Namaskaaramideneeku saayee mammelu
నమస్కారమిదె నీకు సాయీ మమ్మేలు. ( ఈ పాట అందరు కలిసి గ్రూప్ గా పాడాలి ఆరతి పాట కాబట్టి , దానికి సరిపోయిన మ్యూజిక్ చేయాలి . షిరిడి లో హారతికి వాయించినట్టు
--------------------------------------------
తలపైని తలపాగ చుట్టేవు నీవు
కఫ్నీని నిండార ధరియించినావు
మమ్మేలు మా మంచి గురువైతివీవు
నమస్కారమిదె నీకు సాయీ మమ్మేలు ||
మెడలోని హారాలు మా ప్రేమ పూలు
నీ చేతి అభయమ్ము మా భాగ్యమేలు
నీ పాద పద్మాలు మమ్మేలు జేలు
నమస్కారమిదె నీకు సాయీ మమ్మేలు ||
తత్త్వప్రకాశమ్ముతో సాయి నీవు
నిత్యాగ్ని ధునిలోన ద్యుతివై వెలిగేవు
సత్యాన్ని బోధించు సారమ్ము నీవు
నమస్కారమిదె నీకు సాయీ మమ్మేలు ||
నీ చేతి ఓషధులు తినిపించినావు
మా ఒంటి బాధలను తొలగించినావు
మాలోని లోపాలు మన్నించినావు
నమస్కారమిదె నీకు సాయీ మమ్మేలు ||
మనమంత ఒకటంటు బోధించినావు
ఇల తారతమ్యాలు తొలగించినావు
నీ ప్రేమ- పాశాన బంధించినావు
నమస్కారమిదె నీకు సాయా మమ్మేలు ||
నిరాకార సాకార సత్యమ్ము నీవు
పరాకేల పరబ్రహ్మ పరమాత్మ నీవు
పరే సాయి సంపూర్ణ భగవంత నీవు
నమస్కారమిదె నీకు సాయీ మమ్మేలు ||
నమస్కారమిదె నీకు సాయీ మమ్మేలు
నమస్కారమిదె నీకు సాయీ మమ్మేలు ||
నమస్కారమిదె నీకు సాయీ మమ్మేలు. ( ఈ పాట అందరు కలిసి గ్రూప్ గా పాడాలి ఆరతి పాట కాబట్టి , దానికి సరిపోయిన మ్యూజిక్ చేయాలి . షిరిడి లో హారతికి వాయించినట్టు
--------------------------------------------
తలపైని తలపాగ చుట్టేవు నీవు
కఫ్నీని నిండార ధరియించినావు
మమ్మేలు మా మంచి గురువైతివీవు
నమస్కారమిదె నీకు సాయీ మమ్మేలు ||
మెడలోని హారాలు మా ప్రేమ పూలు
నీ చేతి అభయమ్ము మా భాగ్యమేలు
నీ పాద పద్మాలు మమ్మేలు జేలు
నమస్కారమిదె నీకు సాయీ మమ్మేలు ||
తత్త్వప్రకాశమ్ముతో సాయి నీవు
నిత్యాగ్ని ధునిలోన ద్యుతివై వెలిగేవు
సత్యాన్ని బోధించు సారమ్ము నీవు
నమస్కారమిదె నీకు సాయీ మమ్మేలు ||
నీ చేతి ఓషధులు తినిపించినావు
మా ఒంటి బాధలను తొలగించినావు
మాలోని లోపాలు మన్నించినావు
నమస్కారమిదె నీకు సాయీ మమ్మేలు ||
మనమంత ఒకటంటు బోధించినావు
ఇల తారతమ్యాలు తొలగించినావు
నీ ప్రేమ- పాశాన బంధించినావు
నమస్కారమిదె నీకు సాయా మమ్మేలు ||
నిరాకార సాకార సత్యమ్ము నీవు
పరాకేల పరబ్రహ్మ పరమాత్మ నీవు
పరే సాయి సంపూర్ణ భగవంత నీవు
నమస్కారమిదె నీకు సాయీ మమ్మేలు ||
నమస్కారమిదె నీకు సాయీ మమ్మేలు
నమస్కారమిదె నీకు సాయీ మమ్మేలు ||
No comments:
Post a Comment