" మోహన గీతాలు ".
_(లలిత సంగీతం )__
"మధురానగరిలో ... ",
(కల్యాణి రాగం ).
______________________
మధురానగరిలో మలయమారుతము
మధురమై సాగెనే ,మాధవ గీతమై పాడెనే.. ఆ .. ॥
ఆధరసుధారస మాధురి గాంచిన
వేణువే మ్రోగేనే .. అదె సంగీతమై పాడెనే .. ఆ ॥ మధురా ॥
మోహన మురళీ రాగాలనువిని
కోయిలే పాడెనే అదె సంగీతమై పలికేనే
విరహపువేదన వీనులవిందుగ
వంతులై పోయెనే అల్లరి అందమై విరిసెనే ఆ ॥ మధురా ॥
అందరివాడూ ... అల్లరి మోహను-
నందెలే ఘల్లనే నాట్యపు విందులే చేసెనే ..
యమునా తటిదరి బృన్దావని సరి
సందడైపోయెనే స,రి,గ,మ సంగతై పాడెనే .....
మురళీధరుని మోహన రూపమె
అంతటై నిలచెనే అందరి మనసులే మురిసెనే .ఽఆ .. ॥ మధురా ॥
_____________________________________________
_________________________
" ఏడే మాధవుడూ ".
_( ఆభేరి రాగం )_________
ఏడే ... మాధవుడూ ..కనరాడే . నా ధవుడూ
ఏడే మాధవుడూ రాడే నాధవుడూ
నను విడనాడే భూధవుడూ ...
సఖియా చెలియా ఏడే నా ధవుడూ ....॥
అన్నది రాధా ..బాధగా.....
వినరే చెలులారా.. సంగతి కనరే సఖులారా ...॥
పొదపొదలో దరిదరిలో ....
ఆతని అడుగుల సవ్వడి వినబడె
వేణునాదమే వీనులవిందుగ
మదిలో సవ్వడి చేయగ వినబడె
ఏడే మురళిధారీ ... నను వీడే దయమాలీ ........
అన్నది రాధ .. బాధగా ...
వినరే చెలులారా సంగతి కనరే సఖులారా ॥
ఆతని మురళీ గానము వినబడె
ఆతని రూపము కన్నులకగపడె
కలయో .. నిజమో .. తెలియగ రాదే ..
కన్నులు తెరచిన అగపడలేదే
ధారల కన్నుల కన్నీటి ఆన
దీనను నన్నిక మన్నిక నేలగ
రాడే ... మాధవుడూ .. ఏడే నా ధవుడూ
అన్నది రాధా బాధగా ...
వినరే చెలులారా , సంగతి కనరే సఖులారా ...॥
_____________________________
"బృందావనమిది అందరిదీ...
__________________________________
బృందావనమిదె అందరిదీ
గోవిందుడు అందరి వాడేలే
గోవిందుడు అందరి వాడేలే
అరవిందలోచనుడు
అల్లరిమోహను డతడే ....
అల్లరిమోహను డతడే ....
అతడే....... అతడేలే....... ॥
గొల్లలగూడీ వెన్నలుదోచీ ,
పిల్లనగ్రోవిని మోవినిదాల్చీ
అల్లరిచేతల ముద్దులమాటల ,
మనసులు దోచినదతడే ...
అతడే .............. అతడేలే.........
మురళి సరాగాల మధువుల దేల్చీ ,
ముసిముసి నవ్వుల ముదితల రోసి
మనసున మధు సుమ మాలలు నింపిన
నవరస మోహను డితడే ........
ఇతడే .......... ఇతడేలే ....... ॥ బృం దా॥
_______________________________
_______________________________
"మోహన గీతం".
---(మోహన రాగం )
పల్లవి -
రాధా మాదవ మోహనగీతం
మదిలో రేపెను సంగీతం
అనుపల్లవి .
________
మదురసుదారస మురళీగానం
పదగతులకు నదె లయసారం !! రాధా !!
చరణం .
__________
బృందావనమున అందాలొలికే
మందార మల్లెలు లేసుమ బాలలు
మధుర సుగంధాల మేలి ముసుగుతో
స్వాగతమిడెనదె చిరునగవులతో !! రాధా !!
కలువల రేడే కొంటె నగవుతో
మబ్బుల చాటున మరలి దాగెనే
కొమ్మల నడుమ కోయిల గీతాలు
కమ్మని కళల రాగాల సాగెనె
మోహన మురళీ నాదమె ఝుమ్మన ...
ఆ.......ఆ................. !!మోహన !!
ఆడెను రాధ అందెలు ఘల్లన !! రాధా !!
_____________________________
________
ఎంత మధురమీరేయి ,
ఎంత మధుర మీహాయి ,
మదిలో పన్నీటీజల్లు
కురిపించినదోయి ...!! ఎంత !!
చరణం .
________
సరిగమల సప్తస్వర...
రాగ సుధల స్వర ఝరులు ,
మలయపవన మేళకర్త లా ..
మధురిమ వీచికలు !
జన్య,మన్య స్వరభేధపు
భావ,రాగ, లయ,జతులు
ఒకటై ,పద కవితై
నా రచనకు జత కాగ ..!!ఎంత !!
రాగ చాయ రంగరింప
రసమాధురి పొంగగా..
పల్లవి,అనుపల్లవి ..
చెలులష్థచెమ్మలాడగ !
అందెలు ఘల్లని మ్రోగుచు
చరణ గతుల నలరింపగ
అందమైన పాటగా...
ఆడపడుచు అడుగిడగా...!!ఎంత !!
______________________
" మురళీ గానము ".
మదిలో రేపెను సంగీతం
అనుపల్లవి .
________
మదురసుదారస మురళీగానం
పదగతులకు నదె లయసారం !! రాధా !!
చరణం .
__________
బృందావనమున అందాలొలికే
మందార మల్లెలు లేసుమ బాలలు
మధుర సుగంధాల మేలి ముసుగుతో
స్వాగతమిడెనదె చిరునగవులతో !! రాధా !!
కలువల రేడే కొంటె నగవుతో
మబ్బుల చాటున మరలి దాగెనే
కొమ్మల నడుమ కోయిల గీతాలు
కమ్మని కళల రాగాల సాగెనె
మోహన మురళీ నాదమె ఝుమ్మన ...
ఆ.......ఆ................. !!మోహన !!
ఆడెను రాధ అందెలు ఘల్లన !! రాధా !!
_____________________________
"ఎంత మధురమీరేయి ".
_________________________
_పల్లవి.________
ఎంత మధురమీరేయి ,
ఎంత మధుర మీహాయి ,
మదిలో పన్నీటీజల్లు
కురిపించినదోయి ...!! ఎంత !!
చరణం .
________
సరిగమల సప్తస్వర...
రాగ సుధల స్వర ఝరులు ,
మలయపవన మేళకర్త లా ..
మధురిమ వీచికలు !
జన్య,మన్య స్వరభేధపు
భావ,రాగ, లయ,జతులు
ఒకటై ,పద కవితై
నా రచనకు జత కాగ ..!!ఎంత !!
రాగ చాయ రంగరింప
రసమాధురి పొంగగా..
పల్లవి,అనుపల్లవి ..
చెలులష్థచెమ్మలాడగ !
అందెలు ఘల్లని మ్రోగుచు
చరణ గతుల నలరింపగ
అందమైన పాటగా...
ఆడపడుచు అడుగిడగా...!!ఎంత !!
______________________
కనుగొంటే- కనుగొంటి ".
__________________________
కనుగొంటీ -కనుగొంటీ
కొంటె నంద గోపాలుని
ఈ వసంత యామినిలో
ఈ చల్లని రేయిలో ॥ కనుగొంటీ ॥
కమ్మని కోయిల పాడే స్వరములలోనా
కొమ్మలచివురుల పూచే పోవులలోనా ..॥
ఆ నీలి మబ్బులతెర చాటున దాగే
నెలరాజు దోబోచులాడేటి వేళా ॥
యమునానది తీరములో .....
బృందావని వాడలలో....... ॥
కలువ కన్నె తలపులో
మనసు రేపు వలపులో
మురళీ మృదు రవళిలో
వినిపించే మాధురిలో .....
లలితా మధుర అధరాల
తేలియాడు నగవులలో... ॥
_________________
________________________
"మంజులమురళీ ".
______________________________
మంజుల మురళీ గానముతో...
ఆనందపు డోలల వాహినిలో....
నంద -నందనుడు అల్లరిమాధవు -
డందరిమనసులు దోచెనదే ..... ॥ మంజుల॥
పొన్నలచాటున వెన్నెలమాటున
పొంచి పొంచి రేపల్లె కన్నియల
మనసుదోచినాడే ..... సఖీ ......॥
మొహనుడెంత గడుసువాడే .. సఖీ ॥ మనసు॥
ఓ ........... సఖి....... ॥ మంజుల ॥
గోవులుగాచే గోపబాలుడై
వెన్నలుదోచు చిన్నారిపాపడై
గోవర్ధన గిరి ధారుడై ,వీరుడై
పల్లె దోచినాడే ... అందరి
మనసు గెలిచినాడే --సఖీ....... ॥ పల్లె ॥
ఓ ......సఖీ ---------- - ॥ మంజుల ॥
పెదవులుతాకే పిల్లనగ్రోవినై
పదములనలరు చిన్నారి మువ్వనై
గోకులమందున గోపకాంతనై
నిలిచి మురవనీవే ---నాకీ
వరమునొసగమనవే ---సఖీ .... ॥ నిలిచి ॥
ఓ ---------------సఖి ॥ మంజుల ॥
__________________________________
__________________________________
_________________________________
" మురళీ గానము ".
------------------------------------
మురళీగానము వినపడినంతనే
మనసున మల్లెలు విరబూసే
మరలా మరలా విని తరియింపగా
మనసున కోర్కెల మధుబాలా
అల్లరిచేసెను ఈవేళా ........ ॥
మనసే మల్లెల పూబాలై ...
మరలిపోయేనే బృందావనికీ ...
యమునా తాటిపై అలల సవ్వడినై
వీచేగాలిలో వలపు గంధమై
ఆ మాధవునీ అందెల రవళై ...
అల్లుకుపోతిని లతనై ,గతినై .. ॥ మురళీ ॥
మురళీధరునీ రవళిని పలికే..
స్వరసంగమమై మధురనాదమై
అధరసుధారస మధురాంకితమై
రసమయకేళీ రాగారంజనై
పలికితినేనే మురళీరవమై ॥
పరవసినైతిని వలపులచెలినై ..॥ మురళీ ॥
______________________________
_____________________________
"వెన్నెల్లో విరిసింది ...
______________________________
వెన్నెల్లో విరిసింది బృందావనం ..నా
మదినిండు పూలతల నందనవనం ॥
కొమ్మలపైన కోయిల గానం
చిగురులన్నీ తొడిగిన తానం
మనసులెన్నో దోచినగానం
మాధవుని ఆ వేణుగానం ॥
యదను తాకి వ్యధను బాపి
సుధలు పంచే సోమపానం
కదలు యమునాతటి సరాగం
కధల కవితల కావ్యసారం ॥
పల్లవించే పూల అందం
పిల్లగాలై వీచు గంధం
పలుకుతేనెల తీపి అందం
మాధవుని ఆ వేణుగానం ॥
తళుకు తారల కాంతుల నడుమ
వెలుగు వెన్నెల కురిసిన రాగం
కలువ కన్నుల గోప కాంతుల
మనసులెన్నో దోచిన రాగం
అణువూ అణువూ నాదవినోదం
మాధవుని ఆ వేణునాదం ॥ వెన్నెల్లో ॥
__________________________
"వినిపించారా కన్నా.".
(అలైపాయుదే .. కణ్ణా . వరస .)
(__కానడ రాగం __)_____
వినిపించరా ...కన్నా.....
గానము వినిపించరా ..........
____________ వేణుగానమదె
________మోహన వేణుగానమదె
___ఆనంద మోహన వేణుగానమదె
పరమానంద మోహన వేణుగానమదె ॥ వినిపించరా ॥
మనసారగనిను మదితలచితిరా ॥ మన ॥
దీనపాల ఘన నీలమేఘశ్యామా _
మనోహర మురళి గానమదె ....॥ . వినిపించరా ॥
నుదుట కస్తూరీ సిగపింఛముతో
వదనకమలమే నగవులీనగా ..
అదె వేణునాదమె జగముల మరిపించ
కళలస్వరూప కరుణారస మోలుకగా
తరిత్త- తకదిమి తథై ధితై ..
తాళపు గతులకు నాట్యమిడి --ఆ
సరస్సు దాగిన శిరస్సు నణచగ
కాళీయునిపై పదమునిడీ
మురహర గిరిధర కరమురళీధర
నటనలనఘముల హరియించరా
శ్రిత సన్నుత శ్రీకర స్మితసిత సుందర
నతజన పరిపాల ననుబ్రోవరా ...
నాదరూప ఘన లీలామయా ..
గానలోల హరి గోపీప్రియా ...
నను గనరా... మొరవినరా....
శరణు శరణు హరి శ్రితపాలా...
ఒదలలేను నిను మదిని బాయకను
మరిమరి తలచెద మురళి మనోహర ॥ వినిపించరా...॥
__________________________________
___________________________________
మాధవా మనోహరా ..
(బేహాగ్ రాగం )
________________________
మాధవా మనోహరా.... మంజుల మురళీధరా ...
బృందావన సుందరా ... రాధా మన మందిరా ....॥ మాధవా ॥
నంద నందన లాలా .... యాదవకుల గ్వాలా
గోపీజన లోలా ...... గోకులప్రియ బాలా... ॥ మాధవా ॥
సిఖిపించ జటాధరా ... సుఖ సాగర శేఖరా ....
సఖ మునిజన మందిరా ....శ్రిత శుభకర శ్రీకరా ...॥ మాధవా ॥
____________________________________________
______________________________________________
గోపాల బాలుడమ్మా ....
_________________________
గోపాల బాలుడమ్మ
గోపీమనమోహనుడీతడు
గోవర్ధన ధారుడు వీరుడు
మా బాలుడూ ...
గొల్లవాడు నల్లనివాడు ..
గోవులెన్నొ తోలినవాడు
రేపల్లెకు వన్నెలు తెచ్చిన
మా బాలుడూ ....॥ గోపాల ॥
చిన్ని చిన్ని అడుగుల ఆటల
అల్లరెంతో చేసినవాడు ........
చిన్ని వేణువూదీ అందరి
మనసు దోచు వన్నెకాడూ ॥
కాళీయుని అణచినవాడూ
రాసకేళి రసికుడు వీడు
రాణి రాధ లోలుడు
జగములేలు దేముడూ ...
విరిసే సుమ గంధము తోడు
బృందావనికందమువీడు....
అందాల పున్నమరేడు
మా బాలుడూ ........... ॥ గోపాల ॥
______________________________
______________________________
"నందా ..ఽ ఆనందా"....
(_తిలంగ్ రాగం _)
___________________________
నందా ఆనందా ..
హే నంద నంద గోపాలా
ఆనంద నంద , యదు నంద నందనా
భువన లోక పాలా.....॥ నన్దా.... ॥
నీలమేఘ శ్యామలాంగా ...
శ్రీవత్స కౌస్థుభాంగా
తులసీ సుగంధ వనమాలికాది
సుమహార శోభితాంగా .... ॥ నందా ॥
బృందావన విహంగా
గోపీజనాంతరంగా .......
మురళీ ధరాబ్జ కమలా కటాక్ష
కరుణాంతరంగ రంగా ... ॥ నందా ॥
గీతా సుబోధితాంగా
ముని ధ్యాన్న హృదయ బృంగా
కంసాది దమన దురితాది శమన
కలి దారుణాది భంగా ...... ॥ నందా ॥
____________________________
______________________________
"నంద బాలం.... ".
__________________
నందబాలం యదు నందబాలం
గోపీజన మునిమానస హృదయ లోలం ॥
శ్యామ సుందర మదనమోహన
రాధే గోపాలం ........
మృదు మురళీరవ రంజిత
కేళీ విలోలం ...........॥ నంద ॥
కోటిమదన సుందరాంగ
సుందర సుకుమారం
హాటిక చేలాంచల -నవ
తులసీ వనమాలం ....॥ . నంద ॥
పదకింకిణీ రవరంజిత
మర్ధన కాళీయం .....
గోవర్ధన గిరిధారీ
గోకుల ప్రియ బాలం ....॥ . నంద ॥
___________________________
_____________________________
"రంగా శ్రీ రంగా.... "
__________________________
రంగా శ్రీ రంగ రంగ రంగా ....
సంగీత మృదు తరంగా ....
శ్రీ లక్ష్మి సాంగ గరుడా తురంగ
కావేటి రంగ రంగా... ॥ . రంగా ॥
నీలమేఘశ్యామలాంగా
ఫాలలోచనా శుభాంగా ...
క్షీరాబ్ధి వశన , ఫణిరాజ శయన
సుర దేవతాది వంద్యా ... ॥ .రంగా ॥
ఘన వక్ష కౌస్థుభాంగా
కనకాది భూషితాంగా
కర అభయ ముద్ర , కరుణా సముద్ర
సనకాది సన్నుతాంగా ॥ ..రంగా ॥
___________________________
____________________________
"మధువులుచిందే... "
____________________
మధువులు చిందే
మోహన మురళీ
రమ్మని పిలిచేనురా ..రవళీ
నా మది దోచేనురా ........
ఆధార సుధారస
మధువుల తేలి
అదమరపించేనురా ...
నన్ను.. మైమరపించేనురా ...
బృందావనిలో యమునాతటిదరి
కదలినరాగాలు మధురసరాగాలు
యద ఝల్లనగా రమ్మని పిలువగ
ఆ.............. ఆ.........
నీదరి చేరేనురా ... నిలుమా
నేమరి నీదానరా ..... కనుమా..
కృష్ణా .......... కృష్ణా ........
____________________
________________________
No comments:
Post a Comment