ఓం శ్రీ సాయి రాం .
-----------------------
ఆనందభైరవి రాగం .
---------------------
మమ్మేలు మా నాధ శ్రీ సాయి నాధా
మా ఇంటి వెలుగువూ నీవు కాదా ......
కమ్మేటి చీకటుల తొలగింపగా నీవు
నమ్మేటి దైవమై మమ్మేలరాదా ....
శ్రీ సాయి నాధా ....||
అంబ కృప నీ పైన అది నీకు వరమూ
నింబ వృక్షము క్రింద నిత్యమ్ము జపము
లోకాలు గాచుటకు చేసేటి తపము
ఫలియించి పొందేవు దైవత్వము || మమ్మేలు ||
కన్నీరు తుడిచేవు పన్నీరు చిలికేవు
నోట నెంగిలి నీట దీపాలు నిలిపేవు
గంగ ,యమునల నీరు పాదాల పుట్టించి
పాపాలు కడిగి మము పావనుల జేసేవు || మమ్మేలు ||
ఉప్పు నీటిని తేట తీయన్ని నీరుగా
మార్చేవు మహిమతో ,మధురాతి మధురముగ
ప్లేగు ,కలరా వ్యాధి బాప గోధుమ పిండి
ఊరంత చల్లేవు పురజనుల కాచేవు || మమ్మేలు ||
గీతార్ధ సారమును బోధించినావూ
నిస్వార్ధ సేవలను అందించినావూ
పరమార్ధమును దెల్పి పావనుల గావింప
పదకొండు సూత్రాల నెరిగించినావూ ...
పరమాత్మ నీవూ ......|| మమ్మేలు ||
---------------------------------------------------------------
----------------------------------------------------------------
-----------------------
ఆనందభైరవి రాగం .
---------------------
మమ్మేలు మా నాధ శ్రీ సాయి నాధా
మా ఇంటి వెలుగువూ నీవు కాదా ......
కమ్మేటి చీకటుల తొలగింపగా నీవు
నమ్మేటి దైవమై మమ్మేలరాదా ....
శ్రీ సాయి నాధా ....||
అంబ కృప నీ పైన అది నీకు వరమూ
నింబ వృక్షము క్రింద నిత్యమ్ము జపము
లోకాలు గాచుటకు చేసేటి తపము
ఫలియించి పొందేవు దైవత్వము || మమ్మేలు ||
కన్నీరు తుడిచేవు పన్నీరు చిలికేవు
నోట నెంగిలి నీట దీపాలు నిలిపేవు
గంగ ,యమునల నీరు పాదాల పుట్టించి
పాపాలు కడిగి మము పావనుల జేసేవు || మమ్మేలు ||
ఉప్పు నీటిని తేట తీయన్ని నీరుగా
మార్చేవు మహిమతో ,మధురాతి మధురముగ
ప్లేగు ,కలరా వ్యాధి బాప గోధుమ పిండి
ఊరంత చల్లేవు పురజనుల కాచేవు || మమ్మేలు ||
గీతార్ధ సారమును బోధించినావూ
నిస్వార్ధ సేవలను అందించినావూ
పరమార్ధమును దెల్పి పావనుల గావింప
పదకొండు సూత్రాల నెరిగించినావూ ...
పరమాత్మ నీవూ ......|| మమ్మేలు ||
---------------------------------------------------------------
----------------------------------------------------------------
No comments:
Post a Comment