కరచాలనం
పలక బలపము బట్టి ఓ,న,మ: లను దిద్ది
వలయు విద్యల దీర్చి దిద్దు చేయి
గురువు ,పెద్దల పదము లంటి దండములెట్టి
చనవు నాశీర్వచన మిచ్చుచేయి
కార్యభారము లెల్ల నింపుగా సవరించి
సవ్య స్నేహపుపాలు పంచు చేయి
కావ్య రచనలు చేసి కీర్తి బడసిన చేయి
దివ్య జ్యోతుల నింట వెలిగించు చేయి
అతిధి సత్కారముల నందేవేసిన చేయి
ఆదరించి అన్నమెట్టు చేయి
అడిగి నంతనె లేదు లేదన్న మాటొదిలి
కలిగినంతయె దాన మోసగేటి చేయి
గుడిలోన జేగంట మ్రోగించి వేల్పులను
మనసార ధ్యాన్నించి మ్రొక్కు చేయి
దడిలోన పూలన్నీ దెచ్చి మాలలు గుచ్చి
తగు భక్తి గురు సాయి సేవించు చేయి
ఇష్ఠ్ఠాల విందులను ఇచ్చి మురిసెడు చేయి
కష్ఠ్ఠాల కన్నీరు తుడుచు చేయి
నష్ఠ్ఠాల నగుబాట్ల తట్టి ధైర్యము నిచ్చి
శ్రేయమౌ శుభములను ఒనరించు చేయి
గట్టి మేలును చేయు ఘనమైన దా చేయి
అట్టి దానిని పట్టి ఆదరింపగదోయి
జట్టు సేయగ వచ్చి కరచాలనము చేసి
మేటి సంస్కారములనందుకోవోయి ॥
______________________________
రచన,శ్రీమతి ,
జగదిీశ్వరిీముార్తి.
కల్యాణ్.
________________________________
No comments:
Post a Comment