"తరంగిణి "(ప్రారంభ గీతం ).
_______________________________
తరతరాల సాంప్రదాయ
సౌగంధపు వాహినీ
రంగరించు రాగసుధల
సంగీత మోదినీ ॥
గిరులు, ఝరులు ,
విరులు , తరు-
లతాపూరిత
భూషిణి ॥
వాణీ వర-
వీణారవ
రమ్య రస
సుపోషిణీ ॥
ఆమని భరతావని. ......
సమత, మమత
సమ భావన
నిండు నిర్మలావనీ ........ ॥
ఆదర్శపు
అడుగులసిరి
ఆణిముత్యముల
ఖని ॥
అనురాగము
పంచు నిధుల
నిండు నిత్య
యౌవ్వని ... ॥
ఆట, పాట ,
కవుల ,కళల
నాదరించుపాధినీ .... ॥
అహ -రహములు
శాంతి బాట ,
నడచు
కల-సుభాషిణీ .... ॥
ఆమని... భరతావని
సమత , మమత ,
సమ భావన
నిండు నిర్మలావనీ .........॥
_________________________________
_____________________________________
No comments:
Post a Comment