Nivedana
నివేదన .
----------
" స్తోత్రం కస్యన తుష్టయే " అని మహాకవి కాళిదాసు అన్నారు . అంటే
ఈ ప్రపంచంలో స్థుతిచే ప్రసన్నులు కానివారేవ్వరూ ఉండరు అని అర్ధం .
అందికే వేదాలు , పురాణాలు, కావ్యాలు , మొదలైనవి స్తోత్ర పఠనానికి
అనువుగా అభివర్ణిoపబడి ఉన్నాయి .
నవవిధ భక్తులలో ఏ విధమైన భక్తితో భగవంతుని ఆరాధించినా ,ఆతని
అనుగ్రహానికి పాత్రులమే అవుతాము .అందులో ఒకటైనది ,సామవేదం నుండి పుట్టినది
శాస్త్రీయ సంగీతం . సంగీతారాధనతో ఆ దేవదేవుని ప్రసన్నం చెసుకొని ,ముక్తిని , మొక్షాన్నీ
పొందవచ్చుననే సత్యాన్ని , తమ సంగీత పాండిత్యంతో నిరూపించిన ఎందరో వాగ్గేయకారులు
మనకు మార్గ దర్శకులు .
సప్త స్వరాలతో కూడుకొని ఉన్న ఈ సంగీతం 72 మేళకర్తలలలో
నిబిడీకృతమై , సంపూర్ణ రాగాలు , జన్యరాగాలు, ఉప రాగాలు గా విభజించబడి
అన్య స్వర ప్రయోగాలతో , లలిత సంగీతం , సినీ సంగీతం ,జానపదాలు ,పల్లెపాటలు
ఇలా ఎన్నో విధాలైన సంగీత రూపాలకు ప్రాణం పోసింది .
పలురూపాలుగా అవతారమెత్తిన పరమాత్ముడు కలియుగంలో శ్రీ -
సాయినాధునిగా అవతరించి , అడిగినంతనే ఆపదలు బాపే అంతర్యామిగా గణుతికెక్కిన
యోగపురుషుడు .
భక్తికి , భావుకతకి ప్రాముఖ్యతనిచ్చి , కొన్ని రాగాలను, సినీ సంగీతాన్ని
ఆధారంగా తీసుకొని అన్య స్వర ప్రయోగాలతో స్వరపరఛి సద్గురువులు , దైవాంశసంభూతులు , అవతారపురుషులు అయిన శ్రీ సాయి నాధుని , నా భావనాదృష్థి తో దర్శించి కీర్తించిన కీర్తనలే ఈ
" సాయి భక్తి గీతామృతాలు ".
ఎన్నో జన్మల పుణ్య విశేష ఫలంగా నాచే రచింపబడిన ఈ కీర్తనా సుమాలను
నా మొదటి సంగీత గురువు . ప్రేమమూర్తి అయిన నా తల్లిగారు , స్వర్గీయులు
శ్రీ " పంతుల కామేశ్వరీ దేవి " గారికి అంకితమిస్తూ ..
పెద్దలు , సద్గురువుల అశీర్వచనాలతొ ఈ కీర్తనలు వెలుగులోకి రావాలని ఆశిస్తూ
, పరమాత్ముడైన " శ్రీ సాయి నాధుని " చరణారవిందాలకు అంకిత భావంతో అర్పిస్తున్నాను.
నా ఈ గీతరచనకు తోడ్పడి సహకరించిన నా కుటుంబ సభ్యులందరికీ
ఆ దేవ దేవుడైన శ్రీ సాయినాధుని కృపా , కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్ధిస్తూ ...
శ్రీ భాగవత్పాదారవిందాశ్రితురాలు ,
రచయిత్రి
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి .
No comments:
Post a Comment