(ఫిబ్రవరి 10TH 2011 గురువారం ,రాధసప్తమి నాడు " హరిహరకళాక్షేత్రం " హైదరాబాద్ లో "శివపద సప్తాహం " జరిగిన సందర్భం గా గురువుగారు" శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ" గారికి గౌరవ పూర్వకంగా సమర్పించిన " స్వర పుష్పాంజలి "
శణ్ముఖాంజలి .(ప్రారంభ గీతం )
--------------------------------------------------
ఇదె మా అంజలి గొనుమా గౌరవగురు జననుతా
షణ్ముఖ శర్మ నామా కారణ జన్మాద్భుతా
నిపుణ పురాణాది ధనీ , గుణ సద్గుణ జ్ఞానఖనీ
వాజ్మృదు గంభీర స్ఫూర్తి వరభూషిత విభూతీ ॥ ఇదెమా ॥
అహరహములు శ్రమియించీ , అంబ శివుని అర్చించీ
మహా గ్రంధ సారమ్మును అందించిన ఘనగురూ
సహస్ర దివ్య శివ-మహిమలె , కీర్తనలుగ రచియించితి -
విహపర సాధన ఘనములు ,అవియే మా ధనములు ॥ ఇదేమా ॥
శివ-శక్తుల జపియించుటే నిత్య కర్మాగా, ఆ
శివ లీలలు గిరి కీర్తులే నోటిపలుకుగా ......
శివార్పణము నీ దేహము ,శివమయమే జీవనమూ
నీ గమనమే శివ పథమూ , నీ తలపులే శివపదం
శివపదం ..... ఈ.... శివపదం .......
శివకృప కలిగిన వేదం , నీ రచనీ శివపదం ...
_________________________________
_____________________________
No comments:
Post a Comment