"మధురానగరిలో ... ",
(కల్యాణి రాగం ).
______________________
మధురానగరిలో, మలయమారుతము -
మధురమై సాగెనే ,మాధవ గీతమై పాడెనే.. ఆ .. ॥
ఆధరసుధారస , మాధురి గాంచిన
వేణువే మ్రోగేనే .. అదె సంగీతమై పాడెనే .. ఆ ॥ మధురా ॥
మోహన మురళీ , రాగాలనువిని
కోయిలే పాడెనే , అదె సంగీతమై పలికేనే !
విరహపువేదన , వీనులవిందుగ
వంతులై పోయెనే , అల్లరి అందమై విరిసెనే ,
ఆ ...... ॥ మధురా ॥
అందరివాడూ ... అల్లరి మోహను-నందెలే
ఘల్లనే ' నాట్యపు , విందులే చేసెనే .. ..
యమునా తటిదరి బృన్దావని సరి -
సందడైపోయెనే , స,రి,గ,మ
సంగతై పాడెనే .....
మురళీధరుని మోహన రూపమె -
అంతటై నిలచెనే ....అందరి
మనసులే మురిసెనే ...ఆ .. ॥ మధురా ॥
_____________________________________________రచన, శ్రీ మతి
పుల్లాభట్ల జగదిీశ్వరిీముార్తి.
కల్యాణ్.
-----------
No comments:
Post a Comment