగామరీసా ||
*****

శ్మితసితసుందరీ మాధవసోదరీ
మాతమనోహరీ మంజులభాషిణీ '
కామదహనుసతీ తాండవలయకరీ
'' కానడ '' సుస్వరరాగప్రియకరీ ||

గా..స రిపగా. గమరిస రీ . .మ
ధనిసా . నిసరీ . రిపగా . గా .గమ
రిసనిరి సనిపధ నిపమరి గా.రిస |

సా.రిగ రిసనిధ రిసా.ని ధపమపా -
.మగరి సా.రిగ మపధని ధపధని || జయ ||

8. కళ్యాణవసంతం .
ఆరోహణ= సగమధనిసా ,
అవరోహణ= సనిధపమగరిసా ||
*****

కళాణవసంతవాహినీ జనని , సం -
గీతమోదినీ శివగౌరీ .......|
శంకరుకామే , ఇందిరశ్యామే |
స్థ్థితి, లయకారిణీ కాళిభవానీ ||

నీ..స నిధమగ సా.. స గమధని ,
సనిధని గరిసని ధరిసని ధమధని |

సా,రిగ రిసనిధ రిసా.ని ధపమపా
.మగరి సా.రిగ మపధని ధపధని || జయ ||










9. శ్రీరాగం .
ఆరోహణ= సరిమపనిసా .
అవరోహణ= సనిపధనిపమరిగారిస ||
*****

మలయాచలవాసినీ మరకతమణి -
మయ-భూషణి గౌరీ పాలయమాం |
'' శ్రీ '' చక్రేశ్వరీ | హే| శివశంకరీ |
జగదధినేత్రీ ......జగదీశ్వరీ.........||

పా..మ పనిపమ రీ. రీ. రిమరిస ,
రిమపా. మపనీ. పనిసా. నిసరీ. -
రిమరిస సనిపధ నిపమరి గా.రిస ||

సా.రిగ రిసనిధ రిసా.ని ధపమపా-
.మగరి సా.రిగ మపధని ధపధని || జయ ||

Durgaastuti

శివునిపట్టపురాణిగుణమణి , అంబ ఈశ్వరి పాహిమాం |
ఇందుసీతల హాసినీ, మహేంద్రహిమగిరివాసినీ .......|
పాహిమాం ........పాహిమాం ..........||

మంద్రమధురాహాసినీ.,మృదుభాషిణీ, మీనాక్షినీ |
సర్వవేదస్వరూపిణీ ,సమస్థదురితనివారిణీ.......|
సురాసురేశ్వరి ఈశ్వరీ,త్రయంబికే, త్రిపురేశ్వరీ....|
పాహిమాం, పాహిమాం ..............||

భూనభో,భువనాంతరాళిని,క్షుద్ర,క్షిద్ర దురాంత హారిణి |
దుష్థ దైత్య వినాసినీ..........,శిష్థజనపరిపాలినీ..|
అంబ అఖిలనివాసినీ,.... మధురమంత్రోచ్చారిణీ |
పాహిమాం .........పాహిమాం .........||








Deavee Dandakam

జయ,జయ ,జగత్ జ్ఞానప్రసూనాంబికే, అంబికే,
సత్యసంధాయికే, సకల శృష్థ్యాత్మికే ,సర్వసంధాత్రికే ,
భూ,నభో, భువన,సముద్రాంతరవ్యాప్తికే కాళికే ,
వాయురాకాసతేజోవిలాసాంతికే ,దీప్తికే...
చంద్ర,సూర్యాగ్ని సమలోచనావిక్షితే ,సుక్షితే ,
ఇంద్ర, యక్ష్యాది, గంధర్వ ,గణస్తూయకే ,ధ్యాయతే
సర్వ జగన్నాటకాసూత్ర సారాత్మికే శ్రేయసే ,
సకలసౌందర్యతేజోవిరాజాత్మికే, భ్రాజితే |
సర్వ జనమోహ సౌందర్య సారాత్మికే ,చంద్రికే |
సరసమాధుర్య గీతాది నృ శ్చేశ్చికే , స్వశ్చికే |
సౌమ్యే, సింధూరవర్ణే , అనన్యే, శరణ్యే -
గిరిజాంబపూర్ణే , మాతా సువర్ణే
అమోఘాస్థ్థ్రశస్థ్థ్రాది ,పరిపూర్ణమాన్యే , ఓంకారపర్ణే
అణిమద్యష్థసిద్ద్యర్ధ , గుణసారగమ్యే ,సురమ్యే |
పంచ భూతాదివసనే, త్రిలోకాదిమాన్యే.
సాధుజనపూజ్య సంతుష్థ భావే, సర్వజ్ఙే |
శర్వాణి, గీర్వాణీ, మునిరాజయజ్ఙే |
విశ్వాంబికే వేదసారార్ధపరిపూర్ణ శక్త్యాంబికే |
దేవమాతే ధరాద్దురిత శమనాత్మికే, సాత్వికే |
అండ ,పిండాది , బ్రహ్మండ పరిపాలికే కౌళికే |
చండ, ముండాది,మాలాధరే, రౌద్రికే - జ్వలిత-
హ్రీంకారి , ఓంకార బీజాక్షరే భీకరే అంబ ,
శ్రీచక్రరాజేసుపరివేష్థితే , సుస్థితే -
హస్త పాశాంకుసాదిన్మహాఅస్థ్థ్రి కే ,శస్థ్థ్రికే |
చిత్రమాలావిభూషాది రణచండికే శుంభికే
సర్వరక్షాకరే, ప్రళయబీజాంకురే , గిరీన్మధ్య -
స్థిరే , పురే కైలాశమల్లే, జనకల్పవల్లే ....
జనని రక్షే, కటాక్షే, కృపాక్షే , వరాక్షే ,
జగద్రక్షకారభయ కారుణ్యహస్తే ,
నమ:స్తే | నమ:స్తే | నమ:స్తే | నమ: ||


Paahi Paahi

జయ జయ జగదంబే...
జయ హిమాద్రినిలయే శ్రీచక్రవలయే...
జయ పాశాంకుశాది ధనుర్బాణధరకరే...
జయహే జయ శివసతే ''....
సకల దీనజనార్తాభయకరే....
సర్వమంగళే....శివే.

పాహే పాహే పరమేస్వరీ ఈస్వరీ
పాలయమాం జయ పార్వతీ హరుసతీ " పాహీ పాహీ ''

పంచముఖేశ్హునీ వామ భాగే
పంచాగ్ని మధ్య నీలయే కరుణాలయే
కామకో్టీ పీఠాదివాసిని
కౌమారీ ప్రియ షణ్ముఖ జననీ '' పాహీ''

కాదంబరి కరశ్హూల ధారిణి
కల్యాణి కరుణారసశోభిని
భావయామి భగమాలిని భావే
చింతయామి శ్హివశ్హంకరి గౌరీ '' పాహీ''

Paahiparea Lalitea

రాగం =హిందోళ =ఆదితాళం
ఆ: సగమధనిసా అ: సనిధమగసా|
పాహిపరే లలితే..పరదేవతే..''
పరమదయాద్ర హితే , సురసేవితే..'' పాహి ''
ఏహిముదందేహీ, గిరితనయే ,
మధురిపు సోదరి మంగళమయితే '' పాహి ''
పంచాయుధధరి పంచముఖే శివే,
పంచాక్షరి సతి శివయువతే
మృగపతిస్కంధస్థితే జగద్విదితే ,
భగళే, భైరవి , భయసంహరితే....'' పాహి ''
అగ్నిర్వాయురాకాస , సంకాసే
ఖడ్గ్నిని , శూలిని , శక్తి భృతే
బ్రహ్మ, శివా, విష్ణ్రోనఖ ప్రకటిత
ప్రబల ప్రచండే , జగదోర్దండే..........'' పాహి ''

Saaradea

శారదే జయ శారదే
వాగ్విలాసిని శారదే '' శారదే''
సామగాన విలొలినీ
సరసీరుహ దళలోచని
వాణి వీణా పాణి జననీ
వాఙ్మేయీ వనజభవు రాణీ "శారదే"
గురుగుహ జననీ వర కళ్యాణీ
వీణా పుస్తక ధారిణీ ,
వేద పురాణీ వర మృదుపాణీ
వరదే శ్రీ చతురానను రాణీ " శారదే''
కేనొపరిషద్ వేద స్వరూపిణి
కనకాంగీ శ్రీ హంసవాహిని
సాదేవీ సకలార్తిశమనీ
సప్తస్వర సంగీత రూపిణి "శారదే"

Madhuraanamdamugaadaa
ఆనందభైరవి రాగం .
ఆదితాళం .

మధురానందముగాదా, మాతానిను కొలుచుట,
మదిలోకోర్కేలు తీర్చగ వచ్చిన ,
మహిలోవెలసిన ఓ జగదంబా ,
మోదమాంబా ||

మోదముతోనిను కొలిచెదమమ్మా.
మోదమాంబ గనుమమ్మా...అమ్మా...|| మధురా ||

రాగాల మేల్కొలుపిదే తొలిఝామూ,
మురిపాలనీమోము మాపంటనోమూ,
ఈడేరు కోర్కెలు నినుసేవింపగా ,
పాడేరు మాఊరు పావనగంగా ........|| మధురా ||

మధుర ,మధుర శుభమంగళదాయిని ,
మోదమాంబ మాతా వరదాయిని , ||

స్వర్ణాంబరి సరసాంబుజలోచని
సింధూరార్ణవ కుంకుమశోభిని - || మధురము ||

మునిజనసేవిత హేజగవందిని ,
మహిమాన్వితగుణ మలయజవాసిని
నిత్యసురార్చిత నిర్మలభాసిని ,
నందిని , వందిని , శ్రీగిరివాసిని ...|| మధురము ||
Nirupamagunasadanee Vaanee

కళ్యాణిరాగం . ఆదితాళం .
*****

నిరుపమగుణసదనీ , వాణీ |
నీరజాక్షి జయ నిత్యకళ్యాణి || నిరు ||

వరదాయిని వాణీ | కర రాజిత -
వర మృదు వీణా పాణీ.........|| నిరు ||

శరదిందు శోభిత సుందరవదనీ ,
రాగాది, స్వర, లయ , సంగీత సదనీ |
ఓంకారనాదాది ప్రణవ - ప్రసూనే ,
వాగ్విలాసిని వరదే శర్వాణే || నిరు ||

Amrutavarshini

రాగం -- అమృతవర్షిణి --ఆదితాళం
*****

అమృతవర్షిణి ఆనందదాయిని
సూనృతవరరూపిణీ జననీ
శివానందలహరే --
హిమగిరినిలయే '' అమృత ''

అవ్యాజకరుణా రససుధనిలయే
దివ్యాయుధధరి అఘసంహారే
దుష్థభయంకరి శిష్థశుభకరి
అష్థభుజే అభిరామే శివే '' అమృత ''

అండపిండ బ్రహ్మండ పాలయే
అఖిలాండేశ్వరి శ్రీచక్రనిలయే
నిఖిల గణాసుర అర్చిత పదయుగళే
సుఖసాగర లహరే శ్రీకళే ---

తకట తకిట ఝణు తాళతరంగే
ధిమిత ధిమిత ధిమి నాదమృదంగే
ఝణుత ఝణుత ఝణు నట్యరసాంగే
తాందవలయకరి శ్హివప్రణయాంగే '' అమృత ''
kamaladaLaayataaXee

కమలదళాయతాక్షీ కామే
శ్వరి కరుణా కటాక్షీ......'' కమల
అమరింద్రాది దేవాసురపూజిత
మునిజన సేవిత పదయుగళే
పాహిపరాత్పరి పావన చరితే
పరమ దయాకరి శివసతి పార్వతే '' కమల ''

కమలాసనకరి కామిత శ్రీకరీ
కరవీణాధరి గానప్రియే
హిమగిరితనయే, మమహృది నిలయే
శ్రీ చక్రేస్వరి లలితే పాలయే '' కమల ''

పా..మ పధసా. సధపమ గరిరీ. .
మరిసధ సరిమా. గరిరిమ పా.ధప
మపధసా .సధస రీ.రిమ రిసధస
సధపమ పధసా. ధపమప మగరీ. |








Kanchikaamaakshi

కంచి కామాక్షి కౌమారీ
కరుణాటాక్షి శ్రీ రాజరాజెశ్వరీ త్రి పురసుందరీ ''కంచి ''

మదగజగమనీ మాధవ సోదరి
మాహేశ్వరి మహిషాసురమర్ధిని '' కంచీ'

పురభంజను సతి , పరమ దయాకరి
పాశాంకుశ ధరి , పాహి మహేస్వరి
పాలయమాం జయ , పశుపతీసతీ
పన్నగధరు రాణీ, పరమేశ్వరీశ్వరీ '' కంచీ''

Lalitea Sre

లలితే్ శ్రీ లలితే
సలలిత రాగ సుధా కవితే
శ్రీ లలితే శ్రీ లలితే ''

గానప్రియే గమకాది లయకరి
వేదాంకితసారే భవతారే
విమలే విస్వాంతరి ఈశ్వరి
వరదే శ్రీ లలితే విజయేశ్వరి గౌరే '' లలితే''

శి ష్థ సం రక్షిణి దుద్ధర ధర్షిణి
శ్రీచక్ర పరివేష్థి తే సుపూజితే
సుగుణ మనోహరి షఢ్రిపు విదళితే
వరదే శుభ ఫలదే / త్ర్రైయంబికే గౌరీ '' లలితే''

Mahendragiri

మహేంద్రగిరినిలయే మహేశ్వరి
మామవ హృది వలయే , సదయే '' మహేంద్ర ''

మహా మహితకరి మాధవ సోదరి
మరకత మంగళ శ్యామల గౌరీ '' మహేంద్రా''

ఆగమవినుతే దైత్యవిదళితే ,
సామగానప్రియే సన్నుతచరితే
సంగీత స్వర రాగ సుమోదితే
రమా, వాణి సఖి శంకరు యు్వతే ..

పా.పమ రిసనిస రిమరిస రిమపా. | .
మపనీ. పనిసా. నిసరిస రిమరిస |
రీ.పమ రిసనిస రీ.సని పా.మప|
నీ.పమ రీ.రీ. రిమరిస రిమపని |

Manimayamakuta Simhaasana
మణీమయమకుట మణే సింహాసన
స్థితకరి శ్రీకరి శివగౌరీ.....
అణిమద్యష్థ సిద్దేశ్వరి ఈశ్వరి
అన్నపూర్ణే శివ మహేశ్వరీ '' మణి ''

రూపదస దివ్య మంత్రమాన్యే
దర్వీధరకరి కోమలపాణే
దివ్యాంబర , భూషోజ్వల శ్యామల
పర్ణే ,స్థితే , చక్ర శూలభవానే...'' మణి ''

ఆర్కద్యుతి శిర : పాదాంగుళ్యే ,
నయనంచతధా పావకతేజే ...
వహ్నిశిఖే, ముఖ మండలభ్రాజే
తేజోరాసి సముద్భవభేద్యే .. '' మణి ''

మధుకైటభ హంత్రీ మదుసూదని
క్షితిమడల క్షేమంకరి సౌమ్యే
చింతిత మానస హరిత క్లేసే
మోక్షాన్మానుష మిహసంసారే ...'' మణి ''

Nanudaya
ననుదయబ్రొవవె నారాయణీ
నాదస్వరుపిణి వెదపురాణీ '' నను ''

పంకజముఖి పరమేస్వరురాణీ
పాపవిమూచని పాహి మహేస్వరి '' నను ''

అఖిల లొక పరిపాలిని మాతా
ఆది పరాశ్హక్తి అంబే మాతా
ఐగిరి నందిని అన్నపూర్ణేస్వరి
హే జగవందిని వరకల్యాణి ''నను ''

Nanupaalimpaga
ననుపాలింపగ రాగదేమీ ,
కామాక్షీ, ..కరుణాకటాక్షీ ||

కనిగొంటిని నీ మహిమలెల్లా
కామితార్ధములొసగు పరాత్పరీ " నను ''

కంజదళనేత్రీ, కమనీయగాత్రీ |
పాశాంకుశధరి హిమగిరిపుత్రీ |
బిందురూపిణి నాదబ్రహ్మాణి బాలే పూ-
ర్ణేందుబింబధరి బ్రహ్మాండపాలే........

పధసా. నిధపా. మగరీ. గరిసా... |
కరుణా. భరితే. శివగౌ. రినుతే . . |
సనిధప ధనిసరి సరిమా. గరిమప.. |
పా.లయ మాంజయ వరదా. భయభవ |
ధా .ధప పధసా . నిధపధ సరిగమ |
సా .గర తరణే . సురనర మునిగణ |
గరిసా . నిధపా . మగరిస రిమపధ |
వినుతే. జయతే. శివసతి పార్వతే. ||
Needu Smarana

నీదు స్మరణ చేతు నమ్మ
నీరజాక్షి పావనీ
నన్ను బ్రోవ రాగదేమి
రాగసుధా మోదినీ

నీదు నామ మహిమలెల్ల
నిండారెగ జగము నెల్ల
సాధుశీల శ్రుతి , స్వర , లయ
భావ మలర భక్తి పరగ '' నీ''

రాణీ, పున్నాగవిజిత వేణీ ,
కమలజభవు రాణీ ,
కరవీణా పాణీ --''
గీర్వాణీ దురిత హారిణీ
శర్వాణి శ్హరణ దాయినీ,
సత్యలొక వాసినీ
శరణు సింహవాహినీ
Saambhavi

శ్హాంభవి శ్హంకరి శ్హివపార్వతీ
జగదీస్వరీ రాజ రాజేస్వరీ '' శాంభవీ''

హిమగిరి తనయే హైమవతే
హరి సోదరీ అంబ అఖిలేస్వరీ
కాశీపురీస్వరి కంచి కామాక్షీ
కరుణా కటాక్షీ కైవల్యరాశీ -----
మధుర లావణ్య మంజుల భాషిణి
మధుపూరిత రస హాస భూషణీ
మదన మనోహరి మారహరు రిణి
మాత మా దుర్గ సింహవాహినీ '' శాంభవీ''

Xeerasaagaranilayea

క్షీరసాగర నిలయే శ్రీ నిలయే
కరుణారస హృదయే కమలాలయే '' క్షీర ''

జాజీ, చంపక, కుసుమప్రియే జయ
లక్ష్మీం , వరదే పద్మాలయే
పద్మనాభ ప్రియే పంకజ నయనే
పాలయమాం జయ పరమేశ్వరీ '' క్షీర ''

గంధ, సుగంధ, సుమాలా ధారిణి
చందన, కుంకుమ , అలంకృత వదనీ
కనకాభరణే, కలిమలహరణే
కల్యాణీ, కర వారిజధారిణి '' క్షీర

నవావర్ణ శ్లోకాలు

SreeSakti Lalita

శ్రీశక్తి అయిన లలితావైశిష్థ్యం .
---
శ్లోకం :
ఓంకార శృతిరూపయా-
కమలజం పుష్ణాతియా నిర్మితా |
విష్ణోశ్చాపి దశావతార సుకృతిం
వ్యాపారయంతీశ్రియా |
జ్వాలా ఫాలతయాభవం ,
లయవిధా వజ్జీవయంతీ శివై: |
సాశక్తిర్లలితా ప్రసీదతు మయి ,
శ్రీభూతిసంధాయినీ ||

నిర్గుణ పరభ్రహ్మ అయిన ఆదిశక్తి మొట్టమొదట " ఓంకార " నాదంతో వ్యక్తమయినట్లు "ఆర్ష వాజ్మయి " చెపుతోంది . మూడువేదాల సమాహారమైన అ+ఉ+మ అనే అక్షరసంయోగశక్తి ఒకటే సకల శృతి ప్రపంచానికి మూలాధారం .

ఆతల్లి తన ఇచ్చా శక్తితో శృష్థిసంకల్పం చేసి బ్రహ్మని శృష్థికర్తగాచేసి , వేదశక్తిని ప్రసాదించి , తాను ఆ శక్తిని వాగ్రూపంగా అందుకొని వాగ్దేవిగా నిలచింది . అలాగే విష్ణువునందు అనుగ్రహశక్తిని , బుద్ధిని వహించి , శృష్థిరక్షణకై అనేక అవతారాలు ఎత్తే సౌభాగ్యాన్ని ప్రసాదించేందుకై లక్షీశక్తిగా విలసిల్లింది .

అటుపిమ్మట అహితాన్ని లయం చేయడంకోసం శివుని నుదుట అగ్నినేత్రం కల్పించి , తానే దహనశక్తిగామారి నిమిత్తమాతృడైన ఈశ్వరునిచే లయకర్మలు చేయిస్థున్నాది . ఇలా ఆతల్లి ఇచ్చాశక్తి , జ్నానశక్తి , క్రియాశక్తులుగా తననుతాను విభజించుకొని త్రిమూర్తుల కార్యనిర్వాహణను పరిపూర్ణం కావిస్తున్నది .ఈశక్తి ఒకొక్క మన్వంతరంలో్ ఒకొక్క రకంగా అవతరించీ , కొన్ని ధర్మాలను ఉపదేశించింది . అవే మన శాస్త్ర్త్రాలుచెప్పిన సదాచారాలు . ఈమె స్వయంభువ మన్వంతరంలో్ బ్రుగుమహర్షి కూతురుగా పుట్టి భార్గవిగా ఖ్యాతికెక్కింది . ఈ ఒక్క జన్మయే ఆమెకు యోనిజన్మ . మిగిలిన అవతారాలలో ఆమె అయోనిజ .
" స్వారోచిష " మన్వంతరంలో అగ్నినుంచీ,
" ఔత్తమ " మన్వంతరంలో జలరాసినుంచీ,
" తామస " మన్వంతరంలో భూమినుంచీ ,
" రైతవ " మన్వంతరంలో మారేడువృక్షంనుంచీ,
" చాక్షుప " మన్వంతరంలో సహస్రదళపద్మంనుంచీ,
" వైవస్వత " మన్వంతరం లో క్షీరసాగరంనుంచీ ఉద్భవించింది .
దుష్థ్థ- శిక్షణకు , శిష్థ్థ-రక్షణకు పలురకాలుగా మానవులకు అర్ధ , పరమార్ధాలను స్ఫురింపజేస్థూ అవతరిస్థున్న అపరమాత్మైకస్వరూపిణి ఆ త్రేలోక్య, త్రిమూర్తి స్వరిపిణి శ్రీమాత .

'' ఓం తత్ సత్ ''


Navaavarana Slookams

|| ధ్యానం ||

ధ్యాయేత్ ఆది మధ్యాంత రూపిణీ ,
అఖండైక రస వాహినీ, |
అష్థాదసా పీఠ అఘనాసినీ, దేవి ,
ముక్తిప్రదాయినీ, సంగీతరసపోషిణీ ||

అరుణ కిరణోజ్వలాకాంతిరసభాసినీ,
అ,క,చ,ట,త,ప వర్గాది గుణభేదినీ , |
అంబ యంత్రాది ,కాది,సాది,
మంత్రాది వసనీ ,కామేశి శివకామినీ ||

1. త్రైలోక్యమోహన చక్రం .
ఆనందభైరవి రాగం .
*****
సర్వానందకరీం ,జయకరీం ,
త్రిపురాది చక్రేశ్వరీం |,
శర్వాణీ షడ్చక్రభేదకరీం ,శివసతీ,
నిగమాదిసంవేదినీం ||

మహిషాసురాది దైత్యమర్దనకరీం ,
భయహరీం, అణీమాద్యష్థ సిద్దేశ్వరీం |,
'' త్రైలోక్యమోహనచక్ర'' నిలయీం ,
సురనుతాం,'' ఆనందమయి భైరవీం'' ||

2 సర్వాశాపరిపూరకచక్రం ,
కళ్యాణి రాగం.
*****
'' సర్వాశాపరిపూరకచక్ర ''నిలయే ,
శర్వాణి శివవల్లభే .|
శ్రీవాణీ, రమా ,సేవితపార్స్వయుగళే ,
పర్వేందుముఖి పార్వతే ||

దూర్వాసార్చిత దివ్యపాదయుగళే ,భగవతే,
భవ,బంధ,భయ మోచకే |
ఉర్వీతత్వాది స్వరూపిణీం , చైతన్యఖనీం ,
'' కళ్యాణి '', ఘనరూపిణీం ||
3 . సంక్షోభణచక్రం .
శంకరాభరణం రాగం .
*****
అనంతకోటి బ్రహ్మాండనాయకీం ,
''సర్వసంక్షోభిణీం'', బ్రహ్మాణి బహురూపిణీం |
అనంగాద్యుపాసినీం అనంగకుసుమాం,,
అంబ అష్థ్థాదశాపీఠికాం ||

హస్తే అంకుశ,చాప, బాణ, ధనుధరీం ,
జయకరీం తత్త్వప్రదే , శాంకరీం |
శతసహస్రరత్నమణిదీప్తీం,మందేస్మితేందువదనాం ,
' శంకరాభరణవేణీం '' ||

4 .సకలసౌభాగ్యచక్రం .
కాంభోజిరాగం .
*****

నమ: అంబికాయై , నమ:చండికాయై ,
నమ : ఓంకార, హ్రీంకార, బీజాక్షరై |
నమ '' కాంభోజ''చరణే ,చతుర్దశభువనే ,
'' సకలసౌభాగ్య '' శుభదాయినే ||

నమ:కల్మషహరణే కలిసంతరణే ,
చతుర్వర్గ ఫలదాయినే ......|
నమ: కామేశ్వరీ, కాళికే, ఘనకపాలికే,
సకల భువనాంతర్గతపాలికే ...||

5 . సర్వార్ధసాధకచక్రం .
భైరవిరాగం .
*****
'' సర్వార్ధసాధకచక్ర '' నిలయే,
బహిర్దసాదిచక్రవలయే, బహురూపికే ''భైరవే'' |
నిత్యశుద్ధే, ముక్తబుద్ధాభేద్య, సత్ --
చిదానందమయి సాత్వికే ||

త్త్ర్రైమూర్తి త్రిగుణాత్మికే ,ధరనుతే ,
క్షిత్యాదిశివశక్తి స్వరూపాత్మికే. |....
కదంబవనవాటికే, త్రిభువనపాలికే,
దేవి త్త్వ్రైలోక్యరక్షాళికే ,,,,,||

6. సర్వరక్షాకరచక్రం .
పున్నాగవరాళిరాగం .
*****

దశరాదివినుతే గురుగుహవిదితే , దేవి-
దశశక్తి దైత్యాళికే ..... |
''సర్వరక్షాకరీ '', సర్వసంపత్కరీ , దేవి ,
కైలాశరమణేశుమణి సాత్వికే ||

దశకళాత్మికే , దశరసాత్మికే ,దేవి -
సంగీత, సాహిత్య , రసపోషికే.....|
అతిమధురవాణీ ,'' పున్నాగవరాళివేణీ ''
పాహి | సర్వజ్ఙే శివకామినీ....||

7 . సర్వరోగహరచక్రం .
శహనరాగం .
*****

రాజీవనయనే ,.. రాకేందువదనే ,
''శహన'' రాగోత్సాహి లయరంజనే |
స్వాత్మానుభోగినీ , శుభరాజయోగినీ
దేవి ,ఓంకారి, హ్రీంకారి ,జనమోదినీ ||

అతిరహస్యయోగినీ "సర్వరోగహరచక్రస్వామినీ ''
దేవి వాగ్దేవతారూపి విద్యాఖనీ |
కోదండధారిణీ , వీణాసువాదినీ , దేవి -
శరణార్తిశమనీ , సుసౌదామినీ ..||


8 . సర్వశిద్ధిప్రదచక్రం .
ఘంటారాగం .
*****
ఆవాహయే దేవి , అరుణోజ్వలే, అంబ -
దైత్యాళి , జయకాళి , జగదంబికే ....|
సర్వ శక్త్యాత్మికే , దేవి సుకసారికే దివ్య ,
'' ఘంటామణిఘోష '' కవాటికే.......||

నఖోదితవిష్ణు , దశరూపికే , దేవి
దశాకరణ శబ్ధాది అంతర్లయే |
సర్వాత్మికే , సర్వరక్షాకరీ, '' సర్వ -
వరశిద్ధిప్రదదాయి '' త్రిపురాంబికే ||

9 .సర్వానందమయచక్రం .
ఆహిరిరాగం .
*****

జయతి జయతి అంబే, శృంగారరస కదంబే ,
శివకామేశ్వరాంకస్థ - బింబేందుబింబే....|
చింతామణిద్వీప మంచస్థ్థితే , దేవి -
చిద్బింబ , శివరూపి , చక్రస్థితే......... ||

కమలాంబికే దేవి విమలాత్మికే ,
''సర్వ ఆనందమయి'' రూపలలితాంబికే |
శాకంబరీ, దేవి శాతోదరీ జనని ,
దుర్గా,రమా, వాణి సతి సాత్వికే ||

జమంగళం |, దేవిం శుభ మంగళం ||
నిత్య జయ మంగళే , శక్తి కురు మంగళం ||

ఓం | భూ: శాంతిప్రదే | భువన శాంతి ప్రదే |
భూత , ప్రేతాది - గ్రహపీడ శమనహ్రదే .....|
సకలసౌభాగ్య ప్రద పూర్ణమయి మంగళే |
ఓం.......శాంతి:......శాంతి: ......శాంతి:. . ||

రచన -
పుల్లాభట్ల జగదీశ్వరి .