శ్రీ సాయి భక్తి గీతామృతాలు .
------------------------------------------------------------
పల్లవి .
-------------
-------------
మనవుడై పుట్టి మహనీయుడైనాడు
మా దేవుడు గురు సాయీశుడూ .. !మానవుడై !
అనుపల్లవి :
కానరాని ఘన మహిమలు గలవాడు
కారణజన్ముడు కరుణాసముద్రుడు ! మానవుడై !
చరణం :
--------
--------
మానడు నిత్యము జపమూ, తపమూ ..
దాన గుణనిధీ దాచడు ధనమూ
తనమతమెరుగడు మనమతమడుగడు
మనుగడ యేదైన మమ్మేలువాడు !మానవుడై !
చరణం
----------
నిష్ఠను పాటించు జీవనగమనము
యిష్థ మైన విధి పరోపకారము
కష్థజీవులను కాపాడుగుణము
కామితార్ధముల నొసగే దైవము !మానవుడై !!
--------------------------------------------------
-----------------------------------------------------
ఓం శ్రీ సాయి రాం .
---------------------
పల్లవి ;
--------
సాయీ సద్గురు అవతారమిలలో
వేవేల దేవతల కొలువైనదీ....
అనుపల్లవి.
-----------
స్థిరముగవెలసిన షిరిడీపురియే
ఇలమాకు నిండైన వరమైనదీ..... ! సాయీ!
చరణం ;1
--------
దాసులు ఇచ్చిన దానమేదైనను
దాచిఉంచుకొని ధన్యులజేయును
ఊయలబల్లైన రాతి ఇటుకైన
ప్రాణముగానెంచి అనుభవించును !సాయీ !
ఉడుకునీటిలో బియ్యముపోసి
చేతితోకలిపి చక్కగవార్చీ
జీవేదైనను ప్రేమనుపంచీ
ఆకలిదీర్చును ఆదరించును !సాయీ !
సత్యముతానని సమాధినుండే
పలికిచెప్పిన పరమేశుడితడూ
నమ్మినవారికి అన్నీ తానై
ఆదుకొనే హరి అవతారమితడూ !సాయీ !
---------------------------------------
-------------------------------------------
ఓం శ్రీ సాయి రాం .
---------------------
పల్లవి ;
--------
సాయీ సద్గురు అవతారమిలలో
వేవేల దేవతల కొలువైనదీ....
అనుపల్లవి.
-----------
స్థిరముగవెలసిన షిరిడీపురియే
ఇలమాకు నిండైన వరమైనదీ..... ! సాయీ!
చరణం ;1
--------
దాసులు ఇచ్చిన దానమేదైనను
దాచిఉంచుకొని ధన్యులజేయును
ఊయలబల్లైన రాతి ఇటుకైన
ప్రాణముగానెంచి అనుభవించును !సాయీ !
ఉడుకునీటిలో బియ్యముపోసి
చేతితోకలిపి చక్కగవార్చీ
జీవేదైనను ప్రేమనుపంచీ
ఆకలిదీర్చును ఆదరించును !సాయీ !
సత్యముతానని సమాధినుండే
పలికిచెప్పిన పరమేశుడితడూ
నమ్మినవారికి అన్నీ తానై
ఆదుకొనే హరి అవతారమితడూ !సాయీ !
---------------------------------------
-------------------------------------------
No comments:
Post a Comment