Monday, August 26, 2013

వెన్నెలు కురిసిన వేళలలో...

        వసంతగీతాలు .   

-----------------------------   

          స్వప్నగీతం   . 

______________________

వెన్నెల  కురిసిన వేళలలో, నా
కన్నులు కాంచిన స్వప్న మిదే 
కమ్మని ఊహల మధురిమలే  రా 
రమ్మని పిలిచెను గీతికలై ... 
నవ్వుతూ పాడనా . నే కోయిల గీతికనై ॥ 

కళకళ సొగసుల జాబిలినై , తారల నడుమ చరించనా 
కదలే మేఘ మాలికనై  నీలాకాశంలో విహరించనా 
ఏడురంగులా ఇంద్ర ధనుసునై , దివిలో కాంతులు వెదజల్లనా 
మేఘం వెనుక దాగిన చినుకై చిరుజల్లుగా నే వర్షించనా  ॥ వెన్నెల ॥

ఆమని ఎదలో కోయిలనై  వసంత గీతం పలికించనా 
సాగే ఏరుల గలగలనై .. నే ...చిరు సడి అలనై ఉప్పొంగనా 
వీచే గాలి వీచికనై  సుమ అందాల గంధాలు దివి పంచనా 
పైరు పచ్చని సింగారము నా కవిత కన్నియకు అలరించనా ॥వెన్నెల ॥ 

సప్త స్వరాలకు సరిగమనై  సంగీతికి శృతి-లయ నేనౌదునా 
ప్రకృతి  పడతితో పదములు కలిపి అందెల సవ్వడి వినిపించనా 
భావ-భంగిమల ,నాట్యపు గతులను జతినై -గతినై ఆడించనా 
ఓంకారములో ప్రణవము నేనై విశ్వమంత నే విహరించనా ॥ వెన్నెల ॥ 
_____________________________________________

            మానసగీతం . 

_______________________

చిగురులు తొడిగిన కొమ్మల నడుమ కోయిల పాడిన గీతాలే ...... 
మనసున మల్లెల మధురిమ నింపగ  నా మది పాడెను గీతాలై ,....... 

ఆమని నింపిన  పచ్చని  చిగురులు ఏమని గుసగుస లాడినవీ 
ఎగిరే పక్షు లు  కిలకిల రవమున సంగతి ఏమని అడిగినవి ॥ 

నీలాకాసం మబ్బుల్లో 
వెన్నెల కాంతుల జాబిల్లీ 
తళుకు తారలా కన్నెల మదిలో
 రేపెను ఏదో అలజడి ........ 
వెన్నెల రాజుని ఆ కళలే
 కలువ కన్నియల కలవరము 
మారుడు వలపుల పూల శరముతో
 వచ్చెను చెలుడై ఆ క్షణము 
పూల ఋతువతని వలపు ధనం .     ॥ 

నెమలి కన్నియలు నెమ్మది అడుగుల 
నాట్యపు సిరి పురి  విప్పినవీ 
బెదురు  చూపులా జింకలు తడబడి 
అదిరి అడుగులను వేసినవీ 
చల్లని గాలుల వీచికలే
అడవికి పూసెను సుమ గంధం 
అల్లరి ఆటల ప్రకృతి పడతులు 
నా మదికేసెను ఒక బంధం 
చెలిమి చేరువల అనుబంధం ॥ చిగురులు ॥ 
_____________________________

            ప్రక్రుతి తో పయనం . 

_______________________________

చల్లగాలి వీచు వేళలో మల్లెపూల మత్తు వసంతం 
కోయిలమ్మ పాటలో రవం ,నిండు హాయి నిత్య వసంతం 
పరుగుతీయు మనసు ఆ పరుగుతోడి వయసు 
పయనించు ప్రభల పరుగుల స్వప్నం .. 
ఆహ్హ  హహ్హా ...............                              ॥

కన్నె మనసు కవిత ఆ కవిత లింద్రధనుస 
ఆకాసమంత కలల తారలే .. అహ్హహహ్హ  
తారలన్ని మెరిసే చిరు వెన్నెలల్లె కురిసే 
ఆ చందమామ కళల కధలులే ... 
మబ్బుచాటు మేఘం నా మనసు ఒక చకోరం 
తోలి చినుకు తడికి పడెను ఆరాటం .అహ్హహహ్హ..॥

ఇలలోని అందమంతా నా పాట పల్లవంట 
జలజలల రాగ ఝరుల సందడే ..ఽహ్హహహ్హ .... 
చిన్ని చిలుక జంట ,పచ్చన్ని చేలపంట 
నా మధుర గీతి నిండు పదములె.... 
చిరుగాలి వెంట పయనం ,కెరటాల నడుమ గమనం 
భావాల అలలు తేలు  గమ్యమే  అహ్హహహ్హ     ॥ చల్లగాలి॥ 

మనసంత మధుర భావం మదినిండ రసపు పానం 
అది పండు వెన్నెలంత తీపిలే ....హహ్హ 
పూలు సౌరభాల నిలయం, చిరు చినుకు మొలక ప్రాణం 
తలపించు  వేయి  హాయి తలపులే .... 
సంగీత స్వర విహారం ,సరిగమల సఖుల సాయం 
సరదాలు చిందు రాగ మధువులే .ఽహ్హహహ్హ ... ॥
____________________________________________
______________________________________________
               

               "  ఈ.. క్షణం ". 

___________________________________________

 ఏదో ఒక రాగం పలికింది  ఈ క్షణం నాలో 
ఏదో .........  అదీ .......
మదిలో ఒక భావం మెదిలింది ఓ  క్షణం నాలో
ఏదో   ......... అదీ ........

ఆ రాగ భావాల అలలే మది సాగు తీరాల కళలై
మరుమల్లెలై , విరిజల్లులై , పులకింతలై  
చేసే...... సడీ ...
సరిగమ  సందడీ .......  

రాగాలే హరివిల్లై ,ఆ భావాలే పూజల్లై
మది వెన్నెల్లు  కురిపించెగా    ఆ హాహాహా .....
పదములే పాటకు ప్రియమై , సరిగమలే గీతికి లయలై
స్వర -రాగాల జత పంచగా.......
ఆ చరణం వెన్నెల కిరణం ,ఆ కిరణం పాటకు భరణం
ఓమ్ కారమై శృతి సారమై ఆలాపనై....
వినిపించెగా.. వీనుల విందుగా .........;.

వీచే గాలులె స్వరమై ,తలలూచే పైరుల గళమై
వినిపించేను ఒక గీతమై.... ఆహాహాహా
చినుకు తడికి  అందాలే ఆ చిన్ని చిగురు బంధాలై
వికసించేను సుమ గంధమై .......
పలికేటి పాట పల్లవులే వికసించు పూల పుప్పొడులై
కవ్వింతలై ,  తుళ్ళింతలై  పయనించెగా ...
సుధ పంచగా తుమ్మెద జంటగా ......
___________________________________
___________________________________

          "ఓ చంద మామా". 

_________________________

నీలాల ఆకాశం లో ఓ చందమామా 
మబ్బుల్లొ దాగి దాగి మాటేయకూ ...మా 
కన్నుల్లో కల ,కలతీపీ చెరిపేయకూ ....

మెరుపు మేఘాల తప్పెటలూ 
కురియు చినుకుతడి ముచ్చటలూ 
రంగులు నింపెను  హరివిల్లు
ప్రియమైన జంట కిల బంధాలు 
నింగి నీలాల వాకిళ్లు 
ప్రేమ పాశాల పరవళ్ళు 

మురిసేటి తారల చెలులను కవ్వించకూ 
మురిపాల ముద్దుల వెన్నెల దాచెయ్యకు ॥ 

చూపులకందని అందాలు 
మదిలో వేసెను బంధాలు 
భావం నిండిన భంగిమలూ  -
రాగాలై పలికెను సరిగమలూ 
కలువల కన్నుల కళ కళలూ 
విరిసే నవ్వుల కిలకిలలూ 

ఆకాసం అంచుల నడుమ అడుగేయకూ 
నువ్వు నీడల్లే అందరి మనసూ దోచెయ్యకూ ॥ 
_____________________________________
_____________________________________


" గున్నమావి చెట్టుమీది కోయిలమ్మా.". 

_____________________________________________
పల్లవి ;
-----------
గున్నమావి చెట్టు మీది కోయిలమ్మ
చిందులేసి నువ్వు పాట పాడవమ్మ !!
అనుపల్లవి
----------
కొమ్మ,కొమ్మకో పలకరింత , నీ
పాటవినగ మది పులకరింత !!
గూటిలోన గువ్వజంట చూడు , పురి
విచ్చుకున్న నెమలి కన్నె చూడు ..
వింత వింత రాగాలు ,
గొంతులోన పలుకు నేడు
పంతమీడి పాట పాడవ !! గున్నమావి !!
చరణం .
---------
కుహూ కుహూ రాగాల గీతులే
సరాగ సంగమ మధురిమలై
ఊహలలో కవి పదములలో , కడు
ప్రేమసందేసాల సరిగమలై
ఉషోదయపు రవి కిరణాలే , తడి
మంచుబిందువుల తళుకులుగ
కురవనీ..అలా మెరవనీ...
పుడమి కళలు కాంతి నాదమై నిండిపోనీ !! గున్నమావి !!

నీలాకాశం మబ్బుల్లో ..
విహరించే శ్వేశ్చా విహంగమై
గలగల పారే సెలయేటా
తేలే చిన్నారి తరంగమై
వీచే గాలి తెమ్మెరవై ...నువు
పూచే పూల పుప్పొడివై
సాగిపోవా.....గానమందుకోవా...నీ
గొంతులోని తీపి ఇలను నింపరావ !!గున్నమావి !!
---------------------------------------------
_______________________________

 "కొమ్మమీది కోయిలమ్మ"

_________________________________

పల్లవి .
__________
కొమ్మమీది కోయిలమ్మ కుహూ అన్నది
నా మనసే పరవసించి ''ఆహా'' అన్నది !!

అనుపల్లవి .
____________
రాగాలా .. సరాగాలా.. ఆ.......
సప్తస్వర సుధలతో ..
పూబాలలు తలలనూచె
వేయి కళలతొ ...!! కొమ్మమీది !!
చరణం.
_________
కన్నెవాగు గలగలమని పారుచున్నది
కలువభామ సిగ్గుతెరల ఒదిగియున్నది !
తారలనడుమ..వలపు గుసగుస వినుమ
వెన్నెలరాజుని కొంటెతనపు వేడుకగనుమ !! కొమ్మమీది !!

చిరుగాలిలొ పయనించే సౌరభాల మధురిమ
వెన్నెలలో విహరించెను పుష్పబాణుడదెసుమ !
ఆడుచు జతుల, గతుల నాట్యపు రతుల
మదిని మరుమల్లెల మత్తు శరము నొదిలె చూడుమ...!! కొమ్మమీది !!
________________________________________________
______________________________________________

""మధుమాసం- మనకోసం . "

_____________________________________
  పల్లవి.
_________
మధుమాసం ప్రియా మనకోసం
తెచ్చెనులే వసంతమే పూల పరిమళం !! మధు !!
చరణం .
________
పూబాలలు నిలిచెరదిగొ ఇంద్రధనుసులా..
మలయపవన వీచికలివె వీచె హాయిగా..!
మధుపమొకటి మధురగీతి పాడె మత్తుగా..
సుధలుచిందె చందమామ మనసు నిండగా..!!మధు !!

సుమశరుడె వచ్చెనదె వలపురేడులా..
పూలరుతువుకధిపతికద చూచెవాడిగా..
తలలనూచె సుమబాలలు కలలు నిండగా..
నా ఎదురుగ నీవుండగ కనుల పండగా..!!మధు !!

కొమ్మమీద కోయిలమ్మ కూసె హాయిగా..
గూటిలోన గువ్వజంట ఊసులాడెగా..
పురివిప్పినె నెమలి ఆడె కళలు నిండగా..
నా మనసే పాట పాడె నిన్ను కలుయగా..!! మధు !!
___________________________
______________________________

"జాలిలేని కోయిల". 

______________________

జాలిలేని కోయిలా గానమాపుమా 
ఈ వసంత యామినిలో పాడనీయుమా ,నన్ను ॥ జాలి॥ 

తడవు తడవునకు నాతో ,గొంతు కలపబోకుమా 
తగదు తగదు నీకు చొరవ శృతుల నెంచబోకుమా 
వలదు తాళ, లయలమాట భావమెంచి చూడుమా 
గొంతు లోని పలుకు బాధ వీచిక గమనించుమా ॥ జాలి॥ 

మదినికోరి మలచు కొంటి మంచి గీత మెంచుకొంటి 
మధురమైన సంగీతపు మాధుర్యము నెరుగగంటి 
మేటి ఋతు వసంత మెంచి నీదు సాటి పాడనుంటి 
మూగదైన గొంతు మీటి స్వరజతులను పాడుచుంటి ॥ జాలి ॥ 
______________________________________
_____________________________________________
 

         "నవ్వవే కోయిలా".

____________________________________

నవ్వవే రాతనాలా కోయిలా 
రువ్వవే రాగాల ఝల్లిలా ...... 

నీలా నేను పాడాలనీ , రస రాగాలాపన చేయాలనీ 
జతగా నీతో జతులను కలిపీ పల్లవి పాడే పూబాలనీ ॥ నవ్వవే ॥ 

చక్కని చిక్కని రాగాలూ ,మదురిమ లోలికే గీతాలూ 
చక్కిలిగింతల అరుణిమలొ ,ఎగసిపడే తరు అందాలూ 
అల్లరి చేసే మధుబాలా ,నను చక్కగ  పిలిచెను ఈవేళా .. ॥ 

సప్త -స్వరాలా స,రి,గ,మలూ ,మత్తు వసంతాల స్వరఝరులూ 
గుర్తు గులాబీల పదగతులూ ,కొత్త తరంగాల పదనిసలూ 
కవితకు పదమై ,గీతికి లయనై ,నీలా పలికెదనీవేళా ॥ నవ్వవె ॥ 
__________________________________________

_____________________________________________









                                                                                                                                           











  

No comments:

Post a Comment