ఓం సాయి .
------------------
---------
కలియుగమందున కాచే దైవము
నీవే నీవే శ్రీ సాయీ ......
కొలఛినవారికి కొరతలు లేనట్టి
కానుక నీ దయ గుణమోయీ ! కలియుగ !
రంగులు వేరైనా రకతం ఒకటని
మతములు వేరైనా మానవులొకటని
ధర్మం వేరైనా దైవం ఒకటని
చాటిన సద్గురు సాయివి నీవే . !కలియుగ !
పిలచిన పలికే దైవం నీవే
తలచిన నీపేరు కలతలు రావే
కలనైన నీమహిమ కొనియాడలేము
ఇలలోన నీ ఉనికి మా పుణ్య ఫలము !కలియుగ !
------------------------------------------------------
-----------------------------------------------------
ఓం సాయి .
---------------
సాయీ సాయాని పిలచితినీ నిను
శరణము నీయగ రావేలా .....
ఓయీ సాయాని వేడితినీ నను
బ్రోవగ నీకిక జాగేలా ........ ! సాయీ !
భయముల బాపెడు వరదుడవీవని
భావమునందే తలచితినీ
అభయమునీవే ఆర్తపరాయణ
శుభములనొసగే దీనజనావన !సాయీ !
చరణము నమ్మి కరములు మోడ్చితి
కన్నుల నీరూపే కొలువుగ నిలిపితి
సన్నుతి చేయగ సమ్మతికోరితి
సద్గురు సాయీ నీవే నా గతి !సాయీ !
----------------------------------------------------
-----------------------------------------------------
------------------
---------
కలియుగమందున కాచే దైవము
నీవే నీవే శ్రీ సాయీ ......
కొలఛినవారికి కొరతలు లేనట్టి
కానుక నీ దయ గుణమోయీ ! కలియుగ !
రంగులు వేరైనా రకతం ఒకటని
మతములు వేరైనా మానవులొకటని
ధర్మం వేరైనా దైవం ఒకటని
చాటిన సద్గురు సాయివి నీవే . !కలియుగ !
పిలచిన పలికే దైవం నీవే
తలచిన నీపేరు కలతలు రావే
కలనైన నీమహిమ కొనియాడలేము
ఇలలోన నీ ఉనికి మా పుణ్య ఫలము !కలియుగ !
------------------------------------------------------
-----------------------------------------------------
ఓం సాయి .
---------------
సాయీ సాయాని పిలచితినీ నిను
శరణము నీయగ రావేలా .....
ఓయీ సాయాని వేడితినీ నను
బ్రోవగ నీకిక జాగేలా ........ ! సాయీ !
భయముల బాపెడు వరదుడవీవని
భావమునందే తలచితినీ
అభయమునీవే ఆర్తపరాయణ
శుభములనొసగే దీనజనావన !సాయీ !
చరణము నమ్మి కరములు మోడ్చితి
కన్నుల నీరూపే కొలువుగ నిలిపితి
సన్నుతి చేయగ సమ్మతికోరితి
సద్గురు సాయీ నీవే నా గతి !సాయీ !
----------------------------------------------------
-----------------------------------------------------
No comments:
Post a Comment