ఓం సాయి రాం .
----------------------
కొలువై యున్నాడవు కలియుగ దైవమై
కరుణజూపరాదా సాయీ ....
విలువలు నీనామ మహిమలు యిలలో
తలచితిమీ గన రావోయీ !కొలువై !
కొల్లలు నీ భక్తకోటులిలలో ....
కరములు మోడ్చితిరీ సాయీ ...
ఎల్లలు లేనట్టి నీ గుణ గానాలు
ఎంచి భజించితిరీ సాయీ .....
చల్లని చూపుల కాంతుల కరుణను
నిరతము కోరితిరీ సాయీ .....
వెల్లువలై పొంగు నీ ప్రేమే రాగాలు
జల్లుగ కురిపించ వోయీ !కొలువై !
తనువూ ,మనసు నీదిగ చేసి
ఆరాధించితినీ...... సాయీ .....
ఘనమౌ నీరూపు మదిలో నిలిపీ
ధ్యాన్నము చేసితినీ సాయీ ...
సాయీ సాయని నిరతము తలపుల
నినుపూజించితినీ .....నా ...
వెతలను బాపగ వచ్చే భవుడవు
నీవని నమ్మితినీ సాయీ ... !కొలువై!
------------------------------------------------------
------------------------------------------------------
----------------------
కొలువై యున్నాడవు కలియుగ దైవమై
కరుణజూపరాదా సాయీ ....
విలువలు నీనామ మహిమలు యిలలో
తలచితిమీ గన రావోయీ !కొలువై !
కొల్లలు నీ భక్తకోటులిలలో ....
కరములు మోడ్చితిరీ సాయీ ...
ఎల్లలు లేనట్టి నీ గుణ గానాలు
ఎంచి భజించితిరీ సాయీ .....
చల్లని చూపుల కాంతుల కరుణను
నిరతము కోరితిరీ సాయీ .....
వెల్లువలై పొంగు నీ ప్రేమే రాగాలు
జల్లుగ కురిపించ వోయీ !కొలువై !
తనువూ ,మనసు నీదిగ చేసి
ఆరాధించితినీ...... సాయీ .....
ఘనమౌ నీరూపు మదిలో నిలిపీ
ధ్యాన్నము చేసితినీ సాయీ ...
సాయీ సాయని నిరతము తలపుల
నినుపూజించితినీ .....నా ...
వెతలను బాపగ వచ్చే భవుడవు
నీవని నమ్మితినీ సాయీ ... !కొలువై!
------------------------------------------------------
------------------------------------------------------
No comments:
Post a Comment