అమరగీతి. (యే మేరె వతన్ కె లోగో వరస )
--------------------------------------------------------
మన దేశం హక్కులకోసం
పోరాడే వీరులనేకం
గుర్తించీ వారి త్యాగం
కన్నీరిడరే కొంచం ॥
శతృవుల గుండెలు చెండీ ,
తూటాకు బలైనారండీ
అమరత్వం పొందిన యువత
నిలబెట్టిరి ఝండా ఘనత ॥
గాంధీ పోరాడిన దేశం ,
నెహ్రూజీ కోరిన సంఘం
అందించీ మనకు స్వాతంత్ర్యం ,
అసువులనే బాసిన సత్యం ॥మన ॥
జాతి మతాలను వీడి ,
ఒకటై మని స్నేహం తోడి
చిందించిన రక్తం భువిపై ,
ప్రవహించెను నదులై ఝారులై ,॥
ఒక తల్లికి మిగిలెను శోకం ,
తెగే భార్యకు మంగళసూత్రం
అర్పించిన ఆత్మ త్యాగం ,
అది మననం చేసుకో నిత్యం ॥ మన ॥
ఈ భారతి ముద్దుల పంట ,
గర్వించే ఈ యువతంతా
మనమంతా ఒకటే శక్తి ,
ప్రవహించే రక్తం ఒకటి ॥
చిరునవ్వులు మోమున నింపి ,
స్వాతంత్ర్యపు విందులు పంచీ
నిలపెడదాం ఝండా చరితా ,
జై కొడదాం లేవండంతా ॥ మన ॥
-----------------------------------
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదిీశ్వరిీముార్తి.
కల్యాణ్. ( మహరాష్ట్ర .).
-------------------------
____________________________________________
No comments:
Post a Comment